👉గొంతు నొక్కుతున్నది మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాదు, నా అక్కచెల్లెమ్మలను, అవ్వాతాతలను, రైతన్నలను: మంగళగిరి బహిరంగ సభలో సీఎం జగన్..
ఎన్నికలకు రెండు నెలల ముందో, మూడు నెలల ముందో కాకుండా ఇన్ని సంవత్సరాలుగా మీ జగన్ పథకాలను అందిస్తున్నాడు,మీ బిడ్డ ఎం చేసిన కూడా మొదటి నుంచి క్యాలెండర్ ఇస్తు ఏ నెలలో ఏ పథకం ఇస్తామో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మీ బిడ్డ మంచి చేస్తు వచ్చాడు.. అలాంటీ మీ బిడ్డ ప్రభుత్వం పై ఎన్నికల వేళ కుట్రలు చేస్తున్నారు, ఇక్కడ గొంతు నొక్కుతున్నది మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాదు, నా అక్కచెల్లెమ్మలను, అవ్వాతాతలను, రైతన్నలను అనే సంగతిని తెలుసుకోలేపోతున్నారు.వాలంటీర్లు మళ్లీ మీ ఇంటికి రావాలన్నా?.. పేదవాడి భవిష్యత్ మారాలన్నా?.. పథకాలన్నీ కొనసాగాలన్నా?.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా?.. మన పిల్లలు వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా?.. మన హాస్పిటళ్లు, మన వ్యవసాయం మెరుగుపడాలన్నా?… ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదన్నారు.
👉అమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు..ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట.. బెయిల్ మంజూరు.. ఆయన మార్చి 21 న మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టయ్యారు. తాజాగా ఇప్పుడు భారీ ఊరట లభించింది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఈయనకు న్యాయస్థానం మధ్యంతర బెయిల్ నీ కూడా ఈరోజు మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. జూన్ 1వ తేదీ వరకు ఈ బెయిల్ ను సైతం మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ వస్తుందా రాదా అనే విషయం పైన అటు అభిమానుల నేతలలో చాలా ఆందోళన ఉండేది కానీ ఎట్టకేలకు ఇప్పుడు మద్యంతర భైలు ఇవ్వడంతో ఫుల్ ఖుషి అవుతున్నారు నేతలు.ఏప్రిల్ ఏడవ తేదీన అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ని పూర్తి చేసిన తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని నిన్నటి రోజున తెలియజేశారు.. అయితే ఈ రోజున కేజ్రీవాల్ మధ్యంతర బెయిలను ఇచ్చారు. మార్చి 21వ తేదీన ఈడి అధికారులు అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేయడం కూడా జరిగింది. ఒకవేళ ఈ బెయిల్ వచ్చినప్పటికీ కూడా సీఎంగా అధికారిక విధులకు సైతం దూరంగా ఉండాలంటే కోర్టు కూడా చాలా స్పష్టంగా తెలియజేసిందట. అందుకు తాను పూర్తిగా సహకరిస్తారని కూడా కోర్టుకు హామీ ఇచ్చినట్లుగా సమాచారం కేజ్రీవాల్.ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు తీర్పు కేజ్రీవాల్ కు అనుకూలంగా వచ్చిందని సమాచారం. అయితే అరెస్టుకు ముందు ఎన్నోసార్లు ఈడి జారీ చేసిన సామాన్లకు స్పందించని కేజ్రీవాల్ విచారణకు కూడా హాజరు కాలేదట.. అలా అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కూడా హైకోర్టుని ఆశ్రయించారు.అయితే అక్కడ ఊరట దక్కకపోవడంతో చివరికి ఈడి అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి బెయిల్ ఇవ్వాలని ఎక్కడ హక్కు లేదని కూడా అలా బెయిల్ ఇచ్చిన దాఖలు కూడా లేవని ఈడి కోరింది. కానీ చివరికి మాత్రం ఎట్టకేలకు అరవింద్ వాళ్లకి బెయిల్ ఇచ్చారు.
👉ఎన్ డి ఏ కూటమికి భారీ షాక్ ఇచ్చిన బ్రహ్మీ..ఏపీలో మరో రెండు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జగన్, టీడీపీ కూటమి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. వీరిలో ఎవరికి వారు ప్రజలను ఆకర్షించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి తాను చేసిన గత ఐదేళ్ల పరిపాలనే తనను గెలిపిస్తుందని బలంగా నమ్ముతున్నారు. టీడీపీ వాళ్ళు మాత్రం ప్రజల నమ్మకాన్ని గెలుచుకునేందుకు కష్టపడుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ వాళ్లను కూడా రంగంలోకి దింపి తనకు అనుకూలంగా ప్రచారం చేయించుకుంటున్నారు.
