మోడీ కి నిరసన సెగ..సీఎం జగన్ సమక్షంలో చేరికలు..మార్కాపురం కాంగ్రెస్ అభ్యర్థిగా జావీద్ అన్వర్.. ఒంగోలు గిద్దలూరు కనిగిరిలో హేమాహేమీల నామినేషన్లు….

👉మోడీకి దిమ్మ‌తిరిగేలా త‌మిళ‌నాడు రైతుల షాక్‌..పుర్రెలు, ఎముక‌ల‌తో నిర‌స‌న‌! త‌మిళ‌నాడులో గత ఏడాది కాలంలో బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డిన రైతుల పుర్రెలు,ఎముక‌ల‌తో వారు ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి.. కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ ఢిల్లీలో భారీ షాక్ త‌గిలింది. ఇప్ప‌టి వ‌ర‌కు అనేక నిర స‌న‌లు జ‌రిగాయి. ఈ దేశంలో నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు.. అణ‌చివేత‌లు కొత్త‌కాదు. ఏదో ఒక స‌మ‌స్య‌పై నిరంత‌రంగా.. దేశంలో ఉద్య‌మాలు సాగుతూనే ఉన్నాయి. అయితే..తాజాగా త‌మిళ‌నాడు రైతులు..అన్నింటికంటే భిన్నంగా దేశంలో తొలిసారి.. ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డిన రైతుల పుర్రెలు, ఎముల‌తో ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న తెలిపారు.ఎవరికి, ఎప్పుడు, ఎందుకు? ఇలా ఇప్ప‌టి వ‌రకు దేశంలో జ‌ర‌గ‌లేదు.ఇప్పుడు ఎందుకు ఇలా చేశారంటే.. 2014, 2019 ఎన్నిక‌ల్లో మోడీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలోనూ పేర్కొన్నారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు అలా జ‌రిగింది లేదు. పైగాదేశ‌వ్యాప్తంగా మ‌ద్ద‌తు ధ‌ర‌లకు చ‌ట్ట‌బ‌ద్ధత లేదు. రైతుల‌ను వ్య‌వ‌సాయ కూలీ లుగా మార్చే చ‌ట్టాలు తెస్తున్నారు. ఈ ప‌రిణామాల‌తో రైతులు ఆవేద‌న‌, ఆందోళ‌న కూడా వ్య‌క్తం చేస్తున్నా రు.డిల్లీలో నెల‌లు, సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు వ్య‌క్తం చేశారు.అయినా.. కేంద్రంలోని మోడీ స‌ర్కారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే ప‌నులు చేప‌ట్ట‌లేద‌న్న‌ది రైతు ల ఆవేద‌న‌. ముఖ్యంగా మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించాల‌న్న త‌మ డిమాండ్ ఇప్ప‌టికీ నెర‌వేర‌లేద ని వారు వాపోతున్నారు. ఈ క్ర‌మంలోనే మోడీకి దిమ్మ‌తిరిగిపోయేలా భారీ నిర‌స‌న వ్య‌క్తం చేశారు. త‌మిళ‌నాడులో గత ఏడాది కాలంలో బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డిన రైతుల పుర్రెలు, ఎముక‌ల‌తో వారు ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న వ్య‌క్తం చేశారు.గ‌తంలో ఎప్పుడూ ఇలా.. పుర్రెలు, ఎముక‌ల‌తో నిర‌స‌న వ్య‌క్తం చేయ‌క‌పోవ‌డంతో ఇది క్ష‌ణాల వ్య‌వ‌ధిలోనే దేశ‌వ్యాప్తంగా పాకిపోయింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న మోడీ ఇప్పటి వరకూ చేయ‌లేద‌ని రైతులు ఆరోపించారు. అంతేకాదు..మోడీపై పోటీ చేసి ఓడించేందుకు తాము సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు రైతు సంఘాల నాయ‌కులు కూడా ప్ర‌క‌టించారు. మొత్తానికి కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌,.. అటు ముస్లింలు, ఇటు రైతులు మోడీపై మండిప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.

