👉ఎన్నికల వేళ బీజేపీకి కొత్త సమస్య.. ధృవ్ రాతీ వీడియో వైరల్!!!దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ప్రధానపార్టీలన్నీ ప్రచారలతో హోరెత్తించేస్తున్నాయి. ప్రత్యర్థులపై పదునైన విమర్శలతో విరుచుకుపడుతున్నాయి.ఈ సమయంలో ప్రముఖ యూట్యూబర్ ధృవ్ రాతీ చేస్తున్న వినూత్న వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.ఈ సమయంలో అతడు తాజాగా వదిలిన ఒక వీడియో బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తుందని అంటున్నారు!👉… సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ధృవ్ రాతీ…సామాజిక, రాజకీయ అంశాలకు సంబంధించిన అత్యంత కీలక పాయింట్లతో వీడియోలు చేస్తూ ప్రకంపనలు రేపుతున్నాడు! ప్రస్తుతం ఒకవర్గం మీడియా అంతా ఆయా పార్టీలకు కరపత్రాలుగా మారిపోతున్నాయనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో…ధృవ్ రాతీ చేస్తోన్న వీడియోలు మరోవర్గానికి అస్త్రంగా మారుతున్నాయని అంటున్నారు.ఈ నేపథ్యంలో అధికార బీజేపీకి వ్యతిరేక విపక్ష నేతలు, వారి వారి స్టార్ క్యాంపెయినర్లు చేస్తున్న ప్రసంగాల కంటే యూట్యూబ్ వేదికగా ధృవ్ రాతీ చేస్తోన్న వీడియోలే క్షణాల్లో వైరల్ అవుతున్న పరిస్థితి నెలకొంది! దీంతో… ఇతని వీడియోలు బీజేపీకి ముచ్చెమట్లు పట్టిస్తున్నాయని అంటున్నారు.ఈ క్రమంలో తాజాగా “ఒక నియంత తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడని మీకు తెలుసా..?” అంటూ వదిలిన వీడియో తీవ్ర కలకలం రేపుతోంది.ఇందులో భాగంగా… 1933లో హిట్లర్, నాజీ పార్టీ రాజ్యాంగాన్ని మార్చడానికి తన సొంత పార్లమెంటు భవనానికి నిప్పు పెట్టాడని మొదలుపెట్టీ ధృత్ రాతీ… 1999లో పుతిన్ సైతం తన సొంత దేశ పౌరులపై బాంబు పేలుళ్లకు కారణమయ్యాడని ఆరోపించారు.అధికారాన్ని కైవసం చేసుకునేందుకు నియంతలు చేసే ఆలోచనలే ఇవన్నీ అంటూ ఆ వీడియోలో పేర్కొన్నాడు!అలా మొదలుపెట్టిన ధృవ్ రాతీ…ఇండియాలోనూ అవే తరహ పరిస్థితులున్నాయని పేర్కొనడం గమనార్హం. ఇందుకు ఉదాహరణగా… పుల్వామా అటాక్ దాడిని ప్రస్థావించాడు.అది కూడా పైన చెప్పుకున్నట్లు బీజేపీ అధికారం కోసం చేసిన చర్యగానే ఆరోపింంచాడు.హిట్లర్, పుతిన్ తరహలోనే మోడీ కూడా అధికారం కోసం దుశ్చర్యలకు తెగబడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశాడు!కాగా… 29 ఏళ్ల ధృవ్ రాతీ… డిజిటల్ స్పేస్ లో సుపరిచితుడనే సంగతి తెలిసిందే! 2016 ఉగ్రదాడి, భారత నియంత్రణ రేఖ సమ్మె, 2016 నోట్ల రద్దు, మోర్బీ బ్రిడ్జ్ కూలిపోవడం,2019 పుల్వామా దాడి, 2023 మణిపూర్ హింస లాంటి అంశాలపై అతని వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి!
👉ఎన్నికల సందర్భంగా షర్మిళ సీఎం జగన్మోహన్ మోహన్ రెడ్డి పై ఎక్కుపెట్టిన అంశాలు (9 ప్రశ్నలు )ఇలా ఉన్నాయి!
👉ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధుల దారి మళ్లింపు వాస్తవం కాదా? 👉సాగు భూమినిచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు?👉 28 పథకాలను అర్ధంతరంగా ఎందుకు ఆపేశారు? 👉ఎస్సీ, ఎస్టీలకు పునరావాస కార్యక్రమం ఎందుకు నిలిచిపోయింది?👉 విదేశీ విద్య పథకానికి అంబేడ్కర్ పేరు ఎందుకు తీసేశారు?👉 ఎస్సీ, ఎస్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి ఎందుకు సీట్లు నిరాకరించారు?👉 ఎస్సీ, ఎస్టీలపై రాష్ట్రంలో దాడులు పెరిగాయి.. ఇది మీ వివక్ష కాదా?👉 డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారు? 👉స్టడీ సర్కిళ్లకు నిధులివ్వకుండా ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు?…అని షర్మిల లేఖలో ప్రశ్నించారు.
👉బేస్తవారిపేట మండలం మోక్షగుండం గ్రామంలో గిద్దలూరు ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి తనయుడు ముత్తుముల దివ్యేష్ రెడ్డి బుధవారం సాయంత్రం ఇంటింటికి తిరిగి టీడీపీ, జనసేన, బీజేపీ మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో గిద్దలూరు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్తుముల అశోక్ రెడ్డికి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాస రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 👉 సింగరాయకొండ లో తెలుగుదేశం పార్టీ డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెల్లెలు సుధ, రజిత రెడ్డి మేనకోడలు ప్రణతి రెడ్డి హితా రెడ్డి మరియు కార్యక్రమంలో ఐనాబత్తిన రాధిక,ఉప్పుటూరి రజనీ, పోలిశెట్టి మాధురి,పూసల ప్రమీల,రత్నగిరి అంజమ్మ, నల్లబోతులు భారతి,ఇందిరా, కృష్ణవేణి,ఏ మాధవి, ఎం స్వప్న,ఎన్ ఆదిలక్ష్మి, ఎం జయమ్మ,ఐనాబత్తిన రాజేష్, కాసుల శ్రీకాంత్,కాసుల శ్రీనివాస్,కిచ్చెంశెట్టి ప్రవీణ్ కుమార్,సయ్యద్ ఖాజా హుసేన్,చప్పిడి బాను, ముద్రగడ సైదులు,జన సైనికులు,చిగురుపాటి శేషగిరి రావు, బసవయ్య, సన్నేబోయిన మల్లికార్జున ,అంబటి శ్రీను సన్నేబోయిన వెంకటేశ్వర్లు, చొప్పర శ్రీహరి, శ్రీనివాసులు, శివ కుమారి,నాగార్జున, బాబు రావు, నాగేశ్వర రావు, కట్ట శ్రీనివాసులు,సుధీర్ బాబు, సుభాషిణి మరియు తదితర నాయకులు తెలుగుదేశం, జనసేన,బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
👉తన చావుకు సీఐ, ఎస్ఐ కారణమంటూ వ్యక్తి సూసైడ్ నోట్: తన భర్తను కాపాడాలంటూ భార్య ఆవేదన..హన్మకొండ జిల్లా..తన చావుకు సి ఐ ,ఎస్ ఐ లే కారణ మంటూ సూసైడ్ నోట్ రాసి ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన..మంగళవారం రాత్రి
హన్మకొండ జిల్లాలో జరిగింది.పోలీసులు తనని కొట్టారని,తన చావుకు హసన్ పర్తి సీఐ, ఎస్ఐ కారణమని శ్యాంరావ్ ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.తన దగ్గర అప్పు తీసుకున్న వారు వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయిస్తే.. విచారించకుండానే వారు తనను కొట్టారని ఆరోపిస్తూ ఆ వ్యక్తి కనిపించకుండా పోయాడు..తన భర్తను కాపాడి, నా భర్తను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సీపీకి భాదితుడి భార్య శ్యామల ఫిర్యాదు చేసింది..
👉 పోలీస్ స్టేషన్ కి కన్నం వేసిన హోంగార్డు..! కర్నూలు జిల్లా : ఆదోని..
ఆదోని పోలీస్ స్టేషన్లో 5.63 లక్షల చోరీ..హోంగార్డు మనోజ్ పాత్ర..! అరెస్ట్ + రిమాండ్..‼️2 టౌన్ పోలీస్ స్టేషన్లో వివిధ కేసుల్లో పట్టుబడిన నగదును పోలీసులు బీరువా లాకర్లో భద్రపరచగా..ఆ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు మనోజ్ కు నగదు పై కన్ను పడిన వైనం..బీరువాలోని రూ.5.63లక్షలు మాయం… ఈ విషయం గుర్తించి.. హోంగార్డుని అదుపులోకి తీసుకున్న పోలీసులు..నిందితుడి నుంచి రూ.3లక్షల నగదు రికవరీ చేసి,రిమాండ్ కు తరలింపు..