భారీ ర్యాలీ… జగన్ కు జై కొట్టిన ఎన్టీఆర్ – ప్రభాస్ ఫ్యాన్స్!
ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్థావన ఏదో ఒక మూల వినిపిస్తూనే ఉంటుంటుంది .. ఎవరు అవునన్నా కాదన్నా.. రాజకీయాల్లో సినీనటుల ప్రభావం, సినీనటుల కెరీర్ వృద్ధిలో ఆయా రాజకీయ పార్టీల కార్యకర్తల ప్రభావం విడదీయరానిదనే చెప్పుకోవాలి! అయితే ఇది అందరి నటులకు సూటవ్వదు.. కొందరికి వద్దనుకున్నా వదిలిపెట్టదు.. వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు! తాను రాజకీయాలకు దూరం అని ఆయన ఎంత చెప్పినా…రాజకీయాలు మాత్రం ఆయన నుంచి దూరం కావడం లేదు..కావు కూడా! కారణం… చాలా మందికి జూనియర్ ఎన్టీఆర్ అంటే… ఈ జనరేషన్ ఎన్టీఆర్!! అవును… ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్థావన ఏదో ఒక మూల వినిపిస్తూనే ఉంటుంటుంది.వాస్తవానికి 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన తరువాత ఆయన ప్రస్థావన మరింత ఎక్కువగా వినిపించింది. ఒకానొక సమయంలో… పార్టీ పగ్గాలు జూనియర్ కి అప్పగించాలనే డిమాండ్ బలంగా వినిపించింది.ఆ పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైతం జూనియర్ ఎన్టీఆర్ కి పార్టీ బాధ్యతలు అప్పగించాలని,అప్పుడే పార్టీకి మనుగడ ఉంటుందని సలహా ఇచ్చారు.అయితే చంద్రబాబు మాత్రం నారా లోకేష్ పార్టీకి భవిష్యత్తు నాయకుడు అని తేల్చేశారు. ఇదే సమయంలో పార్టీలో వీలైనంత వరకూ జూనియర్ ప్రస్థావన రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినప్పటికీ టీడీపీ సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలను అభిమానులు ప్రదర్శిస్తూనే ఉంటారు. ఇక ఇటీవల జరిగిన కొడాలి నాని నామినేషన్ రోజు సంగతైతే చెప్పే పనే లేదు. జగన్, కొడాలి నాని ఫ్లెక్సీలతో పాటు ప్రతీ ఫోటోలోనూ జూనియర్ కనిపించారు! ఇందులో భాగంగానే… గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నానికి మద్దతుగా జూ. ఎన్టీఆర్ అభిమానులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు.. ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, ఫొటోలతో పాటి జగన్ జెండాలు, ఫ్లెక్సీలు చేతపట్టి కొడాలి నాని నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే క్రమంలో తాజాగా కర్నూల్ లో జరిగిన బహిరంగ సభలో ఎన్టీఆర్ అభిమానులు ఆయన ఫొటో ఉన్న జెండాలతో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే క్రమంలో… యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల సైతం సీఎం జగన్ సభలో సందడి చేశారు. జగన్ – ప్రభాస్ ఫొటోలతో ఉన్న జెండాలతో సభకు వచ్చి.. వైసీపీకి మద్దతుగా, జగన్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో… మెజార్టీ ఎన్టీఆర్ అభిమానులు వైసీపీకే మద్దతు తెలుపుతున్నారనే చర్చ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఈ చర్చ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో.. ఈ ఎన్నికల్లో ఎన్టీఆర్ – ప్రభాస్ ఫ్యాన్స్ మద్దతు వైసీపీకే అనే కామెంట్లు పెరిగిపోతున్నాయి!
👉తాడేపల్లిగూడెంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ను ప్రభుత్వ కార్యాలయము నుంచి బయటకు పొమ్మన్న ఉద్యోగులు తాడేపల్లిగూడెంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేస్తున్న ఉద్యోగులని బెదిరించిన మంత్రి కొట్టు సత్యనారాయణ పై తిరగబడ్డ ఉద్యోగులు.. మీరు బెదిరిస్తే బెదిరిపోయే రోజులు పోయాయి అంటూ మంత్రి పై ఉద్యోగులు తిరగబడటంతో, పోలీసుల సాయంతో వెళ్లిపోయారు
👉 *నవరత్నాల ప్లస్ మేనిఫెస్టో ప్రజలకు అదనపు ప్రయోజనం…సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ జగనన్నే రావాలి..గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు* ఎన్నికల పర్యటనలో భాగంగా బుధవారం గిద్దలూరు మండలంలోని త్రిపురాపురం, పొదలకుంటపల్లె, నరవ, యన్.బయనపల్లె, నల్లగట్ల, బ్రాహ్మణపల్లె,వేములపాడు,, కొమ్మునూరు, ఎగ్గనపల్లె గ్రామాల్లోని పలు వీధుల్లో గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి ప్రచార కార్యక్రమం చేపట్టారు*….ఈ సందర్భంగా కుందూరు నాగార్జున రెడ్డికి ఘన స్వాగతం పలికారు.ఆయా గ్రామాల్లోని ప్రతి గడపకు వెళ్లి జగనన్న పాలనలో అందించిన మంచిని వివరించారు.అనంతరం ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేస్తున్న తనను, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. *టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టోను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు*….అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలను అందించిన జగనన్ననూ మళ్లీ సీఎం చేసుకునేలా ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలన్నారు*.. *రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేయాలని కోరారు. కులాలు, మతాలు అనే తేడా లేకుండా సంక్షేమ పధకాలను అందించి పేదల మోములో చిరునవ్వులు పూయించిన జగనన్నను రానున్న ఎన్నికల్లో మళ్లీ ఆశీర్వదించాలన్నారు మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలంటే*… *పేదలందరికి మంచి జరగాలంటే*… *జగనన్నను మళ్లీ సీఏం చేసుకుందామన్నారు. కార్యక్రమం లో గిద్దలూరు మండల వైసీపీ నాయకులు,వైసీపీ ప్రజా ప్రతినిధులు,వైసీపీ కుటుంబ సభ్యులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు*….అనంతరం గిద్దలూరు మండలం త్రిపురాపురం గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.కార్యక్రమంలో గిద్దలూరు ఎంపీపీ కడప లక్ష్మీ వంశీధర్ రెడ్డి గారు,సర్పంచ్,రామాంజనేయులు,వైయస్సార్ సీపీ నాయకులు,యం.తిరుమలయ్య(పొట్టి).వైయస్సార్ సీపీ నాయకులు యం.వెంకటేశ్వర్లు, గమ్ముళ్ళ శ్రీరాములు,యం.వెంకటయ్య,జి.వెంకటేశ్వర్లు,పందిళ్ళ చిన్న గురవయ్య,శీలం సాయి రెడ్డి, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
బేస్తవారిపేట మండలం జేసీ అగ్రహారంలో ఆ గ్రామ సర్పంచ్ మేకల రాజేశ్వరి మరియు వారి భర్త మేకల రమణయ్య ఆధ్వర్యంలో గ్రామ కార్యకర్తలు నాయకులు గ్రామంలో విస్తృతంగా పర్యటిస్తూ మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు వివరిస్తూ అలానే నాగార్జున రెడ్డి గురించి అందరికీ తెలియపరుస్తూ తప్పకుండా గ్రామ ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వేయించి మరోసారి జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలని అలానే నాగార్జున రెడ్డిని మరియు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించుకోవాలని అందరికీ విన్నవించుకుంటూ గ్రామంలో విస్తృతంగా పర్యటిస్తున్న నాయకులకు అభినందనలు తెలిపారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచి మరియు మేకల రమణయ్య, ముర్క బుగ్గారెడ్డి, దొడ్డి భూపాల్ రెడ్డి, పుల్లారెడ్డి, ఉమాకాంత్ రెడ్డి, రామచంద్రారెడ్డి, దొడ్డి శ్రీనివాసరెడ్డి, వెంకట రంగారెడ్డి, దప్పిలి కాశిరెడ్డి, మాధవరెడ్డి, రమణయ్య, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.👉కుందూరు సమక్షంలో వెల్లుపల్లె గ్రామానికి చెందిన 30 కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీ తీర్థం*….గిద్దలూరు మండలం వెల్లుపల్లె గ్రామానికి చెందిన దాదాపు 30 కుటుంబాలు గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి సమక్షంలో, వెల్లుపల్లె సర్పంచ్ రాజశేఖర్ గారి నాయకత్వంలో టీడీపీని వీడి వైసీపీ తీర్థం పూచ్చుకున్నాయి*….పార్టీలో చేరిన వారిని ఆయన పార్టీ కండువాలు కప్పి సాధారంగా ఆహ్వానించారు.👉 గిద్దలూరు మున్సిపాలిటీకి చెందిన 50 కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీలో చేరిక*….గిద్దలూరు మున్సిపాలిటీ నల్లబండ బజార్ 17 మరియు 18 వార్డులకు చెందిన దాదాపు 50 కుటుంబాలు గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి సమక్షంలో టీడీపీకి గుడ్ బై చెప్తూ వైసీపీలోకి చేరిక*…. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాధారంగా ఆహ్వానించిన కుందూరు నాగార్జున రెడ్డి ..👉జగనన్న మళ్ళీ సీఎం అయితేనే సంక్షేమ పథకాలు*కుందురు నాగార్జున రెడ్డిని ఆదరించండి* కంభం మండలం యల్.కోట పంచాయతీ పరిధిలోని సూరేపల్లి,సూరేపల్లె గ్రామంలో ఇంటింటి ప్రచారంలో కుందురు నాగార్జున రెడ్డి కుటుంబ సభ్యులు*….ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు వైసీపీ ఇంచార్జి,ఎమ్మెల్యే అభ్యర్థి కుందురు నాగార్జున రెడ్డి తమ్ముడు కుందురు కృష్ణ మోహన్ రెడ్డి సతీమణి కేపి. కోమలతా రెడ్డి సూరేపల్లి,లింగోజిపల్లి గ్రామాలలో ఇంటింటికి తిరిగి గత ఐదు సంవత్సరాలుగా జగన్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.ప్రజలకు ఏ సమస్య వచ్చిన స్థానికంగా అందుబాటులో ఉంటున్నారని,ప్రజా సమస్యలను పరిష్కరించటమే ధ్యేయం,కావున కుందూరు నాగార్జున రెడ్డి ఆదరించి , గెలిపించండని విజ్ఞప్తి చేశారు*… కార్యక్రమంలో కంభం మండల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.*
👉కంభం పట్టణంలో తెలుగుదేశం పార్టీ ప్రచారం..
కంభం గ్రామపంచాయతీ పరిధిలోని 54 పోలింగ్ కేంద్రం పరిధిలోని జూమా మసీద్ చిన్న మసీద్ చికెన్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో ప్రచారం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి అనీష్ అహ్మద్(అన్ను )కార్యనిర్వహక కార్యదర్శి అతర్ షేక్ హుస్సేన్ (దాదా) NRI సయ్యద్ రఫీ బూత్ కన్వీనర్ నాగూర్ ఖాన్ ఇంటింటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించడం అలాగే రేపు 13వ తారీకు జరగబోయే ఎన్నికల్లో ముత్తుముల అశోక్ రెడ్డినీ పార్లమెంటు కు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో సయ్యద్ ఖాసిం. జావిద్ ఫయాజ్. మరియు ముస్లిం యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
👉గుంటూరు రూరల్ మండలం పరిధిలోగల జొన్నలగడ్డ గ్రామ వద్ద ఒక కారు ఆగి ఉన్న సమయంలో ఎన్నికల విధులలో ఉన్న *FST TEAM* వారు అనుమానం వచ్చి ఆ యొక్క కారుని తనిఖీ చేయగా అందులో 20 లక్షల రూపాయల డబ్బు దొరికినది మరియు సరియైన కారణాలు చూపనందున తదుపరి చర్యల నిమిత్తం నల్లపాడు పోలీస్ స్టేషన్ కి తరలించినారు.
👉 ఒంగోలు జిల్లా (SEB) అడిషనల్ సూపరిండెంట్ వారి ఆదేశాల మేరకు గిద్దలూరు SEB CI , వారి సిబ్బంది తో కలిసి సాధారణ ఎలక్షన్ల – 2024 నిమిత్తం తనిఖీలలో భాగంగా గిద్దలూరు మండలంలోని అంబపరం గ్రామంలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు .సదరు వ్యక్తి వద్ద 80 మద్యం సీసాలు 180 ఎంఎల్ పరిమాణం కలిగినవి సీజ్ చేయడం జరిగింది.ఆ వ్యక్తి వివరములు ,పేరు : బత్తిని శేషా రావు, తండ్రి: పెద్ద సుబ్బయ్య, వయస్సు: 37 సంవత్సరములు, కులము: గౌడ, అంబవరం గ్రామం,గిద్దలూరు మండలం.ఈ దాడుల్లో పాల్గొన్న అధికారులు గిద్దలూరు SEB సీఐ S. కొండారెడ్డి , SEB SI, T. ఫణి కుమార్ వారి సిబ్బంది పాల్గొన్నారు