👉మేమంతా సిద్ధం యాత్ర చివరి రోజున శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గంలోని అక్కివలస వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ,జనసేన, బీజేపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు.👉విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ మాజీ మంత్రి పెద్దింటి జగన్ మోహన్ రావు,ఆయన కుమారుడు పెద్దింటి రామస్వామి నాయుడు వైసీపీలో చేరారు.👉పార్వతీపురం నియోజకవర్గానికి చెందిన ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్‌ మాజీ సభ్యురాలు, టీడీపీ సీనియర్‌ నేత కొయ్యన శ్రీవాణి వైఎస్ఆర్సీపీలో చేరారు.👉పలాస నియోజకవర్గ కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి,ఆమె కుమార్తె కొర్ల శిరీష వైఎస్ఆర్సీపీలో చేరారు.👉పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మాజీ జెడ్పీటీసీ లోలుగు లక్ష్మణరావు వైఎస్ఆర్సీపీలో చేరారు.

👉ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం ఎంపీటీసీ మజ్జి గౌరి, టీడీపీ ఉపాధ్యక్షుడు మజ్జి రమేశ్‌ వైఎస్ఆర్సీపీలో చేరారు.👉ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం మాజీ ఎంపీపీ గొర్లి విజయకుమార్‌, సీనియర్‌ నాయకుడు రామారావు వైఎస్ఆర్సీపీలో చేరారు.👉చీపురుపల్లి నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణరావు వైఎస్ఆర్సీపీలో చేరారు.- రాజాం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ సభ్యుడు డి.నాగేశ్వరరావు వైఎస్ఆర్సీపీలో చేరారు.👉రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమ రథసారధి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గ వైసిపి అభ్యర్థి అన్నా రాంబాబు అన్నారు.బుధవారం పొదిలి మండలంలోఅక్కచెరువు, తుమ్మకుంట,జువ్వలేరు గ్రామాల్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పనులు నడిపించేందుకు సంక్షేమానికి పెద్దపీట వేసేందుకు ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,మార్కాపురం నియోజకవర్గం అభ్యర్థిగా నన్ను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచులు చేరెడ్డి లక్ష్మీదేవి,అంబవరపు తిరుపతిరెడ్డి,శనగల సుధాకర్ రెడ్డి,వైసీపీ సీనియర్ నాయకులు కసిరెడ్డి వెంకటరమణారెడ్డి అంబావరపు నారాయణరెడ్డి, శనగల వెంకటేశ్వర్ రెడ్డి పలు గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

👉 ఒంగోలు అసెంబ్లీ కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు నామినేషన్ సందర్భంగా భారీ జనసంద్రంతో మినిస్టేడియం నుండి ర్యాలీ గా బయలుదేరి,ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి తో కలిసి నామినేషన్ వేసిన దామచర్ల జనార్దన్ రావు. ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్,బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు శివా రెడ్డి,మాజీ మునిసిపల్ చైర్మన్ మంత్రి శ్రీను,తాతా ప్రసాద్,కోలా ప్రభాకర్ మరియు తదితర నాయకులు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

👉 కనిగిరిలో టిడిపి అభ్యర్థి డాక్టర్ నరసింహారెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీ. అట్టహాసంగా నామినేషన్ కార్యక్రమం👉 కనిగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి దేవరపల్లి సుబ్బారెడ్డి భారీ ర్యాలీతో తరలివెల్లి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆయన వెంట ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, సిపిఎం నాయకులు, ప్రజలు పాల్గొన్నారు

👉అట్టహాసంగా ముత్తుముల అశోక్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం..ప్రకాశం జిల్లా గిద్దలూరు లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ముందుగా గిద్దలూరు పట్టణంలో నాయకులు కార్యకర్తలు నిర్వహించిన భారీ ర్యాలీలో టిడిపి నాయకులు మాగుంట రాఘవరెడ్డి,జనసేన పార్టీ నాయకులు బెల్లంకొండ సాయిబాబు,ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు.గిద్దలూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.👉అనంతరం ఎమ్మార్వో కార్యాలయం ఏర్పాటుచేసిన రిటర్నింగ్ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.తరువాత ముత్తుమల అశోక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు అందిస్తున్న సూపర్ సిక్స్ పథకాలే ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకువస్తాయని అన్నారు. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని గిద్దలూరు నుంచి పోటీ చేస్తున్న తనకు మే 13వ తేదీన జరిగే ఎన్నికలలో ఓటు వేసి గెలిపించాలని ముత్తుముల అశోక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బెల్లంకొండ సాయిబాబు, రాచర్ల మాజీ జడ్పిటిసి కుప్పా రంగసాయి తో పాటు కార్యకర్తలు కీలక నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

👉 కాంగ్రెస్ పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రముఖ న్యాయవాది, సయ్యద్ జావిద్ అన్వర్.

