*విశాఖ డ్రగ్స్ కేసులో టీడీపీకి, పురంధేశ్వరికి సంబంధం ఉందని గట్టిగా అనుమానిస్తున్నాం- సజ్జల*
డ్రగ్స్ కేసులో దొంగే దొంగ దొంగ అన్నట్టుగా టీడీపీ ఆరోపణలు*..తప్పుడు వార్తలు ప్రచురిస్తే ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తాం*…విశాఖ డ్రగ్స్ విషయంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై టీడీపీ తప్పుడు ఆరోపణలు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గుమ్మడికాయలు బుజాలు తడుముకున్నట్లు ముందే టీడీపీ వాళ్లు బుజాలు తడుముకుంటున్నారని, డ్రగ్స్ విషయంలో బీజేపీ, టీడీపీ నేతల పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేసిన సజ్జల.. తప్పించుకోవడానికే ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని అన్నారు. .శుక్రవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ పోర్టులో సీబీఐ డ్రగ్స్‌ను సీజ్ చేసిందని అందుకు సంతోషంగా ఉందని,దేశం పెద్ద ప్రమాదం నుంచి బయటపడిందని సజ్జల పేర్కొన్నారు.అయితే ఈ కేసు సీబీఐ వారు చేధించిన మరుక్షణం నుంచే టీడీపీ అధినేత చంద్రబాబు, తన కొడుకు లోకేష్ విమర్శలు దాడి మొదలు పెట్టారని,నిజానికి వారికే ఈ కేసులు సంబంధాలు ఎక్కువ ఉన్నాయని తెలిపారు. పురంధేశ్వరి బంధువులకు ఆ కంపెనీతో సంబంధాలు ఉన్నాయని,టీడీపీ నేతలు కావాలనే తమపై ఆరోపణలు చేస్తున్నాని,చంద్రబాబు ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారని సజ్జల మండిపడ్డారు.వ్యవస్థల మీద గౌరవం లేని వ్యక్తి చంద్రబాబు అని, పార్టీ అధినేతగా ఉన్న బాబు స్థాయిని మరిచి వీధి స్తాయి మనస్తతత్వంతో ప్రవర్తిస్తున్నారని సజ్జల విమర్శించారు.తప్పుడు చేయడం టీడీపీకి అలవాటుగా మారిందని, గత ప్రభుత్వ హయాంలో గంజాయి, డ్రగ్స్‌పై తూతు మంత్రంగా దాడుల చేశారని గుర్తు చేశారు. డ్రగ్స్ నిందితులకు టీడీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయని, తప్పు చేసి రివర్స్‌లో తమపైనే ఆరోపణలు చేయటం తగదని, తప్పించుకోవడానికే మాపై నిందలు వేస్తున్నారని అన్నారు.వైఎస్సార్‌సీపీకి జనాల్లో విపరీతమైన ఆదరణ చూసి తట్టుకోలేక,మళ్లీ ముఖ్యమంత్రి అవ్వనేమో అనే భయంతో చంద్రబాబు విషం కక్కుతున్నారని ఆరోపించారు. ప్రజలకు చెప్పుకోవటానికి మంచి లేక ఇలాంటి ప్రచారం చేస్తున్నారని అన్నారు.డ్రగ్స్ విషయంలో నిజాలు నిగ్గు తేల్చాలని సీబీఐకి లేఖ రాస్తామని ఎన్నికల కమిషన్ కూడా డ్రగ్స్‌పై దృష్టి పెట్టాలని కోరతామని తెలిపారు. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి పబ్బం గడుపుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.పచ్చ మీడియా తప్పుడు కథనాలు ప్రచురిస్తుందని, తప్పుడు ప్రచురణలు చేసే వారి పై ప్రెస్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు
👉 ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరిన 100 బీసీ కుటుంబాలు.
*ప్రకాశం జిల్లా, గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని మోడంపల్లె గ్రామంలో టిడిపి ఇన్చార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి పర్యటించారు.ఈసందర్భంగా గ్రామంలోని బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవ సోదరులు, రజక సోదరులు మరియు రెడ్డి సోదరులు వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.ఈ సందర్భంగా అశోక్ రెడ్డి టిడిపి కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కలిసి కట్టుగా కృషి చేస్తామన్నారు.*
👉 ముత్తుముల సమక్షంలో 60 కుటుంబాలతో సహా టీడీపీలో చేరిన పెద్ద కందుకూరు మాజీ సర్పంచ్*…అర్ధవీడు మండలంలో తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం ఉదయం గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి ఇన్చార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో అర్ధవీడు మండలం, పెద్ద కందుకూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ చేగిరెడ్డి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 60 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి టిడిపి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన ముఖ్య నాయకులు మరియు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
👉సొంత గూటికి చేరుకున్న మాజీ ఎంపీటీసీ..
గిద్దలూరు మండలం, కొంగలవీడు మాజీ ఎంపీటీసీ సభ్యుడు పోలా సుంకన్న సొంత గూటికి చేరుకున్నాడు. గురువారం రాత్రి వైసీపీలో చేరిన సుంకన్న తిరిగి శుక్రవారం ఉదయం గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు.
👉ఎమ్మెల్యే కేపీ విస్తృత పర్యటన..
బేస్తవారిపేట మండలం గలిజేరుగుల్ల గ్రామంలొ ఎన్నికల జైత్ర యాత్రను ఎంపీపీ ఒసురా రెడ్డి అధ్వర్యంలో మొదలు పెట్టిన గిద్దలూరు ఇంచార్జ్,శాసన సభ్యులు కేపీ.నాగార్జునరెడ్డి పి.విపురం ఎంపీపీ ఒసురా రెడ్డి అధ్వర్యంలో జడ్పీటీసీ రాజయ్య,మండలం అధ్యక్షుడు కొండ రఘునాథ రెడ్డి, చెన్నారెడ్డి ల స్వగృహములో తేనేటివిందులో పాల్గొన్నారు. కాజీపురం గ్రామంలో ఎం .
పి .పి ఓసురా రెడ్డి స్వగృహములో తేనేటివిందు కార్యక్రమములో పాల్గొని అనంతరము గ్రామ సభలో పాల్గొని అందరితో మాట్లాడి, తన విజయములో భాగస్వాములు కావాలని గ్రామ నాయకులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది.
👉 *గిద్దలూరు టౌన్ నగర పంచాయతీ పరిధిలోని 11వ వార్డులో గిద్దలూరు ఇంచార్జ్,శాసన సభ్యులు కుందురు నాగార్జునరెడ్డి సతీమణి కల్పనా రెడ్డి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
👉 కంభం లో పోలీస్ కవాతు
శుక్రవారం కంభం పట్టణంలో ఎన్నికల దృష్ట్యా
డి.ఎస్.పి సీఐ ఎస్ ఐ ఆధ్వర్యంలో పోలీస్ కవాతు నిర్వహించారు..ప్రకాశం జిల్లా కంభం మండల కేంద్రంలో ఎన్నికల సందర్భంగా డి.ఎస్.పి.ట్రైనింగ్ డిఎస్పి షాబాద్ అహమ్మద్, సీఐ కె రామ కోటయ్య .ఎస్సై పులి రాజేష్ మరియు స్పెషల్ ఫోర్స్ పోలీసులు కంభం పట్టణంలో పురవీధుల గుండా పోలీస్ కవాతు నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై అసాంఘిక కార్యక్రమాలపై దృష్టి సారించి ఎన్నికలకు విగాథం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రైనింగ్ డిఎస్పి షాబాద్ అహమ్మద్ వివరించారు.
*ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా*
మహబూబాబాద్ మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించారు. రూ.19 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా పట్టుబడ్డారు. వాటితో పాటు డాక్యుమెంట్ రైటర్ల నుంచి రూ.1,78,000 తీసుకున్న అమౌంట్ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, తస్లీమా ములుగు సబ్ రిజిస్ట్రార్గా గతంలో పనిచేశారు.