మోడీకి సరైన ప్రశ్న సంధించిన ప్రియాంకా!!!..బిగ్ స్టేట్ లో బీజేపీకి షాక్ !?..సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు: డి.ఎస్.పి బాల సుందర రావు..ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి ఒకరి పరిస్థితి విషమం..

👉మోడీకి సరైన ప్రశ్న సంధించిన ప్రియాంకా !

బీజేపీ నేతలకు సెటైరికల్ గా కానీ డైరెక్ట్ గా కానీ ధీటైన జవాబు ఇవ్వాలంటే ప్రియాంకా గాంధీ ఉండాల్సిందే అన్న మాట కాంగ్రెస్ తో పాటు బయట పక్షాలలోనూ ఉంది. గాంధీ కుటుంబంలో నవతరం వారసులుగా రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ ఉన్నారు.ఈ ఇద్దరిలో ప్రియాంకా గాంధీ దూకుడుగా రాజకీయాలు చేస్తారు అని పేరు. ఆమె తన నాన్నమ్మ ఇందిరాగాంధీని పోలి ఉంటారు. అంతే కాదు ఆమె ప్రసంగాలు సైతం పదును తేరి ఉంటాయి. బీజేపీ నేతలకు సెటైరికల్ గా కానీ డైరెక్ట్ గా కానీ ధీటైన జవాబు ఇవ్వాలంటే ప్రియాంకా గాంధీ ఉండాల్సిందే అన్న మాట కాంగ్రెస్ తో పాటు బయట పక్షాలలోనూ ఉంది. ఇదిలా ఉంటే తన రాజకీయ జీవితం గురించి భవిష్యత్తు గురించి కాంగ్రెస్ పార్టీ గురించి తాజాగా ప్రియాంకా గాంధీ ఒక ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ మీద సునిశిత విమర్శలు చేశారు. అమేధీ రాయబరేలీ నుంచి గాంధీ కుటుంబం పారిపోతోంది అన్న ప్రధాని విమర్శలకు ఆమె జవాబు చెబుతూ 2014 లో గుజరాత్ లోని వడోదరా నుంచి పోటీ చేసి గెలిచిన మోడీ ఆ తరువాత ఆ సీటుని ఎందుకు వదిలేశారని ప్రియాంకా గాంధీ సూటిగానే ప్రశ్నించారు. ఆ సీటులో గెలవమని భయమా లేక పారిపోవడం గానే దాన్ని చూడాలా అని ఆమె మోడీని ప్రశ్నించారు. అమేధీ రాయబరేలీ రెండు సీట్లతో గాంధీ కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉందని ఆమె నొక్కి చెప్పారు. ఈ సీట్లను తమ కుటుంబం ఎపుడూ వదులుకోదు ఎక్కడికీ పారిపోదు అని ఆమె అన్నారు. తాము ఎప్పటికీ కంటికి రెప్పలా ఈ సీట్లను కాపాడుకుంటామని ఆమె చెప్పారు. తాను ఈసారి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు అన్న దానికి ఆమె వివరణ ఇచ్చారు. పోటీ చేస్తే ఎన్నికల్లో ప్రచారం చేయడానికి పూర్తిగా సమయం సరిపోదు. నియోజకవర్గానికే సమయం కేటాయించాల్సి ఉంటుంది. అది బీజేపీకే రాజకీయంగా లబ్దిని చేకూరుస్తుంది. అందుకే తాను ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్నానని ఈసారి కాంగ్రెస్ ప్రచారానికే పరిమితం అయ్యానని చెప్పారు. భవిష్యత్తులో తాను పోటీ చేస్తానా లేదా అన్నది పార్టీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని ఆమె అన్నారు. పార్టీ ఆదేశిస్తే ప్రజలు అలా కోరుకుంటే తాను తప్పకుండా పోటీ చేస్తాను అని ఆమె అన్నారు.దీనిని బట్టి ప్రియాంకా గాంధీ రానున్న కాలంలో ఎంపీగా చట్టసభలలో అడుగుపెడతానని చెప్పకనే చెప్పేశారన్న మాట. ఈసారి మాత్రం దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రచారం చేయడం మీదనే తన దృష్టి ఉందని ఆమె అన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలని ఆమె అన్నారు.మొత్తం మీద చూస్తే ప్రియాంకా గాంధీ పూర్తి క్లారిటీతో ఉన్నారని అర్థం అవుతోంది.అదే సమయంలో ఆమె తన ఎన్నికల రాజకీయానికి తెర తీసేది ఎపుడు అన్నది కూడా ఆమెకే తెలుసు అంటున్నారు.

👉 బిగ్ స్టేట్ లో బీజేపీకి షాక్ !?

2019లో అయితే ఏకంగా 70 కి పైగా సీట్లు ఆ పార్టీ సొంతం అయ్యాయి.దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం. దేశంలో అధికారం ఎవరు అందుకోవాలన్నా అతి పెద్ద నంబర్ తో ఎంపీలను ఇచ్చే రాష్ట్రం అయిన ఉత్తర ప్రదేశ్ లో బీజేపీకి బిగ్ షాక్ ఈసారి తగులుతుందా అంటే విశ్లేషకులు అవును అనే అంటున్నారు. యూపీలో 80 దాకా ఎంపీ సీట్లు ఉన్నాయి. 2014, 2019లలో బీజేపీ అత్యధిక శాతం సీట్లు ఇక్కడే గెలుచుకుంది. 2019లో అయితే ఏకంగా 70 కి పైగా సీట్లు ఆ పార్టీ సొంతం అయ్యాయి.

అదే కేంద్రంలో బీజేపీకి బలం అయింది. అలాంటి యూపీ బీజేపీకి ఇపుడు రివర్స్ లో షాక్ ఇస్తే మాత్రం అది చాలా రాజకీయ నష్టాన్ని కలిగిస్తుంది అని అంతా అంటున్నారు. బీజేపీకి కీలకమైన రాష్ట్రంగా ఉన్న యూపీలో ఈసారి పదిహేను సీట్లలో తగ్గిపోతాయని అని అంటున్నారు.

👉ప్రొఫేసర్ నాగేశ్వర్ దీని మీద ఒక యూట్యూబ్ చానల్ లో విశ్లేషణ చేస్తూ బీజేపీ మీద స్పష్టంగా అసంతృప్తి బీజేపీ మీద యూపీ ప్రజలలో కనిపిస్తోంది అని అన్నారు. యోగీ ప్రభుత్వం వచ్చాక పశు వధ శాలను నిషేధించారు. ఉపయోగపడలేని పశువులు ఇతరత్రా వంటి వాటిని అమ్ముకోవడానికి వారికి ఇబ్బందికరంగా ఉంది.

ప్రధాని కిసాన్ యోజన సాయం ఇస్తున్నా దాని కంటే అనేక రెట్లు ఈ పశువుల పోషణకు అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంది అని అంటున్నారు. దాంతో వివిధ సామాజిక వర్గాలకు చెందిన రైతులు అంతా బీజేపీని వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. చెరుకు రైతులకు మద్దతు ధర పెరగకపోవడంతో కూడా అసంతృప్తి ఎక్కువగా ఉందని అన్నారు.

ఇక వివిధ సామాజిక వర్గాలు నాన్ యాదవ వర్గాలు జాట్ సామాజిక వర్గాలు కూడా బీజేపీని వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. రాజ్ పుట్లు కూడా బీజేపీని వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు.గుజరాత్ బీజేపీ సీఎం రూపాలా రాజు పుట్లు మీద చేసిన వ్యాఖ్యలు అలగే యోగీ ఆదిత్యనాధ్ ని దించుతారన్న ప్రచారంతో కూడా వారు అంతా బీజేపీని వ్యతిరేకిస్తున్నారు అన్నది ఆయన విశ్లేషణగా ఉంది.

👉రాజ్ పుట్లు మీటింగులు పెట్టి మరీ బీజేపీని గట్టిగా వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. జాట్లలో కూడా బీజేపీ మీద అధిక శాతం వ్యతిరేకత పెంచుతున్నారని అంటున్నారు. అలాగే అనేక ఉత్తరాది రాష్ట్రాలలో యువత నిరుద్యోగం విషయంలో బీజేపీ ప్రభుత్వం మీద మండి పోతున్నారని అంటున్నారు.రైతాంగ ఉద్యమాన్ని జాట్లు నడిపారు.ఆ ఉద్యమం ద్వారా వ్యతిరేకతను బీజేపీ మూటకట్టుకుందని అంటున్నారు.బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు లేకుండా చేస్తారు అని పెద్ద ఎత్తున చేస్తున్న విపక్షాల ప్రచారం నేపధ్యంలో అది తీవ్ర స్థాయి వ్యతిరేకతను పెంచుతోంది అని అంటున్నారు.

దళిత్ జాతోలు యాదవ్ లు అంతా యూపీలో ఇపుడు ఏకీకృతం అవుతున్నారని అంటున్నారు. ఎస్పీ యూపీలో ఇచ్చిన పిలుపు కూడా బీజేపీకి సెగ తగిలేలా చేస్తోంది.ఎస్పీ సోషల్ ఇంజనీరింగ్ తో బీజేపీని దెబ్బ తీసే పని కూడా జరుగుతోంది.ఆ విధంగా కూడా యూపీలో కలవరపెడుతోందని అంటున్నారు.అయితే ఇన్ని జరిగినా కూడా బీజేపీ బాగానే సీట్లు తెచ్చుకోవచ్చు అని అంటున్నారు. బీజేపీకి ఉన్న ఆర్గనైజింగ్ కెపాసిటీ అలాగే మోడీ ఇమేజ్, యోగీ పాలన పట్ల ఉన్న వచ్చే సానుకూలత, అలాగే రామ మందిరం ఇష్యూ వల్ల సానుకూలత ఉంది. మజ్లిస్ వంటి పార్టీలు విడిగా పోటీ చేయడం కూడా బీజేపీకి లాభం.అయితే ఇపుడు వస్తున్న విశ్లేషణలు చూస్తే కనుక బీజేపీ పది నుంచి పదిహేను సీట్లు పైన చెప్పిన కారణాల వల్ల కోల్పోతుంది అన్నది ప్రొఫేసర్ చెబుతున్న విశ్లేషణగా ఉంది. ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.

👉 ఘోర రోడ్డు ప్రమాదం..

ఇద్దరు మృతి ఒకరి పరిస్థితి విషమం..శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కనిగిరి నుండి వెలిగండ్ల మీదుగా చెన్నై వెళ్తున్న ఆర్టీసీ బస్సు బుచ్చి మండలం దామరమడుగు వద్ద లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెలిగండ్ల మండలానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు వెలిగండ్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన వేమవరపు మరియమ్మ(46) కంకణంపాడు గ్రామానికి చెందిన వేమవరపు డేవిడ్ (50)గా గుర్తించారు.వివరాలు తెలియాల్సి ఉంది.

👉సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు: డి.ఎస్.పి బాల సుందర రావు*

ప్రకాశం జిల్లా కొమరోలు పోలీస్ స్టేషన్ లో శనివారం డీఎస్పీ బాలసుందర రావు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఓట్లు లెక్కింపు సందర్భంగా ప్రజలందరూ సమన్వయం పాటిస్తూ పోలీసులకు సహకరించాలని డి.ఎస్.పి బాల సుందర రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

7k network
Recent Posts

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం