చంద్రబాబువి అసత్య ప్రచారాలు సీఎం జగన్..పవన్ ను నమ్మి సర్వం కోల్పోయా..మహిళా నాయకురాలి ఆవేదన..గిద్దలూరులో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తా..ముత్తుముల..గిద్దలూరు టిడిపిలో చేరికలు

👉ఏలూరు ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్*..మోసాల చంద్రబాబు మరో కొత్త మేనిఫెస్టో తీసుకుని ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు బయలుదేరారు. 2014లో ఇదే పార్టీల పొత్తులతో ప్రకటించిన మేనిఫెస్టోలో కనీసం 10 శాతమైనా అమలు చేసారా.?. మీ గత చరిత్రలోకి పోతే మిమ్మల్ని ఎవరైనా నమ్ముతారా చంద్రబాబూ.? అప్పట్లో ఓట్ల కోసం ఆయనే స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి మేనిఫెస్టో పంపించారు. అందులో రైతన్నకు రుణమాఫీ అని గెలవగానే మోసం చేసి చివరకు నట్టేట ముంచారు. డ్వాక్రా పొదుపు సంఘాల రుణాల మాఫీ అని చెప్పి అక్క చెల్లెమ్మలను మోసం చేసిన మాట నిజమా కాదా చంద్రబాబు.?

👉ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అసత్య, విష ప్రచారం..రాష్ట్రంలో రైతన్నలకు మంచి చేసే మరో పథకం ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అసత్య, విష ప్రచారం మొదలు పెట్టారు. ఈ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ పేరుతో జగన్ భూములు దోచుకుంటారని ఫోన్లు, మెసేజులతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. జగన్ ఎలాంటి వాడో ప్రజలందరికీ తెలుసు. జగన్ భూములు ఇచ్చేవాడే కానీ.. చంద్రబాబులా భూములు దోచుకునే వాడు కాదని ఏ రైతును అడిగినా చెప్తారు. వందేళ్ల క్రితం జరిగిన సర్వేలో భూముల సబ్ డివిజన్, రికార్థుల ఫైలింగ్ సరిగ్గా జరగక పోవడంతో భూవివాదాలు తలెత్తి రైతులు, ప్రజలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. దీన్ని పరిష్కారించి భూములపై సర్వహక్కులు అర్హులకు అందించే ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ మద్దతు తెలపకుండా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. 👉 వృద్ధులకు ఇంటి వద్దకే అందుతున్న పెన్షన్లు రాకుండా చంద్రబాబు అడ్డుకుని అవ్వాతాతల ఉసురు తీస్తున్నారు. పెన్షన్లు ఇచ్చే వాలంటీర్ వ్యవస్థను తానే అడ్డుకుని ఎన్నికల ప్రచారంలో మాత్రం పెన్షన్లను అడ్డుకుంది జగన్ అంటూ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఇంత కంటే దౌర్భాగ్యమైన రాజకీయాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటాయా..  👉రాష్ట్రంలో మీ బిడ్డ పాలనకు ముందు ప్రభుత్వం ఇచ్చే డబ్బు లంచాలు లేకుండా వివక్ష లేకుండా నేరుగా మీ ఖాతాలోకి పడుతుందని అంటే మీలో ఎవరైనా నమ్మి ఉండేవాళ్లా.? అలాంటి పరిస్థితిలో మీ బిడ్డ ప్రభుత్వం ఏకంగా రూ. 2.70 లక్షల కోట్లు బటన్ నొక్కి నేరుగా మీ ఖాతాల్లోకి చేర్చింది. ఇందులో 75 శాతం పైగా డబ్బు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలకు అందించాం. మనం అధికారంలోకి వచ్చాక దశబ్దాలుగా కొత్త రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలుంటే కేవలం 59 నెలల్లో 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ఇందులో 80 శాతంపైగా ఉద్యోగాలు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలకి దక్కాయి. ఇది కాదా అసలైన సామాజిక న్యాయం, యువతకు భవితకు నిజమైన భరోసా.? అన్నారు.

👉సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో రాజకీయం వేసవిని మించిపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు.ఈ క్రమంలోనే జనసేన పార్టీ మాజీ మహిళా నాయకురాలు అయినటువంటి చిట్టె సుభాషిణి సంచలన కామెంట్స్ చేయడం మీడియాలో పెను దుమారమే రేగుతోంది.

పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తిని నమ్మి తాను అక్షరాలా కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా అని ఆరోపించారు.ఓ ప్రముఖ

 మీడియా వేదికగా మాట్లాడుతూ ఆమె… “అమెరికాలో బంగారం లాంటి జీవితాన్ని వదులుకుని జనసేనకు ఆంధ్రాకి వచ్చాను. తీరా వచ్చాక ఇక్కడ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందనుకోలేదు.పదే పదే జీరో పాలిటిక్స్ అని చెప్పే జనసేనాని పవన్ కళ్యాణ్.. తనతో కోటి 50 లక్షలు ఖర్చు పెట్టించారు!” అని ఆమె వాపోవడం జరిగింది.👉పేరుకే నీతులు…జీరో పాలిటిక్స్ అని గప్పాలు కొడుతున్నారని,తనని ఎదగనివ్వకుండా చేయడం అనే అంశాన్ని పక్కన పెడితే పార్టీ వాళ్ళతో అయితే తను ప్రతి నిమిషం యుద్ధం చేశానని ఈ సందర్భంగా కన్నీటి పర్యంతం కావడం గమనార్హం. తన భర్త పవన్ నామకరణం చేసేవారని,పవన్ కోసం సొంత ఊరు వెళ్దామంటే రావడానికి ఒప్పుకున్నానని అన్నారు. అమెరికాలో 1000000 జీతం వదులుకుని మరీ ఇంత దూరం వస్తే ఇక్కడ మాకు మొండి చేయే మిగిలింది అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బతికించే వ్యక్తులు ఈ జనసేన పార్టీలో అస్సలు లేరని ఆమె ఈ సందర్భంగా అభిప్రాయ పడ్డారు.జనసేన పార్టీలో ఉన్న వ్యక్తులకి చిల్లర మనస్తత్వం అని.. అందరూ అజమాయిషీ చేసేవాళ్ళేనన్నారు.👉ఇక తానొక దళిత మహిళని కావడంతో జనసేన పార్టీ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు అవమానం జరిగిందని…ఎమ్మెల్యే సీటు కోసం ఏకంగా నన్ను 10 కోట్లు అడిగారని వాపోయారు. అయితే పది కోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డామని..అందుకోసం యూఎస్ లో ఇల్లు సైతం అమ్మేశామని అన్నారు.ఇల్లు అమ్మగా 6 కోట్లు రాగా,తన అత్తయ్య గారి దగ్గర 2 కోట్లు, మిగతా 2 కోట్లు ఫైనాన్షియర్ దగ్గర అప్పు తీసుకున్నామని అన్నారు.అదే విధంగా పార్టీకి డొనేషన్ అడిగితే..10 వేలు, ఆ తర్వాత పార్టీ అన్నాక ఖర్చులు ఉంటాయి,లెక్కలు ఉంటాయని డబ్బులు అడిగితే 2 లక్షలు, మొత్తానికి 2 కోట్లు లేనిదే పనవ్వదమ్మా? అని పార్టీ నేతలు అంటే విస్తుపోయామని…పవన్ కళ్యాణ్ ఏమో జీరో పాలిటిక్స్ అని కామెడీ చేస్తారని సుభాషిణి కన్నీటి పర్యంతమయ్యారు.

👉కంభం మండలం ఎర్రబాలెం గ్రామంలో ఇంటింటికి తిరిగి టిడిపి జనసేన బిజెపి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి, మే 13న జరిగే ఎన్నికల్లో గిద్దలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న ముత్తుముల అశోక్ రెడ్డి మరియు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న మాగుంట శ్రీనివాస రెడ్డికి సైకిల్ గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్ధించిన అశోక్ రెడ్డి సోదరుడు  జగన్నాధ్.

👉రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధికీ అనుగుణంగా టీడీపీ, జనసేన, బీజేపీ మ్యానిఫెస్టో*ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదలతో రాష్ట్ర ప్రజల్లో సంతోషం… వైసీపీ ప్రభుత్వానికి వణుకు…*గిద్దలూరు ఎన్డీయే కూటమి అభ్యర్థి ముత్తుముల*రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధికీ అనుగుణంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఉమ్మడిగా మ్యానిఫెస్టోను విడుదల చేయటం జరిగిందని, మ్యానిఫెస్టో విడుదలతో రాష్ట్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తుంటే వైసీపీ పాలకులకు వణుకు మొదలు అయ్యిందని గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం సాయంత్రం కొమరోలు మండలం, గుండ్రేడ్డి పల్లె గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వారు మే 13 వ తేదీన జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్దిగా పోటీ చేయుచున్న తనకు, ఎంపీ అభ్యర్దిగా పోటీ చేయుచున్న మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి సైకిల్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ రోజు విడుదల చేసిన మ్యానిఫెస్టోతో రాష్ట్రంలో వైసీపీ గల్లంతు అవ్వటం ఖాయమని, ఎన్డీయే కూటమి అధికారంలోకి రావటం ఖాయమన్నారు. కార్యక్రమంలో మండల టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.*

👉ముత్తుముల సమక్షంలో టిడిపిలో చేరిన 30 కుటుంబాలు*ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో అర్ధవీడు మండలం, అయ్యవారిపల్లె గ్రామానికి చెందిన శ్రీపతి పుల్లయ్య ఆధ్వర్యంలో 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారికి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తు పై ఓటు వేసి, వేయించి అశోక్ రెడ్డి గారిని గెలుపించేందుకు కృషి చేస్తామన్నారు.*

👉ముత్తుముల సమక్షంలో టిడిపిలో చేరిన పాపినేనిపల్లె గ్రామస్తులు*గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో అర్ధవీడు మండలం పాపినేనిపల్లె గ్రామ సర్పంచ్ పుల్లారావు  ఆధ్వర్యంలో గ్రామంలోని మండ్ల శ్రీనివాసులు, భోగం నడిపి రాజు, కేసనబోయిన నరసింహ, శ్రీను లు తెలుగుదేశం పార్టీలో చేరారు.

👉గిద్దలూరు నియోజకవర్గంలో  కేంద్రియ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తా..అధికారంలోకి రాగానే మాజీ సైనికులకు, సైనిక కుటుంబాలకు అన్నీ విధాలుగా అండగా ఉంటాం*మాజీ సైనికుల ఆత్మీయ సమావేశంలో ఎన్డీయే కూటమి అభ్యర్థి ముత్తుముల

గిద్దలూరు పట్టణం, నంద్యాల రోడ్డులోని శ్రీ చీతిరాల కళ్యాణ మండపంలో నియోజకవర్గంలోని మాజీ సైనికులతో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి  సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే గిద్దలూరు నియోజకవర్గంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. దేశ రక్షణలో గిద్దలూరు నియోజకవర్గం నుండి అత్యధిక సంఖ్యలో సైనికులు ఉండటం మన నియోజకవర్గానికే గర్వ కారణమన్నారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే మాజీ సైనికుల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటామని, ECHS వైద్యాశాలకు మరియు మిలిటరీ క్యాంటీన్ కు ప్రభుత్వ స్థలం మంజూరు చేస్తామన్నారు. మాజీ సైనికులు, సైనిక కుటుంబాలు మే 13 న జరిగే ఎన్నికల్లో గిద్దలూరు ఎన్డీయే కూటమి అభ్యర్దిగా పోటీ చేయుచున్న తనకు ఎంపీ అభ్యర్దిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసరెడ్డికి సైకిల్ గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్ధించారు.* మాజీ సైనిక ఉద్యోగుల సంఘం నాయకులు జిల్లా కన్వీనర్ ఎస్. వేణుగోపాల్, కోటారెడ్డి, కె. నరసింహులు, ch. లక్ష్మణ బాబు, యోగేశ్వరరావు, ARK రెడ్డి, పసుపులేటి శ్రీనివాసరావు, లక్ష్మి రంగయ్య, చెన్నయ్య మరియు నియోజకవర్గంలోని మాజీ సైనికులు పాల్గోన్నారు.

7k network
Recent Posts

“ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్‌ లో సీఎం రేవంత్..”జగన్ ను కొలంబియన్ డ్రగ్ లార్డ్ తో పోల్చిన బాబు..”రెడ్ బుక్ తెరవకముందే గగ్గోలు పెడుతున్న జగన్- లోకేష్..”తిరుపతిలో కిలాడి దంపతుల అరెస్ట్..”బెంగళూరులో యువతిపై దాడి..

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు