మోడీ అమిత్ షా:ఏపీలో ఆ మాటెత్తలేదెందుకో?జగన్ సర్కారు పై తీవ్ర విమర్శలు చేసిన మోడీ!..మోడీ అమిత్ షా ల ఆరోపణలతో డైలమాలో జగన్!..టిడిపికి నోటీసులు?..ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో అడ్డంగా బుక్ అయిన పీవీ రమేష్

మోడీ అమిత్ షా : ఏపీలో ఆ మాటెత్తలేదెందుకో…!?

దేశంలో గత కొద్ది రోజులుగా ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా ఒకే ఒక మాట తారకమంత్రంగా మాట్లాడుతూ వస్తున్నారు. దేశంలో గత కొద్ది రోజులుగా ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా ఒకే ఒక మాట తారకమంత్రంగా మాట్లాడుతూ వస్తున్నారు. అదే మైనారిటీలకు రిజర్వేషన్లు రద్దు అన్నది. అంతదాకా ఎందుకు పొరుగున ఉన్న తెలంగాణాలోనూ అదే మాట మాట్లాడుతూ మోడీ షాలు హోరెత్తించారు.మోడీ అయితే మరి కాస్తా ముందుకు వెళ్ళి నా కంఠంలో ప్రాణం ఉండగా మతపరమైన రిజర్వేషన్లు కొనసాగ నివ్వనని తెలంగాణా గడ్డ మీదనే భీషణ ప్రకటన చేశారు.అదే మోడీ ఏపీకి వచ్చి రెండు ఎన్నికల సభలలో పాలుపంచుకున్నారు.ఆ రెండు చోట్లా ఆయన ముస్లిం రిజర్వేషన్ల మీద మాట్లాడలేదు సరికదా ఆ ఊసే ఎరగనట్టుగా వ్యవహరించారు.అదే తీరులో దేశ హోం మంత్రి అమిత్ షా కూడా ఉన్నారు. నిజానికి బీజేపీ ఫిలాసఫీ అది. మతపరమైన రిజర్వేషనలకు బీజేపీ మాతృ సంస్థ ఆరేస్సెస్ అసలు ఒప్పుకోదు..మత పరమైన రిజర్వేషన్లతో దేశంలో చీలిక వస్తుందని ఆరెస్సెస్ గట్టిగా నమ్ముతుంది.అంతలా బీజేపీ జీవ సిద్ధాంతం అయిన ఆ మాటను నిర్భయంగా గట్టిగా ఏపీ గడ్డ మీద ఎందుకు చెప్పలేకపోయారన్నదే అందరిలో కలుగుతున్న ధర్మ సందేహం.రామభక్తులు జగన్ కి ఓటు వేయవద్దని అమిత్ షా పిలుపు ఇచ్చారు.అదే నోటితో మైనారిటీ బుజ్జగింపులకు మా మద్దతు ఉండదని ఎందుకు చెప్పలేకపోయారని ప్రశ్నిస్తున్నారు.ఎన్నికల మ్యానిఫేస్టోతో సంబంధం లేకుండా చంద్రబాబు ఏకంగా ముస్లింలకు భారీ నజరానాలు ప్రకటించారు.లక్ష రూపాయల దాకా ఆర్థిక సాయం హజ్ యాత్రీకులకు ఆయన ప్రకటించారు.అలాగే యాభై ఏళ్ళు నిండితే చాలు పెన్షన్ అని కూడా ప్రకటించారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేయకుండా చూస్తామని కూడా ప్రామిస్ చేశారు.మరి ఇవన్నీ మోడీ అమిత్ షాలకు తెలియవా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.మైనారిటీలను బుజ్జగిస్తున్నారని కాంగ్రెస్ మీద విరుచుకుని పడే మోడీ షాలు ఏపీలో ప్రాంతీయ పార్టీలు రెండూ అదే పనిచేస్తున్నా ఎందుకు ఖండించడం లేదు.ఏపీకి వచ్చి ముస్లిం రిజర్వేషన్లు తాము రద్దు చేస్తున్నామని ఎందుకు ప్రకటించడం లేదన్న చర్చ వస్తోంది.రిజర్వేషన్ల కోసం బడుగు వర్గాలు ఆశగా చూస్తున్నాయని దేశమంతా చెబుతున్నారు.ఏపీలో ఎందుకు చెప్పడం లేదని కూడా అడుగుతున్నారు.దీనిని బట్టే బీజేపీ ఫిలాసఫీని కూడా పక్కన పెట్టి ఏపీలో ఓట్ల రాజకీయానికి తెర తీస్తోందని అంటున్నారు.టీడీపీకి ఆ కూటమిలో ఉన్న బీజేపీకి కూడా ఓట్లు కావాలని అందుకే కోరి మరీ ఈ ప్రస్తావన చేయలేదని అంటున్నారు.ఇక దీని మీద సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అయితే చంద్రబాబు ద్వంద్వ నీతిని ఎండగట్టారు.బీజేపీ తీరునూ తప్పు పట్టారు.ఏపీలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేయకుండా చూస్తానని బాబు ఎలా చెబుతారని దేశవ్యాప్తంగా బీజేపీ రద్దు చేస్తే అది ఏపీకి కూడా వర్తించదా అని ఆయన ప్రశ్నించారు.అలాగే బీజేపీ ఏపీలో గమ్మున ఉండడం వెనక మర్మమేమిటి అన్న ప్రశ్నలూ వస్తున్నాయి.కొన్ని దాచి మరి కొన్ని మూసి అన్న చందంగా ఏపీలో బీజేపీ పెద్దల ప్రచారం సాగుతోంది అన్న విమర్శలు వస్తున్నాయి.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద మాట్లాడాల్సిన చోట దాని మీద అసలు మాట్లాడలేదు.ముస్లిం రిజర్వేషన్లు విషయంలో మాత్రం నర్మగర్భంగా మాట్లాడకుండా వ్యవహరించారన్న విమర్శలు వస్తున్నాయి. అయినా ముస్లిం సమాజానికి ఇవన్నీ తెలియదనుకుంటే పొరపాటే అంటున్నారు. చిత్రమేంటి అంటే దేశమంతా నినదించిన ఒక బలమైన స్లోగన్ ఏపీకి రాగానే ఎందుకు మూగబోయింది అన్నదే.

👉జగన్ సర్కారు పై తీవ్ర విమర్శలు చేసిన మోడీ!!! ప్రజాగళం సభలో ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా కీలక ప్రసంగం చేశారు..ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. వైసీపీ సర్కార్ అవినీతి ఊబిలో కూరుకుపోయిందని ఎద్దేవా చేశారు..అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కార్ ఏర్పడుతుందని..ఏపీకి మోడీ గ్యారెంటీ ఇస్తున్నారని స్పష్టం చేశారు..బాబూ నాయకత్వం, పవన్ విశ్వాసం అవసరం అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.. ఇక ఈ ప్రజా గళం సభా వేదిక పైన వైసీపీ అవినీతి బాట పట్టింది అంటూ ఆరోపణలు చేశారు..👉ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ కి  ఇప్పటికి రాజధాని నిర్ణయించకపోవడానికి గల కారణం కూడా ఉందని అందుకే ఆ కారణం వల్లే కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు అందలేదని తెలిపారు..నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణకు హైదరాబాద్ రాజధాని కాగా.. ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానుల విషయం తెరపైకి వచ్చింది..వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అంటూ తెరపైకి తీసుకొచ్చారు..కానీ అమరావతి ప్రజలు మాత్రం దీనికి అంగీకరించలేదు..పైగా నాలుగున్నర సంవత్సరాల పరిపాలనలో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేకపోవడం నిజంగా విషాదకరం అని చెప్పవచ్చు..👉ఈక్రమంలోనే తాజాగా ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ మోదీ సంచలన ఆరోపణలు చేశారు. వైసిపికి అవినీతి నిర్వహణ తప్ప రాష్ట్ర ఆర్థిక నియంత్రణ తెలియదని చెప్పిన మోదీ.. రాష్ట్ర ఖజానాను వైసీపీ ప్రభుత్వం ఖాళీ చేసిందని తెలిపారు..అంతేకాదు రాజధాని నిర్మాణానికి కేంద్రం 15 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని భావించింది..కానీ అవినీతికి పాల్పడ్డ వైసిపి ప్రభుత్వానికి ఇంత డబ్బు ఇస్తే ఖచ్చితంగా లూటీ చేస్తుందని ఆలోచనతోనే ఆ డబ్బు ఇవ్వలేదని నరేంద్ర మోదీ కామెంట్ చేశారు..ముఖ్యంగా ఈ కారణం వల్లే కేంద్ర నిధులను వైసీపీ సర్కార్ అందుకోలేకపోయిందని తెలిపారు.

👉 మోడీ అమిత్ చాలా దాడితో డైలమాలో పడ్డ జగన్!.. జగన్ అంటే ఒక ఫైటర్ అని చెబుతారు.అది అందరూ అనుకునేదే కూడా. నెత్తి మీద పిడుగు పడినా జంకని తొణకని క్యారెక్టర్ అని కూడా అంటారు.అటువంటి జగన్ తన పదిహేనేళ్ల పొలిటికల్ కెరీర్ లో ఎన్నో ఆటుపోట్లను చూశారు. ఆయన ఏకంగా పదహారు నెలలు జైలు జీవితమూ గడిపారు.ఇక ఆయన 2014లో అధికారంలోకి రావడం గ్యారంటీ అని భావించినా తృటిలో తప్పిపోయింది. అపుడు కూడా నెక్స్ట్ టైం బెటర్ లక్ అని రిజల్ట్స్ వచ్చిన వెను వెంటనే మీడియాతో మాట్లాడుతూ లైట్ తీసుకున్నారు.అలాంటి జగన్ నోటి వెంట వచ్చిన ఆ మాటలు ఇపుడు వైసీపీకి షాకింగ్ గా మారాయి.ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.విపక్షాలకు ఆయుధంగా మారుతున్నాయి.

నాకు నమ్మకం సన్నగిల్లుతోందన్న మాట జగన్ నోటి వెంట వచ్చింది.అది కూడా చాలా జోరుగా సాగుతున్న ఎన్నికల సభా వేదిక నుంచి. మచిలీపట్నం సభలో జగన్ మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా బేలతనం చూపించారని కామెంట్స్ వస్తున్నాయి.ఏపీలో ఎన్నికలు సాఫీగా సాగుతాయన్న నమ్మకం లేదు అంటూ జగన్ మాట్లాడిన మాటలను విపక్షాలు పట్టుకున్నాయి. ఎన్నికలకు ముందే చేతులెత్తేసింది వైసీపీ అని విపక్ష కూటమి ఘాటు కామెంట్స్ చేస్తోంది.అసలు జగన్ ఎందుకు ఏ సందర్భంలో ఈ కామెంట్స్ చేశారు అన్నది పక్కన పెడితే ఆయన సింగిల్ గా వస్తున్నా నేను ఒక్కడినే అని చెబుతూ వచ్చారు. పైన ఉన్న దేవుడు ఎదురుగా ఉన్న ప్రజలు తన అండదండ అని ఆయన అన్నారు.అటువంటిది ఒక్కసారిగా ఎందుకు ఇలా ఓపెన్ అయ్యారు అన్నదే చర్చగా ఉంది. ఈసీ ఏపీలో ఆన్ గోయింగ్ స్కీంలకి నిధులు ఇవ్వవద్దని షాక్ ఇచ్చేసింది. అంతే కాదు ఒక్క రోజు వ్యవధిలో కీలక స్థానాలలో అధికారుల మీద బదిలీ వేటు పడింది. ఏకంగా డీజీపీనే బదిలీ చేసేశారు. ఇక ఇరవై నాలుగు గంటల వ్యవధిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రధాని మోడీ కూడా ఎన్నడూ లేని విధంగా జగన్ మీద పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు.ఇవన్నీ కూడా చకచకా జరిగిన పరిణామాలే.దాంతో జగన్ సోమవారం మాచర్ల తొలి సభకు వస్తూనే ఎందుకో డల్ గా కనిపించారు.ఆయన స్పీచ్ లో కూడా ఎక్కడా జోష్ కనిపించలేదు.నెల్లూరు స్పీచ్ లో కనిపించిన దూకుడు జోరు మాచర్ల సభలో మచ్చుకైనా లేదు అన్నమాట ఉంది. అది ఆయన తొలి సభ ఆ తరువాత చివరి సభ మచిలీపట్నంలో జరిగింది. అక్కడికి వచ్చేసరికి జగన్ బరస్ట్ అయిపోయారు. ఇష్టారాజ్యంగా అధికారులను మార్చేస్తున్నారు.నా మీద కూటమి కుట్రలు చేస్తోంది. కొనసాగుతున్న పధకాలకూ నిధులు పంపిణీ చేయవద్దా పేదలకు అన్యాయం కాదా అని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ వేదిక మీద నుంచే షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ విపక్ష కూటమిని నిందించవచ్చు.అలాగే తీవ్రంగా విమర్శలు చేయవచ్చు కానీ ఒక అధినేతగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఎన్నికల మీద నమ్మకం లేదూ అని ఆయనే అంటే వైసీపీ క్యాడర్ మొత్తం డీ మోరలైజ్ కాదా అని అంటున్నారు.డూ ఆర్ డై అని గ్రౌండ్ లెవెల్ లో పనిచేస్తున్న పార్టీ శ్రేణులకు ఏ రకమైన సందేశం వెళ్తుందని అంటున్నారు.అసలే అమిత్ షా ఏపీకి వచ్చిన నాటి నుంచి విపక్ష కూటమి ఫుల్ జోష్ లో ఉంది.వరస పెట్టి గుడ్ న్యూస్ లన్నీ ఒక్కోటిగా అందుతున్నాయి.మోడీ నోటి వెంట జగన్ ని గట్టిగా విమర్శింపచేశామని వారంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఈ నేపధ్యంలో జగన్ ఈ వైపున నిలబడి నమ్మకం సన్నగిల్లుతోందని అంటే అది విపక్షానికి ఆయుధంగానే మారుతుందని అంటున్నారు.కేంద్రం దన్నుగా ఉంటుందని జగన్ భావించారా ఎక్కడ బదిలీ జరిగినా డీజీపీ బదిలీ జరగదని ధీమాగా ఉన్నారా అన్న చర్చ కూడా ఇపుడు వస్తోంది.రాజకీయం ఇది.ఎపుడు ఏమి జరుగుతుందన్నది ఎవరికీ తెలియదు.ఇక్కడ గెలుపు కోసం వ్యూహాలు మాత్రమే ఉంటాయంటున్నారు. కేంద్రానికి వైసీపీ బాసటగా అయిదేళ్ల పాటు నిలిచింది. రాజ్యసభలో మద్దతు ఇచ్చింది. కీలక బిల్లులు అలా పాస్ అయ్యాయి.ఆనాడు బీజేపీ పెద్దలు ఫోన్ చేసి మరీ మద్దతు ని కోరి తీసుకున్నారు.కానీ ఇపుడు ఎన్నికల రణక్షేత్రంలో వారు ప్రత్యర్థి కూటమిలో ఉన్నారు.అలాగే చేస్తారు.కానీ ఇవన్నీ వైసీపీ అధినాయకత్వం ఊహించుకోలేదా అంతలా కేంద్ర పెద్దలను నమ్మేసిందా అన్న చర్చ సాగుతోంది.ఏది ఏమైనా సోమవారం జగన్ స్పీచులలో తేడా స్పష్టంగా కనిపించిందని డల్ గా సాగడమే కాకుండా డీ మోరలైజ్ చేసేలా కామెంట్స్ ఉన్నాయంటున్నారు. ప్రచారానికి అయిదు రోజులు మాత్రమే వ్యవధి ఉన్న వేళ జగన్ ప్రచారం ఏ విధంగా సాగనుంది అన్నది చూడాల్సి ఉంది.

👉 టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఆంధ్రప్రదేశ్ సీఐడీ(AP CID Notice) అధికారులు నోటీసులు జారీ చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. ఆధారాలుంటే చూపాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. సీఐడీ(CID) సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తిరుమలరావు ఈ నోటీసులను జారీ చేశారు. భూ యాజమాన్య హక్కు చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. మీ వద్ద ఉన్న సాక్ష్యాధారాలను తీసుకుని సోమవారం నాడు గుంటూరు సీఐడీ కార్యాలయానికి రావాలంటూ టీడీపీ ఆఫీసుకు సీఆర్‌పీసీ 160 సెక్షన్ ప్రకారం సీఐడీ నోటీసులు జారీ చేసింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టంపై ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సీఐడీకి కొందరు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా సీఐడీ అధికారులు టీడీపీకి నోటీసులు జారీ చేశారు.
సీఐడీ అధికారులపై టీడీపీ నేతలు ఫైర్..
టీడీపీ కేంద్రకార్యాలయానికి సీఐడి అధికారులు రావడంపై ఆనం వెంటరమణారెడ్డి మండిపడ్డారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన..డిజీపీ వైఎస్ రాజేంధ్రనాధ్ రెడ్డి ఆదేశాలతో పరిగెత్తుకొనివచ్చి చంద్రబాబు నాయుడు,లోకేష్‌కు నోటీసులు ఇచ్చారన్నారు.ల్యాండ్ టైటిలింగ్ పేరుతో ఒక చెత్త యాక్టు తీసుకొస్తే దానిని ప్రశ్నించినందుకు నోటీసులు ఇస్తారా? అని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు వలన ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని పేర్కొన్నారు. 28 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్టు తీసుకువచ్చారా? అని ప్రశ్నించారు.మరో నెల రోజుల్లో జగన్ ముఖ్యమంత్రిగా దిగిపోతున్న సమయంలో ఈ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారని జగన్‌ను ఆనం ప్రశ్నించారు. 👉అవ్వతాతలకు పెన్షన్లు చంద్రబాబు వలనే అపివేశారని చెబుతున్న వైసీపీ నాయకుల మాటలు జవహార్ రెడ్డికి వినిపించలేదా? అని ప్రశ్నించారు.
వైసీపీ నాయకులు..టీడీపీ నాయకుల మీద దుష్పచారం చేస్తే వారిపై కేసు నమోదు చేయరా? అని ఆనం ప్రశ్నించారు.రాత్రికిరాత్రే జగన్ తన ప్రచారాన్ని ఆపేసి టీడీపీ నాయకుల మీద కేసులు నమోదు చేయడానికి తాడేపల్లి ప్యాలెస్‌కు వచ్చారని విమర్శించారు.ఆరు రోజుల్లో ఎలక్షన్స్ పెట్టుకొని చంద్రబాబు మీద కేసులు నమోదు చేయడానికి వచ్చాడని..మరో నెల రోజుల్లో జగన్ వెల్లిపోతాడని..ఇప్పటికైన సీఐడీ అధికారులు మారాలని హితవు చెప్పారు.ఎవరైనా పేపర్లో ఫోటోలు వేసుకున్నేవాళ్లను చూశాం కానీ..సర్వే రాళ్ల మీద ఫోటోలు వేయించుకున్నే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని ఆనం విమర్శంచారు.పెన్షన్ కారణంగా చినిపోయిన అవ్వతాతల హత్య కేసులు అన్ని జవహార్ రెడ్డి మీదనే పెట్టాలని వ్యాఖ్యానించారు.
👉 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో అడ్డంగా బుక్ అయిన పీవీ రమేష్..

  ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇంకా అమలులోకి రాకపోయినా ఈ యాక్ట్ చుట్టూ జరుగుతున్న కుట్రలు అన్నీఇన్నీ కావు.మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ తాజాగా చేసిన ట్వీట్ సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన ట్వీట్ ను టీడీపీ అనుకూల మీడియా జోరుగా ప్రచారం చేసుకుంది.
అయితే పీవీ రమేష్ తర్వాత తన ట్వీట్ లో తప్పును గ్రహించి ఆ ట్వీట్ లో మార్పులు చేసి అడ్డంగా బుక్కయ్యారు.జగన్ సర్కార్ పరువు తీయాలని టార్గెట్ చేసి మరీ పీవీ రమేష్ ట్వీట్ చేసినట్టు ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపించాయి. మరోవైపు ఆయన ట్వీట్ లో స్వగ్రామంలో ఉన్న భూమికి సంబంధించి మ్యుటేషన్ జరగలేదని తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమల్లోకి రాకముందే ఇలాజరిగింది అంటూ ట్వీట్ లో మార్పులు చేశారు.చట్టం అమలులోకి రాకుండానే అన్యాయం ఎలా జరుగుతుందని ఆ చట్టం గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఏముందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. పీవీ రమేష్ తో బాటు అయన సోదరులకు కూడా భాగం ఉందని,ఈ క్రమంలో భూమి మ్యుటేషన్ కోసం వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని అందుకే ఆయన భూమి మ్యుటేషన్ జరగలేదని అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం మ్యూటేషన్ కోసం పలు పత్రాలు సమర్పించాల్సి ఉన్నా ఆ పత్రాలను సమర్పించకుండా మ్యుటేషన్ చేయమంటే ఎలా చేస్తారో పీవీ రమేష్ చెప్పాలని
అధికారులు కామెంట్లు చేస్తున్నారు.ఒక పార్టీ మీడియా ట్రాప్ లో పడి పీవీ రమేష్ ఇబ్బందుల్లో పడ్డారని నెటిజన్లు, వైసీపీ అభిమానులు చెబుతున్నారు.పీవీ రమేష్ తనవని చెబుతున్న భూముల్లో కొంత ప్రభుత్వ భూములు సైతం ఉన్నాయని భోగట్టా.ఒక రైతుతో పీవీ రమేష్ కు సరిహద్దు వివాదం కూడా ఉందని సమాచారం అందుతోంది.పీవీ రమేష్ విన్నుకోటకు వచ్చి వాస్తవాలు తెలుసుకోవాలని పేర్ని నాని సూచించారు.
👉 *వియ్యంకుడి విజయంకోసం వెంకటేష్ ప్రచారం..!*
*ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ యంపి అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి తో కలిసి ఈరోజు సాయంత్రం ఐదుగంటల నుంచి ఖమ్మంలో సినిహీరో వెంకటేష్ రోడ్ షో…!

7k network
Recent Posts

మోడీకి సరైన ప్రశ్న సంధించిన ప్రియాంకా!!!..బిగ్ స్టేట్ లో బీజేపీకి షాక్ !?..సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు: డి.ఎస్.పి బాల సుందర రావు..ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి ఒకరి పరిస్థితి విషమం..

పదేళ్ళ పాలనలో మోడీ ఫెయిల్ నా లేక పాస్ నా?..మనవడి లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ రియాక్షన్!..మహిళలకు గుడ్ న్యూస్..యాభై వేలు పొందండిలా!.ఏపీలో అల్లర్లపై సిట్ ఏర్పాటు..నవధాన్యాల సాగుపై అవగాహన..దోర్నాల.

48గంటల్లోపు ఓటింగ్ శాతాల డేటాను ఇసి వెబ్సైట్లో ఎందుకు ఉంచలేదు-సుప్రీంకోర్టు ఆగ్రహం..ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్యాయత్నం..టూరిస్టు బస్సులో మంటలు ఎనిమిది మంది మృతి..పల్నాడు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గా శ్యాం ప్రసాద్..వజ్రాల వేట మొదలు..ఘర్షణలకు పాల్పడితే చర్యలు కంభం సీఐ..పెట్రేగిపోతున్న మట్టి మాఫియా .

మోడీ : అయోధ్య రామా వర్సెస్ రేషన్ బియ్యం !..రైల్వే పోలీసులకు అభినందనలు తెలిపిన పొదిలి వ్యాపారి..కిమ్స్ లో అరుదైన చికిత్స..వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలిక మృతి..ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..అక్రమ అపార్ట్మెంట్లపై ఉక్కు పాదం.

ట్యాక్సుల‌పై నిర్మల‌మ్మకు డైరెక్ట్ బిగ్ పంచ్..అధికారం లోకి రాబోతున్నాం -“జగన్”..”బాబు”కు భద్రత పెంచిన కేంద్రం..పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల ఇళ్లలో సోదాలు..మాచర్లలో పోలీసుల కవాతు..

ఏం ‘టంగ‌య్యా’ స్వామీ.. మోడీపై విసుర్లు!.. అకస్మాత్తుగా ముస్లింలపై మోడీకి ప్రేమ పుట్టుకు వచ్చేసింది.. ముస్లింలలో పేదరికం ఎక్కువట!.. ఆయన కూడా ముస్లిం స్నేహితులు ఉన్నారట..!ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. “బస్సు ప్రమాదం” ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి!!!