మార్కాపురం నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ను సయ్యద్ జావిద్ అన్వర్ ఎట్టకేలకు సాధించుకున్నారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి చేతుల మీదుగా మంగళవారం సాయంత్రం ఈయన బీఫామ్ అందుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మొదట ఎస్ కే సైదా ను ఆ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే.ఈయన నామినేషన్ కూడా దాఖలు చేశారు.అయితే అనూహ్యంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సైదా ను తొలగించి సయ్యద్ జావిద్ అన్వర్ కు ఎమ్మెల్యే టికెట్ ను కేటాయించింది.

👉గన్ మిస్ ఫైర్.. డీఎస్పీ మృతి.. భద్రాద్రి జిల్లాలో ఈరోజు ఉదయం విషాదం చోటు చేసుకుంది.గన్ మిస్ ఫైర్ కావడంతో సీఆర్పీఎఫ్ డీఎస్పీ శేషగిరి రావు ఛాతిలోకి బుల్లెట్ దూసుకెళ్ళింది.తీవ్రంగా గాయపడిన ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్య లో మరణించారు.కొత్తగూడెం జిల్లా ఛల్లా మండలం పూసుగుప్ప 81వ బెటాలియన్ లో బుధవారం ఈ ఘటన జరిగింది.

👉నెల్లూరు జిల్లా కావలి సమీపం లో ముసునూరు టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి..లారీని క్రాస్ చేయబోయి మరో లారీని ఢీకొన్న కారు.ముగ్గురు మృతి.ఇద్దరు పరిస్థితి విషమం.మృతులు పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంకు చెందిన జ్యోతి కళ్యాణ్, రాజి, కుమార్ లగా గుర్తింపు.చెన్నైలో ఇమిటేషన్ గోల్డ్ కొనుక్కొని తిరిగి కొయ్యలగూడెం వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం…

7k network
Recent Posts

మోడీకి సరైన ప్రశ్న సంధించిన ప్రియాంకా!!!..బిగ్ స్టేట్ లో బీజేపీకి షాక్ !?..సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు: డి.ఎస్.పి బాల సుందర రావు..ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి ఒకరి పరిస్థితి విషమం..

పదేళ్ళ పాలనలో మోడీ ఫెయిల్ నా లేక పాస్ నా?..మనవడి లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ రియాక్షన్!..మహిళలకు గుడ్ న్యూస్..యాభై వేలు పొందండిలా!.ఏపీలో అల్లర్లపై సిట్ ఏర్పాటు..నవధాన్యాల సాగుపై అవగాహన..దోర్నాల.

48గంటల్లోపు ఓటింగ్ శాతాల డేటాను ఇసి వెబ్సైట్లో ఎందుకు ఉంచలేదు-సుప్రీంకోర్టు ఆగ్రహం..ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్యాయత్నం..టూరిస్టు బస్సులో మంటలు ఎనిమిది మంది మృతి..పల్నాడు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గా శ్యాం ప్రసాద్..వజ్రాల వేట మొదలు..ఘర్షణలకు పాల్పడితే చర్యలు కంభం సీఐ..పెట్రేగిపోతున్న మట్టి మాఫియా .

మోడీ : అయోధ్య రామా వర్సెస్ రేషన్ బియ్యం !..రైల్వే పోలీసులకు అభినందనలు తెలిపిన పొదిలి వ్యాపారి..కిమ్స్ లో అరుదైన చికిత్స..వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలిక మృతి..ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..అక్రమ అపార్ట్మెంట్లపై ఉక్కు పాదం.

ట్యాక్సుల‌పై నిర్మల‌మ్మకు డైరెక్ట్ బిగ్ పంచ్..అధికారం లోకి రాబోతున్నాం -“జగన్”..”బాబు”కు భద్రత పెంచిన కేంద్రం..పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల ఇళ్లలో సోదాలు..మాచర్లలో పోలీసుల కవాతు..

ఏం ‘టంగ‌య్యా’ స్వామీ.. మోడీపై విసుర్లు!.. అకస్మాత్తుగా ముస్లింలపై మోడీకి ప్రేమ పుట్టుకు వచ్చేసింది.. ముస్లింలలో పేదరికం ఎక్కువట!.. ఆయన కూడా ముస్లిం స్నేహితులు ఉన్నారట..!ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. “బస్సు ప్రమాదం” ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి!!!