సీఎం జగన్ సమక్షంలో హేమాహేమీల చేరికలు..ఓర్వలేకనే దాడులు..1400 కిలోల బంగారం స్వాధీనం..విస్తృత ప్రచారంలో మాగుంట తనయుడు..కంభంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డిఆత్మీయ సమ్మేళనం.. త్రిబుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య..

👍దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం ఉన్నాయని, ధైర్యంగా అడుగులు ముందుకేద్దామని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు.

ఎవరూ అధైర్య పడాల్సిన అవసరంలేదని పార్టీ శ్రేణుల‌కు ఆయ‌న ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌పై దాడి తర్వాత ఆయన చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర పునఃప్రారంభమైంది. డాక్టర్ల సూచనతో ఒకరోజు విశ్రాంతి తర్వాత బస్సు యాత్రను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆయనపై హత్యాయత్నం ప్రయత్నం జరగడంతో కేసరపల్లి క్యాంపునకు పెద్ద ఎత్తున నాయకులు , కార్యకర్తలు తరలి వచ్చారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిపై హత్యాయత్నం ఘటనపై తీవ్ర విచారం వ్యక్తంచేశారు.వైయస్ఆర్‌సీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని,బస్సు యాత్రకు వస్తున్న విశేష ఆదరణచూసి తట్టుకోలేక ఈ దారుణానికి పాల్పడ్డారని ముఖ్యమంత్రితో అన్నారు. ప్రజల ఆశీర్వాదం వల్లే అదృష్టవశాత్తూ ఈ దాడి నుంచి సీఎం తప్పించుకున్నారన్నారు. ఇలాంటి దాడులు ఆపలేవని ముఖ్యమంత్రి నేతలతో అన్నారు.ఎవరూ అధైర్య పడాల్సిన అవసరంలేదున్నారు. 👉🏼 సీఎం జగన్ ఇతర పార్టీల నుండి అనేక మంది నాయకులను వైయస్ఆర్సీపీ కండువా కప్పి నేడి యాత్రను ప్రారంభించారు.

💫*టీడీపీ (శ్రీశైలం నియోజకవర్గం) నుంచి చేరికలు…నేడు కొత్తగా చేరిన వారిలో అహ్మద్ హుస్సేన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్,హజ్ కమిటీ మాజీ ఛైర్మన్, ముస్తఫా మోమిన్,టిడిపి అధికార ప్రతినిధి,ముఫ్తీ నూర్ మహ్మద్ మరియు మహ్మద్ ఇలియాస్, కర్నూలు జిల్లా తాలిమీ బోర్డు అధ్యక్షులు ఉన్నారు.వారితో పాటు వైఎస్‌ఆర్‌సీపీ శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి చేరికకు హాజరయ్యారు….💫టీడీపీ, కాంగ్రెస్ నుంచి చేరికలు……కొత్తగా చేరిన వారిలో చిరుమామిళ్ల శ్రీనివాసరావు (అలియాస్ బుజ్జి) సీనియర్ టీడీపీ నాయకుడు,నందిగామ మార్కెటింగ్ కమిటీ మాజీ ఛైర్మన్,వడ్డెలి శ్రీనివాసరావు – నందిగామ టౌన్ మాజీ వైస్ ఛైర్మన్, వై రామారావు – నందిగామ మున్సిపల్‌లో టిడిపి కీలక నాయకుడు, గోడపాటిబూరరావు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం చార్జి, షేక్ కరీముల్లా టీడీపీ ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ అధ్యక్షురాలు, డాక్టర్ షేక్ హసీనా,కొమ్ము విజయరాజు,సీనియర్ టీడీపీ నాయకులు.ఈ దీక్షలో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ కేశినేని నాని,నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌లు పాల్గొన్నారు.

👉2వాహనాలు..1400 కేజీల బంగారం..ఎవరిది?

ఎందుకంటే ఒక లారీలో వేయి కేజీల బంగారం ఉంటే.. మరో వాహనంలో 400 కేజీల బంగారాన్ని గుర్తించారు. కేజీ బంగారం అంటేనే.. ఒకలాంటి ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పది గ్రాముల బంగారాన్ని ఒక సగటు మధ్యతరగతి జీవి కొనేందుకు ముందు వెనుకా ఆలోచించాల్సి ఉంటుంది.అలాంటి పరిస్థితి ఉన్న వేళ.. ఏకంగా 1400 కేజీల బంగారం ఒకేసారి..రెండు వాహనాల్లో దొరికిస్తే?అంతకు మించిన సంచలనం ఇంకేం ఉంటుంది? ఇప్పుడు అలాంటి షాకింగ్ సీన్ తమిళనాడులో చోటు చేసుకుంది.తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో తాజాగా భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఎన్నికల సందర్భంగా గస్తీ నిర్వహించే ఫ్లయింగ్ స్క్వాడ్ జరిపిన తనిఖీల్లో ఒక ప్రైవేటు సెక్యూరిటీ సంస్థకు చెందిన మినీ లారీ..మినీ కంటెయినర్ లారీలను సోదాలు జరిపారు.ఈ సందర్భంగా వారికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఎందుకంటే..ఒక లారీలో ఏకంగా వెయ్యి కేజీల బంగారం ఉంటే..మరో వాహనంలో 400 కేజీల బంగారాన్ని గుర్తించారు. వెంటనే ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించారు. ఇంత భారీగా బంగారం పట్టుబడటం సంచలనంగా మారింది.ఇంత భారీగా పట్టుబడిన బంగారానికి సంబంధించిన పత్రాలు లేకపోవటం గమనార్హం.మొత్తం 1400 కేజీల బంగారానికి కేవలం 400 కేజీల బంగారానికి మాత్రమే అధికారిక పత్రాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ బంగారాన్ని చెన్నై విమానాశ్రయం నుంచి శ్రీపెరుంబుదూరు సమీపంలోని మన్నార్ లోని ఒక గోదాంకు తరలిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు.ఇంత భారీ ఎత్తున బంగారం బయటపడటంతో.. చెన్నై ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారుల్ని పోలీసులు సంప్రదిస్తున్నారు.వారి నుంచి మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది.ఇంత భారీగా బంగరాన్ని ఎవరు తెప్పించారు? దీనికి సంబంధించిన అనుమతులు తీసుకున్నారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.

👉 దర్శి మండలం సామంతపూడి లో దరిశి శాసనసభ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీతో కలిసి తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు మాగుంట రాఘవరెడ్డి,నారాపశెట్టి పాపారావు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర్లు , మునిసిపల్ చైర్మన్ పిచ్చయ్య గారు,కౌన్సెలర్ వి. సి. రెడ్డి మరియు ఈ కార్యక్రమం లో పలువురు నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

👉 దర్శి లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో ప్రకాశం జిల్లా పార్లమెంట్ ఇంచార్జి నూకసాని బాలాజీ, దర్శి శాసనసభ అభ్యర్థి డా.గొట్టిపాటి లక్ష్మి భర్త డా. కడియాల లలిత్ సాగర్ మరియు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి సమక్షంలో వై. యస్. ఆర్. సి. పి కన్వీనర్ బి. సుబ్బారెడ్డి, ఫిలిప్స్, ఇంద్రసేన రెడ్డి మరియు 200 కుటుంబాలు నేడు వైకాపాని వీడి తెలుగుదేశం పార్టీ లో చేరడం జరిగింది. కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడం జరిగింది.

👉త్రిబుల్ ఐటీ లో విషాదం…కడప జిల్లా: ఇడుపులపాయ..

ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న సురేఖ హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం.సురేఖ పరిస్థితి విషమం కడప రిమ్స్ కు తరలింపు.రిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందిన విద్యార్థిని సురేఖ.మృతి చెందిన విద్యార్థిని ప్రకాశం జిల్లా కంభం మండలం జంగం గుంట్ల గ్రామం కు చెందిన సురేఖ గా పోలీసుల గుర్తింపు.సురేఖ మృత్తి గల కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు.

👉అన్నమయ్య జిల్లా: రాజంపేట..అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం.బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న రేణుక మృతి..అన్నమాచార్య కాలేజీ బాలికల హాస్టల్ లో ఫ్యాన్ కి ఉరి వేసుకున్న నంద్యాలకు చెందిన రేణుక.మృతి గల కారణాలు తెలియాల్సి ఉంది.

👉సొంత గూటికి చేరిన కాపు నాయకుడు అర్ధవీడు ఎంపీపీ.

ఇటీవల వైసీపీని వీడి టీడీపీ లోకి చేరిన అర్ధవీడు ఎంపీపీ మేడూరి వెంకటరావు,నేడు గిద్దలూరు నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమక్షంలో గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి గార్ల నాయకత్వంలో తిరిగి సొంత గూటికి వైసీపీ లోకి తిరిగి చేరారు..👉*బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామంలో టీడీపి ని వీడి రెండు కుటుంబాలు..ఉండేలా ఆవులరెడ్డి,మోక్షగుండం అనిల్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది..

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…