ఓట్లు చీల్చాలని, చంద్రబాబును గెలిపించాలని కాంగ్రెస్ కుట్ర: సీఎం జగన్..వివేకా హత్య జరిగింది అందుకే..భారతిపై సునీత తీవ్ర వ్యాఖ్యలు!.. విస్తృత ప్రచారంలో కుందూరు కుటుంబం (గిద్దలూరు)

👉మన ఓట్లు చీల్చాలని, చంద్రబాబును గెలిపించాలని కాంగ్రెస్ కుట్ర: కడప బహిరంగ సభలో సీఎం జగన్*

చంద్రబాబు పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్ తో కాపురం చేస్తున్నాడు- మన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి చనిపోయిన ఇన్ని సంవత్సరాలు కోసం నేడు ఎన్నికల కోసం నాన్న సమాధి దగ్గరకు ఢిల్లీ నుంచి వస్తారట- కాంగ్రెస్ కు ఓటు వేస్తే మన కళ్లను మనం పొడుచుకున్నట్లే, చంద్రబాబును గెలిపించేందుకు ఏపీలో కాంగ్రెస్ రంగప్రవేశం చేసింది. కాంగ్రెస్ కి ఓటు వేస్తే మన ఓట్లను చీల్చి ఎన్డీయేను గెలిపించడం కాదా? – చంద్రబాబు పగలు బీజేపీతో రాత్రి కాంగ్రెస్ తో కాపురం చేస్తారు. – రాజకీయాలు ఎంతగానో దిగజారిపోయాయి.

👉 వివేకా హత్య జరిగింది అందుకే… భారతిపై సునీత తీవ్ర వ్యాఖ్యలు! ఇదే సమయంలో… సీఎం జగన్ ను ఎదిరించి మాట్లాడగలిగే సత్తా వివేకాకు ఉండటంవల్లే హత్య చేశారంటూ సునీత కీలక కామెంట్లు చేశారు.ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచార గడువు శనివారం సాయంత్రంతో ముగియనున్న నేపథ్యంలో ప్రచారకార్యక్రమాలు హోరెత్తిపోతున్నాయి.ఇదే సమయంలో క్లైమాక్స్ ని బలంగా ప్లాన్ చేస్తున్న అభ్యర్థులు, స్టార్ క్యాంపెయినర్లూ తమ తమ ట్రంప్ కార్డులను బయటకు తీస్తున్నారు! ఆ సంగతి అలా ఉంటే… రాష్ట్రంలోని ఫైట్ అంతా ఒకెత్తు..కడప లోక్ సభ పరిధిలో ఫైట్ మరొకెత్తు అనే కామెంట్లు వినిపిస్తున్న నేపధ్యంలో తాజాగా వివేకా కుమార్తె సునీత..వైఎస్ భారతి పై సంచలన వ్యాఖ్యలు చేశారు! గతకొన్ని రోజులుగా వైఎస్ వివేకా హత్య కేసుపై మాట్లాడుతున్న క్రమంలో వైఎస్ అవినాష్,ఆయనకు టిక్కెట్ ఇచ్చిన జగన్ లపై విరుచుకుపడుతున్న సునీత.. ఈ మధ్య వైఎస్ భారతిపైనా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. వైఎస్ వివేకా హత్య జరిగి, గది మొత్తం రక్తసిక్తమైపోతే గుండేపోటు అని ప్రసారం చేసింది భారతి అంటూ షర్మిళ విమర్శలు చేసిన నేపథ్యంలో… సునీత మరింత ఘాటుగా స్పందించారు. ఇందులో భాగంగా…పులివెందులలో సింగల్ ప్లేయర్ గా ఉండాలనే ఉద్దేశ్యంతోనే వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేశారని మాట్లాడారు సునీత! ఇదే సమయంలో… “ఇంకా ఎవరినైనా హత్య చేయాలని అనుకుంటున్నారా” అని ప్రశ్నించిన ఆమె… భారతి.. “నన్ను నరికేస్తారో, లేక షర్మిలను నరికేస్తారో తెలియదు గానీ సింగిల్ ప్లేయర్ గా ఉండాలంటే అదొక్కటే పాజిబిలిటీ” అంటూ సంచలన కామెంట్స్ చేశారు.ఇదే సమయంలో…సీఎం జగన్ ను ఎదిరించి మాట్లాడగలిగే సత్తా వివేకాకు ఉండటంవల్లే హత్య చేశారంటూ సునీత కీలక కామెంట్లు చేశారు. ఇదే క్రమంలో… తనకు కూడా ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చని, అందుకే తన పిల్లలకు ఆస్తులు వీలునామా రాసేశానని, అన్నింటికీ తెగించే పోరాడుతున్నానని సునీత తెలిపారు. ఇదే సమయంలో… అవినాష్ రెడ్డి చెప్పిన మాటలు నమ్ముతున్నట్లు జగన్ చెప్పడం ఏమిటని ఆమె ఘాటుగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా… దేశమంతా ఎన్నికలు సాధారణంగా జరుగుతుంటే కడప ఎన్నికలకు మాత్రం ప్రత్యేకత ఉందని చెప్పిన సునీత… కడపలో న్యాయానికి, నిందితులకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని, అందుకే ప్రపంచం అంతా చూస్తుందని తెలిపారు. అదేవిధంగా… షర్మిలను ఎంపీగా చేయాలని వివేకానంద రెడ్డి అనుకున్నా కుదరలేదని..ఆయన కోరికను నెరవేర్చేందుకు ప్రజలంతా షర్మిళకు ఓటు వేసి న్యాయం వైపు నిలవాలని సునీత విజ్ఞప్తి చేశారు.

👉కంటతడి పెట్టిన షర్మిల… జగన్ పై సంచలన వ్యాఖ్యలు!

ఈ క్రమంలో తాజాగా కడపలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన షర్మిళ కంట తడి పెట్టుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ఇంక 24గంటల వ్యవధి కూడా లేదు! ఈ సమయంలో ఏపీ రాజకీయం పీక్స్ కి చేరిపోతోంది! పార్టీల అధినేతలు, నేతలు ప్రచారాలతో హోరెత్తించేస్తున్నారు. అలుపెరగకుండా ప్రజలను కలుస్తున్నారు..వారి మనసు దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.ఈ సమయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన షర్మిళ కంట తడి పెట్టారు. అవును… ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో మిగిలిన రాష్ట్రమంతా ఒకెత్తు, కడప లోక్ సభ పరిధిలో ఎన్నిక ఒకెత్తు అన్నట్లుగా పరిస్థితి మారిపోయిన సంగతి తెలిసిందే. అక్కడ పోటీ చేసేది అవినాష్ అయినా… వ్యవహారం మాత్రం జగన్ వర్సెస్ భారతి అన్నట్లుగా మారిన పరిస్థితి. ఈ క్రమంలో తాజాగా కడపలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన షర్మిళ కంట తడి పెట్టుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కాంక్షతోనే తాను కడపలో పోటీ చేస్తున్నానని జగన్‌ అంటున్నారని మొదలుపెట్టిన షర్మిళ… అసలు తనను రాజకీయాల్లోకి తెచ్చింది జగనన్న కాదా? అని ప్రశ్నించారు.జగన్ జైల్లో ఉన్నప్పుడు భర్త, పిల్లల్ని వదిలేసి వేల కి.మీల మేర పాదయాత్ర చేసిన విషయాన్ని గుర్తు చేశారు.ఈ క్రమంలోనే జగన్ భవిష్యత్‌ కోసం తన కాలికి గాయమైనా వెనక్కి తగ్గలేదని షర్మిళ తెలిపారు. వాస్తవానికి తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో వైసీపీ అంతా తన చుట్టే తిరిగిందని చెప్పిన షర్మిళ… తనకే గనుక రాజకీయ కాంక్ష ఉంటే పార్టీని హైజాక్‌ చేసేదాన్ని కాదా? అని ప్రశ్నించారు. ఇదే క్రమంలో… “మీ నుంచి పైసా సాయంకోరినట్టయినా నిరూపించగలరా?” అని సూటిగా ప్రశ్నించారు షర్మిళ! బైబిల్ పై ప్రమాణం చేసి చెప్పగలరా?:ఈ సందర్భంగా తనకు రాజకీయ కాంక్ష గానీ, డబ్బు కాంక్ష గానీ ఉందని మీ మనస్సాక్షిలో మీరు నిజంగానే నమ్ముతున్నారా? అని జగన్ ని సూటిగా ప్రశ్నించిన షర్మిళ…మీరు సీఎం అయ్యే వరకు అన్న అని మీకోసం ఎంతో చేసిన విషయం వాస్తవం కాదా? అని అడిగారు.ఇదే క్రమంలో…”నాకు రాజకీయ కాంక్ష గానీ, డబ్బు కాంక్షగానీ, మిమ్మల్ని పదవి అడగకుండా మీ కోసం నిస్వార్థంగా పనిచేశానని నేను..మనిద్దరం నమ్మే బైబిల్‌ మీద ఒట్టేసి నేను చెప్పగలను..మిమ్మల్ని పదవి అడిగానని మీరు అదే బైబిల్‌ పై ప్రమాణం చేయగలరా? అని షర్మిళ సవాల్ విసిరారు! ఇదే క్రమంలో…సోషల్‌ మీడియా ద్వారా తనపై దారుణంగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడిన షర్మిళ… రాజన్న బిడ్డ అనే ఇంగితం కూడా లేకుండా తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు అని అన్నారు. ఫలితంగా… తనపై వికృతంగా ప్రచారం చేయించినందుకు జగన్‌ చరిత్రలో నిలిచిపోతారని చెప్పిన షర్మిళ.. మీ కోసం త్యాగం చేసిన చెల్లిని గౌరవించకపోగా మానసికంగా హింసిస్తారా? అని ప్రశ్నించారు. దొంగ ఎప్పుడైనా దొంగనని చెబుతాడా? ఇక వివేకా హత్య వ్యవహారంలో అవినాష్ చెబుతున్న వెర్షన్ లాజికల్ గా ఉందని చెబుతూ.. అతడు తప్పు చేయలేదని తాను నమ్ముతున్నట్లు జగన్ చెప్పిన విషయంపైనా షర్మిళ స్పందించారు! ఇందులో భాగంగా.. తాను నిర్దోషి అని అవినాష్ రెడ్డి నాలుగు ఇంటర్వ్యూల్లో చెబితే చూసి కన్విన్స్‌ అవ్వడానికి మీరెవరు..? రాజ్యాంగమా..? చట్టమా..? కన్విన్స్ అవ్వాల్సింది న్యాయ వ్యవస్థ అని షర్మిళ తెలిపారు.నిజంగా నిర్దోషులైతే సీబీఐ వస్తే ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారని ప్రశ్నించిన షర్మిళ…దొంగ ఎప్పుడైనా దొంగనని చెబుతాడా? దొంగ మాటలు పిచ్చోళ్లే నమ్ముతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

👉ఎల్లప్పుడు గిద్దలూరు ప్రజల సంక్షేమం,కార్యకర్తల బాగోగులు చూసే తత్వం,నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా నాగార్జున రెడ్డి.. కోమలతా రెడ్డి..నియోజకవర్గ అభివృద్ధి కోసం తపన పడే నాగార్జున రెడ్డికి గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు మద్దతుగా నిలవాలని కుందూరు నాగార్జున రెడ్డి మరదలైన కోమలత రెడ్డి కోరారు. శుక్రవారం ఆమె కంభం మండలం దర్గా గ్రామంలో, బేస్తవారిపేట మండలం జిబి కృష్ణాపురం గ్రామంలో  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. .మే 13న జరిగే ఎన్నికల్లో గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న కుందురు నాగార్జున రెడ్డికి మరియు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.కార్యక్రమంలో ,కంభం మండలం ఎంపీపీ చేగిరెడ్డి తులసమ్మ ఓబుల్ రెడ్డి జేబి.కేపురం సర్పంచ్ కంచర్ల వెంకట లక్ష్మమ్మ,దర్గా సర్పంచ్, వైయస్సార్ సీపీ ముఖ్య నాయకులు కంచర్ల తిరుపతయ్య ,బేస్తవారిపేట మండల మాజీ ఎంపీపీ వెంకట రాజు ,బేస్తవారిపేట మండల వైయస్సార్ సీపీ సీనియర్ నాయకులు బొల్లా బాలిరెడ్డి ,గ్రామ ముఖ్య నాయకులు,బేస్తవారిపేట మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు,మహిళా వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.👉ఎన్నికల ప్రచారం లో భాగంగా గిద్దలూరు మండలం లోని కృష్ణంశెట్టి పల్లె

పంచాయతీ లోని ఆక్కలరెడ్డి పల్లె లో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్థి కుందురు నాగార్జున రెడ్డి.. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు.

7k network
Recent Posts

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం