👉మోదీకి షర్మిల ఘాటు కౌంటర్!!!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని పార్టీలు జోష్ పెంచేశాయి.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని పార్టీలు జోష్ పెంచేశాయి. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్, వైసీపీ వేర్వేరు కాదని.. ఈ రెండు పార్టీలు ఒకటేనని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, వైసీపీలు రెండూ ఏపీలో ఒకే కుటుంబం చేతిలో ఉన్నాయని ఆయన విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎన్డీయే కూటమికి పోనివ్వకుండా కాంగ్రెస్ కు మళ్లించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని మోదీ సంచలన విమర్శలు చేశారు. ఈ మేరకు చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో టీడీపీ, జనసేన, బీజేపీ నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రధాని మోదీ ఘాటు విమర్శలు చేశారు.ఈనేపథ్యంలో నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. జగన్ ను, చంద్రబాబును ఆడిస్తున్న రింగ్ మాస్టర్ మోదీయేనని షర్మిల నిప్పులు చెరిగారు. జగన్ మోదీకి దత్తపుత్రుడు అని (ఒక సందర్భంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు) షర్మిల గుర్తు చేశారు. జగన్, చంద్రబాబును రెండు పంజరాల్లో పెట్టి ఆడిస్తూ తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.పరిసర ప్రాంతాల్లో చేతివాటం రాష్ట్ర విభజన జరిగాక పదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్ నాశనం కావడంలో ముఖ్య పాత్ర పోషించింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాదా అని షర్మిల నిలదీశారు. ఇప్పుడు తనపైన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పైగా కాంగ్రెస్, వైసీపీ ఒకటే అని కూతలా? అని షర్మిల దుయ్యబట్టారు. ఐదేళ్లుగా జగన్ తో అంటకాగుతూ, వాళ్ల అరాచకాలను అడ్డుకోకుండా వారికి అడుగడుగునా సహాయ సహకారాలు అందించింది ఎవరని నిలదీశారు. రాష్ట్రాన్ని ఇంకా నాశనం చేయండి.. ఇంకా అప్పులు తెచ్చుకోండి అని తెరచాటు స్నేహం నడిపింది ఎవరిని మోదీపై షర్మిల విరుచుకుపడ్డారు. పార్లమెంటులో బీజేపీ పెట్టే ప్రతి బిల్లుకు వైసీపీ సిగ్గువిడిచి మద్దతు ఇచ్చిందని షర్మిల గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం.. మోదీ మిత్రులు అదానీ,అంబానీలకు రాష్ట్రంలో ఆస్తులు కట్టబెట్టడమే కాకుండా వారికి రాజ్యసభ సీట్లు ఇచ్చిందని మండిపడ్డారు.ఇది వీరి స్నేహం,విడదీయరాని బంధం అంటూ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా , వెనుకబడిన రాష్ట్రాలకు నిధులు వంటి హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే కారణంతో వాటిని బీజేపీ, టీడీపీ, వైసీపీ తుంగలో తొక్కాయని షర్మిల మండిపడ్డారు.బీజేపీ ప్రభుత్వ అసమర్థత, మోసాలను కప్పిపెట్టి..కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం అని చెప్పినందుకు కాంగ్రెస్ పార్టీకి భయపడుతున్నారా అని నిలదీశారు.
👉కడప ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి..కడప నుంచి పోటీ చేయాలని షర్మిలపై ఒత్తిడి పెంచిన అధిష్టానం..అధిష్టానం కోరిక మేరకు కడప ఎంపీ గా పోటీచేసే ఆలోచనలో షర్మిలా రెడ్డి..ఈ నెల 25 న మొదటి లిస్ట్ ప్రకటించే అవకాశం ఉంది.
👉భిన్నత్వంలో ఏకత్వమే దేశ ప్రగతికి సోపానాలు: మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ..
విజయవాడలోని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో జనసేన ఉత్తరాంధ్ర నాయకులు ముక్క శ్రీనివాసరావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ ఆయన్ని సాదరంగా స్వాగతం పలికారు.అనంతరం హిందూ,ముస్లిం సోదరులు అన్నదమ్ముల వలె ఇఫ్తార్ విందును స్వీకరించారు. ఫారూఖ్ షిబ్లీకి శ్రీనివాస్ రావు ఖర్జూరం పండును తన స్వహస్తాలతో తినిపించి ఉపవాస దీక్షను విరమింపచేసినారు.ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ దేశంలో హిందూ ముస్లింల మధ్య సోదరభావం పెరిగి మతసామరస్యం వర్ధిల్లాలని ప్రతి ఒక్కరూ కాంక్షిస్తూ హిందు,ముస్లింలు కలిసికట్టుగా ఇఫ్తార్ విందును స్వీకరించారు.కార్యక్రమంలో సమితి రాష్ట్ర లీగల్ టీం అధ్యక్షులు హైకోర్టు న్యాయవాది ఎండి సలీం పాషా,రాష్ట్ర ప్రధానకార్యదర్శి మౌలానా హుస్సేన్, ఇమ్రాన్, బాబు సల్మాన్, షమ్మీ,అబ్దుల్ గపూర్ తదితరులు పాల్గొన్నారు…….
👉సచివాలయ ఉద్యోగికి డాక్టరేట్.. ఆంధ్ర మిర్రర్..
కంభం మండలం చిన్న కంభం సచివాలయంలోడిజిటల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న గోన అనిల్ కుమార్ కు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో డాక్టరేట్ (P.hd)పట్టాను ఆంధ్ర విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొ. పి వి జి డి ప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా ప్రధానం చేశారు.ప్రొ.కె.వెంకట రావు మరియు ప్రొఫెసర్ .ఎన్ వి ఇ ఎస్ మూర్తి వారి మార్గదర్శకత్వంలో గోన అనిల్ కుమార్ ఆంధ్ర యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం లో పరిశోధన చేశారు. పరిశోధన ప్రాజెక్ట్ యొక్క శీర్షిక “డిటెక్షన్ అండ్ క్యారెక్టరిజషన్ అఫ్ ఎం ఆర్ బ్రెయిన్ ఇమేజెస్ యుసింగ్ హైబ్రిడ్ వావేలెట్ ట్రాన్స్ఫారం అండ్ ఆప్టి మైజ్డ్ క్లస్టరింగ్ విత్ షాఫ్ట్ అల్గొరితం ” అనే అంశం పై పరిశోధన కు గాను ఆయన డాక్టరేట్ పట్టా పొందారు.డాక్టర్ గోన అనిల్ కుమార్ తన ప్రాథమిక,మాధ్యమిక మరియు ఉన్నత పాఠశాల విద్యను ప్రకాశంజిల్లా కంభం గవర్నమెంట్ హైస్కూల్ లో పూర్తి చేశారు.ఇంటర్మీడియట్ గుంటూరు లోని అమరావతి రెసిడెన్షియల్ కళాశాలలో, డిగ్రీ కర్నూల్ లోని ఎస్ జె జి సి కళాశాలలో, ఎం .టెక్ (కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ) ఆంధ్ర విశ్వ విద్యాలయం లో అభ్యసించారు.వీరు 1998 ప్రభుత్వ ఉపాధ్యాయడిగా ఎన్నిక కాబడి కొంతకాలం పనిచేసిన తరువాత ఉద్యోగానికి రాజీనామా చేసి విదేశాలలో సాఫ్టవేర్ ఉద్యోగంలో చేరాడు.వీరి తల్లితండ్రులైన గోనా డేవిడ్ ,సుశీలమ్మ వృత్తి రీత్య ఉపాధ్యాయులు.వీరు ప్రధానోపాధ్యాయులుగా పని చేసి ప్రస్తుతం పదవి విరమణ పొంది ఉన్నారు. వృద్ధాప్యం లో వున్న తల్లి తండ్రుల వద్ద ఉండాలనే ఉద్ధ్యేశంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి 2019 లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సచివాలయం ఉద్యోగ నియామకాల్లో డిజిటల్ అసిస్టెంట్ గా ఉద్యోగానికి ఎంపికయ్యారు.తనకు డాక్టరేట్ పట్టా పొందడానికి తన తల్లి తండ్రులు, బంధుమిత్రుల సహకారం ఎనలేనిదని అన్నారు . ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది కంభం గ్రామస్థులు, బంధుమిత్రులు అనిల్ కుమార్ ను అభినందించారు.ఈ సందర్భంగా అనిల్ కుమార్ ను కంభం ఉపసర్పంచ్ సయ్యద్ ఖాసీం, పి ఏ ఎఫ్ నాయకులు కె.విజయ్,బాబ్జి,అన్వర్, మరియదాసు,చిట్టి, రంగా నాగరాజు లైన్మెన్ ఖాసిం వలి బాబురావు ఈశ్వర్ రెడ్డి ఏసురత్నం తదితరులు సన్మానించారు.
👉విద్యుత్ ఉద్యోగుల క్యాలెండర్, డైరీ లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే అన్నా.. ఆంధ్ర మిర్రర్ గిద్దలూరు
వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు గిద్దలూరు శాసన సభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్నా రాంబాబును మర్యాద పూర్వకంగా కలిశారు. గురువారం మార్కాపురం జవహర్ నగర్ లోని ఎమ్మెల్యే అన్నా నివాసంలో విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు కలిసి శాలువా,పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ క్యాలెండర్, డైరీ లను ఎమ్మెల్యే అన్నా ఆవిష్కరించారు.కార్యక్రమంలో వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.*