74 ఏళ్ల వయసులో చంద్రబాబు హుషారు..!!..విస్తృత ప్రచారంలో మాగుంట కుందూరు,అన్నా, ముత్తుముల కుటుంబాలు..కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభం

👉 74 ఏళ్ల వయసులో చంద్రబాబు చూపిస్తున్న ఉత్సాహం చూసినోళ్లు ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబుతో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీ అధినేతలంతా ఆయనకంటే చిన్నవారు.ఏపీ విషయానికి వస్తే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు 55ఏళ్లు కాగా..సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 51 ఏళ్లు. అంటే.. చంద్రబాబు కంటే ఈ ఇద్దరు అధినేతల వయసు దాదాపు 20 ఏళ్లు పైనే. వయసులో ఇంత తేడా ఉన్నప్పుడు ఉత్సాహం విషయంలో వీరిద్దరితో పోటీ పడటమే కాదు..తనతో పోటీ పడే సత్తా ఎవరికీ లేదన్నట్లుగా ఆయన తీరు ఉంది. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఉదయం పూట ప్రచారం చేయటానికి యువకులైన నేతలు సైతం చెమటలు కక్కుతూ.. సాయంత్రం వేళకు ప్రచారాల్ని వాయిదా వేస్తున్నారు.తెలంగాణరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం..తన బస్సు యాత్రను సాయంత్రం వేళలోనే నిర్వహిస్తున్నారు. అందుకు భిన్నంగా చంద్రబాబు ప్రచారం మాత్రం పగలు..రాత్రి అన్న తేడా లేకుండా నిర్వహిస్తున్నారు.ఎన్నికల వేళ ఆయన ప్రదర్శిస్తున్న స్టామినాను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.74 ఏళ్ల వయసులో ఇంతలా శ్రమించటం ఆయనకుమాత్రమే సాధ్యమంటున్నారు. రాజకీయంగా సవాలచ్చ విభేదాలు ఉండొచ్చు కానీ ఇంతటి బలం ఆయనకు మాత్రమే సాధ్యమంటున్నారు. కీలకమైన ఎన్నికల వేళ.. చంద్రబాబు ఫిట్ నెస్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోందని మాత్రం చెప్పక తప్పదు.

👉 గిద్దలూరు నియోజకవర్గం బేస్తవారిపేట లో తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షులు సైదులు నివాసం లో కార్యకర్తల తో ఆత్మీయ సమావేశం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గిద్దలూరు శాసనసభ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి మరియు మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు నిఖిల్ రెడ్డి, కుప్పా రంగసాయి , జనసేన నియోజకవర్ఘ ఇంచార్జి బెల్లంకొండ సాయి బాబు మరియు తదితర టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

👉ప్రకాశం జిల్లా కంభం, బి పేట,అర్ధవీడులో కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ ఎన్నికల ప్రచారంలో టిడిపి ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, గిద్దలూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి, జనసేన పార్టీ ఇన్ చార్జ్ బెల్లంకొండ సాయిబాబు పాల్గొన్నారు.ముందుగా అర్ధవీడులో ఎన్డీఏ కూటమి కార్యకర్తలు నిర్వహించిన భారీ ర్యాలీలో వీరు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలోని అన్ని వర్గాల వారికి ఎంతో మేలు చేకూరిందని గిద్దలూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు.ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానికంగా ఉండే తనకు ఓటు వేసి గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.👉మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ… ఎన్డీఏ కూటమి అభ్యర్థులమైన తనను అశోక్ రెడ్డిని గెలిపిస్తే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు కరువు ప్రాంతంగా పిలుస్తున్న ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో ప్రధాన సమస్య అయిన రాచర్ల గేటు సమస్య పరిష్కరించడంతోపాటు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.అలానే మార్కాపురం జిల్లాగా చేసేందుకు కట్టుబడి ఉంటామని అన్నారు.తాము ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటామని ప్రజలందరూ తమను ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించాలని అన్నారు. 👉జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించండి.. అఖిలభారత రాష్ట్ర పెన్షనర్ల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యన్ జి ఓ సంఘం మాజీ అధ్యక్షుడు అయిన  జి. పూర్ణచంద్రరావు…జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించాలని అఖిలభారత రాష్ట్ర పెన్షనర్ల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యన్ జి ఓ సంఘం మాజీ అధ్యక్షులు జి. పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు.మాట్లాడుతు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను పెన్షన్లను సామాన్య ప్రజానీకాన్ని నడ్డి విరిసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించాలని కోరారు.సోమవారం బెస్తవారి పేట లో వారు టీడీపీ కి మద్దత్తు ప్రకటించారు..ఈ సందర్బంగా ఆల్ ఇండియా పెన్షనర్స్ అస్సోసియేసన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ యన్ జి ఓ సంఘం మాజీ అధ్యక్షుడు జి . పూర్ణచంద్రరావు, గురవయ్య ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం మాజీ అధ్యక్షుడు,, విజ్డమ్ చౌదరి ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ యన్ జి ఓ సంఘం మాజీ అధ్యక్షుడు, పిచ్చయ్య, ప్రకాశం జిల్లా మాజీ అధ్యక్షుడు,తదితర ఫింఛన్ దారుల నాయకుల సమక్షంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తెలుగు దేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మరియు అశోక్ రెడ్డి,తెలుగు దేశం పార్టీ గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థి ద్వారా కరపత్రాలు విడుదల చేసి పంపిణీ చేశారు.ఈ కరపత్రం ద్వారా ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి తెలుగు దేశం జనసేన భారతీయ జనతా పార్టీలతో కూడిన కూటమి బలపరచాలని నిర్ణయించారు. ఒంగోలు పార్లమెంటు తెలుగు దేశం పార్టీకి చెందిన అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని, గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి యం. అశోక్ రెడ్డిని,అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.👉ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఒకటో తేదీన పెన్షన్ రాక టెన్షన్ పడుతూ పదో తేదీ నుండి 20వ తేదీ వరకు ఎదురు చూస్తున్న పెన్షనర్లను ఈ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు చెల్లించవలసిన పి ఆర్ సి, డి ఏ లు జిపిఎఫ్ మెడికల్ బిల్లులు ఇవ్వకుండా ఉన్న మొత్తం బకాయిలు 30 వేల కోట్ల రూపాయలు ఉన్నాయని అన్నారు.12.50 లక్షల కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీలకు 2.5 కోట్ల రూపాయలు ఇచ్చానని తనే చెప్పిన జగన్ మోహన్ రెడ్డి మిగిలిన 10 లక్షల కోట్లు ఎవరి జేబులోకి వెళ్లాయని సూటిగా ప్రశ్నించారు.ప్రతి పౌరుడు పై రెండు లక్షలు అప్పు తెచ్చి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకు పట్టం కట్టేరని ఎద్దేవ చేశారు పరిశ్రమల రాక యువత ఉద్యోగ అవకాశాలు లేక అనేక ఇబ్బందులు పడ్డారన్నారు రాష్ట్రంలో పరిశ్రమల లేక ఉపాధి అవకాశాలు లేక భవన నిర్మాణ కార్మికులు వలసలు వెళ్లారని అన్నారు సామాన్యులకు అధిక ధరలు పెంచి నడ్డి విరిసిన ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం అని అన్నారు 175 అసెంబ్లీ స్థానాలు 25 పార్లమెంటు స్థానాలు టిడిపి బిజెపి జనసేన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 👉రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షులు గురవయ్య మాట్లాడుతూ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఎస్సీ ఎస్టీ సప్లెన్ను చట్టబద్ధత కల్పించి ఎస్సీ ఎస్టీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని అయితే ఆ నిధులను జగన్మోహన్ రెడ్డి మళ్లించి దళితులను వంచించారని అన్నారు అంబేద్కర్ విదేశీ విద్యను నిధులు పెంచుతున్నామని చెప్పి దళిత విద్యార్థులను వంచించారని అన్నారు. దళితులకు అందవలసిన 27 సంక్షేమ పథకాలను చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డిని దళితులంతా ఓడించి వైసిపి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు. 👉వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం నాయకులు విజ్ డం చౌదరి మాట్లాడుతూ ప్రశ్నించే ఉద్యోగులపై అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేసిన జగన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలని అని ఓటు అనే ఆయుధంతో అరాచక పాలన బుద్ధి చెప్పాలని తెలియజేశారు.

👉రాచర్ల మండలంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన కుందూరు నాగార్జున రెడ్డి.. రాచర్ల మండలంలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈసందర్భంగా మండలంలోని పలు గ్రామాలను సందర్శించిన కుందూరు నాగార్జున రెడ్డి ఇంటింటికి వెళ్లి వైసిపి కే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. మే 13వ తేదీన జరగనున్న పోలింగ్లో ప్రతి ఒక్కరు పాల్గొని ఓటు వేయాలని కోరారు.సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు మరో సంవత్సరాలపాటు అందాలంటే వైసిపి కే ఓటు వేయాలన్నారు.తనకు ఓటు వేస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. ఒంగోలు పార్లమెంటు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తున్నారని మీ అమూల్యమైన రెండవ ఓటు ఆయనకు వేయాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో వైసీపీ నాయకులు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు స్థానిక కీలక వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

👉మార్కాపురం , పొదిలి లో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా కోడలు అనూష, కుమార్తె సౌజన్య*పొదిలి టౌన్ లో జరిగిన ప్రచారంలో అన్నా కుటుంబ సభ్యులతో పాటు పాల్గొన్న ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి*

మహిళల అభ్యున్నతి కోసం పాటుపడుతూ,మహిళల ఆర్థికాభివృద్ధికి అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సిపి అభ్యర్థి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు కోడలు అన్నా అనూష,కుమార్తె సౌజన్య అన్నారు.ఆదివారం ఉదయం మార్కాపురం పట్టణంలోని 28వ వార్డులో మరియు సాయంత్రం పొదిలి టౌన్ లోని 20వ వార్డులోని పలు వీధుల్లో వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు కోడలు అన్నా అనూష,కుమార్తె సౌజన్య ప్రచార కార్యక్రమం నిర్వహించారు. పొదిలి లో జరిగిన ప్రచార కార్యక్రమం లో ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా కుటుంబ సభ్యులతో పాటు ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.

👉పొదిలి లో కాంగ్రెస్ పార్టి కార్యాలయం ప్రారంభం. హాజరైన మార్కాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టి అభ్యర్థి జావిద్ అన్వర్. సి.పి.ఎం,సి.పి.ఐ నాయకుల‌మద్దతు….*

ప్రకాశంజిల్లా పొదిలిలోరాబొయే ఎన్నికల నేపథ్యంలో కాంగ్రేస్ పార్టి కార్యాలయాన్ని మార్కాపురం నియోజకవర్గ కాంగ్రేస్ పార్టి అభ్యర్థి జావిద్ అన్వర్ ప్రారంభించారు.ఈసందర్భంగా జావిద్ అన్వర్ మాట్లాడుతూ తనతో పాటు ఒంగొలు పార్లమెంటు అభ్యర్థి ఈద సుధాకర్ రెడ్డిని కుడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కొరారు.నరేంద్ర మోడి పేదల నడ్డి విరిచి కార్పొరేట్ వ్యవస్థలను బాగుపరిచారని రాబొయే ఎన్నికల్లో ఇండియా కుటమికి మీ అముల్యమైన ఓటు వేసి కాంగ్రెస్ సు అధికారంలోకి తీసుకురావాలని ఆయన కొరారు. ఈ కార్యక్రమంలో పొదిలి, కొనకొనమిట్ల, మార్కాపురం, తర్లుపాడు మండలాల అధ్యక్షులు షేక్ నసరుద్దీన్, ధర్నాసి సుబ్బారావు, ఇస్మాయిల్, బడే సాహెబ్, సిపిఎం నాయకులు రమేష్, సిపిఐ నాయకులు కె.వి రత్నం, బాబావలి, కొత్తపుడి వెంకటేశ్వర రెడ్డి, నేత పాలెం బాబు, దేశి రెడ్డి శ్రీనివాసరెడ్డి, కృష్ణ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు._

👉దర్శి నియోజకవర్గం కురిచేడు మండలం ఆవులమంద లో దర్శి శాసనసభ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీతో కలిసి తెలుగు దేశం పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోడలు మాగుంట రాఘవ రెడ్డి సతీమణి చందన రెడ్డి.. కార్యక్రమం లో తెలుగుదేశం, జనసేన,బిజెపి మహిళా కార్యకర్తలు,నాయకులు ,పాల్గొన్నారు.

👉 మార్కాపురం నియోజకవర్గం సీతా నాగులవరంలో ఆదివారం రాత్రి జరిగిన తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమం మరియు రోడ్డుషో మార్కాపురం నియోజకవర్గం సీతా నాగులవరం లో జరిగిన తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమం మరియు రోడ్డుషో లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయులు యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి మరియు మార్కాపురం శాసనసభ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి గారు మరియు తదితర టీడీపీ, జనసేన, బీజేపీ మండల నాయకులు, గ్రామ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు మాగుంట రాఘవరెడ్డి మరియు మార్కాపురం శాసనసభ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి మరియు తదితర టీడీపీ,జనసేన,బీజేపీ మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

7k network
Recent Posts

మోడీకి సరైన ప్రశ్న సంధించిన ప్రియాంకా!!!..బిగ్ స్టేట్ లో బీజేపీకి షాక్ !?..సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు: డి.ఎస్.పి బాల సుందర రావు..ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి ఒకరి పరిస్థితి విషమం..

పదేళ్ళ పాలనలో మోడీ ఫెయిల్ నా లేక పాస్ నా?..మనవడి లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ రియాక్షన్!..మహిళలకు గుడ్ న్యూస్..యాభై వేలు పొందండిలా!.ఏపీలో అల్లర్లపై సిట్ ఏర్పాటు..నవధాన్యాల సాగుపై అవగాహన..దోర్నాల.

48గంటల్లోపు ఓటింగ్ శాతాల డేటాను ఇసి వెబ్సైట్లో ఎందుకు ఉంచలేదు-సుప్రీంకోర్టు ఆగ్రహం..ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్యాయత్నం..టూరిస్టు బస్సులో మంటలు ఎనిమిది మంది మృతి..పల్నాడు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గా శ్యాం ప్రసాద్..వజ్రాల వేట మొదలు..ఘర్షణలకు పాల్పడితే చర్యలు కంభం సీఐ..పెట్రేగిపోతున్న మట్టి మాఫియా .

మోడీ : అయోధ్య రామా వర్సెస్ రేషన్ బియ్యం !..రైల్వే పోలీసులకు అభినందనలు తెలిపిన పొదిలి వ్యాపారి..కిమ్స్ లో అరుదైన చికిత్స..వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలిక మృతి..ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..అక్రమ అపార్ట్మెంట్లపై ఉక్కు పాదం.

ట్యాక్సుల‌పై నిర్మల‌మ్మకు డైరెక్ట్ బిగ్ పంచ్..అధికారం లోకి రాబోతున్నాం -“జగన్”..”బాబు”కు భద్రత పెంచిన కేంద్రం..పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల ఇళ్లలో సోదాలు..మాచర్లలో పోలీసుల కవాతు..

ఏం ‘టంగ‌య్యా’ స్వామీ.. మోడీపై విసుర్లు!.. అకస్మాత్తుగా ముస్లింలపై మోడీకి ప్రేమ పుట్టుకు వచ్చేసింది.. ముస్లింలలో పేదరికం ఎక్కువట!.. ఆయన కూడా ముస్లిం స్నేహితులు ఉన్నారట..!ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. “బస్సు ప్రమాదం” ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి!!!