-
- సీఎం జగన్ పై రాయి దాడి.. నిందితులు గుర్తింపు..
గత శనివారం రోజున ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన రాయి దాడి జరిగిన ఘటన పైన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. ఈ దాడి చేసిన వ్యక్తిని పట్టిస్తే నగదు బహుమతిని కూడా ప్రకటించారు. తాజాగా దర్యాప్తులో భాగంగా పురోగతి సాధించినట్లు తెలుస్తోంది పోలీసులు.. ముఖ్యంగా ఈ కేసులో ఐదుగురు యువకులను అనుమానితులుగా పోలీసులు గుర్తించారు .దీంతో వారిని వెంటనే అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.. అసలు విషయంలోకి వెళ్తే అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందినటువంటి సతీష్ (సత్తి) అని యువకుడే సీఎం జగన్మోహన్ రెడ్డి పైన రాయి దాడి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.సతీష్ తో పాటు మరొక నలుగురు కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించడంతో వారిని కూడా అదుపులోకి తీసుకున్నారట. అయితే ఈ దాడికి గల కారణాలను ఇంకా అధికారులు ప్రశ్నిస్తున్నారు.. అయితే సీఎం జగన్ పైన దాడికి విసిరినటువంటి రాయి.. రాయి కాదని అది పాత టైల్స్ ముక్క అన్నట్లుగా వెల్లడించారు.. టైల్స్ రాయిని జేబులో వేసుకొని వచ్చి సడన్గా ఈ దాడి చేసినట్లుగా పోలీసులు సైతం గుర్తించామంటూ తెలియజేశారు. మరి ఈ దాడి చేయడానికి గల కారణం ఏంటనే విషయాన్ని ఈరోజు విచారణలో భాగంగా కనిపెడతామంటూ పోలీసులు తెలియజేస్తున్నారు.
👉వైసీపీలో చేరిన తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీ సెల్ కార్యదర్శి రమణ ..ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని బెస్తవారిపేట పట్టణానికి చెందిన,దోమల వెంకట రమణహనుమంతుల, వెంకటసుబ్బయ్య,దుస్సా, చంద్రమౌలి,అంకిరెడ్డి, సత్తార్,టిడిపిని వీడారు. మంగళవారం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి సోదరుడు కుందూరు కృష్ణమోహన్ రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరారు.ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి కృష్ణమోహన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైస్సార్సీ నాయకులు పాల్గొన్నారు.
👉బేస్తవారిపేట లో స్థానిక ఎంపీపీ స్వగృహం నందు విశ్వాస్ టివి ఎండీ బోడిచెర్ల సునీల్ కుమార్ మరియు విశ్వాస్ దినపత్రిక ఎడిటర్ సైమన్ విశ్వాస్ కుమార్ మరియు కంభం అర్థవీడు విశ్వాస్ టివి రిపోర్టర్ కాశిం పీరా అధ్యర్యంలో మరియు రాణిపేట కాలనీ వాసులు భారీ గా బేస్తవారిపేట ఎంపీపి.ఓసూరా రెడ్డి అధ్యర్యంలో భారిగా వైసీపీ లో చేరారు
👉గిద్దలూరును అభివృద్ధి చేసే బాధ్యత అశోక్ రెడ్డిది..14వ వార్డు ఇంటింటి ప్రచారంలో అశోక్ రెడ్డి సతీమణి పుష్పలీల..గిద్దలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత అశోక్ రెడ్డిదేనని సతీమణి పుష్పలీల ప్రజలకు తెలియజేశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు పట్టణంలోని 14వ వార్డు, పి.ఆర్ కాలనీ, అర్బన్ కాలనీలలో ఇంటింటికి తిరిగి టిడిపి జనసేన బిజెపి మ్యానిఫెస్టో లోని అంశాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.
👉ఎన్నికల ప్రచారంలో అశోక్ రెడ్డి తనయుడు దివ్యేష్.గిద్దలూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యలను పరిష్కరించడమే అశోక్ రెడ్డి లక్ష్యమని వారి తనయుడు దివ్యేష్ ప్రజలకు వివరించారు.ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి తనయుడు దివ్యేష్ రెడ్డి మంగళవారం బేస్తవారిపేట మండలం,పివి పురం, జెన్నీవారిపల్లె,చెరుకుపల్లె బసినేపల్లె,గ్రామాలలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు గ్రామ పెద్దలు, అవ్వ తాతలను కలిసి టిడిపి జనసేన బిజేపి మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. 👉బెస్తవారిపేట మండలం బసినపల్లె పంచాయతీలో జెన్నీవారిపల్లె వైసీపీ నుండి టీడీపీ లోకి 10 కుటుంబాలు చేరిక. అభివృద్ధి చేసిన అశోక్ రెడ్డి కె మా మద్దతని తెలిపి 10 కుటుంబాలు మాజీ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి తనయుడు దివ్యేష్ రెడ్డి సమక్షంలో వైసీపీ నీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
👉వైసీపీలో చేరిన అర్ధవీడు మండలానికి చెందిన మాగుటూర్ గ్రామం,బసిరెడ్డి పల్లె టీడీపి నాయకులు..ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం లోని మాగుటూరు గ్రామానికి చెందిన యాదవులు….భోగం వెంకటేశ్వర్లు,నల్లబోతుల వెంకటేశ్వర్లు,నాలి కొండయ్య యాదవ్,కోడి గంగులయ్య, మద్దెల పోల్ రాజు,నాలి తిరుపతయ్య,బొల్లె బోయిన రాజులయ్య,బొల్లె బోయిన వెంకటేశ్వర్లు,గోపిదేశి చిన్న పిచ్చయ్య,రజకులు: యాపాకుల రవి,పనగళ్ల శీను,పోతన పల్లె చిన్న రామలింగయ్య,రాజులయ్య,నారాయణ,అలుగుసాని వెంకటేశ్వర్లు టీడీపిని వీడారు..అలాగే బసిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన యనమల రమేష్ 3 వ వార్డు మెంబర్ తరపున 30 కుటుంబాలు,మంగళవారం నాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందురు నాగార్జున రెడ్డి సోదరుడు కుందురు కృష్ణమోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ లోకి చేరారు.ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి కేపి.కృష్ణ మోహన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.కార్యక్రమంలో, అర్ధవీడు మండల వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు..
👉వైసీపీలో చేరిన అర్ధవీడు మండలానికి చెందిన యాచవరం గ్రామానికి చెందిన టీడీపి నాయకులు..ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం లోని యాచవరం గ్రామానికి చెందిన యెనుబెర జేమ్స్,కాలువ రాములు, భూపని రమేష్,నల్లబోతుల కాశీరావు,పొట్టే శేఖర్ టీడీపిని వీడారు.మంగళవారం నాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందురు నాగార్జున రెడ్డి సోదరుడు కుందురు కృష్ణమోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ లోకి చేరారు.ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి కేపి.కృష్ణ మోహన్ పార్టీలోకి ఆహ్వానించారు.