👉 టీడీపీ – బీజేపీ – జనసేన కలిసి పోటీ చేస్తున్నట్లు చేసిన ప్రకటనపై వైఎస్ షర్మిళ ఘాటుగానే స్పందించారు.ఈ సందర్భంగాచంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు.”అందరూ దొంగలే”అంటూ వ్యాఖ్యానించారు.
దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తుపై స్పందించిన షర్మిళ… “అందరూ దొంగలే.. ఎందుకు కలుస్తున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. పోలవరం ఇచ్చారని కలుస్తున్నారా.. ప్రత్యేక హోదా ఇచ్చారని కలుస్తున్నారా.. రాజధాని ఇచ్చారని కలుస్తున్నారా” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఐదు సంవత్సరాలపాటు బీజేపీ పొత్తుపెట్టుకుని కూడా ప్రజలకు న్యాయం చేయకపోయినా.. మళ్లీ అదే బీజేపీతో ఎందుకు కలుస్తున్నారు అని షర్మిళ సూటిగా ప్రశ్నించారు. ఈ విషయంపై ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని అన్నారు. ఇదే సమయంలో… 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని షర్మిళ ట్విట్టర్ వేదికగా ఆరోపించారు..
- 👉ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీల కలయిక చారిత్రాత్మకమైంది: గిద్దలూరు టిడిపి ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి..
తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమిని పార్టీ సభ్యులుగా అందరం స్వాగతిస్తున్నామని గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల ఆధారంగా అధినేత చంద్రబాబు నాయుడు పొత్తు నిర్ణయం తీసుకున్నారని వైసీపీ నిరంకుశ పాలనను తుద ముట్టించేందుకు బిజెపి టిడిపి జేఎస్పి కలిసి పోటీ చేయనున్నాయన్నారు. జగన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడింది. అప్పులాంధ్ర ప్రదేశ్ గా మార్చింది ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం. కులంతో సంబంధం లేకుండా బీసీలు, ఎస్సీ, ఎస్టీలపై దాడులు జగన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగాయి. వైసీపీ పాలనలో ప్రభుత్వం అంటే కేవలం జగన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణరెడ్డి, ధనుంజయ్ రెడ్డిగా మారిందని ఈ ప్రభుత్వంలో బీసీలను ఎంత హీనంగా చూశారో వైస్సార్సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణ మూర్తి మాటల్లోనే విన్నామన్నారు. బీసీలకు తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు లాంటింది. మొన్న జరిగిన జయహో బీసీ కార్యక్రమం ద్వారా మరోసారి రుజువైందన్నారు. ఇంత అరాచక జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు మూడు పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. తెలుగుదేశం పార్టీ పై కేంద్రంలో ఉన్న బీజీపీ పెద్దలకు కూడా నమ్మకం కలిగింది. అందుకే కేంద్రమే పొత్తులకు ఆహ్వానించిందని తెలుగు ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ సంకల్పించిన మహాయజ్ఞానికి ఇటు జనసేనతో పాటు, బీజేపీ కూడా కలిసి వస్తోంది. నారా చంద్రబాబు నాయుడు దార్శనికపాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రక్షనగా ఉంటుందని మేము నమ్మాము, అతి పెద్ద జాతీయ పార్టీతో పాటు దేశం మొత్తం తమకు మద్దతిస్తోందన్నారన్నారు.
👉టిడిపిలో చేరిన 50 బీసీ కుటుంబాలు..
గిద్దలూరు టీడీపీలోకి వలసలు కొనసాగుతూనే వున్నాయి. స్థానిక నాయకత్వాన్ని బలపరుస్తూ, అధికార పార్టీని వీడుతూ తెలుగుదేశం పార్టీకి జై కొడుతున్నారు. గిద్దలూరు పట్టణంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో కంభం మండలం, ఎర్రబాలెం గ్రామంలోని వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన 50 కుటుంబాలు, ఒక మాజీ సర్పంచ్, విద్యా కమిటీ చైర్మన్, వైస్ సర్పంచ్ తో సహా వైసీపీకి గుడ్ బై చెబుతూ అశోక్ రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా టీడీపీ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని, బీసీల సంక్షేమం టీడీపీ జనసేనలతోనే సాధ్యమని రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలోని బీసీ సోదరులంతా ఐక్యంగా పోరాడి అశోక్ రెడ్డిని గెలిపించుకుంటామన్నారు. కార్యక్రమంలో వైసిపిని వీడి టీడీపీలో చేరిన మాజీ సర్పంచ్ పిక్కిలి ఆదినారాయణ, విద్యాకమిటీ చైర్మన్ పిక్కిలి సుబ్బయ్య, తదితరులతోపాటు కంభం మండల టీడీపీ నాయకులు పాల్గోన్నారు.
👉 మహిళా సూపరిండెంట్ ప్రమీలపై ఏసీబీ దాడులు..
కలెక్టరేట్ కార్యాలయంలోని సి సెక్షన్ లో పనిచేస్తున్న సూపరిండెంట్ గా పనిచేస్తున్న ప్రమీల…వి.ఎన్.పల్లి కి చెందిన శేఖర్ అనే రైతు వద్ద సర్వే నెంబర్ 51 లో 6.6 చుక్కల భూమికి సంభందించి రు. 1,50,000 డిమాండ్ చేసింది.అడ్వాన్స్ గా రు.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులకు దాడి చేశారు.ప్రస్తుతం ఏసిబి అధికారులు ప్రమీలను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.ఈ తనిఖీలలో డీఎస్పీ గిరిధర్, శ్రీనివాస్ రెడ్డి,మహమ్మద్ అలీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.