👉ఈవీఎం లు పనితీరు పై జిల్లా వ్యాప్తంగా ప్రదర్శన లు.. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఒంగోలు నగరం భాగ్యనగర్
లోని ఈవీఎం గోడౌన్ లో ఉన్న ఈవీఎం లను జిల్లా కలెక్టర్ ఎ ఎస్ దినేష్ కుమార్ సోమవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం లను బయటకు తియ్యటం జరిగింది, వీటిని జిల్లా వ్యాప్తంగా వీటిని అన్ని నియోజకవర్గలలో ప్రజలకు వీటిని ఏ విదంగా రాబోయే ఎన్నికల్లో ఉపయోగించాలో ఓటర్లకు ప్రదర్శన ల రూపంలో చూపించే కార్యక్రమం కొరకు జిల్లా లోని అన్ని మండలాల నుండి వచ్చిన తాసిల్దార్లకు పంపిణి చెయ్యటం జరిగింది. ప్రతి నియోజకవర్గం కి ఒక సెట్, బ్యాలేట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వివి ప్యాడ్ లను ఏ ఇ ఆర్ల ఓలకు తాసిల్దార్లకు ఇవ్వటం జరిగింది, ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు , జిల్లా ఎలక్షన్ సెల్ సూపరంటెండ్ శ్రీనివాసరావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు వైసీపీ దామరాజు క్రాంతికుమార్, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ రసూల్, బీజేపీ.. బసినేపల్లి రాజశేఖర్, గుర్రం సత్యం, టీడీపీ స్వరూప్, కాలీషా బేగ్,సిపిఎం రఘురామ్,మండల తాసిల్దార్లు ఎన్నికల సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
*సిద్ధం పోస్టర్ ను రిలీజ్ చేసిన కేపీ*..వైఎస్సార్ ఆసరా,పేదలకు భరోసా*
మార్చి10వ తేదీన ప్రకాశం జిల్లా మేదరమెట్లలో జరగబోవు సిద్ధం సభకు సంబంధించిన సిద్ధం పోస్టర్ నుగిద్దలూరు సమన్వయకర్త అయిన కుందురు నాగార్జున రెడ్డి విడుదల చేసారు. కార్యక్రమంలో ఆరు మండలాల ఎంపీపీలు ,జడ్పిటిసిలు ,స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్లు,జేసిఎస్ కన్వీనర్లు సచివాలయం కన్వీనర్లు సర్పంచులు ఎంపీటీసీలు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు*…
వైఎస్సార్ ఆసరా,పేదలకు భరోసా* ముఖ్య అతిధిగా పాల్గొన్న గిద్దలూరు సమన్వయకర్త, మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి*..ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ ఆసరా,పేదలకు భరోసా,చంద్రబాబు పాలన ఏపీకి శాపమైందన్నారు.ప్రజలకు ఒక ఆసరా లేదు,ఒక భరోసా లేదని కోట్లాది జనం దిక్కులు చూస్తున్న దుస్థితిలో .నేనున్నాను..నేను విన్నాను అంటూ జగనన్న రావడంతో ఏపీలో బీద బిక్కి ప్రజలకు ప్రాణం లేచొచ్చిందన్నారు. గిద్దలూరు రాచర్ల, కొమరోలు మండలాలకు సంబంధించిన మహిళ సంఘాల వైస్సార్ ఆసరా చెక్కులను ఆయన పంపిణి చేశారు.అనంతరం వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీలు,జడ్పీటీసీలు, సర్పంచులు,ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు,లబ్దిదారులు పాల్గొన్నారు.
*రూ.50 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. మార్కాపురం పట్టణంలో బ్రిడ్జి, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అన్నా*
మార్కాపురం పట్టణంలో 50 లక్షల రూపాయలతో పలు వార్డుల్లో పలు రకాల అభివృద్ధి పనులకు గిద్దలూరు ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్నారాంబాబు సోమవారం శంకుస్థాపనలు చేశారు. మార్కాపురం పట్టణంలోని 9వ వార్డులో గల గుండ్లకమ్మ కెనాల్ పై 30 లక్షల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం 19వ వార్డు లో 10 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించబోతున్న డ్రైనేజ్ కాలువ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 22వ వార్డులో 10 లక్షలతో రూపాయలతో డ్రైనేజ్ కాలువ, మెటల్ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే అన్నా శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అన్నా మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన అందిస్తున్న మన ముఖ్య మంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డికి మనమందరం అండగా ఉండాలన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జగనన్న ఆదేశాల మేరకు మార్కాపురం నుండి పోటీచేస్తున్న తనను అత్యధిక మెజార్టీ తో ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ముందుగా ఆయా వార్డ్ పరిధిలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే అన్నా ను ఘనంగా సన్మానించి ఆహ్వానించారు. ఈ మున్సిపల్ చైర్మన్ బాల మురళి కృష్ణ, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.