పౌరసత్వ సవరణ చట్టంపై నోరు మెదపరేం???సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ..ఢిల్లీ రైతులకు మద్దతుగా సిఐటియు ప్రదర్శన.. గిద్దలూరు టిడిపి టికెట్ మాజీ ఎమ్మెల్యే ముత్తుములకు కేటాయింపు.. టిడిపిలోకి వలసలు 

 

ముస్లిం మైనార్టీల ఉనికిని దెబ్బకొట్టి వారి భవిష్యత్తును అంధకారబంధం చేస్తున్న సిఎఎ (పౌరసత్వ సవరణ చట్టానికి) రూల్స్‌ నోటిఫై చేసి దేశాన్ని ప్రమాదంలోకి నెట్టిన బిజెపి కుతంత్రాలపై రాష్ట్రంలో వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు ఎందుకు నోరు మెదపడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రశ్నించారు. రాష్ట్రంలో సిఎఎను అమలు చేయబోమని వైసిపి ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.మైనారిటీలను ఉద్ధరిస్తానని రోజు రాగాలు తీసే సిఎం జగన్మోహన్‌ రెడ్డి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

సిఏఏ ద్వారా ముస్లిం మైనార్టీల ఉనికిని దెబ్బతీయటంలో బిజెపిని బలపరచిన తెలుగుదేశం నేరస్థురాలు కాదా? రాష్ట్రంలో మైనార్టీలపై మెజార్టీ మతస్తులను రెచ్చగొట్టి ఉద్రిక్తతలను సృష్టించాలనుకుంటున్న బిజెపితో కలిసి తెలుగుదేశం లౌకికవాదం ఎలా కాపాడుతుంది? అని ప్రశ్నించారు.బిజెపి దురాగతాలను ప్రశ్నించకుండా వైసిపి మైనార్టీలను ఎలా రక్షిస్తుందో చెప్పాలనీ వి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 ప్రకారం కులం, మతం, రంగు, జాతి, ప్రాంతం, భాష ఆధారంగా ఎవరిపట్ల వివక్ష ఉండకూడదు. కాని సిఎఎ మత ప్రాతిపదికన వివక్ష పాటిస్తుందన్నారు. రాజ్యాంగంలోని 19వ అధికరణం మతపరమైన స్వేచ్ఛ ఇస్తున్నప్పుడు ముస్లిములకు తప్ప ఇతరులకే పౌరసత్వం ఇస్తామని చెప్పడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా? శ్రీలంకలో దశాబ్దాలుగా మతపరమైన హింసను ఎదుర్కొంటున్న శ్రీలంక హిందువులను ఎందుకు మినహాయించారని ప్రశ్నించారు.పొరుగు దేశాల్లో మతపరమైన హింసకు గురవుతున్న ప్రజలను ‘మానవతా దృష్టితో’ ఆదుకునేందుకే ఈ చట్టం తెచ్చినట్టయితే కేవలం మూడు దేశాలకే ఎందుకు పరిమితం చేయాల్సి వచ్చింది? మన పొరుగున ఉన్న మయన్మార్‌లో మైనార్టీల్కెన రొహింగ్యా ముస్లింలు, హిందువులు శ్రీలంకలో క్రైస్తవ తమిళులు తీవ్రమైన హింసాకాండకు గురయ్యారు.వారిని ఎందుకు ఈ చట్టంలో చేర్చలేదు అంటే ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. చివరికి పాకిస్తాన్‌ ముస్లింలలో అనేక మైనార్టీ తెగలు తీవ్రమైన హింసాకాండకు గురవుతున్నారు.మరి బిజెపి ప్రభుత్వ ‘మానవతా’ జాబితాలో వారు ఎందుకు చేరలేదు? వీటన్నిటి బట్టి చూస్తే దీని వెనుక ‘మానవత’ లేదనీ, ఒక రాజకీయ వ్యూహంతో ఇదంతా చేస్తున్నదనీ అర్ధమవుతోందన్నారు. వామపక్షల మద్దతుతో ఇండియా బ్లాక్‌ అధికారంలోకి వస్తే సిఎఎ అమల్లోకి రాదని.. అదే మైనార్టీలకు రక్ష.. మత సామరస్యానికి గ్యారెంటీ అని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.

👉 ఢిల్లీ రైతులకు మద్దతుగా సిఐటియు ప్రదర్శన

ప్రకాశం జిల్లా పొదిలి..ఢిల్లీలో  540 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు మద్దతుగా గురువారం పొదిలిలో సిఐటియు నాయకులు ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ వ్యవసాయ నల్ల చట్టాల రద్దు సందర్భంగా కేంద్ర బిజెపి ప్రభుత్వం 2021 డిసెంబర్లో రాత పూర్వకంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఢిల్లీ బయలు దేరిన రైతాంగాన్ని నిలువరించి అత్యంత పాశవికంగా దాడి చేయడం ప్రభుత్వ దమనకాండ నిదర్శనం అన్నారు.రైతులను అడ్డుకుంటూ రోడ్లపై కందకాలు తవ్వడం మేకులు నాటడం బార్కెట్లు ముళ్లకంచెలు ఏర్పరచడం,వాటర్ క్యాన్, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించడం,డ్రోన్ల ద్వారా విషవాయువులు చంపడంతో అనేకమంది రైతులు కంటిచూపు కోల్పోయి,చెవులు వినపడక ఇబ్బందులు పడ్డారన్నారు. పోలీస్ కాల్పుల్లో శుభకరం సింగన యువరైతు చనిపోవడంతో పాటు మరో ముగ్గురు రైతులు గుండె ఆగి చనిపోయారన్నారు.ఈ దాడుల్లో 200 ట్రాక్టర్ ధ్వంసం కాగా ప్రసార చానల్స్ నిలిపివేసి ఈ దురాగతాన్ని ప్రసారం కానేకుండా అడ్డుకున్నారని విమర్శించారు.ఈ కాలంలో నాలుగు సార్లు చర్చలు సాగించిన ఎటువంటి ప్రోగ్రామ్ లేకపోగా మంత్రులు ఇతర విషయాలు చర్చిస్తున్నారని మద్దతు ధర చట్టాన్ని గురించి గానీ హామీ ఇచ్చిన ఇతర అంశాల గురించి గానీ చర్చించడం లేదన్నారు.రెండు సంవత్సరాల నుండి రైతాంగానికి రాతపూర్వక ఇచ్చిన హామీలు అమలు పరచకుండా రద్దుచేసిన నల్ల చట్టాల విధానాలను దొడ్డిదారి అమలు చేసే కుట్ర జరుగుతుందన్నారు.మొత్తం వ్యవసాయ రంగాన్ని అదాని, అంబానీ ఇతర కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికే బిజెపి ప్రభుత్వం కంకణం కట్టుకుందని,ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులే నిదర్శనమన్నారు. ఎరువుల సబ్సిడీపై కోత పెంచడం, ఆహార భద్రత చట్టం అమలుకు నిధుల్లో కోత విధించడం,కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇవ్వడం ప్రభుత్వ కుటిలనీతికి అద్దం పడుతుందన్నారు. ఈ పరిస్థితుల్లో మరొకసారి దేశవ్యాప్తంగా రైతాంగం, వ్యవసాయ కార్మికులు తమ కోర్కెలను గొంతు విప్పి వినిపించాలనే లక్ష్యంతో ఢిల్లీలో భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చాయన్నారు. దేశంలో వ్యవసాయాన్ని, రైతాంగాన్ని కాపాడుకోవాలంటే మోడీ వారి మిత్రులను ఓడించి కార్పొరేట్ విధానాలు వ్యతిరేకించాలన్నారు.అప్పుడే రైతాంగం కోరుతున్న చట్టాలను సాధించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు పాల్గొన్నారు.

👉రోడ్డు సైడ్ చిన్న వ్యాపారస్తులకు భద్రత కలిపిం చి వారికి షాపులు నిర్మించి ఇవ్వాలి సిపిఎం డిమాండ్*

కర్నూలు నగరంలోని రోడ్డు సైడ్ చిన్న వ్యాపారస్తుల సంఘం జనరల్ బాడీ సమావేశం ,పాతబస్తీలోని సుర్జిత్ భవన్ నందు, షేక్ మొహమ్మద్ షరీఫ్ అధ్యక్షతన జరిగింది .ఈ సమావేశానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు, కె ప్రభాకర్ రెడ్డి, సిపిఎం కర్నూల్ అసెంబ్లీ అభ్యర్థి డి గౌస్ దేశాయ్, నగర కార్యదర్శి ఎం రాజశేఖర్ లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు.కర్నూలు నగరంలోని రోడ్డు సైడ్ చిన్న వ్యాపారస్తుల అందరికీ, భద్రత కల్పించి ,వారికి షాపులు నిర్మించి ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు.కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న వైసిపి ప్రభుత్వం ,ఎటువంటి ఉపాధి, పరిశ్రమలు, ఉద్యోగాలు కల్పించడం లేదని ఈ 10 సంవత్సరాలలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమలు ఉపాధి ,ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుపోవడం వల్ల సంవత్సరానికి వేలాదిమంది ఇంజనీరింగ్ కాలేజ్ నుండి యువకులు బైటికి వస్తా ఉన్నారని,వారికి ఉపాధి లేక రోడ్డును ఆసరాగా తీసుకొని, ట్రాఫిక్ అంతరాయం లేకుండా, స్వయంగా తమ కాళ్ళపై తాము ,జీవిస్తూ తమ కుటుంబ పోషణ కోసం, దుమ్ము ,ధూళి, కాలుష్యాన్ని దిగా మింగుతూ తమ ఆరోగ్యాలు చెడిపోతా యాని తెలిసిన, ఉపాధి లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో జీవిస్తున్నారని, వారు తెలియజేశారు ఇటువంటి యువతకు కనీసం కొత్తగా ఏర్పడే ప్రభుత్వాలైన పరిశ్రమల ఉపాధి కోసం హామీ తీసుకోవాలని వారు కోరారు. కార్మికుల సంక్షేమం కోసం ఎటువంటి చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోకపోవడాన్ని తప్పుపట్టారు.సిపిఎం పార్టీ అనునిత్యం కార్మికుల సమస్యలపై ,వారి సంక్షేమం కోసం కార్మికుల హక్కుల సాధన కోసం, నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే, సిపిఎం పార్టీ అభ్యర్థి అయినటువంటి డి గౌస్ దేశాయ్ ,సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుపై, ఓటు వేసి వేయించి ,గెలిపించాలని పిలుపునిచ్చారు.కార్మిక నాయకుడు గౌస్ దేశాయ్ విజయం మన పేద, బడుగు బలహీన వర్గాల,కార్మిక ,కర్షక, ఉద్యోగ ,ఉపాధ్యాయ విజయంగా భావించి,నేటి నుండి ఎన్నికల అయ్యేంతవరకు, ప్రజలను ఒప్పించి, మెప్పించి ,ప్రజల మన్నలను పొంది ,ఆ రకంగా ఓట్లు వేయించాలని వారు కోరారు. సమావేశంలో సంఘం నగర నాయకులు ఆర్ నరసింహులు ఈశ్వర రెడ్డి శివకుమార్ ఇలియాస్ లక్ష్మయ్య విజయ్ కుమార్ సల్కాపురం అక్బర్ బాషా షాషా ఇమ్రాన్ సాంబశివ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.

తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి గిద్దలూరు నియోజకవర్గ అభ్యర్థిగా ముత్తుముల అశోక్ రెడ్డి..

తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి గిద్దలూరు నియోజకవర్గ అభ్యర్థిగా ముత్తుముల అశోక్ రెడ్డిని అధిష్టానం నిర్ణయించింది. ఈ సందర్భంగా గిద్దలూరు పట్టణంలోనూ, కొమరోలు మండల ఇస్లాంపేట యూత్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆనందోత్సాహాలతో బాణాసంచా కాల్చి ముత్తుముల అశోక్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.*

**వైసీపీకి గుడ్ బై చెప్పిన పాపినేనిపల్లె ఎంపీటీసీ* ప్రకాశం జిల్లా,. గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో అర్ధవీడు మండలం, పాపినేనిపల్లె గ్రామానికి చెందిన వైసీపీ ఎంపీటీసీ సభ్యురాలు మీనిగే వెంకట సుబ్బమ్మ అధికార వైసీపీ పార్టీకి గుడ్ బై చెపుతూ టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.ఈ సందర్బంగా అశోక్ రెడ్డి టీడీపీ కండువా కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు.

👉ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరిన 40 బీసీ, మైనార్టీ కుటుంబాలు……ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి ఇన్చార్జ్ మరియు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో కంభం మండలం, కందులాపురం గ్రామానికి చెందిన 20 యాదవ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు మరియు 20 మైనార్టీ కుటుంబాలు మొత్తం 40 కుటుంబాలు ఒంగోలు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి కేతం శ్రీను ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి టిడిపి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.కార్యక్రమంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు మైలగాని రాజు యాదవ్, బొర్రా కిరణ్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు కుక్క పులిభద్రుడు, మైనార్టీ నాయకులు షేక్ అలీ ముస్తఫా, గమిని రంగారావు, మొర్రి కాశయ్య, గమిని రంగస్వామి తదితరులు పాల్గోన్నారు.

7k network
Recent Posts

* అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది..👉 ఆన్ లైన్ పేకాటలో జిల్లా రెవెన్యూ అధికారి మలోల బిజీ బిజీ (అనంతపురం ) .. *రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ గా మధుసూదన్ రెడ్డి 👉నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ లకు యువకుడు బలి*.. *రాష్ట్ర డీఐజీ ద్వారక తిరుమలరావుకు ఘన స్వాగతం.. నేనిప్పుడు మారిపోయాను : ఆర్జివి ..

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త