నారాయణ విద్యాసంస్థల అవినీతి భాగోతం..కంభంలో ఘనంగా వైయస్సార్ ఆసరా..ముమ్మర ప్రచారంలో ఎమ్మెల్యే అన్నా

*👉నారాయణ విద్యాసంస్థల అధినేత…ఏపీ మాజీ మంత్రి నారాయణ చేసిన మోసం…బస్సుల కొనుగోలు వ్యవహారంలో అవినీతి ..10 కోట్లకు పైగా పన్ను చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.22.25 లక్షలు మాత్రమే పన్ను…ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి వెల్లడి..

నెల్లూరు నగరంలో మాజీ మంత్రి నారాయణ అనుచరుల ఇళ్లలో జరిగిన పోలీస్ సోదాల విషయంలో ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి మీడియాకు వివరాలు తెలియజేశారు.రాజకీయాలకు ఈ సోదాలకు సంబంధం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.నారాయణ విద్యా సంస్థల పేరుతో బస్సుల కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వాన్ని మోసం చేయాలని చూశారని,రవాణా శాఖకు రావాల్సిన ఆదాయానికి గండి కొట్టాలని ప్రయత్నించారని..అందుకే ఆ కేసుతో సంబంధం ఉన్న అందరి ఇళ్లలో సోదాలు చేపట్టామని తెలిపారాయన.

👉అసలేం జరిగిందంటే..? నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీకి అనుబంధంగా ఇన్స్ పైరా అనే సంస్థ ఉందని తెలిపారు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి. ఆ సంస్థకు పునీత్ అనే వ్యక్తి డైరెక్టర్ గా ఉన్నారని, నారాయణ విద్యాసంస్థల్లో కూడా ఆయన డైరెక్టర్ గా ఉన్నారని చెప్పారు. 2023 జూన్ లో ఇన్స్ పైరా అనే కంపెనీ నారాయణ విద్యా సంస్థలతో ఒక ఒప్పందం కుదుర్చుకుందని అన్నారు ఎస్పీ. ఈ ఒప్పందం ప్రకారం 92 కొత్త బస్సుల కోసం రూ. 20.8 కోట్లకు ఇన్స్ పైరా సంస్థ ఆర్డర్ పెట్టిందని, అయితే ఇన్ వాయిస్ మాత్రం నారాయణ విద్యా సంస్థల పేరు మీద తీసుకున్నారని ఆయన వివరించారు.

👉ఎందుకీ జిమ్మిక్కులు..?    వాస్తవానికి విద్యా సొసైటీ కి చెందిన వాహనాలకు పన్ను తక్కువగా ఉంటుంది. అందుకే ఇన్స్ పైరా సంస్థ ఇక్కడ నారాయణ విద్యా సంస్థల పేరు వాడుకుందని అంటున్నారు నెల్లూరు జిల్లా ఎస్పీ. అయితే ఈ కేసులో జిల్లా రవాణా శాఖ అధికారికి ఈ గోల్ మాల్ పై సమాచారం అందిందని, ఆ సమాచారం ఆధారంగా తాము విచారణ చేపట్టామని, సోదాలు చేశామని చెప్పారాయన. బస్సులను నారాయణ సంస్థ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించినా.. ప్రతి నెలా ఇన్స్ పైరా సంస్థ ఆ బస్సులకు సంబంధించి అద్దెను నారాయణ సంస్థలనుంచి వసూలు చేయడం విశేషం. వాహనాలను ఇన్స్ పైరా కొన్నా కూడా వాటిని నారాయణ సంస్థ కొన్నట్టు రవాణా శాఖకు చూపించారు. మరి వాటి యజమాని నారాయణ విద్యాసంస్థ అయితే.. ఇన్స్ పైరా కు సదరు సంస్థ అద్దె ఎందుకు చెల్లిస్తోందనేదే ఇక్కడ అసలు ప్రశ్న. అంటే ఇక్కడ గోల్ మాల్ చేసి, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారని పోలీసులు తేల్చారు.

👉అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు..   నెల్లూరు జిల్లా రవాణా శాఖ అధికారులు బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారి ఇళ్లపై దాడులు చేశారు. ఈ దాడుల్లో కోటీ 81 లక్షల రూపాయల సొమ్మ స్వాధీనం చేసుకున్నారు. ఈ సొమ్ముకి సదరు యజమానులు లెక్క చూపించకపోవడం విశేషం. దీన్ని ఆదాయపు పన్ను శాఖకు అప్పగిస్తున్నట్టు తెలిపారు పోలీసులు. తప్పుడు డాక్యుమెంట్ల తో  వాహనాలను రిజిస్ట్రేషన్ చేసిన కేసులో పూర్తి స్థాయి విచారణ చేపట్టామన్నారు.ఈ వ్యవహారంలో పునీత్ పై కేసు నమోదు చేశామని,విచారణ కొనసాగుతోందని ఆయన తెలిపారు.

👉కోట్లకు బదులు లక్షల్లో పన్ను.. డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటలిజెన్స్ విభాగం ఈ మోసాన్ని గుర్తించిందని తెలిపారు డీటీసీ చందర్. రవాణా శాఖ కమిషనర్ కు ఫిర్యాదు రావడంతో ఆయన ఆదేశాల మేరకు తాము విచారణ చేపట్టామన్నారు. మొత్తం 92 వాహనాలు కొనుగోలు చేశారని, నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించి పన్ను ఎగ్గొట్టారని అన్నారు. రూ.10 కోట్లకు పైగా పన్ను చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.22.25 లక్షలు మాత్రమే పన్ను కట్టారన్నారు. నారాయణ సంస్థకు నోటీస్ లు ఇచ్చి వివరణ తీసుకుంటున్నామని, అవసరమైతే ఆయా బస్సుల్ని సీజ్ చేస్తామని చెప్పారు డీటీసీ చందర్. బస్సుల రిజిస్ట్రేషన్లలో జీఎస్టీ అక్రమాలకు కూడా పాల్పడినట్టు విచారణలో బయట పడినట్టు తెలిపారు .

*డ్వాక్రా రుణాలను మాఫీ చేసిన ఘనత జగనన్నదే..కంభంలో వైఎస్సార్ ఆసరా చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి

పాదయాత్ర లో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా రుణాలను మాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డిదే అని మార్కాపురం ఎమ్మెల్యే గిద్దలూరు వైసీపీ సమన్వయకర్త కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు.మంగళవారం పట్టణంలోని ఉదయగిరి బృందావన్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కంభం, అర్ధవీడు, బి పేట మండలాల వైఎస్సార్ ఆసరా 4 విడత వారోత్సవాలల్లో ఆయన మాట్లాడుతు మహిళల అభ్యున్నతి కొరకు, అన్ని వర్గాల మహిళలకు ఆర్థికంగా ఆదుకోవడానికి వైఎస్సార్ ఆసరా పథకం రూపొందించారన్నారు. ఈ పథకం వలన మహిళలు స్వతహాగా అనేక చిన్నచిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని, ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగ పడుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిని మరలా అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గిద్దలూరు ప్రజలు జగనన్న తర్వాత అంతటి అభిమానంతో భారీ మెజార్టీ అందించారన్నారు. జగనన్న ఆదేశాల మేరకు గిద్దలూరు నుండి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో  ప్రజా సేవకై వస్తున్న తనను ఆశీర్వదించి గెలిపించాలని మహిళలను కోరారు.  కార్యక్రమంలో మూడు మండలాల వైసీపీ,నాయకులు, కార్యకర్తలు,అధికారులు,మహిళలు,పాల్గొన్నారు.

*👉గడప గడపకు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన ఘనత జగనన్నదే..  ఎమ్మెల్యే అన్నా

*మార్కాపురం పట్టణంలో 12, 14 బ్లాక్ ల్లో ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మార్కాపురం ఇన్చార్జి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి ప్రతి గడప -గడప కు ప్రభుత్వ పథకాలు అందించిన ఘనత ముఖ్య మంత్రి జగనన్నదే అని మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. సోమవారం మార్కాపురం పట్టణంలోని 12, 14 బ్లాక్ లో ప్రచార కార్యక్రమం నిర్వహించారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని,ఆదరించి ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహకారంతో మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. జగనన్న ఆశీస్సులతో మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను, ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల తర్వాత అత్యధిక మెజారిటీని గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు ఇచ్చారని, అదే రీతిలో మార్కాపురం ప్రజలు ఆదరిం చాలని ఆశిస్తున్నానన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని, మార్కాపురం పట్టణా భివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. జగనన్న పాలనలో ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంలో లబ్ది చేకూరిందన్నారు.ముందుగా ఎమ్మెల్యే అన్నా నాయకులు ఏర్పాటు చేసిన వైస్సార్సీపీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి పంచి పెట్టారు. అనంతరం వికాలంగునికి ట్రై సైకిల్ అందచేశారు.కార్యక్రమంలో పలువురు వైసీపీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు,వార్డు కౌన్సిలర్స్, కోఆప్షన్ సభ్యులు, సచివాలయ కన్వీనర్లు,తదితరులు పాల్గొన్నారు

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..