నేడు ప్రధాని నామినేషన్..”మూడ్ ఆఫ్ ఏపీ” :పార్టీలకు పెరిగిన బీపీ !..ఈసారి బాబు గెలుపు ఖాయమేనా! ..జగన్ గెలుపు ఖాయం అంటున్న ఐప్యాక్..”అల్లు అర్జున్” పై నాగబాబు ట్వీట్స్ వైరల్  

నేడు ప్రధాని మోదీ నామినేషన్..

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు..ఈసారి ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేసినా పబ్లిసిటీ బాగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. బహుశా అలా చెయ్యడం వల్ల భారీ విజయం దక్కుతుందని భావిస్తున్నారేమో. ఈ కారణంగానే నామినేషన్ ప్రక్రియను కూడా హై రేంజ్‌లో జరుపుతుండటం హాట్ టాపిక్ అయ్యింది.

ఎప్పుడైనా సరే నామినేషన్ ప్రక్రియను సింపుల్‌గా చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరుతూ ఉంటుంది. కానీ రాజకీయ నేతలు అలా చెయ్యరు. భారీ హంగామా చేస్తారు. తమతోపాటూ.. పెద్ద ర్యాలీ నిర్వహిస్తారు. ఇందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మినహాయింపు కాదు అని నిరూపిస్తున్నారు. ఇవాళ మరోసారి వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ వేస్తున్న ప్రధాని మోదీ.. ఈ కార్యక్రమంలో 12 బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనేలా ప్లాన్ చేశారు. అలాగే.. ఏపీ నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరవ్వబోతున్నారు.ఈసారి ఎన్నికల్లో ఎన్డీయేకి మ్యాజిక్ మార్క్ రావడమే కష్టం అని ఇండియా కూటమితోపాటూ.. కొన్ని ప్రతిపక్షాలు అంటుంటే.. సొంతంగా 370, కూటమితో కలిసి 400 సీట్లు సాధించాలనుకుంటున్న బీజేపీ.. భారీ ప్రచారంతో ప్రతిపక్షాలకు షాక్ ఇస్తోంది. నిన్న వారణాసిలో భారీ రోడ్ షో నిర్వహించిన మోదీ.. దాని తోనే.. తాను ఏం చేసినా భారీగానే ఉంటుందని మరోసారి ప్రతిపక్షాలకు సంకేతం ఇచ్చారు. ఇవాళ నామినేషన్ సందర్భంగా.. భారీ రోడ్ షో, ప్రచార సభ జరగనున్నాయి. అందుకే.. ఈ కార్యక్రమ ఏర్పాట్లను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యవేక్షిస్తున్నారు.

వారణాసిలో ప్రధాని నామినేషన్ దాఖలుకు ముందు కాశీ విశ్వనాథుడు, కాలభైరవ ఆలయాలను దర్శించుకునే చాన్స్ ఉంది. బనారస్ హిందూ వర్సిటీ నుంచి కాశీ విశ్వనాథుడి ఆలయం వరకు 5 కిలోమీటర్ల మార్గంలో 4 గంటలపాటు రోడ్ షో నిర్వహిస్తారు. అలాగే ఇవాళ ఎన్డీఏ నేతల సమావేశంలో కూడా మోదీ పాల్గొంటారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ వారణాసికి వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోది వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ వేస్తున్న సందర్భంగా వీరిద్దరికీ ఆయన నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ నామినేషన్ కార్యక్రమానికి ఎన్డీయే కూటమిలోని ప్రధాన పార్టీల నేతలకూ కూడా మోదీ ఆహ్వానం పలికారు.ఏపీలో కూటమి గెలుపు ఖాయం అని బీజేపీ భావిస్తోంది. ఈ కారణంగానే.. కూటమిలో భాగమైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ సేవల్ని దేశవ్యాప్తంగా వినియోగించుకునేందుకు బీజేపీ సిద్ధపడింది. ఇలా వీరిద్దరికీ ఆహ్వానం పపడం ద్వారా.. ఏపీలో వైసీపీకి వ్యతిరేక సంకేతాలు కూడా పంపినట్లైంది. అందువల్లే మోదీ నామినేషన్ అంశం ఇప్పుడు ఏపీలో కూడా హాట్ టాపిక్ అవుతోంది.ఇవాళ బీజేపీ బహిరంగ సభలో పాల్గొని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత ఇవాళ రాత్రికి చంద్రబాబు తిరిగి ఉండవల్లికి రానున్నారు.వారణాసి అనేది బీజేపీకీ, మోదీకీ కంచుకోటగా మారంది. మోదీ ఇప్పటికే రెండుసార్లు అంటే.. 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో వారణాసి నుంచే గెలిచారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ 6,74,664 ఓట్లతో గెలిచి 63.6 శాతం ఓట్లను సాధించారు. 2014లో మోదీ గుజరాత్‌లోని వడోదర, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి.. రెండు లోక్‌సభ స్థానాలకూ పోటీ చేశారు. యూపీలో బీజేపీని బలపరిచేందుకూ.. హిందీ బెల్టులో తన స్థాయిని పెంచుకునేందుకూ మోదీ.. వారణాసిని ఎంచుకున్నారు. అక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అందుకే ఈ నియోజకవర్గం మోదీ అడ్డాగా మారింది. మరోసారి ఆయనకు భారీ మెజార్టీ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

👉మూడ్ ఆఫ్ ఏపీ : పార్టీలకు పెరిగిన బీపీ !

అయితే పల్లె ఓటర్లలో ఒక రకమైన లక్ష్యం ఉందని పట్టణ ఓటర్లలో మరో రకమైన లక్ష్యం ఉందని ప్రచారం సాగుతోంది. ఏపీలో బ్రహ్మాండమైన ఓటింగ్ జరిగింది. పల్లె పట్నం తేడా లేకుండా ఈసారి జనాలు విరగబడి ఓటేశారు.అయితే పల్లె ఓటర్లలో ఒక రకమైన లక్ష్యం ఉందని పట్టణ ఓటర్లలో మరో రకమైన లక్ష్యం ఉందని ప్రచారం సాగుతోంది.ఇద్దరిదీ భవిష్యత్తుకి సంబంధించిన బెంగగానే చూస్తున్నారు. ఈ ప్రభుత్వం పోతేనే భవిష్యత్తు అని ఒక సెక్షన్ అలాగే ప్రభుత్వం ఉంటేనే ఫ్యూచర్ అని మరో సెక్షన్ బలంగా బటన్ నొక్కిన నేపధ్యాన్ని స్థూలంగా అంతా చూస్తున్నారు. ఈ మధ్యలో ఇంకా చాలా రకాలైన కుల సమీకరణలు కూడా ఉన్నాయని చెప్పాలి.ఏది ఎలా చూసుకున్నా ఏపీ ఓటర్ ఓటెత్తాడు. అది కూడా జోరుగానే. దాంతో ఈ పెరిగిన ఓటింగ్ తమకు లాభమా లేక నష్టమా అన్నదే అధికార వైసీపీతో పాటు విపక్ష టీడీపీ కూటమిలో చర్చోపచర్చగా సాగుతోంది.మరో వైపు చూస్తే ఏపీలో అధికార పక్షానికి వ్యతిరేకత అయితే పూర్తి స్థాయిలో లేదు.అలాగే కొన్ని విషయాలలో అనుకూలత ఉంది. అదే విధంగా విపక్ష కూటమికి అనుకూలత కొన్ని అంశాలలో ఉంది. ఇలా ఒక సంక్లిష్టమైన వాతావరణంలో జరిగిన ఎన్నికలుగా 2024 ఏపీ అసెంబ్లీ పోలింగ్ ని చూసి తీరాలని అంటున్నారు.ఏపీలో రెండు ప్రభుత్వాలను జనాలు చూసి ఇస్తున్న అచ్చమైన స్వచ్చమైన తీర్పుగా కూడా దీనిని భావించాలని అంటున్నారు. అయిదేళ్ల జగన్ పాలన అలాగే విభజన ఏపీలో అయిదేళ్ళ చంద్రబాబు పాలన చూసారు. ఈ రోజున వారి మ్యానిఫేస్టో కంటే కూడా వారి పాలనలో వారు ఇచ్చే ప్రాధాన్యతలు వారికి వేటి మీద ఫోకస్ ఉంది. వేటి మీద లేదు అన్న అంశాలు ఈ పదేళ్ళలో జనాలకు క్షుణ్ణంగా తెలుసు.ఇక తమకు ప్రభుత్వం నుంచి ఏమీ కావాలో బాగా తెలుసు. అలాగే ఎవరు అధికారంలో ఉంటే ఏపీ ప్రగతి గతిన సాగుతుంది అన్నది కూడా తెలుసు.ఇలా అన్ని రకాలుగా విశ్లేషించుకుని మరీ ఓటెత్తినట్లుగానే ఈ భారీ పోలింగ్ ని చూడాలి. అటు వైసీపీ ఇటు టీడీపీ అటు జగన్ ఇటు చంద్రబాబు ఈ ఇద్దరూ కూడా జనాలకు తెలిసిన వారు. వారి రాజకీయ జీవితం కూడా తెరచిన పుస్తకం.వారి పాలన కూడా చూసి ఉన్నారు.ఇలా తీసుకుంటే కనుక జనాలకు జవాబు చెప్పడం చాలా సులువు.అలాగే తమదైన తీర్పు ఇవ్వడం కూడా సులువు. అదే సమయంలో ఈ ఇద్దరి విషయంలో కచ్చితమైన అభిప్రాయానికి రావడం కూడా కొంత ఇబ్బంది.ఇలా అనేక శషబిషలకు అవకాశం ఉన్న ఈ ఎన్నికలలో ఓటర్లు మాత్రం సామాజిక పరంగా ప్రాంతీయ పరంగా అలాగే అర్బన్ రూరల్ అన్న దాని పరంగా చీలిపోయారు అని స్పష్టంగా అర్ధం అవుతోంది. దాంతో ఈసారి జరిగిన భారీ పోలింగ్ ఎవరికి అనుకూలం ఎవరికి ప్రతికూలం అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉందని అంటున్నారు. ఎవరెన్ని విశ్లేషించినా ఓటర్ మాత్రం గుంభనంగా ఉన్నాడు. తన బటన్ తాను నొక్కేసి వెళ్ళిపోయాడు.ఆ ఓటు మాదే అంటే మాదే అని రెండు పార్టీలు అనుకోవచ్చు.కానీ ఎవరికి నిజంగా పడింది అన్నది మాత్రం జూన్ 4న తెలుస్తుంది.అంతవరకూ పార్టీలకు హై బీపీ తప్పదని అంటున్నారు.

