భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి.. విద్యుత్ షాక్ 15 మందికి గాయాలు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కుందూరు.. ఎమ్మెల్యే అన్నా తనయుడు కృష్ణ చైతన్య

*పొదిలిలోని శ్రీ పార్వతీదేవి సమేత నిర్మమహేశ్వరరావు స్వామీ దేవాలయం వద్ద భద్రత మరియు బందోబస్త్ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీపి. పరమేశ్వర రెడ్డి..జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు…ఉత్సవాల సమయంలో దొంగతనాలు, అసాంఘీక కార్యకలాపాలు జరగకుండా ప్రత్యేక నిఘా.మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పొదిలిలోని శ్రీ పార్వతీ దేవి సమేత నిర్మమహేశ్వరరావు స్వామి దేవస్థానం నందు శుక్రవారం శివరాత్రి మహోత్సవం శనివారం రథోత్సవం సందర్బంగా శుక్రవారం జిల్లా ఎస్పీ ఆలయాన్ని దర్శించుకొని అక్కడి భద్రత బందోబస్త్ ఏర్పాట్లను పర్యవేక్షించి పోలీస్ అధికారులకు పలు సూచనలు తెలియజేసారు. దేవాలయ ఆలయ పరిసరాలు, ప్రవేశ మార్గములు, క్యూలైన్లను, పార్కింగ్‌ స్థలాలు, రథశాల నుండి మండపం వరకు భద్రతా బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు.

👉మహాశివరాత్రి వేడుకల్లో విద్యుత్ షాక్.. 15 మంది పిల్లలకు గాయాలు.. పలువురి పరిస్థితి విషమం..రాజస్థాన్‌లోని కోటాలో విషాదం నెలకొంది. మహా శివరాత్రి సందర్భంగా శుక్రవారం ఉదయం జరిగిన విగ్రహాల ఊరేగింపులో కరెంట్ షాక్ జరిగింది. ఈ ఘటనలో 15 మందికిపైగా చిన్నారులు గాయపడ్డారు. దీంతో వారిని హుటాహుటిన స్థానిక ఎంబీఎస్ ఆస్పత్రిలో చేర్పించారు.అక్కడ చిన్నారుల పరిస్థితి విషమించగా మెరుగైన చికిత్స కోసం జైపూర్‌కు తరలించారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కోట ఎస్పీ అమ్రిత దుహన్ వెల్లడించారు. ఇది చాలా విచారకరమైన ఘటన అని తెలిపారు. స్థానికంగా ఉన్న కాళీ బస్తీకి చెందిన కొందరు కలశాలతో ఊరేగింపు వద్దకు చేరుకున్నారని వెల్లడించారు. అదే సమయంలో ఒక చిన్నారి చేతుల్లో ఉన్న 20 అడుగుల పైపు హైటెన్షన్ వైర్‌కు తాకడంతో కరెంట్ షాక్ జరిగినట్లు పేర్కొన్నారు.

*👉సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన గిద్దలూరు వైసీపీ ఇంచార్జి కేపీ*

గిద్దలూరు నియోజకవర్గం పరిధిలోని అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన కొమరోలు మండలం బ్రాహ్మణపల్లి పంచాయతీ పామూరుపల్లె గ్రామానికి చెందిన పోలా వెలుగొండ రెడ్డికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన రూ 35,000 లను మార్కాపురం ఎమ్మెల్యే, గిద్దలూరు వైసీపీ ఇంచార్జి కేపీ నాగార్జున రెడ్డి గిద్దలూరు టౌన్ లోని వారి స్వగృహంలో అందజేసారు. కార్యక్రమంలో కొమరోలు మండల కన్వీనర్ బోయిల్లా జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.

👉గిద్దలూరు వైఎస్ఆర్సిపి నియోజకవర్గ సమన్వయ కర్త కుందురు నాగార్జున రెడ్డి మహా శివరాత్రి పండగ పర్వదినం పురస్కరించుకొని రాచర్ల మండలం రామాపురం గ్రామంలో శ్రీ పార్వతి పరమేశ్వరి దేవతల ఆశీర్వాదంతో ప్రత్యేక పూజలలో పాల్గొని బండ పందెం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.👉అనంతరం కె ఎస్ పల్లి గ్రామంలో శ్రీ ఎగువ భీమా లింగేశ్వర స్వామి నీ దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొని, బండ పందెములను ప్రారంభించారు. ఎంపీపీ కడప లక్ష్మీ వంశిధర్ రెడ్డి ఎంపీటీసీలు, సర్పంచులు,ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

👉శ్రీ గంగా పార్వతి సమేత కేదారేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అన్నా తనయుడు కృష్ణచైతన్య*

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తర్లుపాడు మండలం కేతగుడిపి గ్రామంలో వెలసిన శ్రీ గంగా పార్వతి సమేత కేదారేశ్వర స్వామి వారిని గిద్దలూరు శాసనసభ్యులు, మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు తనయుడు డా”అన్నా కృష్ణచైతన్య శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయంలో ప్రత్యేక, పూజలు మరియు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు అన్నా కృష్ణ చైతన్య ను సన్మానించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఈ కార్యక్రమం లో పలువురు వైసీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు*

7k network
Recent Posts

ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులు..సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించిన షర్మిల..పవన్ కళ్యాణ్ పై నాన్ బైయిలబుల్ కేసు!!! సల్మాన్ ఖాన్ఇంటి వద్ద కాల్పులు..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట..ఎమ్మెల్యే అన్నా సతీమణి,కోడలు ప్రచారం..

సీఎం సమక్షంలో వైకాపాలో చేరిన కీలక నేతలు..ప్రచారంలో మాగుంట చందన..జగన్ సర్కారు పై ధ్వజమెత్తిన ముత్తుముల.. ఎమ్మెల్యే అన్నా సమక్షంలో వైకాపాలో చేరికలు..ఇజ్రాయిల్ దాడులను ఖండించిన ఎస్ఐఓ..రాష్ట్రస్థాయిలో కంభం వాసవి విద్యార్థుల ప్రతిభ.

బీజేపీ నేతలపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు .. పిఠాపురం నుంచి కే.పవన్ కల్యాణ్ పోటీ!..సింబల్ తెలిస్తే షాకే!..రంజాన్ వేడుకలలో ఎంపీ మాగుంట,ఎమ్మెల్యే కేపీ..విస్తృత పర్యటన లో ముత్తుముల..యశోద హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్స