👉 బీజేపీ రాష్ట్రాలలో ఏదో జరుగుతోంది…? కుల సమీకరణలతో నెట్టుకుని రావాల్సిన చోట ఆ లెక్కలు పక్కన పెట్టేసి మత సమీకరణల మీద కూడా కొత్త లెక్కలతో వస్తున్నారు.
బీజేపీకి పట్టున చోట ఏదో జరుగుతోంది అన్న చర్చ మొదలైంది. బీజేపీకి మొదటి నుంచి కొమ్ము కాస్తూ వస్తున్న రాష్ట్రాలు కీలక స్థావరాలలో తేడా ఏమైనా కొడుతోందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా బీజేపీ అగ్ర నేతలు నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరూ కూడా చాలా దూకుడుగా మాట్లాడుతున్నారు. అగ్రెసివ్ మోడ్ లో వారి మాటలు ఉపన్యాసాలు ఉన్నాయి అని విశ్లేషిస్తున్నారు. కుల సమీకరణలతో నెట్టుకుని రావాల్సిన చోట ఆ లెక్కలు పక్కన పెట్టేసి మత సమీకరణల మీద కూడా కొత్త లెక్కలతో వస్తున్నారు. ముస్లిం మైనారిటీ రిజర్వేషన్ల రద్దు మీద పెద్దగా మాట్లాడుతున్నారు.దీంతోనే అనేక రకాలైన డౌట్లు వస్తున్నాయి.హిందువుల ఓట్లు ఏవీ బీజేపీకి ఈసారి గంపగుత్తగా పడవా అన్న సందేహాలకు కూడా తెర లేస్తోంది.కీలకమైన ఉత్తరాది రాష్ట్రాలు బీజెపీతోనే ముందుకు సాగుతూ వచ్చిన పరిస్థితి గత రెండు ఎన్నికల్లోనూ అంతా చూశారు. కాషాయ జెండా నీడలోనే కీలక రాష్ట్రాలు చేరి బీజేపీకి బ్రహ్మాండమైన మెజారిటీని కట్టబెట్టిన ఉదంతాలను కూడా చూశారు. కానీ ఇపుడు చూస్తే సీన్ బాగా మారుతోంది అని అర్ధం అవుతోంది.దాంతో పాటు కుల సమీకరణలు బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని అంటున్నారు. హిందూ సమాజం ఒక్కటిగా మారితే అది భారీ ఓటు బ్యాంక్ అవుతుంది. అదే బీజేపీకి శ్రీరామరక్షగా ఉంటుంది. కానీ ఇపుడు ఉత్తరాదిన మత సమీకరణలు కంటే కుల సమీకరణలు డామినేట్ చేస్తున్న నేపధ్యం కనిపిస్తోంది. ఈ పరిణామం బీజేపీకి రాజకీయంగా ఇబ్బంది పెట్టేది అని అంటున్నారు. మొత్తంగా చూస్తే బీజేపీకి ఉత్తరాదిన ఏదో తెలియని భయాలు ఉన్నాయని అంటున్నారు. నిజానికి ఎండలకు జడిసి ఓట్లు వేయకుండా అక్కడ జనాలు ఉండరు. కానీ తొలి విడత మలి విడత పోలింగ్ చూస్తే తక్కువ శాతం నమోదు అయింది. ఇది ఓటర్లలో నిర్లిప్తత తో పాటు బీజేపీ పట్ల వైముఖ్యత కూడా పెంచుతోందా అన్న చర్చ ఉంది. ఈ కారణంగానే బీజేపీ అగ్ర నేతలు ఉలిక్కి పడి తరువాత కార్యాచరణకు నడుం బిగించారు. అని అంటున్నారు. మొత్తం రెండు విడతలుగా జరిగిన ఎంపీ ఎన్నికల్లో 192 సీట్లకు గానూ బీజేపీకి వందకు పైగా వస్తాయని బీజేపీ అగ్రనేత అమిత్ షా చెబుతున్నప్పటికీ బీజేపీకి లోలోపల సందేహాలు అనేకం ఉన్నాయని అంటున్నారు.ఓటింగ్ సరళికి సంబంధించి బీజేపీ పెద్దల వద్ద కీలక సమాచారమే ఉంది అని అంటున్నారు. అది బీజేపీకి సానుకూలంగా ఉంటే కనుక బీజేపీ అగ్ర నేతలు ఇంత అగ్రెసివ్ మూడ్ లో ఉపన్యాసాలు ఇచ్చేందుకు సిద్ధపడరని అంటున్నారు. హిందూత్వ మంత్రం ఈసారి పండడం లేదన్న సంకేతాలతోనే మైనారిటీ రిజర్వేషన్లు రద్దు అంటూ బీజేపీ స్వరం పెంచిందని అంటున్నారు. అంటే మరోమారు హిందూత్వను రగిలించకపోతే బీజేపీకి పట్టున్న రాష్ట్రాలలో అనుకున్న స్థాయిలో నంబర్ రాదు అన్నది కూడా అర్ధం అవుతోంది అని అంటున్నారు. ఈ పరిణామాల నేపధ్యం నుంచి చూసినపుడు బీజేపీకి ఇపుడు అర్జంటుగా భావోద్వేగ నినాదం కావాల్సి ఉంది అని అంటున్నారు. మత పరమైన రిజర్వేషన్లు అంశం అంది పుచ్చుకున్నా అది పెద్దగా జనాల్లోకి ఎక్కడంలేదని, అనుకున్న స్థాయిలో చర్చకు రావడం లేదని అంటున్నారు.జగన్ నయా సవాల్ ! దాంతో బీజేపీ కాంగ్రెస్ పార్టీ విధానాల మీద కూడా మాట్లాడుతోంది. ఆఖరుకు రాహుల్ గాంధీ రెండు చోట్ల పోటీ చేయడం మీద కూడా ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు చేస్తున్నారు దీనిని కాంగ్రెస్ నేతలు తిప్పికొట్టారు కూడా. రెండు చోట్ల పోటీ చేయడం 2014లో నరేంద్ర మోడీ కూడా చేశారని గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఎమోషనల్ గా జనాలతో కనెక్ట్ అయ్యే ఇష్యూ ఈసారి లేకపోవడం ఎన్ని విభేదాలు ఉన్నా ఇండియా కూటమి ఐక్యంగానే బీజేపీని ఢీ కొంటూ కీలక రాష్ట్రాలలో నిలువరించే ప్రయత్నాలు చేయడం పోలింగ్ శాతం తగ్గడం వంటి అంశాలు కమలనాధులను కలవరపెడుతున్నాయని అంటున్నారు. చూడాలి మరి ముందు ముందు బీజేపీ ఏ రకమైన కొత్త వ్యూహాలను అనుసరిస్తుందో.
👉 ఆంధ్రప్రదేశ్‌లో వివాదాస్పదమైన ల్యాండ్ టైటిల్ యాక్ట్‌తో పాటు తిరుపతి జనసేన టికెట్ రేట్ తదితర అంశాలపై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడారు. ల్యాండ్ టైటిల్ చట్టం తీసుకొచ్చిందే కేంద్రంలోని మోదీ సర్కార్ అన్నారు.ఆ యాక్ట్ గురించి చంద్రబాబు అబద్ధాలు చెప్పడం మానేసి, ఎన్డీఏలో భాగస్వామిగా వాస్తవాలు చెప్పాలని భూమన డిమాండ్ చేశారు.
తిరుపతి కొర్లగుంటలో ఎంపీ అభ్యర్థి డాక్టర్ మద్దిల గురుమూర్తితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ల్యాండ్ టైటిల్ చట్టాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందనే సంగతిని ఆయన గుర్తు చేశారు. ఇంత వరకూ ల్యాండ్ టైటిల్ చట్టంపై కనీసం ప్రాథమిక చర్చ కూడా సరిగా ప్రారంభం కాలేదన్నారు. కానీ జగన్ ఏదో చేస్తున్నాడంటూ చంద్రబాబు విమర్శలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. చంద్రబాబుకు వంత పాడే పత్రికల్లో కూడా మరొక విషయమే లేనట్టు రాస్తున్నాయని భూమన మండిపడ్డారు. గోతికాడ గుంట నక్క లా కూర్చుని అవకాశం దొరికితే ఏదంటే అది మాట్లాడడం చంద్రబాబు నైజం అని భూమన ధ్వజమెత్తారు. అలాగే పెన్షనర్ల ఇబ్బందులకు చంద్రబాబే కారణమన్నారు. పెన్షనర్ల పాపం చంద్రబాబుకు ఊరికే పోదని ఆయన హెచ్చరించారు. వలంటీర్లపై దుర్మార్గమైన ప్రచారం చేసి, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుతో ఇళ్ల వద్ద పంపిణీని అడ్డుకున్నారని విమర్శించారు. వృద్ధులంతా నరకయాతన పడుతున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌పై సామాజిక పింఛన్‌దారులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని ఆయన అన్నారు. జగన్‌పై కోపాన్ని వృద్ధులు, దివ్యాంగుల మీద తీర్చుకోవాలని ప్రతిపక్షాలు అనుకోవడం దుర్మార్గమన్నారు. ఓట్లు రావడం లేదని తెలిసి వాళ్లు మాట్లాడుతున్న మాటలను సమాజం గమనిస్తోందని ఆయన అన్నారు.తెలుగుదేశం, జనసేన దిగజారి పోయాయని భూమన విమర్శించారు. పవన్ కల్యాణ్ బజారు మనిషిలా రోజూ అసహ్య ప్రసంగాలు చేస్తున్నాడని తప్పు పట్టారు. పవన్ కల్యాణ్‌కు రాజకీయ పరిజ్ఞానం లేదని విమర్శించారు. రాజకీయాలంటే అవతలి వాళ్లని తిట్టడమే అనుకుంటున్నాడని భూమన దెప్పి పొడిచారు. పవన్‌కు తగ్గట్టుగానే ఆయన పార్టీ నాయకులు, అనుచరులు, అభ్యర్థులు తయారయ్యారని భూమన విమర్శించారు.👉 తిరుపతిలో 30 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుని ఆరణి శ్రీనివాసులుకు టికెట్ ఇచ్చారని భూమన విమర్శించారు.
👉కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఈ ఎన్నికల్లో 400 సీట్లు సాధించడమే లక్ష్యంగా కాషాయ పార్టీ ముందుకు సాగుతోంది. ఇండియా కూటమిని మరోసారి చిత్తు చేసి.. ఎర్రకోటపై మరోసారి కాషాయ జెండా రెపరెపలాడించేందుకు పకడ్బందీగా వ్యూహాలు రచించింది. ఇందులో భాగంగా సెలబ్రెటీలు, క్రీడాకారులను సైతం బీజేపీ ఈ ఎన్నికల్లో బరిలోకి దింపింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, పద్మ శ్రీ అవార్డ్ గ్రహీత కంగనా రనౌత్‌కు బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చింది. కంగనా సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌లోని మండి పార్లమెంట్ స్థానం నుండి బీజేపీ ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీని రంగంలోకి దించింది.
దీంతో కంగనా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం సైతం కంగనా మండి పార్లమెంట్ పరిధిలో ప్రచారం హోరెత్తించారు. అయితే, ఓ సభలో మాట్లాడిన కంగనా పప్పులో కాలేశారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిపై విమర్శలు ఎక్కుపెట్టబోయి.. సొంత పార్టీ నేతపైన విమర్శలు చేశారు. ఆర్జేడీ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌పై విమర్శలు చేయబోయిన కంగనా.. ఆయనకు బదులుగా బీజేపీ కర్నాటక ఎంపీ తేజస్వీ సూర్యపై ఫైర్ అయ్యారు. రౌడీజం చేసే తేజస్వీ సూర్య చేపలు తింటుంటారని కంగనా విమర్శించారు.👉తేజస్వీ యాదవ్‌కు బదులు బీజేపీ నేత తేజస్వీ సూర్యపై కంగనా విమర్శలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కంగనా వీడియోపై నెటిజన్లు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. కనీస రాజకీయ పరిజ్ఞానం లేని వాళ్లకు టికెట్లు ఇస్తే ఇలాగే ఉంటుందని.. ప్రత్యర్థి ఎవరో, సొంత పార్టీ నేత ఎవరో కూడా తెలియని వ్యక్తికి టికెట్ ఇవ్వడం దారుణమని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు కంగనా వీడియోపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సైతం రియాక్ట్ అయ్యారు. అసలు ఈమె ఎవరూ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
👉ఒంగోలులో గోల్డ్ సిల్వర్ మర్చంట్స్ అసోసియేషన్ కళ్యాణ మంటపంలో జరిగిన విశ్వబ్రాహ్మణుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి , ఒంగోలు శాసనసభ అభ్యర్థి దామాచర్ల జనార్దన్ రావు, జనసేన నియోజకవర్ఘ ఇంచార్జి షేక్ రియాజ్ , బీజేపీ నియోజకవర్ఘ ఇంచార్జి యోగయ్య యాదవ్ , మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు నిఖిల్ రెడ్డి అయినాబత్తిన ఘన శ్యామ్ తాతా ప్రసాద్, పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి, బ్రహ్మానంద శర్మ మరియు పలువురు విశ్వబ్రాహ్మణ నాయకులు మరియు తదితర నాయకులు టీడీపీ, జనసేన, బీజేపీ మండల నాయకులు, అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
👉మార్కాపురం నియోజకవర్గం నాగులవరం గ్రామం లో తెలుగు దేశం పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోడలు యువ నాయకులు మాగుంట రాఘవ రెడ్డి సతీమణి చందన రెడ్డి మరియు మార్కాపురం శాసనసభ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి సతీమణి కందుల వసంత లక్ష్మి..కార్యక్రమం లో తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు, మహిళా కార్యకర్తలు, కార్యకర్తలు, నాయకులు ,పాల్గొన్నారు
👉 బేస్తవారిపేట మండలం కలగొట్ల గ్రామంలో, సలకలవీడు గ్రామంలో ఆదివారం మండు టెండను కూడ లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.కార్యక్రమంలో ఎంపీపీ వేగినాటి ఓసురా రెడ్డి, జెడ్పీటీసీ బండ్లమూడి వెంకట రాజయ్య సర్పంచ్, గ్రామ ముఖ్య నాయకులు బిక్కా నరసింహా రెడ్డి,పొలిరెడ్డి తదితరులు ఉన్నారు.