👉ఈసారి బాబు  గెలుపు ఖాయమేనా!!!..ఏపీలో ఈరోజు జరిగిన ఎన్నికలు కొన్ని చోట్ల ప్రశాంతంగా, మరికొన్ని చోట్ల ఘర్షణల నడుమ ముగిసింది. ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి కొద్దిచోట్ల పోలింగ్ పూర్తి కాగా.. మరికొన్ని చోట్ల క్యూలో కొంతమంది నిలబడి ఉన్నవారిని సమయం దాటిపోయినా.. ఓటింగ్ కి అనుమతినిచ్చారు. అయితే పలు చోట్ల వైసీపీ వర్గీయులు, టీడీపీ వర్గీయుల మద్యన వాదనలు కాదు తోపులాటలు, రాళ్ళు విసురుకోవడం లాంటి చెదురు మదురు సంఘటనలు జరిగాయి. ఇక ఈ రోజు పోలింగ్ వేవ్ మాములుగా లేదు. ఏపీలో ఎన్నడూ లేని విధంగా మహిళలు, ముసలి వాళ్ళు, యూత్ కూడా ఓటెయ్యడానికి ఉత్సాహం చూపించారు. చాలామేరకు ఈసారి బాబు గారి గెలుపు ఖాయమనే మాట వినిపిస్తోంది. మహిళలు, ఇంకా వృద్దులు చంద్రబాబు పథకాలకు పడిపోయి ఓటు వేసారని అంటున్నారు.👉 జగన్ పథకాల్లో కొత్తదనంలేదు, కొద్దిగా పెంచి చెప్పడమే కాకుండా ఈ ఐదేళ్ళలో పెన్షన్ కొద్ధి కొద్దిగా పెంచుకుంటూ రావడం, సంక్షేమ పథకాల్నిపట్టించుకుని రోడ్లు వగైరా అభివృద్ధిని జగన్ నిర్లక్ష్యం చేసిన కారణం గానే ఈసారి జాగన్ కి దెబ్బపడుద్ది అని ఓటు వేసేందుకు వచ్చిన పలువురు మాట్లాడుకుంటున్నారు. చదువుకున్న వారు, రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకునే వారు జగన్ కి ఓటెయ్యలేదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఇక జగన్ ఓట్ బ్యాంకు కింద ఎమన్నా పేద ప్రజల ఓట్లు పడినా.. టీడీపీ కూటమి 100 నుంచి 110 స్థానాలైతే పక్కాగా కొడుతోంది అంటున్నారు. చూద్దాం జూన్ 4 న ఏపీలో ఎలాంటి రిజల్ట్ రాబోతుందో అనేది.

👉 అల్లు అర్జున్ పై నాగబాబు ట్వీట్స్ వైరల్!!!

ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు మెగా ఫ్యామిలీలో మరొకసారి చిచ్చుపెట్టేలా కనిపించాయి. గతంలో కూడా ఈ గొడవలు ఉన్నప్పటికీ అవి చాలా స్పష్టంగా కనిపించలేదు.. ముఖ్యంగా అల్లు వారి కుటుంబానికి మెగా కుటుంబానికి మధ్య పొలిటికల్ గొడవలు మరింత రాజుకుంటున్నాయి. తాజాగా నాగబాబు చేసిన ఒక ట్వీట్ అల్లు అర్జున్ అభిమానులను మరింత రెచగొట్టేలా కనిపిస్తోంది. అల్లు అర్జున్ పేరు ఎత్తకుండా నాగబాబు ఒక ఘాటు ట్వీట్ ను సైతం తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ట్విట్ కాస్త వైరల్ గా మారుతోంది.👉ఈ ట్విట్ లో ఇలా రాసుకోస్తు..”మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడు అయినా పరాయి వాడే.. మాతో నిలబడే వాడు పరాయివాడైన మావాడే.. అంటూ అల్లు అర్జున్ పేరత్తకుండా ఇలా తన పైన ట్వీట్ చేశారని తెలుస్తోంది. నాగబాబు పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సందర్భంగా మెగా కుటుంబం అందరూ కూడా ఆయనకు అండగా నిలిచేందుకు సహాయపడ్డారు.. చాలామంది పిఠాపురం వెళ్లి కూడా ప్రచారం చేయడం జరిగింది. చిరంజీవి కూడా వీడియోతో తన సందేశాన్ని ఇచ్చారు. రామ్ చరణ్ కూడా చివరిలో పిఠాపురానికి వెళ్లి ప్రచారం చేశారు.👉అల్లు అర్జున్ మాత్రం తన స్నేహితుడైన వైసిపి అభ్యర్థి కోసం నంద్యాలకు వెళ్లి రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. తన స్నేహితుడిని గెలిపించాలని కూడా అల్లు అర్జున్ పిలుపునిచ్చారు. దీంతో అల్లు అర్జున్ వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని విషయం జన సైనికులకు చాలా కోపాన్ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు పోలింగ్ పూర్తి అయిన తర్వాత నాగబాబు వక్రబుద్ధి బయటపడింది.. ఇలా తెలివిగా ట్వీట్ చేశారు. ముందుగానే చేస్తే కచ్చితంగా బన్నీ ఫ్యాన్స్ కి కోపం వస్తుంది దీంతో కూటమికి షాక్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తెలిసి పోలింగ్ అయిపోయిన వెంటనే ఇలా తన వక్ర బుద్ధితో ఈ ట్విట్ చేశారు నాగబాబు. ప్రస్తుతం మెగా వర్సెస్ మధ్య ఒక వార్ మొదలయ్యింది.

👉 జగన్ గెలుపు ఖాయం అంటున్న ఐ ప్యాక్ డైరెక్టర్ ..

ఏపీ లో ప్రస్తుతం అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలవడానికి చాలానే ప్రయత్నాలను చేశారు. సంక్షేమ పథకాలు అందించి, అవి అందించినట్లు, తాను తప్ప ఇన్ని సంక్షేమ పథకాలు ఎవరూ అందించలేరని ప్రజలు అర్థం చేసుకునేలా ఎన్నికల ప్రచారాలు నిర్వహించారు. నిజానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) నాయకత్వం వహించింది.👉అయితే తాజాగా ఐ-ప్యాక్ డైరెక్టర్, సహ వ్యవస్థాపకుడు రిషి రాజ్ సింగ్ తాజాగా మాట్లాడుతూ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారనే బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఆదివారం లోకల్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ 34 ఏళ్ల ఐఐటీయన్, జగన్ గెలుపు ఫార్ములా చాలా సింపుల్, అది ఏంటంటే ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడమే అని పేర్కొన్నారు. ఏపీ ప్రజలు విశ్వసనీయతను నమ్మి సరైన నిర్ణయాన్ని ఓటు ద్వారా తెలియజేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.👉భూ హక్కు చట్టంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాలను వైఎస్సార్‌సీపీ పట్టించుకోవడంలేదని స్పష్టం చేశారు. “నిజం పక్కింటికి తెలిసేలోపు అబద్ధం అనేది ఊరంతా తిరిగేసి వస్తుందనే సామెత ప్రకారం భూ హక్కు చట్టంపై అబద్ధం అనేది రాష్ట్రం అంతటా వ్యాప్తి చెందిందని అన్నారు. ప్రజలు ఏది నిజమో ఏది అబద్దమో గుర్తించాలని కోరారు. టీడీపీ ఈ ఎన్నికల తర్వాత ఏమవుతుందో కూడా ఊహించడం కష్టమని ఆయన వ్యాఖ్యానించారు. లోకేష్ సమర్థ నాయకుడు కాదని, పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా సేమ్ అలానే ఉంటుందని, అందువల్ల వారికి ఇదే లాస్ట్ ఎన్నిక కావచ్చు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.👉జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనను తాను కమ్యూనిటీ లీడర్గా అభివర్ణించుకుంటూ ప్రజలకు దూరం అవుతున్నారని చెప్పారు.ఒక కమ్యూనిటీ లీడర్ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవడం కష్టమని తన అభిప్రాయం వ్యక్తపరిచారు. ఇకపోతే ఈసారి జగన్ ఒంటరిగా, ఎవరి తోడు లేకుండా సింగల్ గా పోటీ చేస్తున్నారని, అది ఒక తెలివైన నిర్ణయం అని పేర్కొన్నారు.

7k network
Recent Posts

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం