కేజ్రీవాల్‌ పేరు చెప్పాకే మాగుంటకు బెయిల్‌!!! గిద్దలూరు టిడిపి వైకాపాలలో చేరికలు.. ఎంపీ అవినాష్ రెడ్డి బెయిలు రద్దు పై వాదనలు

👉కేజ్రీవాల్‌ పేరు చెప్పాకే మాగుంటకు బెయిల్‌.. కేజ్రీవాల్ అరెస్ట్ పై కాషాయం పార్టీ కుట్ర..ఆప్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!!!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై ఆరు నెలల పాటు తీహార్ జైల్లో ఉండి తాజాగా బెయిల్ పై బయటకు వచ్చిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్.. కేజ్రీవాల్ అరెస్ట్ పై స్పందించారు.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారం మరింత సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పైగా లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ ఢిల్లీ సీఎం అరెస్ట్ రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోందని తెలుస్తుంది.ఈ సమయంలో కేజ్రీవాల్ అరెస్ట్,మాంగుంట రాఘవకు బెయిల్ మొదలైన విషయాలపై ఆప్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై ఆరు నెలల పాటు తీహార్ జైల్లో ఉండి తాజాగా బెయిల్ పై బయటకు వచ్చిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్.. కేజ్రీవాల్ అరెస్ట్ పై స్పందించారు.ఇందులో భాగంగా…ఆయన కేజ్రీవాల్ అరెస్ట్ పై కాషాయం పార్టీ కుట్ర ఉందని విరుచుకుపడ్డారు.ఇదే సమయంలో..ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ పేరు చెప్పిన తర్వాతే మాగుంట రాఘవకు బెయిల్ వచ్చిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు! వయసు ఎంతో తెలుసా? అవును…లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఎటువంటి మనీ ట్రయల్ ఆధారాలు లేవని..కేవలం కుట్రలు చేసే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారని..ఆప్ ను నాశనం చేయాలని చూస్తున్న బీజేపీ ప్రయత్నాల్లో ఇదొకటని మొదలుపెట్టిన సంజయ్ సింగ్…కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి స్టేట్ మెంట్ ఇచ్చారని..ఆ తర్వాతే రాఘవకు బెయిల్ ఇచ్చారని.. ఇప్పుడు టీడీపీ టిక్కెట్ ఇవ్వడంతో మోడీ ఫోటో పట్టుకుని ఓట్లు అడుగుతున్నారని కామెంట్స్ చేశారు!! విచారించ‌నున్న అధికారులు! అరవింద్ కేజ్రీవాల్ మీకు తెలుసా అని మాగుంట శ్రీనివాస్ రెడ్డిని ఈడీ మొదట అడిగినప్పుడు,అతను నిజం చెప్పాడని చెప్పిన సంజయ్ సింగ్…తాను అరవింద్ కేజ్రీవాల్‌ ను కలిశానని, అయితే చారిటబుల్ ట్రస్ట్ భూమి విషయంలో కలిశానని చెప్పాడని తెలిపారు.అయితే ఆ తర్వాత కొడుకుని అరెస్ట్ చేసి 5 నెలల పాటు జైలులో ఉంచడంతో..తండ్రి స్టేట్ మెంట్ మార్చాడని ఆరోపించారు.ఇదే సమయంలో… ఫిబ్రవరి 10 – జూలై 16 మధ్య మాగుంట రాఘవ నుంచి ఏడు స్టేట్ మెంట్లు తీసుకోబడ్డాయని.. ఈ ఏడు స్టేట్ మెంట్ లలోనూ మొదటి ఆరింటిలో కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా అతను ఏమీ మాట్లాడలేదని అన్నారు. ఈ సమయంలో జూలై 16న ఇచ్చిన ఏడో స్టేట్ మెంట్ లో మాత్రం తన వైఖరిని మార్చుకుని,కుట్రలో భాగస్వామి అయ్యాడని.. ఫలితంగా,అరవింద్ కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా స్టేట్ మెంట్ ఇచ్చాడని..దీంతో బెయిల్ దక్కిందని సంజయ్ చెబుతున్నారు!! కాగా.. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా టీడీపీ తరుపున ఒంగోలు నుంచి శ్రీనివాసుల రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ముందుగా ఈ టిక్కెట్ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కొడుకు రాఘవకు ఇస్తున్నట్లు కథనాలొచ్చినా.. చివరి నిమిషంలో చంద్రబాబు శ్రీనివాస్ రెడ్డినే ఎంపిక చేశారు!!

👉ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై సీబీఐ తరఫు న్యాయవాది,పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ వాదనలు వినిపించారు. ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారా తనకు ప్రాణాహనీ ఉందని అప్రూవర్ దస్తగిరి తరుపు కోర్టు దృష్టి తీసుకెళ్లారు. దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి.. తాను జైల్లో ఉన్న సమయంలో ప్రలోభాలకు గురిచేశాడని దస్తగిరి పిటిషన్‌లో పేర్కొన్నాడు. తన తండ్రి పైనా అవినాష్ అనుచరులు దాడి చేశారని గుర్తు చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి చాలా ప్రభావితమైన వ్యక్తి అని, ఆయనకు వెంటనే బెయిల్ రద్దు చేయాలని కోర్టును కోరారు పిటిషనర్ తరుపు న్యాయవాది.మరోవైపు దస్తగిరికి ప్రాణ హానీ ఉందని సీబీఐ వాదించింది. దీనికి ప్రతిస్పందించిన హైకోర్టు.. దస్తగిరిక ప్రాణ హానీ ఉందని మీరు ఇప్పుడు ఎలా చెబుతున్నారు? అని ప్రశ్నించింది.అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లలేదని సీబీఐని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది.ఈ ప్రశ్నకు స్పందించిన సీబీఐ.. సుప్రీంలో బెయిల్ రద్దు చేయాలని సవాల్ చేసే లోపే వివేకా కూతురు సునీత సుప్రీంకోర్టుకు వెళ్లిందని పేర్కొంది.దీంతో సీబీఐ సైతం సునీత పెటిషన్‌లో కౌంటర్ దాఖలు చేశామని హైకోర్టుకు సీబీఐ వివరణ ఇచ్చింది.

👉 ప్రకాశం జిల్లా అర్దవీడు మండలం బొమ్మిలింగం గ్రామంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ. కర్రల దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలు. బాధితులకు కంభం ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స.

👉 అర్ధవీడు మండలంలో వైసీపీకి ఝలక్..మాగుంట, ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరిన అర్ధవీడు మాజీ ఎంపీపీ..

మాగుంట, ముత్తుముల సమక్షంలో అర్ధవీడు మాజీ ఎంపీపీ  తన వర్గం తో కలిసి టిడిపిలో చేరారు.మండలంలో టీడీపీలోకి వరుస చేరికలతో వైసీపీ కంచుకోటగా ఉన్న అర్ధవీడులో ప్రస్తుతం తెలుగుదేశం తన పంజా విసురుతూ ముందుకు దూసుకుపోతుంది.ఇటీవల వైసిపిని వీడిన ఎంపీపీ, మండల ముఖ్య నాయకుల బాటలోనే మండలంలోని మరి కొంతమంది ముఖ్య నాయకులు అధికార పార్టీకి గుడ్ బై చెపుతున్నారు. శుక్రవారం సాయంత్రం గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి మరియు ఒంగోలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు రాఘవ రెడ్డిల సమక్షంలో అర్ధవీడు వైసీపీ ముఖ్య నాయకుడు,మండల మాజీ ఎంపీపీ పాలుగుళ్ల పురుషోత్తమ రెడ్డి,తన ఆధ్వర్యంలో ఒక వైస్ సర్పంచ్, ఒక వార్డు మెంబరు,100 కుటుంబాలతో సహా అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా మాగుంట రాఘవరెడ్డి టీడీపీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.కార్యక్రమంలో వైసిపిని వీడి టీడీపీలో చేరిన అర్ధవీడు వైస్ సర్పంచ్ సిరివెళ్ల బాలయ్య వార్డ్ మెంబర్ మద్దెర్ల గాలెమ్మ మద్దెర్ల చిన్న సుబ్బారాయుడు వర్రా రాములు షేక్ వలి కీర్తి వెంకటేశ్వర్లు వార్డ్ మెంబర్ తోట చిన్నసుబ్బరాయుడు, మండల టీడీపీ నాయకులు తదితరులు పాల్గోన్నారు*

👉 ప్రజలు మళ్లీ సీఎంగా జగనన్ననే కోరుకుంటున్నారు*. కుందూరు*….

రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు ఎమ్మెల్యేగా మీ కుందూరు నాగార్జున రెడ్డిని, ఎంపీ గా చెవిరెడ్డిని అత్యధిక మెజారిటీ తో గెలిపించండి..ఎవ్వరికీ సాధ్యం కానన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి,రాష్ట్ర ప్రజల గుండెల్లో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రపంచ రాజకీయాలకే ఆదర్శమని గిద్దలూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి,ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు.శుక్రవారం కంభం మండలంలోని నర్సిరెడ్డి పల్లె,తురిమెళ్ల,ఎర్రబాలెం గ్రామాల్లో పర్యటించి గిద్దలూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనని ,ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర రెడ్డి ని ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని అభ్యర్థించారు.ఈ సందర్భంగా కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ గత 40 ఏళ్లలో ఎవ్వరికీ సాధ్యంకాని విధంగా కేవలం ఐదేళ్లు పాలనలో జగనన్న రాష్టాన్ని మరింత అభివృద్ధి చేశారన్నారు.చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా జనరంజక పాలన అందించిన జగనన్న వైపే ప్రజలంతా ఉన్నారని స్పష్టం చేశారు.రానున్న ఎన్నికల్లో తిరిగి జగనన్నను సీఎంగా ఎన్నుకోవడానికి రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు*……

👉బీసీల సంక్షేమమే ఎన్డీయే కూటమి లక్ష్యం*..మాగుంట, ముత్తుముల సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్న 35 బీసీ కటుంబాలు*..

రాష్ట్రంలో బీసీల సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ముందుకు అడుగులు వేస్తుందని అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ ను ప్రవేశపెట్టిందని ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు.గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొంగలవీడు పంచాయతీలోని చంద్రారెడ్డి పల్లె గ్రామానికి చెందిన 35 బీసీ కుటుంబాలు గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి మరియు ఒంగోలు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు రాఘవరెడ్డి ఆధ్వర్యంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.ఈ సందర్భంగా వారికి టిడిపి కండువాలు కప్పి సాధనంగా పార్టీలోకి ఆహ్వానించారు రాబోయే ఎన్నికల్లో బీసీ సోదరులంతా ఐక్యమత్యంగా పోరాడి గిద్దలూరు అసెంబ్లీ, ఒంగోలు పార్లమెంటు ఎంపీ స్థానాలకు అత్యధిక మెజార్టీ తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీలో చేరిన చల్లా ఓబయ్య, బిల్లా రంగయ్య, బిల్లా రవి వార్డ్ మెంబర్ , చాబోలు కాశన్న నాయకులు తదితరులు పాల్గోన్నారు*

7k network
Recent Posts

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం