👉 మోడీ జగన్ పై విమర్శలు చేయక పోవడం పై సందేహాలు..???
చిలకలూరిపేట సమీపంలోని బొప్పాడిలో నిన్నటి రోజున జరిగిన భారీ బహిరంగ సభ చూసి అందరికీ ఒక సందేహం వస్తోంది. ముఖ్యంగా జగన్ పైన నేరుగా మోడీ విమర్శలు చేయకపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఏదో అనాలని అన్నారే కానీ జగన్ కాంగ్రెస్ ఒక్కటేనంటూ ఒక్క కామెంట్ తోనే సరి పెట్టుకున్నారు. కానీ టిడిపి జనసేన నేతలు కార్యకర్తలు మోడీ నుంచి చాలానే ఎక్స్పెక్ట్ చేశామని కానీ అలాంటిది ఎక్కడా ఏమీ కనిపించలేదని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ అవినీతి గురించి ప్రస్తావిస్తారని అందరూ భావించగా అలాంటివేమి చేయలేదు.టిడిపి నేతలు ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా మోదీ కామెంట్స్ ఎక్కడ వినిపించలేదు.కేవలం మోడీ ప్రసంగమంతా ఎన్డీఏను గెలిపించాలని 400 సీట్లు రావాలని కోరికతో తప్పించి జగన్ ప్రభుత్వాన్ని దించాలని పిలుపుని ఎక్కడా కూడా అటు టిడిపి నేతలకు ఇవ్వలేదని వార్తలు వినిపిస్తున్నాయి.. వాస్తవానికి మోడీ ఇతర రాష్ట్రాలకు వెళితే అక్కడ పార్టీల పైన విమర్శలు చేస్తూ ఉంటారు.. ఇటీవల తెలంగాణలో టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పైన అవినీతి విమర్శలు కూడా చేయడం జరిగింది. మరి అక్కడ నేతలు కూడా విమర్శించారు కానీ ఆంధ్రాలో వచ్చేసరికి మొత్తం మార్చేశారు మోది..ఏపీ సీఎంను ప్రత్యక్షంగా విమర్శించకుండా చిక్కి చిక్కినట్లు గా అనేసి వెళ్లిపోయారు..మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ జగన్ వేర్వేరు అయినప్పటికీ ఒకే కుటుంబ సభ్యులు అన్నట్లుగా వ్యవహరించారు. అంతే తప్ప జగన్ పైన ప్రత్యేకంగా ఎలాంటి విమర్శలు కూడా చేయలేదు. జగన్ని ఓడించాలని చెప్పకపోవడంతో అందరూ నిరుత్సాహంతో ఉన్నట్లు కనిపిస్తోంది. టిడిపి జనసేన అభ్యర్థులను గెలిపించాలంటూ నేరుగా కోరలేదు.. ఆ సమయంలోనే ఎన్డీఏ ఎంపీ అభ్యర్థులను మాత్రం గెలిపించాలని తెలియజేశారు.. గత ఎన్నికల ప్రచారంలో ఏపీకే వచ్చినప్పుడు కుటుంబ పార్టీని పోలవరాన్ని ఏటీఎం గా చంద్రబాబు వాడుకొని చాలా విమర్శించారు కానీ ఈసారి మాత్రం పోలవరం ప్రస్తావన లేదు కేవలం అభివృద్ధి లేదంటూ విమర్శిస్తున్నారు. మొత్తానికి మోడీ వంటి వారు జగన్ మీద విమర్శించకపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
👉టీడీపీ కార్యకర్త మునయ్యను గొడ్డలితో నరికి చంపటం దుర్మార్గం..
👉సొంత బాబాయిని గొడ్డలితో చంపిన నాయకుల్ని, వైసీపీ కార్యకర్తలు ఆదర్శంగా తీసుకున్నారు..గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి.. వైసీపీ రాక్షస జాతికి చెందిన పార్టీ అని గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి వైసీపీ చేస్తున్న హత్యా రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తూ గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అధికారం కోల్పోతున్నారన్న అక్కసుతో వైసీపీ రాక్షస మూకలు నరమేధం సాగిస్తున్నాయని,గిద్దలూరు మండలం, గడికోట పంచాయతీ పరమేశ్వర నగర్ కు చెందిన టీడీపీ నాయకుడు పాముల మునయ్య హత్యను తీవ్రంగా ఖండించారు. టీడీపీ కార్యకర్తల పై దాడులు చేసినవారిని, హత్యలు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని,చిలకలూరిపేట ప్రజాగళం సభకు గ్రామం నుంచి పెద్ద ఎత్తున జనాన్ని తరలించాడన్న అక్కసుతో వైసీపీ రాక్షస మూకలు గొడ్డలితో మునయ్యను నరికి చంపారని, సొంత బాబాయిని గొడ్డలితో నరికి చంపిన వైసీపీ నాయకుల్ని, గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలు ఆదర్శంగా తీసుకున్నారన్నారు. ఎన్నికల సంఘం వైసీపీ పార్టీకి ఫ్యాన్ గుర్తును రద్దు చేసి, గొడ్డలి గుర్తు కేటాయించాలన్నారు. మునయ్యను రాజకీయ హత్య చేసిన నిందితుల పై కఠిన చర్యలు తీసుకోవాలని నిందితుని వెనుక ఉన్న రాజకీయ నాయకులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.పాముల మునయ్య కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ప్రెస్ మీట్ లో మండల అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, జడ్పీటీసీ సభ్యులు బుడతా మధుసూదన్ యాదవ్ కడియం శేషగిరి, బిల్లా రమేష్ యాదవ్, బాబాయ్ లు పాల్గోన్నారు.
👉 రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ,ఎంపీ అభ్యర్థి గా చెవిరెడ్డిని గెలిపించండి..
ప్రజల సమస్యలు తెలుసుకొని వారి సమస్యల పరిస్కారానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు పరచిన సంక్షేమ పథకాల రథసారథి మన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అని మార్కాపురం వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. సోమవారం తర్లుపాడు మండలంలోని మీర్జా పేట గ్రామంలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించి రేపు జరగబోయే ఎన్నికల్లో ఆశీర్వదించాలని అభ్యర్థించారు.మార్కాపురం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న అన్నా రాంబాబును, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి వేయించి గెలిపించాలన్నారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే అన్నా మాట్లాడుతూ రాష్టంలో మన జగనన్న ప్రతి పేదింటి ప్రజలకు పెద్ద కొడుకుగా,అవ్వాతాతల ముద్దుల మనవడిగా, ఆడపడుచులకు అన్నగా, విద్యార్థులకు మేనమామగా, రైతుల పాలిట ఆపద్భాందవుడిగా,బడుగు బలహీన వర్గాల ఆశాదీపంగా పేరు పొందారన్నారు. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వాన్ని గెలిపించి రాబోయే రోజుల్లో మార్కాపురం నియోజకవర్గమును అభివృద్ధి పధంలో నడిపిద్దామన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు,వైసీపీ శ్రేణులందరూ కలిసి కట్టుగా పనిచేసి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ముందుగా పలువురు వైసీపీ నాయకులుమార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా ను ఘనంగా సన్మానించి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం లో పలువురు వైసీపీ ముఖ్య నాయకులు,వైసీపీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
👉నాయీ బ్రాహ్మణులంతా కేపీ వెంటే…..
గిద్దలూరు పట్టణంలోని గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ నాగార్జున రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నాయీ బ్రాహ్మణుల సంఘం పెద్దలు.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కు శక్తివంచన లేకుండా కృషి చేసి గిద్దలూరు నియోజకవర్గం లో కుందూరు నాగార్జున రెడ్డికి వారు మద్దతు తెలిపారు.ఈ నెల 26వ తేదీన కొమరోలు గిద్దలూరు, రాచెర్ల మండలానికి సంబంధించిన నాయీ బ్రాహ్మణులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చెయ్యనున్నట్టు కేపీ నాగార్జున రెడ్డికి తెలిపారు*👉కేపీ నాగార్జున రెడ్డికి సతీమణి ,గిద్దలూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ,నియోజకవర్గంలో ఆడపడుచులు అందరిని పలకరిస్తూ, వారి సమస్యలు వింటూ,వారందరికీ భరోసా ఇస్తూ,మీ అందరికీ పూర్తిస్థాయిలో మేము అండగా ఉంటామని, మీకు ఏ సమస్య వచ్చినా ఎల్లవేళలా అందుబాటులో ఉండి తప్పక సమస్యలు తీరుస్తామని, అందరికీ భరోసాహిస్తూ, తన భర్త విజయంలో మహిళలందరూ భాగస్వాములు కావాలని,తర్వాత ఐదు సంవత్సరాలు, మీ అందరికీ మా కుటుంబం అండగా ఉంటుందని తెలియజేస్తూ కేపి.కల్పనారెడ్డి గడపగడపకు వెళ్లే ప్రచారం నిర్వహిస్తున్నారు.
👉 గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేపి.నాగార్జునరెడ్డి సతీమణి కల్పనారెడ్డి మరియు కేపి.నాగార్జునరెడ్డి అక్క పద్మావతి ప్రతి ఇంటింటికి తిరిగి కేపి.నాగార్జునరెడ్డికి మద్దతు తెలియజేసి మీ అమూల్యమైన ఓటును ఫ్యాను గుర్తుకు వేసి వేయించి భారీ మెజార్టీతో ఎం.పి మరియు ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.కార్యక్రమంలో వైయస్సార్ సీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
👉ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరిన ఓబులరెడ్డి పల్లె గ్రామానికి చెందిన 40 కుటుంబాలు*
ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో టిడిపి ఇన్చార్జ్ అశోక్ రెడ్డి సమక్షంలో రాచర్ల మండలం, పాలకవీడు పంచాయతీ, ఓబుల్ రెడ్డి పల్లె గ్రామానికి చెందిన 40 కుటుంబాలు వైసిపిని వీడి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.ఈ సందర్భంగా అశోక్ రెడ్డి టిడిపి కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో వైసీపీని వీడి టిడిపిలో చేరిన సూరా బాలరంగారెడ్డి, మండ్ల కాశీ రావు బొంత ప్రభాకర్ సూరా రామచంద్రారెడ్డి యనుముల రామిరెడ్డి, గంగుల పెద్దిరాజు, సూర రాఘవేంద్రారెడ్డి, ఎనుముల రమణారెడ్డి కొండ రాజశేఖర్ రెడ్డి, పందనబోయిన పెద్ద బాల రంగయ్య, బొగ్గు కాశిరావు, సూరా లక్ష్మిరెడ్డి, మండ్ల కాశీమురళీ, మండల టీడీపీ నాయకులు తదితరులు పాల్గోన్నారు.
👉 ముండ్లపాడులో టిడిపిలో చేరికలు..ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి ఇన్చార్జ్ ముత్తుముల సమక్షంలో గిద్దలూరు మండలం, ముండ్లపాడు గ్రామానికి చెందిన మండల కోఆప్షన్ మెంబర్ తో సహా 250 మంది మైనార్టీ సోదరులు వైసీపీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.ఈ సందర్భంగా అశోక్ రెడ్డి టిడిపి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.కార్యక్రమంలో వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన వందలాది మంది ముస్లిం మైనార్టీ సోదరులు,టీడీపీ నాయకులు పాల్గొన్నారు.