పవన్ నీవల్ల మేం బలి కావాలా..జనసేన నేత పంతం సరోజ.. ఈసీ అనుమతి తప్పనిసరి ఈసీవో ముఖేష్ కుమార్.. వైకాపాను వీడుతున్న వారిపై వ్యంగాస్త్రాలు.. కంభం వైకాపాలో చేరికలు

త‌ప్పెవ‌రిది ప‌వ‌న్‌..నీవ‌ల్ల మేం బ‌లికావాలా?.. కాకినాడ జనసేన నేత పంతం సరోజ..

అసెంబ్లీ,పార్ల‌మెంటు ఎన్నిక‌ల పొత్తులు,టికెట్ల కేటాయింపు వ్య‌వ‌హారం వంటివి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు భారీ సెగ పెడుతున్నాయి.అది కూడా కాపులు,శెట్టిబ‌లిజ సామాజిక వ‌ర్గాలు ఎక్కువ‌గా ఉన్న ఉమ్మడి తూర్పు గోదావ‌రి జిల్లాలోనే కావ‌డం గ‌మ‌నార్హం. ”త‌ప్పెవ‌రిది ప‌వ‌న్‌?”అంటూ నిల‌దీత‌లు తెర‌మీదికి వ‌చ్చాయి.దీంతో ఇప్పుడు జ‌న‌సేన ఎలా రియాక్ట్ అవుతుంద‌నేది చూడాలి.కాకినాడ మాజీ మేయర్, జనసేన నేత పంతం సరోజ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీని సర్వనాశనం చేశారు. విధానపరమైన అంశాలు,పార్టీ నిర్మాణం తెలిసిన వ్యక్తిగా ఉండి ఈ రోజు జనసేన పార్టీని ఏం చేశారు? మనకు పోల్ మేనేజ్ మెంట్ లేదని,బూత్ మేనేజ్ మెంట్ లేదని,టీడీపీకి పోల్ మేనేజ్ మెంట్ లో 40 ఏళ్ల అనుభవం ఉంది కాబట్టి వాళ్లకే అవకాశం ఇద్దాం, వాళ్లతో సమానంగా కలిసి అడుగులేద్దాం అని మొన్న తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ చెప్పారు. పోల్ మేనేజ్ మెంట్ లేకపోవడం అనేది ఇన్చార్జిల తప్పా?“అని స‌రోజ నిల‌దీశారు.నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి నెలకోసారి ఇక్కడికి వచ్చి క్లబ్ లో ఉంటూ,ఒక రోజుంతా మీటింగులు పెడుతుంటారని,మూడు నాలుగు రోజులు ఇక్కడే ఉంటూ పోల్ మేనేజ్ మెంట్ కానీ,బూత్ మేనేజ్ మెంట్ కానీ చేయకుండా ఏం చేస్తున్నార‌ని స‌రోజ ప్ర‌శ్నించారు.“ఈ అంశంపై మీడియా ముఖంగా జనసేన పార్టీని ప్రశ్నిస్తున్నాను. ప్రశ్నించమని మా నాయకుడు పవన్ కల్యాణే నేర్పారు.పవన్ కల్యాణ్ స్ఫూర్తితోనే ఇవాళ ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. ఈ రోజు వరకు జనసేన పార్టీ ఏం చేస్తోంది?ఆయన దశాబ్దకాలంగా పార్టీని నడిపారు కదా.ఇప్పటిదాకా పోల్ మేనేజ్ మెంట్, బూత్ మేనేజ్ మెంట్ లేదంటే,ఇది ఎవరి వైఫల్యం?ఈ ప్రశ్నకు పవన్ కల్యాణ్,నాదెండ్ల మనోహర్ సమాధానం చెప్పి తీరాలి“అని స‌రోజ నిప్పులు చెరిగారు.ఇంతమంది జనసైనికులు ఉన్నారు, పవన్ కల్యాణ్ అంటే పడిచచ్చిపోయే యువత ఉంది…పవన్ కల్యాణ్ కోసం చొక్కాలు చించుకుంటూ,కాళ్లకు చెప్పులు కూడా లేకుండా కారు వెంట పరిగెడుతుంటూ ఆయనకు కొంచెం కూడా జాలి కలగడం లేదా? అని ప్ర‌శ్నించారు స‌రోజ‌.”పార్టీని న‌మ్ముకున్న వారి భవిష్యత్తును ఇవాళ సర్వనాశనం చేశారు. దశాబ్దకాలం అంటే…ఒక తరానికి భవిష్యత్తు పోయింది. మా నాయకుడు సీఎం అవుతాడు,సీఎం అవుతాడు అని ఒక తరం వారిని ఆయన వెంట తిప్పించుకున్నారు. మా నాయకుడు సీఎం అవ్వాలని కలలుగనే ఈ యువత ఏమైపోవాలి?” అని నిల‌దీశారు.

**రానున్న ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసుకోవాలనుకున్నా కూడా ఈసీ అనుమతి తప్పనిసరి అని ఈసీవో ముఖేష్ కుమార్ మీనా తాజా లేఖలో స్పష్టం చేశారు. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసుకోవాలనుకునే నేతలు.. స్థానిక రిటర్నింగ్ అధికారుల అనుమతి తీసుకున్న తర్వాతే ప్రచారం నిమిత్తం ఓటర్ల ఇళ్లకు వెళ్లాలని సూచించారు. ఇదే క్రమంలో సభలు, సమావేశాల విషయంలోనూ కీలక సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో… సభలూ, సమావేశాలు పెట్టుకోవాలన్న.. ఆఖరికి కరపత్రాలు పంచాలన్నా కూడా సువిధ యాప్ లో అనుమతి తీసుకోవాల్సిందే అని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరించేవారు, కీలక నేతలు తమ తమ ప్రచార వాహనాల అనుమతులను స్థానికంగా కాకుండా.. సీఈఓ స్థాయిలోనే అనుమతులు తీసుకోవాలని.. అదేవిధంగా.. తమ తమ ప్రచార సామాగ్రికి అనుమతులు కూడా సీఈవో వద్దే తీసుకోవాలని తెలిపారు. ఇక ప్రధానంగా సభలు పెట్టుకోవాలన్నీ, ర్యాలీలు చేపట్టాలన్నా కనీసం 48 గంటల ముందు అనుమతి తీసుకోవాలని.. పోలింగ్ కు 48 గంటల ముందు నుంచీ ఎలాంటి ప్రచారలకూ అనుమతులు ఉండవని.. తెలిపారు. ఇదే సమయంలో… పోలింగ్ తేదీ రోజున నియోజకవర్గంలో తిరిగేందుకు అసెంబ్లీ అభ్యర్థితో పాటు వారి పోలింగ్ ఏజెంట్ కు కలిపి రెండు వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తారని ,లోక్ సభ అభ్యర్థులకు మరో వాహనం అనుమతిస్తామని తెలిపారు.

👉వైకాపాను వీడి టీడీపీలో చేరిన వారిపై సోషల్ మీడియా వేదికగా వ్యంగాస్త్రాలు..         గిద్దలూరు నియోజకవర్గంలో వైస్సార్సీపీ నుండి చేరికలు అంటూ డబ్బా కొట్టుకుంటున్న వ్యక్తులకు టిడిపి కండువాలు మార్చుకుంటున్న వారు టిడిపి కార్యకర్తలేనన్న సంగతి నియోజకవర్గంలోని ప్రజలందరికీ తెలుసునని గతంలో గిద్దలూరు శాసనసభ్యులు అన్నారాంబాబు టిడిపి నుండి వైసిపిలో చేరిన క్రమంలో ఆయనతో పాటు టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నాడు పార్టీలో చేరి ఐదేళ్ళు అధికారం పదవులను అనుభవించి నేడు టిడిపిలో చేరుతున్న పరిస్ధితి..అంతే తప్పా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని అభిమానించే నాయకులు కార్యకర్తలు ఏఒక్కరు పార్టీని వీడి పోలేదని అంటుండగా మరికొందరు మాత్రం ప్యాకేజీల కోసం అమ్ముడు పోతున్నారని ఎద్దేవా చేస్తున్నారు …

👉గిద్దలూరు మండలంలోని కొంగలవీడు గ్రామంలో మొదలైన గిద్దలూరు వైసీపీ ఇంచార్జి కేపీ.నాగార్జునరెడ్డి  ఎన్నికల ప్రచార కార్యక్రమం.. వైకాపాలో చేరికలు..

శుక్రవారం గిద్దలూరు నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా మన ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విచ్చేయుచున్న సందర్భంగా వారికి స్వాగతం పలకడానికి గిద్దలూరు నగర పంచాయతీ, గిద్దలూరు రూరల్,బేస్తవారిపేట, కొమరోలు,రాచర్ల మండలాల ముఖ్య నాయకులతో గిద్దలూరు ఇంచార్జ్ శాసనసభ్యులు కుందురు నాగార్జున రెడ్డి మంగళవారం సమావేశం నిర్వహించినారు. 👉కంభం,కందులాపురం గ్రామాలలో “విశ్వబ్రాహ్మణుల”20 కుటుంబాలు మంగళవారం  గిద్దలూరు ఇంచార్జ్,శాసన సభ్యులు కేపి.నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా ఆయనకు మద్దతు తెలిపి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది.

7k network
Recent Posts

రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత…పొగిడారా ?..పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని..ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు… నిందితులకు 14 రోజుల రిమాండ్..చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్..ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం..జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..ఉప్పల్లో నకిలీ వైద్యుడు అరెస్ట్.

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం