మన ప్రభుత్వం వల్ల తనకి మేలు జరిగిందని చెప్పటమే గీతాంజలి చేసిన పాపం, సైకోలతో వేధించి ప్రాణం తీసిన శ్యాడిస్టు చంద్రబాబు: సీఎం జగన్..
అదే బడ్జెట్, అదే రాష్ట్రం, మీ బిడ్డ చేయగలిగింది, చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడని మేమంతా సిద్ధం బస్ యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం కొనకనమిట్ల సభలో ఆయన ప్రసంగించారు.చంద్రబాబు మార్క్ అంటే అబద్ధాలు, కుట్రలు, మోసాలు, జగన్ మార్క్ అంటే ప్రతి గ్రామంలో కనిపించే అభివృద్ధి అన్నారు.ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు అవినీతి మోసాలు కుట్రలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.జన్మభూమి కమిటీలను మారుస్తు,ఇంటి వద్దకే చేరవేసే వాలంటీర్ వ్యవస్థ తీసువచ్చామన్నారు. వాలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయన్నారు. పేదలకు మంచి జరుగుతుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడన్నారు. స్కీములన్నీ చూస్తుంటే చంద్రబాబుకు ఐదు జెలుసిల్ ట్యాబ్లెట్లు వేసుకున్నా కడుపుమంట తగ్గట్లేదు,అందుకే వాలంటీర్లు లేకుండా చంద్రబాబు కుట్ర. తన రాజకీయం కోసం పేదల్ని చంపే చంద్రబాబు శాడిస్ట్ కాక ఇంకేంటి?.పేదలకు మంచి జరుగుతుంటే చూడలేని వాడే శాడిస్టు అని ఆయన చంద్రబాబును ఎద్దేవా చేశారు.👉 వైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ నేతలు.. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ,బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు వైయస్ఆర్ సీపీలో చేరారు.ప్రకాశం జిల్లా జువ్విగుంట క్రాస్ స్టే పాయింట్ వద్ద వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు వైయస్ఆర్ సీపీ కండువా కప్పుకున్నారు.టీడీపీ బీసీ సాధికార స్టేట్ కన్వీనర్, ఏపీ గౌడ సంఘం అధ్యక్షులు చలుమోలు అశోక్‌గౌడ్,క్లస్టర్ ఇన్‌ఛార్జి భాను ప్రకాష్, సొసైటీ మాజీ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాసరావు, జిల్లా గౌడసంఘం నేత ఎం. వరప్రసాద్‌లు సీఎం సమక్షంలో వైయస్ఆర్ సీపీలో చేరారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ, నియోజకవర్గ ఇన్‌ఛార్జి డీ వీ ఆర్ కె చౌదరి, డీసీసీ కార్యదర్శి సీహెచ్ కిరణ్‌లు వైయస్ఆర్ సీపీ కండువా కప్పుకున్నారు. అంతేకాకుండా బీజేపీ పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు పొన్నూరు శంకర్ గౌడ్ సీఎం వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్ సీపీలో చేరారు. కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఉన్నారు. 👉సీఎంను కలిసిన కొండెపి, కనిగిరి, కందుకూరు వైయస్ఆర్ సీపీ నేతలు.. ఆతర్వాత, ప్రకాశం జిల్లా కొండెపి,కనిగిరి,కందుకూరు నియోజకవర్గాలకు చెందిన వైయస్ఆర్ సీపీ కాంగ్రెస్ పార్టీ నేతలు కలిశారు.జువ్విగుంట నైట్ స్టే పాయింట్ వద్ద పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌ను కలిసి ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచార సరళిని వివరించారు.తనను కలిసిన పార్టీ నేతలు, కార్యకర్తలను, అభిమానులను సీఎం వైయస్ జగన్ పేరుపేరునా పలకరిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.👉పోన్నలూరు మండలం కే అగ్రహారం వద్ద మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారీ క్రేన్లతో స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు.
👉విశాఖలో సుమారు కోటి రూపాయలు నగదు పట్టుకున్న పోలీసులు….నగరంలోని ద్వారకా నగర్ వద్ద సుమారు కోటి రూపాయలు నగదు పట్టుకున్న పోలీసులు..ఇద్దరు వ్యక్తులు స్కూటీలో నగదు తరలిస్తుండగా పక్కా సమాచారంతో పట్టుకున్న ద్వారకా నగర్ పోలీసులు..నగదుకు సంబంధించి ఆధారాలు లేకపోవడంతో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ద్వారక సి.ఐ పోలీసులు సిబ్బంది.ఇద్దరు వ్యక్తులతో పాటు నగదు సీజ్ చేసి ద్వారక పోలీస్ స్టేషన్ కు తరలించారు.
👉బుల్లెట్ బైక్ పై పల్నాడు కలెక్టర్*…ఓటు హక్కును వినియోగించుకోవడం మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ శివశంకర్ అన్నారు.నరసరావుపేటలో ఓటర్ల అవగాహనపై మోటార్ సైకిల్ ర్యాలీని ఆదివారం కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లలో చైతన్యం తీసుకుని రావడం కోసం బైక్ ర్యాలీ నిర్వహించామని అన్నారు.మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓటింగు ప్రక్రియలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
👉అనుమానస్పద స్థితిలో గర్భిణీ మృతి..భర్త పై అనుమానం వ్యక్తం చేస్తున్న సోదరుడు*
కొమరోలు మండలం కొమరోలు లో చర్చి వీధిలో నాలుగు నెలల గర్భవతి లంకోజి ప్రసన్న (30) ఇంట్లోనే బాత్రూం లో అనుమానాస్పద స్థితిలో తీవ్ర గాయాలతో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
👉 గుంటూరు నగరంలోని ప్రైవేట్ వైద్యశాలలో నర్సుగా పనిచేస్తున్న యువతి అనుమానాస్పద మృతి. యువతికి తల్లిదండ్రులు లేరని తెలుస్తోంది. కాగా యువతి మరణానికి గల కారణాలు విచారణలో తెలియాల్సి ఉంది. మృతి చెందిన యువతి పలనాడు జిల్లా బెల్లంకొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిగా తెలుస్తోంది…. పూర్తి వివరాల అందాల్సి ఉంది …..👉బేస్తవారిపేట మండలం, పీవీ పురం గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న ప్రకాశం పోలీసులు..
రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం,నగదు మరియు ఇతర ప్రలోభ వస్తువుల సరఫరాకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్, ఐ.పి.యస్ ఆదేశాల మేరకు పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు.అందులో భాగంగా బేస్తవారిపేట మండలం, పీవీ పురం గ్రామంలో ఆటోలో అక్రమంగా రవాణా చేస్తున్న 391(180ఎంఎల్) క్వార్టర్ బాటిళ్లు, 48(650ఎంఎల్) బీర్ బాటిళ్లు బి.వి.పేట పోలీసులు స్వాధీనం చేసుకొని,ఒక వ్యక్తిని అరెస్టు చేసినారు.
👉వైసీపీకి గుడ్ బై చెప్పిన సీనియర్ నాయకుడు..ఒక మాజీ సర్పంచ్, విద్యా కమిటీ చైర్మన్,100 కుటుంబాలతో సహా టీడీపీలో చేరిన నారాయణ రెడ్డి…గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్డీయే కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో గిద్దలూరు మండలం,అంబవరం గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు సిరిపిరెడ్డి నారాయణ రెడ్డి, తనతో పాటు ఒక మాజీ సర్పంచ్,విద్యా కమిటీ చైర్మన్, గ్రామంలోని 100 కుటుంబాలతో సహా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.ఈ సందర్బంగా వారికీ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో అశోక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.కార్యక్రమంలో వైసిపిని వీడి టీడీపీలో చేరిన మాజీ సర్పంచ్ ఎండూరి ఏసురత్నం,విద్యా కమిటీ చైర్మన్ షరీఫ్ బాషా, పేరం సిరిపిరెడ్డి, పేరం నారాయణ రెడ్డి, సిరిపిరెడ్డి నరసింహా రెడ్డి, కంచర్ల ప్రసాద్ తదితరులు పాల్గోన్నారు.
👉జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోస్తాం..సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తాం.. దౌర్జన్యాలకు పాల్పడే నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు..గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల ..
రాష్ట్రంలో దోపిడీ పాలన చేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోసి, సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి ఘంటాపథంగా తెలిపారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా 6వ రోజు కంభం మండలంలోని తురిమెళ్ళ, మదారుపల్లి, నర్సిరెడ్డి పల్లె, కంభం పట్టణం,మరియు కందులాపురం గ్రామాలలో మిత్ర పక్షాలైన జనసేన, బీజేపీ నాయకులతో కలిసి తన పర్యటనను విజయవంతంగా కొనసాగిస్తూ ప్రతి గ్రామంలో అవ్వ, తాతలను, మహిళలు,గ్రామ పెద్దలను కలుసుకొని నాడు తెలుగుదేశం హయాంలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ, జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను, దోపిడీ దౌర్జన్యాలను ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు.అభివృద్ధి సంక్షేమం అందిస్తామని అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి నిత్యావసరాల ధరలు, గ్యాస్ ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు ఇసుక, సిమెంటు, ఇనుము ధరలను పెంచి రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచారన్నారు.రాష్ట్రంలో జగన్ రెడ్డి చేస్తున్న అవినీతి అక్రమాలను, భూ కబ్జాలను, దౌర్జన్యాలను ప్రజలంతా గమనిస్తున్నారని, వైసీపీ అధినేత బాటలోనే నియోజకవర్గాల్లో కూడా వైసీపీ నాయకులు అవినీతి అక్రమాలు,దౌర్జన్యాలకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని,వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసే సమయం అతి త్వరలోనే ఉందన్నారు.తాను స్థానికుడనని ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో, ప్రజల మధ్య నివాసం ఉండే వ్యక్తినని,ప్రతిరోజు నియోజకవర్గంలో ఎక్కడ తాను పర్యటన చేసిన రాత్రి సమయానికి గిద్దలూరుకు మాత్రమే వెళ్తానని,పక్క నియోజకవర్గాలకు వెళ్లే వ్యక్తిని కాదని,తాను మీవాడినని,మీ ఇంటి బిడ్డననిఅన్నారు.కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ బెల్లంకొండ సాయిబాబు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.👉ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరిన అర్ధవీడు గ్రామానికి చెందిన బీసీ కుటుంబాలు.. ఆదివారం సాయంత్రం కంభం పట్టణంలో పర్యటిస్తున్న అశోక్ రెడ్డి సమక్షంలో అర్థవీడు గ్రామానికీ చెందిన బీసీ వడ్డెర కుటుంబాలు వైసిపిని వీడి, తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈసందర్భంగా అశోక్ రెడ్డి టిడిపి కండువాలు కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో వైసిపిని వీడి,టీడీపీలో చేరిన తమ్మిశెట్టి వెంకటసుబ్బయ్య,తమ్మిశెట్టి శ్రీనివాసులు,ఏడుకొండలు, వెంకటేశ్వర్లు,సుబ్బయ్య, వెంకటయ్య,డేరంగుల శ్రీను, రాజు,తిరుమల కొండయ్య, బత్తుల ముని, వల్లెపు వెంకటేశ్వర్లు,శ్రీను, కుంచాల ఆంజనేయులు, రమణ, ఓర్సు తిరుపతమ్మ,గుంజా దుర్గా తదితరులు పాల్గోన్నారు.*👉ముత్తుములకు ఘన సన్మానం ..
ఎన్నికల ప్రచారంలో భాగంగాకంభం పట్టణంలోని నాయక్ వీధి లో టిడిపి నాయకుడు ఖాదర్ వలీ స్వగృహానికి విచ్చేసిన ముత్తుముల అశోక్_రెడ్డి,జనసేన ఇంచార్జ్ బెల్లంకొండసాయిబాబాలను ఖాదర్ వలీ ముస్లిం మైనార్టీ నాయకులు మిత్రబృందం గజమాల వేసి ఘనంగా సన్మానించారు.ఈసందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రారంభమైన నాటి నుండి మతసామరస్యానికి కట్టుబడి ఉందని మైనార్టీల అభివృద్ధి,సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తోందని మైనార్టీలకు నష్టం చేకూర్చే పని ఎప్పుడూ చేయలేద న్నారు.రాష్ట్రంలో ముస్లిం మైనారిటీ సోదరుల అభ్యున్నతికి కృషి చేసింది చంద్రబాబే అని, దుల్హన్ పథకం,రంజాన్ తోఫా, మైనార్టీ రుణాలు,మౌజామ్ లకు గౌరవవేతనాలు,హజ్ యాత్ర,విదేశీ విద్య, వంటి అనేక సంక్షేమ పథకాలను అందించారని గుర్తు చేశారు.