చంద్రబాబు ప్రలోభాలకు లొంగొద్దు..సీఎం జగన్..వైసీపీకి షాక్‌..విజయమ్మ కీలక ప్రకటన!..పవన్ కళ్యాణ్ కు కోపం తెప్పించే పని చేసిన అల్లు అర్జున్.. మైనారిటీలు వైసిపి వైపే..రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ షంషీర్ అలీ బేగ్..ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జీవో కాపీ దగ్ధం చేసిన ఒంగోలు టిడిపి నాయకులు..

👉 కైకలూరు ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్..హైలెట్స్..

*”ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా.. అందరూ ఆలోచన చేయండి. చంద్రబాబు ప్రలోభాలకు లొంగొద్దు. చంద్రబాబు హామీలన్నీ అబద్ధాలే.. ఐదేళ్ల పాలనలో ఏ నెల ఏ పథకం వస్తుందో ముందే క్యాలెండర్ ఇచ్చి ఖచ్చితంగా పథకాలు అందించాం. ఇలాంటి మీ బిడ్డ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ఈ సందర్బంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా”.. 👉 *చంద్రబాబు ప్రలోభాలకు మోసపోవద్దు. ప్రతి ఏటా జరిగబోయే మంచిని ఏ ఒక్కరూ పోగొట్టుకోవద్దు. వచ్చే ఐదేళ్లలో వాలంటీర్లు ఇంటికే రావాలన్నా, అవ్వతాతల పెన్షన్ మళ్లీ ఇంటికే రావాలన్నా, నొక్కిన బటన్ల సొమ్ము మీ ఖాతాల్లోకి రావాలన్నా, పేదల పిల్లల చదువులు బాగుపడాలన్నా.. ఫ్యాన్ బటన్ పై రెండు ఓట్లు నొక్కాలన్నారు  👉 “ఎన్నికల్లో మీ బిడ్డ జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు.. ఇంటింటి అభివృద్ధి, అదే పొరపాటున చంద్రబాబు కూటమికి ఓటు వేస్తే పథకాలన్నింటికి ముగింపు, మళ్లీ మోసపోవటమే. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం. ఇదే మోసపూరిత వాగ్దానాలతో, సాధ్యం కానీ హామీలతో చేసిన మేనిఫెస్టోకు అర్థం” అన్నారు 👉”2014 ఎన్నికల హామీల్లో భాగంగా ఆడబిడ్డ పుడితే రూ. 25 వేలు ఇస్తామన్న చంద్రబాబు ఇచ్చాడా ఇక్కడ ఇన్ని వేల మంది మహిళలు ఉన్నారు ఏ ఒక్కరికి అయినా ఆడబిడ్డ పుట్టినందుకు చంద్రబాబు మీ ఖాతాల్లోకి వేసారా”.. పిఠాపురం ఎన్నికల ప్రచారం ముగింపు సభలో చంద్రబాబు గురించి సీఎం జగన్ అని ప్రశ్నించారు.👉”నా తల్లిలాంటి, నా అక్కలాంటి వంగా గీత అక్క మన ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం చేస్థానని మీ అందరి ముందు మాట ఇస్తున్నా”.. పిఠాపురం ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్*

👉 జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు స్టార్ హీరో అల్లు అర్జున్ కోపం తెప్పించే ప‌ని చేశారు…. వైసీపీని ప‌వ‌న్‌క‌ల్యాణ్ తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేకించే సంగ‌తి తెలిసిందే.ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వైసీపీని గెల‌వ‌నీయ‌కూడ‌దనేది ప‌వ‌న్ ధ్యేయం. అందుకే ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్లు చీలకుండా టీడీపీ, బీజేపీల‌తో ఆయ‌న పొత్తు పెట్టుకున్నారు. అయితే ఆయ‌న ఆశించిన‌ట్టు ఓట‌ర్లు ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో రెండు రోజుల్లో తెలియ‌నుంది.ఇదిలా వుండ‌గా, ప‌వ‌న్ రాజ‌కీయ పంథాకు వ్య‌తిరేకంగా అల్లు అర్జున్ ఇవాళ వ్య‌వ‌హ‌రించారు. త‌న స్నేహితుడైన నంద్యాల ఎమ్మెల్యే శిల్పా ర‌విచంద్రారెడ్డి ఇంటికి భార్య స్నేహారెడ్డితో క‌లిసి అల్లు అర్జున్ నంద్యాల వెళ్లారు. త‌న ఇంటికి వ‌చ్చిన అల్లు అర్జున్ దంప‌తుల‌కు శిల్పా ర‌వి దంప‌తులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అల్లు అర్జున్ రాక గురించి తెలుసుకుని ఆయ‌న అభిమానులు భారీ సంఖ్య‌లో నంద్యాల‌కు చేరుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే శిల్పా ర‌వి ఇంటి వ‌ద్ద అల్లు అభిమానులు సంద‌డి చేశారు. ఎన్నిక‌ల ముగింపు రోజు శిల్పా ర‌వి ఇంటికి అల్లు అర్జున్ త‌న స‌తీమ‌ణితో క‌లిసి వెళ్ల‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ర‌వి ఇంటికి వెళ్ల‌డం ద్వారా, త‌న అభిమానుల‌కు రాజ‌కీయంగా వైసీపీకి మ‌ద్ద‌తు ఇవ్వాల‌నే సంకేతాలు పంపార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. గ‌త ఎన్నిక‌ల్లో కూడా శిల్పా ర‌వి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లి మ‌ద్ద‌తు ప‌లికారు.👉 రాజ‌కీయంగా వైసీపీ, ప‌వ‌న్ నేతృత్వం వ‌హిస్తున్న జ‌న‌సేన మ‌ధ్య తీవ్ర విభేదాలున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ మ‌నోభిప్రాయానికి విరుద్ధంగా వైసీపీ అభ్య‌ర్థి ఇంటికి ఎన్నిక‌ల‌కు రెండు రోజుల ముందు అల్లు అర్జున్ వెళ్ల‌డం స‌హ‌జంగానే ప‌వ‌ర్ స్టార్ అభిమానుల‌కు కోపం తెప్పిస్తుంద‌నే మాట వినిపిస్తోంది.

👉 వైసీపీకి షాక్‌.. విజయమ్మ కీలక ప్రకటన! ఆంధ్రప్రదేశ్‌ లో మరోసారి అధికారంలోకి రావాలని ఆశిస్తున్న వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ కు గట్టి షాక్‌ తగిలింది.ఆంధ్రప్రదేశ్‌ లో మరోసారి అధికారంలోకి రావాలని ఆశిస్తున్న వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ కు గట్టి షాక్‌ తగిలింది.ఆయన తల్లి విజయమ్మ సంచలన వీడియో విడుదల చేశారు.

కడప ఎంపీ స్థానంలో తన కుమార్తె, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు అనుకూలంగా విజయమ్మ వీడియో విడుదల చేశారు. కడప ఎంపీగా తన కుమార్తెను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కడప ఎంపీ అభ్యర్థిగా వైసీపీ తరఫున వైఎస్‌ అవినాష్‌ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి లె లిసిందే. 2014, 2019 ఎన్నికల్లో కడప ఎంపీగా వైఎస్‌ అవినాష్‌ రెడ్డి వైసీపీ తరఫున గెలుపొందారు.ఈసారి ఆయనపై ప్రత్యర్థిగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బరిలోకి దిగారు.టీడీపీ తరఫున భూపేశ్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో మే 11న ప్రచారం ముగియడానికి రెండు గంటల ముందు విజయమ్మ కీలక వీడియో ప్రకటన విడుదల చేశారు.కడప కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వైఎస్సార్‌ కుమార్తె షర్మిలకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘వైఎస్సార్‌ను అభిమానించే, ప్రేమించే వారికి, కడప లోక్‌ సభా నియోజకవర్గ ప్రజలకు నా విన్నపం. వైఎస్సార్‌ ను మీరెంత ఎలా అభిమానించారో,ఏవిధంగా అక్కున చేర్చుకున్నారో,ఏ విధంగా నిలబెట్టుకున్నారో.. ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంతవరకు ప్రజాసేవకే అంకితమయ్యారు. ప్రజా సేవ చేస్తూనే ఆయన చనిపోయారు.ఈ రోజు ఆయన ముద్దుబిడ్డ షర్మిలమ్మ ఎంపీగా పోటీ చేస్తోంది. ఆమెను ఆశీర్వదించండి. వైఎస్సార్‌ లాగా సేవ చేసే అవకాశాన్ని ఆమెకు కల్పించండి.కడప జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించండి. ఆమెను గెలిపించి పార్లమెంటుకు పంపాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నా’’అని విజయమ్మ ఆ వీడియోలో విజ్ఞప్తి చేశారు. స్కూలుకు షాకిచ్చిన కోర్టు ఎన్నికల షెడ్యూల్‌ వెలువడటానికి ముందే విజయమ్మ అమెరికా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఓవైపు తన కుమారుడు వైఎస్‌ జగన్‌ వైసీపీ అధినేతగా, ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరోవైపు విజయమ్మ కుమార్తె షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్నారు.దీంతో ఎవరో ఒకరి పక్షం తీసుకోవడం ఇష్టం లేకే ఆమె అమెరికా వెళ్లిపోయారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారానికి మరికొద్ది గంటల్లో తెరపడనున్న వేళ విజయమ్మ వీడియో ప్రకటన హాట్‌ టాపిక్‌ గా మారింది. ఇప్పటికే వైఎస్‌ అవినాశ్‌ రెడ్డికి వ్యతిరేకంగా దివంగత మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తన బాబాయి వివేకాను అవినాశ్‌ రెడ్డి చంపించారని ఆమె ఆరోపిస్తున్నారు.కడపలో ధర్మం, న్యాయం గెలవాలంటే తనను గెలిపించి ఓట్లేయాలని షర్మిల అభ్యర్థిస్తున్నారు. అప్పుడే తన బాబాయికి న్యాయం జరుగుతుందని ఆమె చెబుతున్నారు.మరోవైపు అవినాశ్‌ రెడ్డికి మద్దతుగా సీఎం వైఎస్‌ జగన్, ఆయన భార్య వైఎస్‌ భారతి, అవినాష్‌ రెడ్డి భార్య, సోదరీమణులు, తదితరులు భారీ ఎత్తున ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో విజయమ్మ వీడియో ప్రకటన ద్వారా తన కుమార్తెను గెలిపించాలని పిలుపునివ్వడం హాట్‌ టాపిక్‌ గా మారింది. మరి కడప ప్రజలు అవినాశ్‌ కు పట్టం కడతారో లేక షర్మిలను గెలిపిస్తారో వేచిచూడాల్సిందే….

👉వైసిపి వైపే మైనారిటీలు… మైనారిటీల సంక్షేమమే జగన్ ధ్యేయం.. వైసిపి మైనారిటీ నాయకులు ఎస్ కె నజీర్అహ్మద్, డాక్టర్ సయ్యద్ మక్బూల్ బాషా లతో కలసి …రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మీర్జా షంషీర్ అలీ బేగ్   కలసి శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా, ఎంపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డి లను అత్యధిక మెజారిటీతో గెలిపించమని కోరారు.వైసిపి వైపే మైనారిటీలు ఉంటారని… మైనారిటీల సంక్షేమమే జగన్ ధ్యేయం అన్నారు.4 ఎమ్మెల్సీ, ఈ ఎన్నికల్లో 7 ఎమ్మెల్యే సీట్లు మైనారిటీలకు కేటాయించిన ఘనత జగన్ కే దక్కిందని,ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం అట్టడుగు వర్గాలకు..అందులో మైనారిటీలకు అగ్ర తాంబూలం అని …మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లను కల్పించిన ఘనత స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి కే దక్కిందని,మైనారిటీలను ఓటు అడిగే నైతిక హక్కు టిడిపి, జనసేన,బిజెపికి ఏమాత్రం లేదన్నారు.ఉర్దూను రెండవ అధికార భాష గా ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.మైనారిటీల విద్యాభివృద్ధికి వైసిపి కృషి అని . వైసిపి తిరిగి అధికారంలోకి రావడం తథ్యమని సంక్షేమం,అభివృద్దే ధ్యేయంగా పనిచేసిన జగన్ ప్రభుత్వం.సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రజల ముంగిట్లోకి 526 కు పైగా ప్రభుత్వ సేవలు. పట్టణంలో 2 కోట్లతో షాదిఖానా ను నిర్మించడం జరిగిందని ..రూ 500 కోట్లతో మేడికల్ కళాశాల ఏర్పాటు…పశ్చిమ ప్రకాశం ప్రజల ఆశాజ్యోతి అయిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కిందని,ప్రాంతాలకు,కులాలకు,మతాలకు అతీతంగా వైసిపి అభివృద్ధి చేసిందన్నారు.

👉ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం జీవో నెంబర్ 512 కాపీని తగలబెట్టి నిరసన..  తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి ఆధ్వర్యంలో ఒంగోలులోని  9వ డివిజన్లో శనివారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వైసిపి ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం జీవో నెంబర్ 512 కాపీని తగలబెట్టి నిరసన వ్యక్తం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో తొమ్మిదో డివిజన్ ఎలక్షన్ ఇంచార్జి పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో క్లస్టర్ ఇంచార్జి కపిల్ భాష,9వ డివిజన్ అధ్యక్షుడు వడ్లమూడి మునీంద్ర మరియు తొమ్మిదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ ముఖ్యనాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో సామాన్య ప్రజల ఆస్తుల్ని దోచుకోవడానికి ఈ సైకో జగన్ రెడ్డి బ్యాంకుల్లో ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి మన జీవితాలు నాశనం చేయడానికి పూనుకున్నాడు ఈ ప్రజాస్వామ్యంలో ఈ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సామాన్యులకు తెలుగుదేశం పార్టీ అండగా నిలబడుతుంది, ఏది ఏమైనా రేపు మే 13 తారీకున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ మేల్కొని ఈ అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి ప్రతి ఒక్క ఓటరు మహాశయులారా మీయొక్క అమూల్యమైన ఓటును ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన దామచర్ల జనార్ధన్ కి *మూడవ* నంబరు పైన సైకిల్ గుర్తుకు ఒక ఓటు వేసి అదేవిధంగా మన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు *మాగుంట శ్రీనివాస్ రెడ్డికి నాలుగవ* నెంబరు పైన సైకిల్ గుర్తుకు ఒక ఓటు వేసి ఇరువురిని గెలిపించవలసిందిగా కోరుతూ 9వ డివిజన్ తెలుగుదేశం పార్టీ తరఫున ఓటర్లను కోరారు.

7k network
Recent Posts

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం