వైకాపాలో చేరిన ముద్రగడ..MHPS రాష్ట్ర అధ్యక్షులు ఫారుక్ షిబ్లికి సన్మానం.. సభకు వెళ్లిన మైనర్ బాలుడు అదృశ్యం.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న మార్కాపురం ఎమ్మెల్యే.. గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ముత్తుముల..

ఆంధ్ర మిర్రర్ విజయవాడ… సి ఎం క్యాంప్‌ కార్యాలయంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు (తూర్పుగోదావరి జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు), ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు.

👉ఆంధ్ర మిర్రర్ మదనపల్లి..మాజీ మదనపల్లి ఎమ్మెల్యే షాహ్జహాన్ కు టీడీపీ మదనపల్లి ఎమ్మెల్యే టికెట్ కేటాయించిన సందర్బంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీకి శాలువా కప్పి సన్మానించారు అనంతరం ఫారూఖ్ షిబ్లీ గారు సైతం షాహ్జహాన్ గారికి శాలువా కప్పి సత్కరించారు.

*👉 ఇంటింటి ప్రచారం చేసిన కుందూరు నాగార్జున రెడ్డి*

ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం బొల్లుపల్లి అచ్చంపేట గ్రామాలలో గురువారం గిద్దలూరు వైసిపి ఇన్చార్జ్ మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన నాగార్జున రెడ్డికి స్థానిక వైఎస్సార్సీపి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తర్వాత ఇంటింటికి వెళ్లి కుందూరు నాగార్జున రెడ్డి 2024 ఎన్నికలలో తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మళ్లీ నవరత్నాల పథకాలు ప్రతి ఒక్కరికి అందాలంటే వైసిపి నే గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.                      👉సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన గిద్దలూరు వైసీపీ ఇంచార్జి కేపీ.. గిద్దలూరు నియోజకవర్గం పరిధిలోని అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన అర్ధవీడు మండలం మొహద్దిన్ పురం గ్రామానికి చెందిన జమ్ములదిన్నె లక్ష్మమ్మకి మార్కాపురం ఎమ్మెల్యే, గిద్దలూరు వైసీపీ ఇంచార్జి కేపీ నాగార్జున రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన 45,000 రూ. “లను చెక్కును అందజేసారు.

👉సిద్ధం సభకు వెళ్లిన మైనర్ బాలుడు అదృశ్యం*

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఆకవీడు గ్రామానికి చెందిన 17 సంవత్సరాల మైనర్ బాలుడు రమణారెడ్డి ఈనెల 10వ తేదీన మేదరమెట్లలో జరిగిన సిద్ధం సభకు వెళ్లి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు బంధువుల ఇల్లు సమీప ప్రాంతాలు అన్వేషించి తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరన్నా రమణారెడ్డిని గుర్తిస్తే 7036916672 నంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

*టిడిపి జనసేన అధ్వర్యంలో శంఖారావం. ఆంధ్ర మిర్రర్

ప్రకాశం జిల్లా కోమరొలు మండలం చింతలపల్లి గ్రామంలో టీడీపీ ఇన్ ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించారు.కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన వచ్చిన టీడీపీ ఇన్ ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి కి జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు కు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముత్తుముల అశోక్ రెడ్డి, బెల్లంకొండ సాయిబాబు మాట్లాడుతూ…టీడీపీ హయాంలోనే నియోజక వర్గం ఎంతో అభివృద్ధి సాధించిందని గ్రామ గ్రామాన సిమెంట్ రోడ్లు డ్రైనేజీ కాలువలు పడ్డాయన్నారు.2024 ఎన్నికలలో టీడీపీ జేనసేన కూటమిని గెలిపించుకోవాని అన్నారు.స్థానికుడు అయిన అశోక్ రెడ్డికే ఓటు వేసి గెలిపించాలని స్థానిక నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమం లో స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

7k network
Recent Posts

ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులు..సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించిన షర్మిల..పవన్ కళ్యాణ్ పై నాన్ బైయిలబుల్ కేసు!!! సల్మాన్ ఖాన్ఇంటి వద్ద కాల్పులు..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట..ఎమ్మెల్యే అన్నా సతీమణి,కోడలు ప్రచారం..

సీఎం సమక్షంలో వైకాపాలో చేరిన కీలక నేతలు..ప్రచారంలో మాగుంట చందన..జగన్ సర్కారు పై ధ్వజమెత్తిన ముత్తుముల.. ఎమ్మెల్యే అన్నా సమక్షంలో వైకాపాలో చేరికలు..ఇజ్రాయిల్ దాడులను ఖండించిన ఎస్ఐఓ..రాష్ట్రస్థాయిలో కంభం వాసవి విద్యార్థుల ప్రతిభ.

బీజేపీ నేతలపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు .. పిఠాపురం నుంచి కే.పవన్ కల్యాణ్ పోటీ!..సింబల్ తెలిస్తే షాకే!..రంజాన్ వేడుకలలో ఎంపీ మాగుంట,ఎమ్మెల్యే కేపీ..విస్తృత పర్యటన లో ముత్తుముల..యశోద హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్స