అయితే ప్రజలపై బాగా ప్రభావం కలిగి ఉన్న స్టార్ హీరోలు, కమెడియన్లు మాత్రం జనసేన, టీడీపీ వారికి షాక్‌లు ఇస్తున్నారు. దిగ్గజ హాస్యనటుడు బ్రహ్మానందం కూడా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడిని గెలిపించాలని బాగా ఆశపడుతున్నారు చిరంజీవికి బ్రహ్మానందానికి మంచి సంబంధాలు ఉన్నాయి. మీరు ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉంటూ రాసుకుని పూసుకొని తిరుగుతుంటారు. అలాంటి చిరంజీవి ఏమనుకుంటారు అని ఎలాంటి నిర్మొహమాటం లేకుండా బ్రహ్మానందం వైసీపీ సపోర్టును ప్రకటించారు. పవన్ తో పాటు చిరు కూడా షాక్ అయినట్లు తెలుస్తోంది.
పోలింగ్ తేదీకి రెండు రోజుల సమయం ఉండగా ఈ కీలక సమయంలో బ్రహ్మానందం మాట్లాడుతూ.. “మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు ఏపీ సీఎం జగన్ మహాయజ్ఞం ఇస్తున్నారు. అందులో భాగంగా ఉన్న చేయూత, ఆసరా వంటి పథకాలు ప్రవేశపెట్టారు. వీటివల్ల ప్రజలు వైసీపీ పార్టీకి బాగా దగ్గరయ్యారు ఇది చూడలేని టీడీపీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతోంది. ప్రజలను వైసీపీకి దూరం చేయాలనే ఆలోచనతో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. ఆ సంక్షేమ పథకాలకు ఆపివేసి మహిళా సాధికారతకు బ్రేకులు వేశారు. ఇది చాలా దురదుష్టకరమైన విషయం. మహిళలందరికీ న్యాయం జరగాలంటే మళ్లీ జగన్ గెలవాలి, అందుకే మనమందరం ఓటు వేసి గెలిపించుకోవాలి.” అని వైసీపీకి సపోర్ట్ గా వ్యాఖ్యానించారు.
👉 మాజీ సీఎంలను ఇరుకున్న పెడుతున్న మోడీ వ్యాఖ్యలు..తెలిసి మాట్లాడినా.. తెలియక మాట్లాడినా. ఒక్కోసారి మనం చేసే వ్యాఖ్యలు బూమ్ రాంగ్ అవుతుంటాయి. తాజాగా ప్రధాని మోదీ చేసిన విమర్శలే ఇందుకు నిదర్శనం. ఏపీలో ఎలాగైనా ఎన్డీయే కూటమిని అధికారంలోకి తీసుకురావాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు.ఇందులో భాగంగా పలు జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తూ.. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ..వైఎస్ జగన్ ను ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్నారు.
ఇటీవల రాజంపేట సభలో మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ మోదీ బహిరంగ సభ నిర్వహించారు.ఈ క్రమంలో వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైందని హెచ్చరించారు. రాయలసీమ అనేక మంది ముఖ్యమంత్రులను ఇచ్చినా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ఏ రంగంలోను పురోగతి సాధించలేదని విమర్శించారు. సాగు నీటి ప్రాజెక్టులు లేవని.. ఏపీలో డెవలమ్ మెంట్ జరగాలంటే డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని అన్నారు.
అన్నమయ్య ప్రాజెక్టు కూలిపోవడం బాధ కలిగిందని.. పోలవరం విషయంలో ఏం జరుగుతుందో మనందరకీ తెలిసిందే అని వ్యాఖ్యానించారు. రాయలసీమలో ఖనిజ సంపదకు లోటు లేదన్నారు. రాయలసీమ అభివృద్దికి ఎన్నో అపార అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ వికాసమే మోదీ లక్ష్యం అని వివరించారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. గతంలో సీఎంలుగా పనిచేసిన వారిలో ఎన్డీయే భాగస్వామి టీడీపీ అధినేత చంద్రబాబు, ఎవరి తరఫున అయితే ప్రచారం చేస్తున్నారో ఆయన కూడా రాయలసీమ సీఎం కావడం గమనార్హం.అంటే ఇన్ డైరెక్ట్ గా వారిద్దరనీ విమర్శించినట్లే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఎన్డీయే అధికారంలోకి వచ్చినా రాయలసీమ వ్యక్తే సీఎం అవుతారనే విషయం ప్రధాని మరిచిపోయినట్లున్నారు. సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడానికి 14 ఏళ్లు పాలించిన చంద్రబాబే కారణం అని విమర్శిస్తున్నారు.వైఎస్ హయాంలో పోతిరెడ్డి పాడు ఎత్తిపోతల పథకాన్ని ప్రవేశ పెట్టగా,రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సీఎం జగన్ ప్రవేశ పెడుతున్నారు.ఆ లెక్కన రాయలసీమకు ఏం చేయని సీఎంల జాబితాలో ముందు వరుసలో చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలే ఉంటారు. ఈ లెక్కన మోదీ చేసిన వ్యాఖ్యలు మాజీ సీఎంలను షాక్ కు గురిచేసేవే.
👉టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గెలుపే లక్ష్యంగా కూటమితో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్నది ఆయన ప్రధాన లక్ష్యం..
పైగా వయసు అయిపోవడం దాదాపు ఇవే చివరి ఎన్నికలు కావడం, వారసుడైన లోకేష్ ను గద్దెనెక్కించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు.అందులో భాగంగానే బలమైన అధికార పార్టీని ఢీ కొట్టడానికి ఒంటరిగా పోరాడలేక జనసేనతో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు..అయితే జనసేనతో పొత్తు పెట్టుకున్నప్పటికీ జగన్ ను ఎదుర్కోగలమన్న నమ్మకం కలగలేదు..అందుకే వ్యవస్థల సహాయం కావాలంటే కేంద్రంలో అధికారంలో చలామణిలో ఉన్న బిజెపితో పొత్తు తప్పనిసరి అని నిర్ణయించుకున్నారు.. అనుకున్నదే తడువుగా పవన్ కళ్యాణ్ ద్వారా పలు దఫాలుగా బిజెపితో రాయబారాలు జరిపి చివరికి పొత్తు పెట్టుకోవడంలో విజయం సాధించారు.. అయితే ఇప్పుడు ఈ వ్యవస్థల నుంచి కూడా తగిన సహాయ సహకారాలు లభించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టిడిపి నేతలు..నిజానికి అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డిజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి లను వెంటనే మార్చేయాలని బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకున్న వెంటనే వీరిద్దరిని మార్చేయాలని బిజెపిని కోరింది టిడిపి.. కానీ అక్కడే టిడిపికి చుక్కెదురయింది..ఎన్నికలకు కేవలం వారం ముందు మాత్రమే పోలీస్ బాస్ డిజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మారిపోయారు.. కొత్తగా వచ్చిన డీజీపీ హరీష్ గుప్తా కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారి అని టిడిపి నేతలు అంటున్నారు.. ఇప్పటికే ముగ్గురు ఐఏఎస్ లు, 5 మంది ఐపీఎస్ అధికారులపై వేటు వేసినా.. కొత్తగా వచ్చిన వారు కూడా అటు వైసీపీకే అనుకూలంగా ఉండడంతో టిడిపి నేతల్లో ఒక్కసారిగా ఆందోళనలు మొదలయ్యాయి..ఒకరకంగా చెప్పాలంటే బిజెపితో పొత్తు వల్ల కలిగే రాజకీయ లాభం కంటే నష్టమే ఎక్కువగా కనిపిస్తోంది..👉ముఖ్యంగా బీజేపీతో పొత్తు కలపడం వల్ల అప్పటివరకు అనుకూలంగా ఉన్న ముస్లిం, క్రిస్టియన్, మైనారిటీలు కూడా ఇప్పుడు దూరమైపోయారు.. అలాగే దళితుల ఓట్లు కూడా ఆశించిన స్థాయిలో పడవనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక లాభం కోసం కూటమితో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు అనుకూలం లేకపోయేసరికి లబోదిబో అంటున్నారు..
👉 టంగుటూరు లో ఎన్నికల ప్రచారం లో భాగంగా మాజీ శాసనసభ్యులు పోతుల రామారావు నివాసం వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం మరియు పార్టీ చేరికల కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కొండపి శాసనసభ అభ్యర్థి డా.డోల బాల వీరాంజనేయ స్వామి,మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు నిఖిల్ రెడ్డి టీడీపీ.జనసేన,బీజేపీ నాయకులు,పాల్గొన్నారు.
👉నేడు కొండపి నియోజకవర్గం సింగరాయకొండ లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం లో భాగంగా రోడ్ షో లో పాల్గొన్న, ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి,కొండపి శాసనసభ అభ్యర్థి డా. డోల బాల వీరాంజనేయ స్వామి, మాజీ శాసనసభ్యులు పోతుల రామారావు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు నిఖిల్ రెడ్డి,బెల్లం సత్యనారాయణ మరియు పలువురు టీడీపీ. జనసేన, బీజేపీ మండల నాయకులు,అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.