పూలసుబ్బయ్య”వెలిగొండ ప్రాజెక్ట్ ను ప్రారంభించి జాతికి అంకితం చేసిన సీఎం జగన్.. పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నా.. ఎల్ కోట జడ్పీ స్కూలులో ఘనంగా ఫేర్ వెల్ .

 

పూల సుబ్బయ్య “వెలిగొండ ప్రాజెక్ట్ ను ప్రారంభించి జాతికి అంకితం చేసిన సీఎం జగన్..ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని ఫ్లోరైడ్ ప్రభావిత, మెట్ట ప్రాంతాలైన 30 మండలాల్లో 15.25 లక్షల జనాభాకు త్రాగునీరు..

ప్రకాశం, నెల్లూరు, వైయ‌స్ఆర్‌ జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల కల వెలిగొండ ప్రాజెక్టును సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బుధవారం సాకారం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భా­గమైన నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలను తరలించేందుకు వీలుగా మొదటి టన్నెల్‌ను 2021, జనవరి 13 నాటికి పూర్తిచేయించిన సీఎం జగన్‌.. రెండో టన్నెల్‌ తవ్వకం పనులను ఈ ఏడాది జనవరి 21 నాటికి పూర్తిచేయించి వెలిగొండ ప్రాజెక్టును సీఎం జ‌గ‌న్ ఇవాళ జాతికి అంకితం చేశారు. నాడు తండ్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి శంకుస్థాపన చేశారు. నేడు కొడుకుగా సీఎం హోదాలో వైయ‌స్‌ జగన్‌ ప్రారంభోత్సవం చేశారు. యుద్ధ ప్రాతిపదికన వెలిగొండ ప్రాజెక్ట్‌ జంట సొరంగాలు పూర్తి చేయించారు.ఆసియాలోనే అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసిన ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని సీఎం జ‌గ‌న్ నిలబెట్టుకున్నారు.ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ, అద్భుతమైనప్రాజెక్ట్‌ పూర్తి చేసినందుకు, వెలిగొండ ప్రాజెక్ట్ 20 ఏళ్ల కల నేడు నేరవేరినందుకు ఆనందంగా ఉందన్నారు. “మహానేత వైఎస్సార్‌ వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆయన కొడుకుగా ఈ ప్రాజెక్ట్‌ తాను పూర్తి చేయడం గర్వంగా ఉంది. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్‌. 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది’’ అని సీఎం జగన్‌ అన్నారు. వెలిగొండ ప్రాజెక్టుతో ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో మెట్ట ప్రాంతాలకు 4 లక్షల 47వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం తెలిపారు.ఫ్లోరైడ్ పీడత ప్రాంతమంతంట మంచి జరిగే ప్రాజెక్ట్ అవుతుందని తెలిసి కూడా ఈ టన్నెల్ పూర్తి చేయటంలో గత ప్రభుత్వం నత్త నడక పనులు చేసిందని సీఎం ఆరోపించారు. రెండు టన్నెళ్లు ఉన్నాయి ఒక్కోకటి 18. 8కీ. మీ. ఉంటుందని, ఇందులో 2004- 14 వరకు 20 కీ.మీ పనులు పూర్తి చేశారని, అదే 2014-19లో కేవలం 6.4 కి.మి. పనులు మాత్రమే పూర్తైయ్యాయని తెలిపారు. మీ బిడ్డ ప్రభుత్వంలో దాదాపు 11 కీ. మీ టన్నెల్ పూర్తి చేసి యుద్ధ ప్రాతిపదికన అందించామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు,కుందూరు నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు .

👉రాబోయే పదేళ్లలో విశాఖను అభివృద్ధి చేసేందుకు #visionvisakhaను ఆవిష్కరించిన సీఎం జగన్* *అగ్ర పారిశ్రామిక వేత్తలు వైజాగ్‌ను ఫిన్-టెక్ క్యాపిటల్‌గా చూస్తున్నారు**అమరావతితో పోలిస్తే వైజాగ్‌ను రాజధానిగా చేయడానికి సహజమైన భౌగోళిక వెసులుబాటు*..మళ్లీ గెలుస్తా.. విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా.. వచ్చే ఎన్నికల తర్వాత విశాఖ నుంచి పాలన సాగిస్తా.. సీఎం జగన్*.. విశాఖపట్నంలో జరిగిన ‘డెవలప్‌మెంట్ డైలాగ్’లో సీఎం జగన్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు, రాబోయే దశాబ్దంలో (10 ఏళ్లలో) విశాఖపట్నంను ప్రపంచంలోని అత్యుత్తమ ప్రగతి కేంద్రాలతో చేయి- చేయి కలిపి తూర్పు తీరంలో మెగాసిటీగా అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్ #VisionVisakha అనే సమగ్ర ప్రణాళికను ఆవిష్కరించారు. అందులో విశాఖను ఇన్నోవేషన్, ఫైనాన్షియల్, ఫిన్‌టెక్ హబ్‌లుగా అభివర్ణించారు.వైజాగ్ అత్యంత డిమాండ్ ఉన్న పెట్టుబడి గమ్యస్థానంగా గుర్తించి, కనెక్టివిటీ, భౌతిక, సామాజిక మౌలిక సదుపాయాలు, పరిశ్రమల ప్రకృతి దృశ్యం, సుస్థిరత వంటివి పెంపోందించే విధంగా, *రాబోయే 10 సంవత్సరాలలో రూ. 1,05,000 కోట్ల పెట్టుబడులను విశాఖ వేదికగా ముఖ్యమంత్రి ప్రతిపాదించారు*. ప్రపంచంలోని ఉత్తమ నివాసయోగ్యమైన నగరాల్లో విశాఖ ఒకటి. నేడు ‘విజన్‌ విశాఖ’ పేరుతో వైజాగ్‌లో ఏర్పాటు చేసిన ఏపీ డెవలప్‌మెంట్‌ సదస్సులో మంగళవారం సీఎం జగన్ పాల్గొని మాట్లాడారు.*..హైదరాబాద్‌ కంటే మిన్నగా వైజాగ్‌లో అభివృద్ధి*.. ఉత్పత్తి రంగంలో దేశంలో ఏపీ మెరుగ్గా ఉందని.. అభివృద్దిలో​ విశాఖ నగరం దూసుకెళ్తోందని తెలిపారు.రాయపట్నం, కాకినాడ, మూలపేట, మచిలీపట్నం పోర్టులు ఎంతో కీలకమని అన్నారు. IDPL, NMDC, NFC, IICTతో సహా హైదరాబాద్‌లో పెట్టుబడులు అధికంగా కేంద్రీకృతం కావడం వల్ల, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాలు ఎక్కువగా వ్యవసాయాధారంగా ఉన్నాయని, మార్పు తీసుకురావడానికి, వైజాగ్ వృద్ధి పై మనం దృష్టి పెట్టాలని, తద్వారా పదేళ్లలో మనం హైదరాబాద్, బెంగళూరుతో పోటీ పడవచ్చని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వ సంస్థలు 90 శాతం హైదరాబాద్‌కే పరిమితం అయ్యాయన్నారు. అద్భుతమైన ప్రగతి సాధించిన హైదరాబాద్‌ను రాష్ట్ర విభజనతో వదులుకోవాల్సి వచ్చిందన్నారు. రాష్ట్ర జీఎస్‌డీపీలో సర్వీస్ సెక్టార్ తెలంగాణలో 62 శాతం ఉండగా, ఆంధ్ర ప్రదేశ్‌లో 40 శాతం మాత్రమే ఉందన్నారు. తలసరి ఆదాయం కూడా తెలంగాణ లో 3.12 లక్షలు ఉంటే ఏపీ లో 2.9 లక్షలు మాత్రమే ఉందన్నారు. సుదూర సముద్ర తీరంలో పోర్టులను అభివృద్ది చేస్తున్నామన్నారు. రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ, మూల పాడు పోర్టులు అత్యంత వేగంతో నిర్మాణం అవుతూ ఉన్నాయన్నారు. బ్లూ ఎకానమీని పెంచే క్రమంలో 10 ఫిషింగ్ హార్బర్‌ల నిర్మాణం జరుగుతోందన్నారు. సర్వీస్ సెక్టార్‌ను విస్తృతం చేయడమే విజన్ విశాఖ లక్ష్యమన్నారు. గ్రీన్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ కడప, అనకాపల్లి జిల్లాల్లో ఏర్పాటు అవుతున్నాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నంబర్ 1లో ఉన్నామన్నారు. గత మార్చిలో జరిగిన ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌లో 13 లక్షల కోట్ల విలువ చేసే 360 ఎంఓయూలలో 39 శాతం ఎంఓయూలు గ్రౌండ్ అయ్యాయన్నారు. అధికారంలోకి వచ్చాక 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించామని సీఎం చెప్పారు. పెద్ద పరిశ్రమలు 3, 4 లక్షల ఉద్యోగాలు అందిస్తే ఎంఎస్ఎంఈలు 30 లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నాయన్నారు. 1.5 కోట్ల మహిళలు స్వయం ఉపాధిని సాధించారన్నారు.

ఏపీలో తలసరి ఆదాయం పెరిగిందని, గత పదేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌న కోల్పోయామని, దాని ప్రభావం ఏపీపై ఎంతో ఉందని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అన్నారు. అయితే వైజాగ్‌ నగరం అభివృద్ది చెందుతోందని.. హైదరాబాద్‌ కంటే మిన్నగా వైజాగ్‌లో అభివృద్ధి జరుగుతోందని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో​ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, దేశంలోనే వ్యవసాయం రంగంలో ఏపీలో 70 శాతం వృద్ధి సాధించామని సీఎం జగన్‌ పేర్కొన్నారు.👉విశాఖపై విషం కక్కుతున్నారు..చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో 30 లక్షల ఉద్యోగాలు వచ్చాయని.. స్వయం ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని సీఎం జగన్‌ తెలిపారు. స్వయం సహాయక బృందాల పెండింగ్‌ రుణాలను మాఫీ చేశామని చెప్పారు. బెంగళూరు కంటే వైజాగ్‌లో సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. కొన్నిమీడియా సంస్థలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని అన్నారు. ప్రతిపక్షానికి లబ్ధి కలిగించేలా కథనాలు ఇస్తున్నాయని తెలిపారు. కోర్టు కేసులతో సంక్షేమ పథకాలను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని, స్వార్థ ప్రయోజనాల కోసం కొంత మంది విశాఖపై విషం కక్కుతున్నారని అన్నారు. భవిష్యత్తు తరాల కోసం మేం పనిచేస్తున్నామని సీఎం తెలిపారు. నాయకుడి ఆలోచన తప్పుగా ఉంటే విశాఖ అభివృద్ది చెందదని అన్నారు. స్వార్థ ప్రయోజనాల వల్ల విశాఖ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని చెప్పారు. విశాఖ ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సి ఉందని సీఎం జగన్‌ అన్నారు.

👉*మళ్లీ గెలుస్తా… విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా.. వచ్చే ఎన్నికల తర్వాత విశాఖ నుంచి పాలన సాగిస్తా..ఎన్నికల తర్వాత ఏపీ రాజధానిగా విశాఖ ఉంటుందని సీఎం జ‌గ‌న్‌ అన్నారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఇక్కడే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని.. ఎన్నికల తర్వాత విశాఖలోనే ఉంటానని స్పష్టం చేశారు. విశాఖను ఎకనామిక్‌ గ్రోత్‌ ఇంజన్‌లా మారుస్తామన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టాలని.. ఈనాటికే లక్ష కోట్లంటే వచ్చే 10-15 సంవత్సరాల్లో అది 10లక్షల కోట్లకు పైనే చేరుతుందని వివరించారు.అదే వైజాగ్‌లో ఇప్పటికే అవసరమైన అన్ని హంగులు ఉన్నాయన్నారు. దేశాన్ని ఆకర్షించే ఐకానిక్ సెక్రటేరియట్‌ నిర్మిస్తామని సీఎం జగన్‌ పేర్కొన్నారు.   👉రాష్ర్ట అభివృద్ధిని అడ్డుకునే ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉంది ఇది దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు.విశాఖ నుంచి పరిపాలనను అడ్డుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ఉంటే నగరం అభివృద్ధి బహుముఖంగా జరుగుతుందన్నారు. తనకు ఏమీ వ్యక్తిగత ఆలోచనలు, ప్రయోజనాలు లేవని మరోసారి స్పష్టం చేసారు.రాష్ర్టఅభివృద్ధి ఒక్కటే లక్ష్యమన్నారు. బెంగలూరు, చెన్నై తరహాలో అభివృద్ధి చెందే అవకాశం వైజాగ్‌కు ఉంద‌ని సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు.  👉ఏపీలో తగ్గిన నిరుద్యోగం*..ప్రతి సంక్షేమ పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. డీబీటీ పద్దతి ద్వారా నేరుగా లబ్ధిదారులకు నగదు అందజేస్తున్నామని అన్నారు. ఏపీలో మహిళల అభివృద్ధికి ప్రభుత్వ కృషి చేస్తోందని చెప్పారు. వ్యవసాయానికి ఏపీలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని.. సముద్రతీరంలో పోర్టులను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. ఏపీలో నిరుద్యోగం తగ్గిందని.. ఉపాధి అవకాశాలు పెరిగాయని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

*అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అన్నా*

 *పొదిలి పట్టణంలోని పొదిలిలో పలు అభివృద్ధి పనులకు గిద్దలూరు శాసన సభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమనవ్యకర్త బుధవారం శంకుస్థాపన చేసారు. పొదిలి టౌన్ లో సి. సి రోడ్డు పనులకు ఎమ్మెల్యే అన్నా శంకుస్థాపన చేసి మాట్లాడారు. జగనన్న పాలనలో అన్ని వర్గాల వారికీ మంచి జరిగిందన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మార్కాపురం అభ్యర్థి గా నన్ను, ఎంపీ అభ్యర్థి గా చెవిరెడ్డి గారిని ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమం లో పలువురు వైసీపీ నాయకులు,ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.    👉పాఠశాలలో ఫేర్వెల్ సంబరాలు..కంభం: ఎల్ కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు డాక్టర్ బి.వి.రామకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం పాఠశాల వార్షికోత్సవం మరియు పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా తరగతి గది జ్ఞాపకాలను,వార్షిక స్మృతులను వల్లెవేసుకుంటూ విద్యార్థులు,ఉపాధ్యాయులు ఆనందానుభూతులను పంచుకున్నారు. అనంతరం విద్యార్థినీ, విద్యార్థులు ఆనందోత్సాహాల నడుమ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఆటపాటలతో అలరించారు. పాఠశాల విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలుకుతూ, పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు సాధించి, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.అన్ని సబ్జెక్టులలో 95శాతం పైగా మార్కులు సాధించిన వారికి రెండు వేల రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలను అందించనున్నట్లు ఉపాధ్యాయులు ప్రకటించగా విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు డాక్టర్ బి.వి.రామకృష్ణ,సిఆర్పీరామలింగయ్య,ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు,విద్యా కమిటీ సభ్యులు, పాల్గొన్నారు.

 

7k network
Recent Posts

రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత…పొగిడారా ?..పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని..ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు… నిందితులకు 14 రోజుల రిమాండ్..చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్..ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం..జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..ఉప్పల్లో నకిలీ వైద్యుడు అరెస్ట్.

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం