ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవిత అరెస్టు డ్రామా నా!!!..ప్రజారాజ్యం పదవి కోసం..జనసేన ప్యాకేజ్ కోసం..గిద్దలూరు వైకాపా,టీడీపీలలో చేరికలపై చేరికలు!!!

👉ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవితను అరెస్టు చేయకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నిరుత్సాపడింది.

అందుకే వారి కేడర్, కార్యకర్తలకు నమ్మకం కలిగించేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో అరెస్ట్ చేశారని, అందుకే ఇప్పుడు బీజేపీ కేడర్‌లో ఉత్సాహం వచ్చిందని’’ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానల్ క్వచ్చన్ అవర్ కార్యక్రమానికి హాజరైన అయన ‘’కవితకు ఈడీ నోటీసుల వెనుక బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందం ఉందని తాను గతంలో చెప్పానని… ఇప్పుడు అరెస్ట్ వెనుక కూడా ఓ కారణం ఉందని’’ ఆయన అన్నారు. ‘బీజేపీ వాళ్లు తమ రాజకీయ మనుగడ కోసం, బతుకుదెరువు కోసం రాముడి పేరును ఉపయోగించుకుంటున్నారని, శ్రీరాముడు దేవుడని, ఆయనను లీడర్ చేయవద్దని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారన్న కేసీఆర్ మాటలను సీరియస్‌గా తీసుకోవద్దని కోరడం విశేషం. ఈ ఎన్నికల్లో 12 నుండి 14 పార్లమెంట్ స్థానాలు గెలుస్తామన్నారు..

👉ప్రజారాజ్యం పదవి కోసం.. జనసేన ప్యాకేజ్ కోసం.. ఎమ్మెల్యే ఫైర్!ఈ సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీను. ఈ సందర్భంగా పవన్ పై విమర్శలు గుప్పిస్తూ.. చిరంజీవికి కొన్ని సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం గమనార్హం.ఏపీలో రాజకీయాలు రోజు రోజుకీ వేడెక్కుతున్న సంగతి తెలిసిందే.ప్రధానంగా అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటుంది. అధికారపార్టీపై విపక్షాలు విమర్శలు చేయడం..అనంతరం వైసీపీ నేతలు వరుసపెట్టి తలంటడం వంటి కార్యక్రమాలు రోజు రోజుకీ తీవ్రమైపోతున్నాయి! ఈ సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీను. ఈ సందర్భంగా పవన్ పై విమర్శలు గుప్పిస్తూ.. చిరంజీవికి కొన్ని సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం గమనార్హం.అవును…జనసేన అధినేత పవన్ పై ప్రభుత్వ విప్, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో ఆయన మానసిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసినంతపనిచేశారు. ఇదే సమయంలో పవన్ చేస్తున వ్యాఖ్యలు,ఆ మాటలు మాట్లాడేటప్పుడు చేస్తున్న చేష్టలు, ఆయన వివాహ జీవితం మొదలైన విషయాలపై శ్రీను సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.ఈ సమయంలో ప్రజారాజ్యం, చిరంజీవి మొదలైన విషయాలను ప్రస్థావించడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇందులో భాగంగా..సినీ గ్లామర్‌ తో కార్లను మార్చినట్లు భార్యలను మార్చుతున్న పవన్.. హిందూ వివాహ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తూ పిచ్చిప్రేలాపనలు పేలుతున్నారని గ్రంధి శ్రీను ఫైరయ్యారు.పవన్‌ మానసిక స్థితి సరిగా లేదని, అందువల్ల తక్షణం మెరుగైన వైద్యం కోసం ఆయనను వైజాగ్‌ లోని పిచ్చాస్పత్రిలో చేర్పించాలని చిరంజీవి కుటుంబ సభ్యులకు ఆయన సూచించారు. ఇదే సమయంలో…గతంలో తన తల్లిని విమర్శించిన చంద్రబాబు, లోకేష్‌ తో పవన్ ఎందుకు పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించారు.ఇదే క్రమంలో… ప్రముఖ కాపు నేత వంగవీటి రంగాను హత్య చేయించిన గూండాలతో జతకట్టిన పవన్‌…భీమవరంలో గూండాలు,రౌడీలు,బాంబుల అంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందని చెప్పిన శ్రీను…ఊగిపోతూ, రెచ్చిపోతూ అతను వాడుతున్న భాషను చూస్తే రౌడీ ఎవరో ప్రజలు ఇప్పటికే గుర్తించారని చురకలంటించారు! అందువల్లనే గత ఎన్నికల్లో పవన్‌ ను భీమవరం ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించి ఇంటికి పంపించారని అన్నారు. అదేవిధంగా…గతంలో పాచిపోయిన లడ్డూలిచ్చారంటూ మోడీని తిట్టిన పవన్‌..బీజేపీతో ఎలా జతకట్టాడని ప్రశ్నిచారు.కరోనా వైరస్‌ సమయంలో ప్రజలు అల్లాడిపోతుంటే.. పక్క రాష్ట్రానికి పారిపోయిన పవన్‌.. నేడు ఏముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నాడని శ్రీనివాస్‌ దుయ్యబట్టారు.ఈ సమయంలో ప్రజారాజ్యం టాపిక్ కూడా తెరపైకి తెచ్చిన గ్రంధి శ్రీను… చిరంజీవి స్వార్థంతో తనకు పదవి రావడం కోసం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌ పార్టీకి అమ్ముకుంటే.. నేడు రోజువారీ ప్యాకేజీ కోసం తన తల్లిని దూషించిన చంద్రబాబు, లోకేష్ తోనే పవన్‌ జత కట్టారని గ్రంధి శ్రీనివాస్‌ ఫైరయ్యారు. ఈ సందర్భంగా కాపు మహిళతో పవన్ కళ్యాణ్ విఫలమైన వివాహాన్ని ఎత్తిచూపిన గ్రంధి శ్రీను..కాపు సామాజికవర్గం పవన్ కళ్యాణ్‌ కు మద్దతు ఇవ్వడంపై పునరాలోచించాలని కోరారు.పవన్ కళ్యాణ్‌ తో వివాహం కారణంగా ఆమె చాలా బాధపడ్డారని నొక్కి చెప్పారు. పవన్ కళ్యాణ్ బహుళ వివాహాల గురించి గ్రంధి శ్రీను అసహ్యం వ్యక్తం చేస్తూ…పవన్ పనులన్నీ మన సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధం అని పేర్కొన్నాడు.

👉ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరిన 100 కుటుంబాలు*…గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి ఇన్చార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో గిద్దలూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన 100 కుటుంబాలు వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.

👉ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరిన 20 ఎస్సి కుటుంబాలు*కంభం ఎస్సి పాలెంలో గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో మండల ఎస్సి సెల్ అధ్యక్షులు సిరివెళ్ళ రవికుమార్ ఆధ్వర్యంలో 20 ఎస్సి కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు.వారికీ టీడీపీ కండువాలు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో కంభం పట్టణంలో ఎస్సి సోదరులంతా అశోక్ రెడ్డి గెలుపుకోసం కృషి చేస్తామన్నారు.👉ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరిన నారాయణపల్లె గ్రామానికి చెందిన 10 కుటుంబాలు*కంభం పట్టణంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో అర్ధవీడు మండలం,నారాయణ పల్లె గ్రామానికి చెందిన 10 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు…….

👉 ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరిన 10 కుటుంబాలు*రచర్ల మండలం, చినగానిపల్లె పంచాయతీలోని అచ్చంపేట గ్రామానికి చెందిన 10 కుటుంబాలు వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.వారికీ టిడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో అశోక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.

👉రాచర్ల మండలంలో వైసీపీకీ భారీ షాక్..ముత్తుముల సమక్షంలో 150 కుటుంబాలతో సహా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు..రాచర్ల మండల వైసీపీకి భారీ షాక్ తగిలింది మంగళవారం ఉదయం గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి ఇన్చార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో రాచర్ల మండలం,అనుమలవీడు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు చప్పిడి శ్రీనివాసులు మరియు అతని ఆధ్వర్యంలో 150 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారికి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

👉వైసీపీలోకి చేరిన మట్టా శేషు. ఆంధ్ర మిర్రర్.. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం,బేస్తవారిపేట పట్టణానికి చెందిన,మాజీ ఉప సర్పంచ్ మరియు ఆర్యవైశ్య నాయకుడు మట్టా శేషు మరియు వారి కుటుంబ సభ్యులు టీడీపి ని వీడారు.మంగళవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందురు నాగార్జున రెడ్డి సోదరుడు కుందురు కృష్ణ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు.ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి కేపి.కృష్ణ మోహన్ రెడ్డి గారు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

👉వైసీపీలోకి చేరిన 20 కుటుంబాలు..ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం,కంభం పట్టణానికి చెందిన,మీరావలి మరియు సుభాని ఆధ్వర్యంలో 20 కుటుంబాలు వైస్సార్సీపీ లోకి చేరారు.మంగళవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందురు నాగార్జున రెడ్డి సోదరుడు కుందురు కృష్ణ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలోకి చేరారు.ఈసందర్భంగా వారందరికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కేపి.కృష్ణ మోహన్ రెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.*…👉గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీలోకి భారీ చేరికలు* 17 మరియు 18 వార్డులలోని 200 టీడీపీ కుటుంబాలకు వైసీపీ తీర్థం*.రాష్ట్రంలో పేదవాడికి సంక్షేమం జరగాలంటే వైసీపీ ప్రభుత్వమే రావాలి*

*గిద్దలూరు వైసీపీ ఇంచార్జి, ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి సమక్షంలో, కౌన్సిలర్స్ దొంత లక్ష్మి మరియు షాక్షావలి నాయకత్వంలో టీడీపీని వీడి వైసీపీలో చేరిన గిద్దలూరు నగర పంచాయతీ నల్లబండ బజార్ 17 మరియు 18 వార్డులకి చెందిన 200 కుటుంబాలు..ఈ సందర్భంగా నాగార్జున రెడ్డి వైసీపీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి, జగనన్న హయాంలోనే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి జరిగిందని,మళ్ళీ సంక్షేమం కొనసాగాలంటే గిద్దలూరులో తనను గెలిపించాలన్నారు.పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ గిద్దలూరు అసెంబ్లీ మరియు ఒంగోలు పార్లమెంట్ స్థానాలకు అత్యధిక మెజార్టీ వచ్చేందుకు తామంతా కృషి చేస్తామన్నారు*….

7k network
Recent Posts

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి