పవన్ వారాహి రధం ఎక్కడ?.. సీఎం జగన్ సమక్షంలో వైకాపాలో చేరికలు..ఫారుక్ షుబ్లిపై ఆవాజ్ ధ్వజం..పలు కార్యక్రమాలలో పాల్గొన్న మాగుంట.. గిద్దలూరు టీడీపీ వైకాపాలలో చేరికలు..

పవన్ వారాహి రధం ఎక్కడ…!?చంద్రబాబుతో కలసి ఉమ్మడి

సభలలో పవన్ పాల్గొంటున్నారు. ఆ తరువాత మాత్రం వారాహి సద్దు లేకుండా ఉంటోందని అంటున్నారు. అప్పట్లో అన్న గారి చైతన్య రధం మాదిరిగా ఎన్నికల వేళ పవన్ వారాహి రధం జనం మధ్యన ఉంటూ జనంతో నెలల తరబడి తిరుగుతూ ఏపీని చుట్టబెడుతుందని అంతా ఆశించారు. కానీ గత ఏడాది జూన్ నెల నుంచి కొద్ది కాలం పాటు ఉభయ గోదావరి జిల్లాలలో మాత్రమే పవన్ వారాహి రధం తిరిగింది.ఆ తరువాత మాత్రం ఆగిపోయింది.ఎన్నికలు దగ్గర పడిన తరువాత పవన్ ఉధృతంగా ఏపీ అంతా తిరుగుతారు అనుకుంటే పోలింగ్ కి కౌంట్ డౌన్ దగ్గరపడుతోంది కానీ ఆ ముచ్చట అయితే కనిపించడంలేదు.చంద్రబాబుతో కలసి ఉమ్మడి సభలలో పవన్ పాల్గొంటున్నారు.ఆ తరువాత మాత్రం వారాహి సద్దు లేకుండా ఉంటోంది అని అంటున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ ఉమ్మడి సభల కంటే ఏపీ అంతటా తానుగా తిరిగి కూటమికి పాజిటివ్ వేవ్ ని క్రియేట్ చేయవచ్చు.కానీ పుణ్య కాలం అంతా ఇలా గడచిపోతోంది. ఉత్తరాంధ్రాలో పవన్ తిరుగుతారు అనుకుంటే ఒక్క అనకాపల్లి సభ మాత్రమే ఇప్పటిదాకా జరిగింది. అలాగే గోదావరి జిల్లాలలో కూడా సోలోగా పవన్ టూర్లు అయితే పెద్దగా లేవు అని అంటున్నారు. ఇక నామినేషన్ల ఘట్టం వచ్చేసింది. దాంతో కొన్ని రోజులు పిఠాపురంలో పవన్ కి ఆ హడావుడి ఉంటుంది. ఇదంతా అయ్యేసరికి బీజేపీ జాతీయ నేతలు ఏపీకి వస్తారు. వారితో కలసి ఉమ్మడి ప్రచారం చేస్తే అప్పటికి పోలింగ్ డేట్ వచ్చేస్తుంది. మొత్తం మీద చూస్తే టీడీపీ కూటమిలో క్రౌడ్ పుల్లర్ గా భావించే పవన్ కళ్యాణ్ ప్రచారం కూటమికి బాగా కలసి వస్తుందనుకుంటే ఆయన సింగిల్ గా ప్రచారం అయితే చేయడం లేదు అని అంటున్నారు. ఇక ప్రచారం టీడీపీ జనసేన కలసి చేస్తున్నా రాయలసీమ మీద పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు అని అంటున్నారు. గ్రేటర్ రాయలసీమగా చెప్పుకునే నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు కర్నూల్, అనంతపురం కడపలలో గట్టిగా పర్యటించాల్సిన కూటమి నేతలు ఆ వైపు చూడడంలేదు. ఆ బాధ్యతలు ప్రస్తుతానికి బాలక్రిష్ణ చూస్తున్నారు కానీ అక్కడ కూటమి సభలు ఉమ్మడిగానూ విడివిడిగానూ పవన్ బాబు నిర్వహిస్తే బాగుంటుందని అంటున్నారు. మరో వైపు చూస్తే ఈసారి ఎన్నికల్లో పవన్ ప్రచారం తీవ్ర స్థాయిలో చేయాల్సి ఉందని అంటున్నారు. ఆయన మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు కాకపోయినా రీజియన్ల వారీగా తిరిగి సభలు పెట్టి జనాలను కూటమి వైపుగా తిప్పాల్సిన అవసరం ఉందని అంటున్నారు. లేకపోతే కూటమి ఇబ్బందులో పడుతుందని అంటున్నారు. అయితే పవన్ ఎక్కువగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారు అన్న ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనా ఏపీలో ఎన్నికల ప్రచారానికి గట్టిగా 23 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ సమయంలో ప్రచారం చేసుకున్న వారికి చేసుకున్నంత అని అంటున్నారు. చూడాలి మరి నామినేషన్ల తరువాత అయిన జోరు చూపిస్తారో లేదో.
👉 పారుక్ షుబ్లి ముస్లిం సమాజాన్ని బిజెపి టిడిపి జనసేనకు తాకట్టు పెట్టారు..

ఆయన చెప్పే నీతి వాక్యాలు అన్ని బూటకము ఆయన మాటలు నమ్మవద్దని ఆవాజ్ జిల్లా కార్యదర్శి ఎస్ మస్తాన్వలి తెలిపారు.దేశంలో ఉన్న ముస్లిం మేధావి వర్గం బిజెపి విధానాలను వ్యతిరేకిస్తున్నా..పార్లమెంట్లో వైసీపీ మాత్రమే సి ఏ ఏ చట్టాన్ని బలపరిచిందని చెప్పడం పూర్తిగా తప్పు టిడిపి కూడా బలపరిచినది.. మీకు నిజాయితీ ఉంటే విజయవాడలోనే టిడిపి నుండి వైసీపీలో చేరిన ఎంపీ నానిని అడగండి నాని ఒక్కడు మాత్రమే సి ఏ ఏ చట్టాన్ని వ్యతిరేకించారు.. ముస్లింలను మోసపు మాటలు చెప్పి బిజెపిని ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకున్నా టిడిపి జనసేన ను మీరు ఎందుకు వ్యతిరేకించడం లేదు?.. ప్రధాని మోడీ మేనిఫెస్టో విడుదల చేస్తూ దేశవ్యాప్తంగా సిఏఏ యు సి సి మరియు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలు చేస్తాము అని ప్రకటించారు ప్రధానంగా బిజెపికి 400 సీట్లు కేంద్రంలో వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రకటించారు ఆ విధంగా ప్రకటించిన బిజెపికి మన రాష్ట్రంలో ఒక్క శాతం ఓట్లు లేకుండా ఎంపీ ఎమ్మెల్యే సీట్లు కేటాయించిన టిడిపి జనసేనను మీరు ఎందుకు విమర్శించరు???.. రాజ్యాంగాన్ని మారుస్తా అన్న బిజెపి మాటలను టిడిపి కూడా బలుపరచినట్లే కదా మీకు రాజ్యాంగం పైన ఏమాత్రం గౌరవం లేదు ముస్లింలకు మోసం చేయడం తప్ప మరి ఏమి చేతకాదు.. 👉 రాష్ట్రాల హక్కులను హరించి ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థను ధ్వంసం చేస్తూ గవర్నర్ల ద్వారా పరిపాలన చేస్తున్న బిజెపి విధానాలు దేశవ్యాప్తంగా రైతన్న కార్మిక ఉద్యోగులను మహిళలను వారి హక్కుల కొరకు పోరాడుతుంటే అక్రమ కేసులు బనాయిస్తున్న విషయం చంద్రబాబుకు తెలియదా మీకు తెలియదా తెలిసినా తెలియనట్టు నటిస్తున్నారా? నేటికీ ఢిల్లీలో సిఏఏ చట్టాన్ని వ్యతిరేకించిన ముస్లిం సోదరులు మహిళలు జైల్లో ఉన్నారు.. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు కోట్ల రూపాయల ఆస్తిని పోగొట్టుకున్నారు ఈ విషయం మీకు తెలియదా మణిపూర్ దుర్ఘటనలో కనీసం ఒక్క మాట మాట్లాడలేని ప్రధాని మోడీని నిలదీస్తే ఖండించలేని దౌర్భాగ్యస్థితి మనది..ఎక్కడో రాష్ట్రాల గురించి మనకెందుకు అనుకునే మీకు ఒకే ఒక ప్రశ్న సమాధానం చెప్పండి ముస్లింలకు శాసనసభలో ఎన్ని సీట్లు కేటాయించారు సీట్లు ఇస్తామని కూడా చివరికి మోసం చేసిన చంద్రబాబు బిజెపి చెప్పిన వారికే సీట్లు ఇచ్చినారు. ఎదుటివారికి చెప్పే శ్రీరంగనీతులు మనం పాటిస్తున్నామా లేదా గమనించండి.చివరిగా బిజెపి చేసే మోసం ఇటువంటిదో పుల్వామా ఘటన గురించి తెలుసుకోండి ఆ విషయము అప్పుడు గవర్నర్ గా ఉన్న సత్యపాల్ మాలిక్ వివరంగా చెప్పారు బిజెపి ప్రధాని మోడీ హోంమంత్రి రక్షణ మంత్రి మాటలు పట్టించుకోలేదు బహిరంగంగా ప్రకటన ఇచ్చినారు.. వెంటనే ఆయన పైన ఈ డి ఐటి సిఐడి దాడులు ఆయన ఇంటి పైన వారి బంధువుల ఇండ్ల పైన జరిగినవి. 👉 బిజెపికి బలపరిచిన వారందరూ నిజాయితీపరులు వ్యతిరేకించేవారు అవినీతిపరులు అందుకే భయపడి చంద్రబాబు నాయుడు బిజెపితో పొత్తు పెట్టుకున్నారు మీకు ఈ విషయం పూర్తిగా తెలుసు తెలిసి మాట్లాడే వారిని మోసం చేసేవారు అని చెప్పక తప్పదు.ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రోల్ బాండ్స్ పైన చర్చ జరుపుతూ బిజెపి అవినీతి ప్రభుత్వాన్ని ప్రతి మేధావి ఖండిస్తుంటే మీరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బలపరచడం అంటే మిమ్మల్ని ఏమనాలి?..ఇప్పటికైనా మీ వైఖరిని మార్చుకొని టిడిపి జనసేన బిజెపి పార్టీల పొత్తును వ్యతిరేకించి ముస్లింల హక్కుల పరిరక్షణ పేరుతో ఏర్పడిన సంఘానికి ముస్లింల హక్కులను పరిరక్షించండి ఇప్పటివరకు పరిరక్షించడం లేదని తెలియజేస్తున్నానని ఖండించారు..

*ముఖ్యమంత్రి జగన్స సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కీలక నేతలు.

కాకినాడ జిల్లా రాజానగరం నియోజకవర్గం.. ఎస్.టి.రాజపురం వద్ద జనసేన, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుంచి ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో
నెల్లూరు జిల్లా జనసేన, తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు కండువా వేసి వైయస్సార్సీపీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి,నెల్లూరు మండల అధ్యక్షుడు కాటంరెడ్డి జగదీష్ రెడ్డి,జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ యాదవ్,తెలుగుదేశం పార్టీ ఉదయగిరి మండల మాజీ ఎంపీపీ చేజెర్ల సుబ్బారెడ్డి.
కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ అభ్యర్ధి వి విజయసాయిరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదాల ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు.

👉రాష్ట్రంలోని ప్రతిపక్ష కూటమిపై సీఎం జగన్ సెటైర్లు.. చంద్రబాబు తన మనుషులను పంపితే ఏర్పటైన కూటమి.ఆ కూటమిలో ప్యాకేజి స్టార్ టికెట్లు ఎవరికీ ఇవ్వాలో కూడా చంద్రబాబే నిర్ణయిస్తారు. కూటమిలో నిర్ణయాలు.. బాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్. జగన్ ను కొట్టు అంటే కొట్టు.. దత్తపుత్రా నీకు ఇచ్చేది 80 కాదు 20 అంటే దానికి ఓకే.. ప్యాకేజి స్టార్ కు ఆంధ్రప్రదేశ్ అంటే ఎంత చులకన అంటే.. చిన్న జ్వరం వస్తే హైదరాబాద్ వెళ్లిపోయే అంత చులకన..సీఎం జగన్..

👉 100 వైసీపీ కుటుంబాలు టీడీపీ లో చేరిక.. ఒంగోలు పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి మరియు మార్కాపురం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అసెంబ్లీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి పొదిలి మండలంలోని టి.సల్లూరు, ఏలూరు,తలమల్ల,గోగినేని వారిపాలెం,ఉప్పలపాడు గ్రామాలలో గురువారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలు పూలదండలు హారతులతో ఘన స్వాగతం పలికారు.మాగుంట శ్రీనివాసులు రెడ్డి,కందుల నారాయణరెడ్డిల సమక్షంలో తలమల్ల పంచాయతీలోని 100 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు.కార్యక్రమంలో మండల తెలుగుదేశం నాయకులు,ఆయా గ్రామాల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

👉పలు కార్యక్రమాలలో పాల్గొన్న మాగుంట..నేడు కొండపి నియోజకవర్గం లో కొండపి శాసనసభ అభ్యర్థి డోలా బాల వీరాంజనేయ స్వామి నామినేషన్ కార్యక్రమం లో  ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన తనయులు మాగుంట రాఘవ రెడ్డి, పూర్ణచంద్ర రావు జయంత్ బాబు రిటర్నింగ్ ఆఫీసర్ కు నామినేషన్ పత్రాలు అందించారు… .నేడు యర్రగొండపాలెం నియోజకవర్గం లో యర్రగొండపాలెం శాసనసభ అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు  నామినేషన్ కార్యక్రమం లో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు .👉 కొండపి నియోజకవర్గం లో యం. ఆర్. ఓ కార్యాలయం ప్రక్కన ఏర్పాటు చేసిన సభలో  ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి,  దామచర్ల సత్య ,జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ , కొండేపి నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ కనపర్తి మనోజ్ కుమార్,వరికూటి నాగరాజు,బిజెపి తెలుగుదేశం,జనసేన, తదితర నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు….,…………….👉అభివృద్ధి చేసిన మా నాన్నను ఆధరించండి అంటూ మాజీ ఎమ్మెల్యే తనయుడు దివ్యేష్ రెడ్డి…ఎన్నికల ప్రచారంలో భాగంగా బెస్తవారిపేట మండలంలోని పెంచికల పాడు, మోక్షగుండం, పూసలపాడు గ్రామలలో తిరిగి గ్రామ ముఖ్య నాయకులను, గ్రామ పెద్దలను కలిసి జరగబోయే మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా పోటీ చేయుచున్న ముత్తుముల అశోక్ రెడ్డికి మరియు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న మాగుంట శ్రీనివాస రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరిన అశోక్ రెడ్డి తనయుడు దివ్యేష్.

👉గిద్దలూరు లో నామినేషన్ వేసిన కె పి.. గిద్దలూరు నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా కుందూరి నాగార్జున రెడ్డి శుక్రవారం నామినేషన్ వేశారు. కార్యక్రమంలో వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

👉 బేస్తవారిపేట మేజర్ పంచాయితీలో టిడిపి నుండి వైయస్సార్ కాంగ్రేస్ పార్టీకి బారీగా వలసల పరంపర కొనసాగుతుంది అందులో బాగంగా బేస్తవారి పేట జంక్షన్ లో ఆటో యూనియన్ నాయకులు బీసీ కాల్నీలో టిడిపి నాయకులు కార్యకర్తలకు గిద్దలూరు వైస్సార్సీపీ అభ్యర్ధి కుందురు నాగార్జునరెడ్డి సోదరుడు కుందురు కృష్ణమోహన్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకోవడం జరిగింది.కార్యక్రమంలో ఎంపీపీ ఓసూరారెడ్డి వైస్ ఎంపీపీ ఖాజి మండల కన్వినర్ కొండా రఘునాధరెడ్డి టౌన్ కన్వినర్ బొంతల లక్ష్మన్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు……

👉వైసీపీలో చేరిన అర్ధవీడు మండలం నాగులవరం గ్రామంలో వడ్డెర కుటుంబాలు
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని అర్ధవీడు మండలం నాగులవరం గ్రామంలో వడ్డెర 50 కుటుంబాలు శుక్రవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందురు నాగార్జున రెడ్డి సోదరుడు కుందురు కృష్ణ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ లో చేరారు.ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి కృష్ణ మోహన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు..

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…