సీఎం జగన్‌ ఘటనపై పలు అనుమానాలు..ఉప ముఖ్యమంత్రి పై అభియోగం.. విస్తృత ప్రచారంలో మాగుంట కుటుంబం..ఓటమి భయంతోనే జగన్ రెడ్డి డ్రామా..మాజీ ఎమ్మెల్యే ముత్తుముల ఆరోపణ.

👉సీఎం జగన్‌ ఘటనపై పలు అనుమానాలు..???

వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విజయవాడ, సింగ్‌నగర్‌లో జరిగిన రాయి దాడి ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సీఎం రోడ్డుషో సందర్బంగా పలు మార్లు విద్యుత్ సరఫరా నిలిపి వేయడంపై కూడా పలు సందేహాలు వస్తున్నాయి. ఖచ్చితత్వంతో రాయి తగలడంపై కాట్ బాల్ వాడి ఉంటారని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.వీవీఐపీ వాహనం చుట్టూ ఉండే రోప్ పార్టీ ఎందుకు లేదని మాజీ పోలీస్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.విద్యుత్ సరఫరా లేని సమయంలో బుల్లెట్ ప్రూఫ్ షీట్లు వాడాల్సిన సీఎం సెక్యూరిటీ..రాయి తగిలిన ఘటన జరిగిన తరువాత కూడా బస్ వద్ద జనాన్ని పోలీసులు క్లియర్ చేయలేదు. సమీపంలో ఏవైనా సీసీ కెమెరాలు ఉన్నాయోమోనని పరిశీలిస్తున్నారు.కాగా జగన్‌కు రాయి తగిలిన చోట వైద్యులు బస్ లోనే రెండు సార్లు చికిత్స చేసారు.అంతా అయిపోయాక ప్రభుత్వాసుపత్రికి వెళ్ళాలని ప్లాన్ చేశారు.అక్కడ చికిత్స తరువాత మళ్ళీ కేసరపల్లి క్యాంప్‌కు జగన్ వెళ్లిపోయారు. కాగా ముఖ్యమంత్రికి తగిలింది స్వల్ప గాయమేనని ప్రభుత్వాసుపత్రి వైద్యులు చెప్పారు. కాగా ఈ రోజు బస్ యాత్రకు సీఎం జగన్ బ్రేక్ ఇచ్చారు.. శనివారం రాత్రి ఆగంతుకులు ఆయనపై రాయి విసిరారు. గుర్తుతెలియని వ్యక్తి పూలతో పాటు రాయిని విసిరాడు. దీంతో ఎడమ కంటికి తగలడంతో స్వల్ప గాయమైంది.వైద్యులు బస్సులోనే చికిత్సఅందించారు.చికిత్స అనంతరం జగన్ బస్సు యాత్రను కొనసాగించారు.

👉ఏపీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తమను మోసం చేసినట్లుగా ఒక మహిళ సీరియస్ ఆరోపణ చేసింది. తన భర్తకు ఉద్యోగం ఇస్తానని చెప్పిన ఆయన మాటలతో తాము డబ్బులు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. తాజాగా ఆమె చేసిన ఆరోపణ సంచలనంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో తన భర్తకు మేల్ నర్సింగ్ ఆర్డర్లీ జాబ్ ఇప్పిస్తానని చెప్పి మోసం చేసినట్లుగా ఆమె ఆరోపిస్తోంది. గణపవరం ప్రాంతానికి చెందిన పరిమళ సుమన అనే మహిళ అదే ఊళ్లో స్టాఫ్ నర్సుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమెకు మాధవరం గ్రామంలో లైన్ మెన్ గా పని చేస్తున్న సుదర్శన్, అతడి భార్య ఇద్దరు కలిసి తన భర్తకు ఎమ్ఎన్ వోగా జాబ్ ఇప్పిస్తానని చెప్పి నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. మంత్రికి రూ.4.5 లక్షలు ఇవ్వాలని చెప్పారని.. ఇందులో భాగంగా 2020 జనవరిలో మధ్యవర్తుల సాయంతో అప్పటి ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రిని కలిసి తాము డబ్బులు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. మాట ఇచ్చిన ప్రకారం ఎమ్ఎన్ వో ఉద్యోగం కాకుండా స్వీపర్ పోస్టు ఇచ్చినట్లుగా పేర్కొన్న మహిళ..ఏడాది తర్వాత ఆ జాబ్ నుంచి కూడా తొలగించినట్లుగాపేర్కొన్నారు.ఈవిషయాన్నిమధ్యవర్తులను ప్రశ్నించగా తమపై దాడికి పాల్పడినట్లుగా సదరు మహిళ ఆరోపించారు.ఎన్నికల వేళ ఉప ముఖ్యమంత్రి మీద దళిత మహిళ ఒకరు చేసిన ఆరోపణ హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశంపై ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణను వివరణ అడగ్గా.. తాను ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదని.. ఎన్నికల వేళ ఇలాంటి ఆరోపణలతో తన ప్రతిష్ఠను దెబ్బ తీయాలని ప్లాన్ చేసినట్లుగా పేర్కొన్నారు.

👉అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో కనిగిరికి రైలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి..గురువాజిపేటను మండల కేంద్రంగా మార్చేందుకు కృషి- డాక్టర్ ఉగ్ర..కనిగిరిఅడ్డరోడ్డు నుంచి గురువాజిపేట వరకు భారీ  ర్యాలీ..గజమాలతో మాగుంట ఉగ్రలకు స్వాగతం ..అధికారంలోకి వచ్చిన వెంటనే

మూడు నెలల్లో కనిగిరికి రైలు వచ్చే విధంగా కృషి చేస్తానని టిడిపి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలిపారు. కనిగిరి మండలం గురువాజిపేటలో జరిగిన ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.అడ్డరోడ్డు నుంచి గురువాజీపేట వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.భారీ గజ మాలలతో టిడిపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కీర్తిశేషులు మాగుంట సుబ్బరామిరెడ్డి ప్రకాశం జిల్లాను దత్తత జిల్లాగా స్వీకరించి ఎన్నో అభివృద్ధి పనులు చేసి ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. ఆయన బాటలో తాను కూడా ప్రకాశం జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నానన్నారు.తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కేంద్రం సాయంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చని తెలిపారు.వలసలు నివారించబడి ఉపాధి కల్పన కలుగుతుందని తెలిపారు. కనిగిరి టిడిపి అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆయన పదవీ లేకపోయినా కనిగిరి ప్రాంతాన్ని విడిచిపెట్ట లేదని ప్రజాసేవ లక్ష్యంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఉచిత కంటి వైద్య శిబిరాలు,అన్నా క్యాంటీన్ వంటి వాళ్ళు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నిరంతరం ప్రజల మధ్యనే ఉన్నారని తెలిపారు.కనిగిరి అభివృద్ధి కోసం తనను ఉగ్ర నరసింహారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.టిడిపి అభ్యర్థి డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ గురువాజీపేటను అవకాశం ఉంటే మండల కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.ఈ గ్రామంలో కళాశాల ఏర్పాటుకు పాటుపడతానని తెలిపారు. వెనుకబడిన కనిగిరి అభివృద్ధి తన లక్ష్యమని తెలిపారు. మాగుంట శ్రీనివాసులురెడ్డి సహకారంతో కనిగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. మెజారిటీ నిచ్చే గ్రామాలకు ప్రాధాన్యత ఇచ్చి నిధుల కేటాయింపు చేసి అభివృద్ధి చేస్తానన్నారు .కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షులు నంబల వెంకటేశ్వర్లు,కన్వీనర్ పిచ్చాల శ్రీనివాసరెడ్డి,టిడిపి నాయకులు ముచ్చుమారి చెంచిరెడ్డి,నాగిరెడ్డి,పోతు కొండారెడ్డి,కుందూరు తిరుపతిరెడ్డి,నాదెండ్ల తిరుపతిరావు,కోటపాటి జనార్దన్ రావు,ఉగ్ర నరసింహారెడ్డి తనయుడు జయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

👉 కొండపి నియోజకవర్గం సింగరాయకొండ మండల ఊళ్ళపాలెం,ఫకీర్ పాలెం లలో మాగుంట చారిటబుల్ ట్రస్ట్ మరియు సింగర్ కంపెనీ ఆధ్వర్యంలో మాగుంట అభిమానులు నడుపుతున్న ఉచిత కుట్టు మెషిన్ శిక్షణా కేంద్రాన్ని యువ నాయకులు మాగుంట రాఘవ రెడ్డి సతీమణి చందన సందర్శించారు ,ఈసందర్భంగా శిక్షణ తీసుకుంటున్న మహిళలతో కొద్ది సేపు ముచ్చటించారు. కార్యక్రమంలో సర్పంచ్ పాకనాటి సుబ్బారెడ్డి, షేక్ నాసిర్,ఎన్నాబత్తిన మురళి కోటి రెడ్డి, షేక్ మున్నా,ఆత్మకూరి బ్రహ్మయ్య,చెరుకూరి ఆదిలక్ష్మి మరియు పలువురు మహిళలు పాల్గొన్నారు.


👉దర్శి లోని శ్రీనివాస పద్మావతి ఎ /సి కల్యాణ మండపం నందు జరిగిన ఆర్యవైశ్య సోదర సోదరీమణుల ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న దర్శి శాసనసభ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి,నారప శెట్టి పాపారావు,నారపు శెట్టి పిచ్చయ్య,డాక్టర్ కడియాల లలిత్ సాగర్ , తాతా ప్రసాద్, శ్రీ దివి రమేష్ మరియు పలువురు ఆర్యవైశ్య సోదరులు,కార్యకర్తలు పాల్గొన్నారు

👉ఓటమి భయంతోనే జగన్ రెడ్డి డ్రామా రాజకీయాలు..నాడు కోడి కత్తి డ్రామా..నేడు రాళ్ల దాడి డ్రామా :గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల..

వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంతోనే డ్రామా రాజకీయాలు చేస్తున్నాడని గిద్దలూరు టీడీపీ ఇన్చార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 2019 ఎన్నికల్లో ఇదే తరహాలో కోడికత్తి డ్రామాతో అధికారంలోకి వచ్చాడని, ప్రస్తుతం అన్నీ సర్వేల్లోనూ వైసీపీకీ ఓటమి తప్పదని తేలటంతో మరలా రాళ్ల దాడితో డ్రామా రాజకీయాలు మొదలు పెట్టాడన్నారు.ఈ ఐదేళ్ళ వైసీపీ పాలనలో జగన్ నిజస్వరూపం రాష్ట్ర ప్రజలంతా తెలుసుకున్నారని,సొంత చెల్లిని, తల్లిని గెంటేసిన జగన్ రెడ్డి తన రాజకీయ లబ్ది కోసం ఎన్ని డ్రామాలు ఆడిన రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.ఆదివారం ఉదయం కొమరోలు మండలంలోని పలుగ్రామాలలో పర్యటించిన అశోక్ రెడ్డి గ్రామాలలోని అవ్వ, తాతలు,మహిళలు ప్రతీ ఒక్కరిని కలిసి ఉమ్మడి మైనిఫెస్టోలోని అంశాలను వివరించారు.నాడు తెలుగుదేశం హయాంలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, ప్రజలకు జరిగిన సంక్షేమం గుర్తు చేశారు.తాను స్థానికంగా నివాసం ఉంటానని గిద్దలూరు ప్రజలకు సంక్షేమం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటం తన లక్ష్యమని,మే 13 న జరిగే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్దిగా పోటీ చేస్తున్న తనకు,ఎంపీ అభ్యర్దిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసుల రెడ్డికి సైకిల్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు,మండల టీడీపీ,జనసేన, బీజేపీ నాయకులు పాల్గోన్నారు…👉అశోక్ రెడ్డి కృషితోనే పట్టణంలో సిమెంట్ రోడ్లు, త్రాగునీరు..గిద్దలూరు పట్టణంలో సిమెంట్ రోడ్లు,త్రాగునీరు అశోక్ రెడ్డి కృషితోనే సాధ్యమైందని ఎన్డీయే కూటమి అభ్యర్థి అశోక్ రెడ్డి సతీమణి పుష్పలీల ప్రజలకు వివరించారు.పట్టణంలోని 4వ వార్డు ఏబీఎమ్ పాలెంలో ఇంటింటికి తిరిగి నాడు తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేస్తూ, మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.గిద్దలూరు ఎన్డీయే కూటమి అభ్యర్థిగా పోటీ చేయుచున్న అశోక్ రెడ్డికి మరియు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న మాగుంట శ్రీనివాసరెడ్డికి సైకిల్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ నాయకులు,జనసేన,బీజేపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

7k network
Recent Posts

మోడీకి సరైన ప్రశ్న సంధించిన ప్రియాంకా!!!..బిగ్ స్టేట్ లో బీజేపీకి షాక్ !?..సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు: డి.ఎస్.పి బాల సుందర రావు..ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి ఒకరి పరిస్థితి విషమం..

పదేళ్ళ పాలనలో మోడీ ఫెయిల్ నా లేక పాస్ నా?..మనవడి లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ రియాక్షన్!..మహిళలకు గుడ్ న్యూస్..యాభై వేలు పొందండిలా!.ఏపీలో అల్లర్లపై సిట్ ఏర్పాటు..నవధాన్యాల సాగుపై అవగాహన..దోర్నాల.

48గంటల్లోపు ఓటింగ్ శాతాల డేటాను ఇసి వెబ్సైట్లో ఎందుకు ఉంచలేదు-సుప్రీంకోర్టు ఆగ్రహం..ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్యాయత్నం..టూరిస్టు బస్సులో మంటలు ఎనిమిది మంది మృతి..పల్నాడు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గా శ్యాం ప్రసాద్..వజ్రాల వేట మొదలు..ఘర్షణలకు పాల్పడితే చర్యలు కంభం సీఐ..పెట్రేగిపోతున్న మట్టి మాఫియా .

మోడీ : అయోధ్య రామా వర్సెస్ రేషన్ బియ్యం !..రైల్వే పోలీసులకు అభినందనలు తెలిపిన పొదిలి వ్యాపారి..కిమ్స్ లో అరుదైన చికిత్స..వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలిక మృతి..ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..అక్రమ అపార్ట్మెంట్లపై ఉక్కు పాదం.

ట్యాక్సుల‌పై నిర్మల‌మ్మకు డైరెక్ట్ బిగ్ పంచ్..అధికారం లోకి రాబోతున్నాం -“జగన్”..”బాబు”కు భద్రత పెంచిన కేంద్రం..పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల ఇళ్లలో సోదాలు..మాచర్లలో పోలీసుల కవాతు..

ఏం ‘టంగ‌య్యా’ స్వామీ.. మోడీపై విసుర్లు!.. అకస్మాత్తుగా ముస్లింలపై మోడీకి ప్రేమ పుట్టుకు వచ్చేసింది.. ముస్లింలలో పేదరికం ఎక్కువట!.. ఆయన కూడా ముస్లిం స్నేహితులు ఉన్నారట..!ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. “బస్సు ప్రమాదం” ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి!!!