ప్రకృతి వ్యవసాయం లో పనిచేసే ఉద్యోగుల 16 నెలల😲పెండింగ్ వేతనాలు ఇవ్వాలి..కేరళలో నిఫా వైరస్ కలకలం..సీఎం చంద్రబాబు అధ్యక్షతన కూటమినేతల సమావేశం..వినుకొండలో జరిగింది రాజకీయ మర్డర్ కాదు-షర్మిల..టీడీపీ పాలనపై జగన్‌ ట్వీట్‌..దివ్యాంగబాలునికి శ్రవణ యంత్రం అందజేసిన ప్రకాశం జిల్లా కలెక్టర్. పార్లమెంటులో ఎంపీ మాగుంట ప్రశ్నలు..ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేసిన మార్కాపురం డి.ఎస్.పి…

👉ప్రకృతి వ్యవసాయం లో పనిచేసే ఉద్యోగుల 16 నెలల 😲 పెండింగ్ వేతనాలు ఇవ్వాలి.. సిఐటియు డిమాండ్..ప్రకృతి వ్యవసాయంలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలు 16 నెలలుగా పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరుతూ నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుండి ప్రకృతి వ్యవసాయ నంద్యాల జిల్లా ప్రధాన కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యూనియన్ గౌరవాధ్యక్షులు ఏ నాగరాజు సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరెడ్డి ,జిల్లా కార్యదర్శి రామాంజనేయరెడ్డి,జిల్లా ఉపాధ్యక్షురాలు మున్ని సుబ్బలక్ష్మి, రమాదేవి, కోశాధికారి లత, రాజశేఖర్ శ్రీనివాసులు, సుబ్బరాయుడు, అయ్యస్వాములు, ప్రభావతి వీరితో పాటు 500 మంది జిల్లా నలుమూలల నుండి ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులు పాల్గొనడం జరిగింది. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిపిఎమ్ఓ కి అందజేయడం జరిగింది.*

*అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రపంచమంతా ప్రకృతి వైపు చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి ఉద్యోగుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని ఒకవైపు ప్రకృతి వ్యవసాయంలో ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో అవార్డు తీసుకొని దానికోసం కృషిచేసిన ప్రకృతి ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం చేయడం తగదని ప్రకృతి వ్యవసాయంలో ఎలాంటి హాని జరిగినా ప్రమాద బీమా సౌకర్యం లేకపోవడం ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పిఎఫ్, ఈఎస్ఐ బెనిఫిట్స్ సౌకర్యాలు కల్పించాలని అన్నారు నంద్యాల జిల్లాలో 28 వేల ఎకరాలకు పైగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ రాయలసీమ జిల్లాలో నంద్యాలకు ప్రత్యేక స్థానం వచ్చేలా కృషి జరిగిందని అటువంటి కృషి చేసిన ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల పట్ల వారి కుటుంబాల పట్ల నిర్లక్ష్యం తగదని వెంటనే 16 నెలల పెండింగ్ వేతనాలను ఇవ్వాలని లేనిపక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు ఈ నెల 29న చలో గుంటూరు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి తీరుతామని హెచ్చరించారు.

👉కేరళలో నిఫా వైరస్ కలకలం… రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం..కేరళలో నిఫా వైరస్ కలకలం..వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిన గంటలోనే ఒక బాలుడు మృతి..కేరళకు ప్రత్యేక వైద్యబృందాన్ని పంపిన కేంద్రం..ప్రభావిత ప్రాంతాల్లో క్వారంటైన్ ఏర్పాట్లు చేయాలంటూ కేంద్రం ఆదేశాలు..ప్రమాదకరమైన నిఫా వైరస్ భారత్ లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే కేరళలో ఓ బాలుడు నిఫా వైరస్ సోకి మృత్యువాత పడ్డాడు. వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిన గంటలోనే బాలుడు మృతి చెందడంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి..ఇది ప్రాణాంతకమైన వైరస్ కావడంతో కేంద్రం అప్రమత్తమైంది. నిఫా వైరస్ వ్యాప్తి పట్ల జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. నిఫా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్న చోట క్వారంటైన్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. నిఫా వైరస్ తొలిసారిగా 1999లో వెలుగులోకి వచ్చింది. అయితే దీనికి వ్యాక్సిన్ లేదు. ఇది జంతువుల ద్వారా మనుషులకు సోకుతుంది. 2018లో కేరళలో ఈ వైరస్ బారినపడి 27 మంది మృతి చెందారు. తాజాగా, కేరళలో మరోమారు నిఫా కలకలం రేగడంతో, కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక వైద్య బృందాన్ని కేరళకు పంపింది.

👉అసెంబ్లీ కమిటీ హాల్‍లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కూటమి నేతల సమావేశం..! అమరావతి..దాదాపు గంటన్నరపాటు సాగిన కూటమి నేతల సమావేశం…ఇసుక, శాంతిభద్రతలపై ప్రధానంగా చర్చించిన చంద్రబాబు…తొలిరోజు సభలో జగన్ ప్రవర్తన అసహ్యం కలిగించిందన్న పవన్ కల్యాణ్ …అక్రమ కేసులు ఎదుర్కొని 53 రోజులు అన్యాయంగా జైల్లో ఉన్నా… కక్షసాధింపు చర్యలకు దిగాలంటే ముందుండాల్సింది నేనే…ప్రజలు మనల్ని కక్షసాధింపు కోసం గెలిపించలేదని గుర్తుపెట్టుకోండి…శాంతి భద్రలకు ఎవరు విఘాతం కల్పించినా ఉపేక్షించేది లేదు..తప్పు చేసిన వారిని చట్టప్రకారమే కఠినంగా శిక్షిద్దాం.. వివేకా హత్య కేసులో నడిపిన నాటకాన్నే మళ్లీ మొదలు పెట్టారు..వినుకొండ జిలానీ-రషీద్ వ్యవహారంలో అదే కుట్ర చూస్తున్నారు..ఇసుక జోలికివెళ్లొద్దని ఎమ్మెల్యేలకు స్పష్టం చేసిన చంద్రబాబు.. ఇసుక దరల విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయన్న పలువురు ఎమ్మెల్యేలు..మూడు పార్టీల మధ్య సమన్వయం అంశాన్ని ప్రస్తావించిన నాదెండ్ల మనోహర్..చంద్రబాబు నిర్ణయాన్ని తాను తన పార్టీ ఎమ్మెల్యేలు మద్దతిస్తారన్న పవన్.. ఉచిత ఇసుక విధానాన్ని మరింత పారదర్శకంగా అమలు చేస్తామన్నారు.

👉 దివ్యాంగ బాలునికి శ్రవణ యంత్రమును అందజేసిన… జిల్లా కలెక్టర్..ప్రకాశం జిల్లా ఒంగోలు సోమవారం గ్రీవెన్స్ హాలులో జరిగిన కార్యక్రమంలో దివ్యాంగ బాలునికి శ్రవణయంత్రమును ప్రకాశం జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా అందజేశారు. మద్దిపాడు మండలం కీర్తిపాడుకు చెందిన మొండ్రు హరినాథ్ పద్మల కుమారుడు స్టీవెన్ (13)పుట్టుకతో వినపడని సమస్యతో బాధపడుతున్నాడు.ఈ సమస్య దైనందిన జీవితంతో పాటు విద్యాభ్యాసానికి తీవ్ర ఇబ్బంది కలిగిస్తుందని స్టీవెన్ తల్లి పద్మావతి గ్రీవెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ కి విన్నవించుకున్నారు. ఇందుకు స్పందించిన జాయింట్ కలెక్టర్ వారు దరఖాస్తుదారునికి శ్రవణ యంత్రం మంజూరు చేయాల్సిందిగా దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. దీనితో ఆ శాఖ సహాయ సంచాలకులు జి అర్చన ఆధ్వర్యంలో సిబ్బంది శ్రవణ యంత్రమును సమకూర్చారు. ఈ శ్రవణ యంత్రమును కలెక్టర్ తమిం అన్సారియా వారు, వారి చేతుల మీదుగా గ్రీవెన్స్ హాల్లో బాలునికి అందజేశారు.

👉వినుకొండలో జరిగింది రాజకీయ మర్డర్ కాదు.. జగన్ రెడ్డి పార్టీ వాళ్ళే, ఇద్దరికీ ఇద్దరు నరుక్కున్నారు.. నేను ఎంక్వయిరీ చేశా అంటున్న షర్మిల..జగన్ రెడ్డి నాటకం ఆడుతున్నాడు అని అంటున్న చెల్లి షర్మిల…

👉 టీడీపీ ప్రభుత్వ పాలనపై జగన్‌ ట్వీట్‌..50 రోజుల్లో టీడీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం..హామీలు అమలు చేయలేక..ఓటాన్‌ బడ్జెట్‌పై ఆధార పడాల్సి వస్తోంది-జగన్‌. మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించడానికి కూడా..టీడీపీ ప్రభుత్వం భయపడుతోంది-జగన్‌ చంద్రబాబు భయం భయంగా పరిపాలన చేస్తున్నారు.. మేం ప్రశ్నిస్తామని భయపడుతున్నారు-జగన్‌.

👉గన్ ఫై రెచ్చిపోయిన జగన్’ ..ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత..వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వ‌ద్ద ఉన్న పోస్ట‌ర్ల‌ను లాక్కొని, చించివేసిన పోలీసులు..పోలీసులపై సీరియస్ అయిన ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్..పోస్ట‌ర్లు చించే అధికారం ఎవరిచ్చారంటూ పోలీసులపై జ‌గ‌న్ ఆగ్ర‌హం..గుర్తుపెట్టుకో మధుసూదన్ అధికారం ఎవరికి శాశ్వతం కాదు..మీకు టోపీ మీద ఉన్న మూడు సింహాలు కి అర్థం అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ కొట్టడం కాదు.

👉పి.యం. కౌశల్ వికాస్ యోజన పధకం క్రింద యువత శిక్షణపై మాగుంట ప్రశ్న*

ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పధకం క్రింద దేశం మరియు ఆంధ్రప్రదేశ్ లో యువతకు శిక్షణా కోర్సులు ఏర్పాట్లు, గత ఇదు సంవత్సరాలలో నమోదు కాబడిన విద్యార్ధులు, సెంటర్లకు కేటాయించిన నిధులు, మరియు ఈ పధకం గురించి ప్రజలకు తెలియజేసే కార్యక్రమాల గురించి కేంద్ర చర్యల ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు, మాగుంట శ్రీనివాసులురెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత శాఖ (స్వతంత్ర) సహాయక మంత్రి, జయంత్ చౌదరి సమాధానమిస్తూ – ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పధకం క్రింద దేశంలోని యువతకు శిక్షణా కోర్సులు కల్పించుటకు ధృడమైన వాటాదార్ల వ్యవస్థ స్థాపించబడినదని, జాతీయ మరియు అంతర్జాతీయ సమగ్ర నైపుణ్య అంచనాలను నిర్ధారించడానికి మరియు ఆధ్యయనం చేయడానికి జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ పలు చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ఈ పధకం క్రింద, అన్ని శిక్షణా కోర్సులు జాతీయ అర్హత రిజిస్టర్ నుండి తీసుకోబడి, పరిశ్రమల సంప్రతింపులతో అభివృద్ధి చేయబడునని మరియు ఈ పధకం గురించి ప్రజలకు అన్ని మాధ్యమాల ద్వారను, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారను మరియు ప్రభుత్వ మరియు ప్రైవేటు న్యూస్ ఏజెన్సీస్ ల ద్వారాను తెలియజేయడం జరుగుతున్నదని తెలిపారు. గత ఇదు సంవత్సరాలలో, దేశం మొత్తంలో 51,47,090 మంది మరియు ఆంధ్రప్రదేశ్ లో 31-04-2024 నాటికి 1,13,884 మంది అభ్యర్ధులు నమోదయ్యారని, ఈ పధకం క్రింద నేరుగా జిల్లాలకు నిధులు కేటాయించబడవని – రాష్ట్రాలవారీగా కేటాయించబడునని కేంద్ర మంత్రి తెలియజేశారు.

👉 మార్కాపురం మరియు రూరల్ ప్రాంతాల్లో ఆటో నడిపే ప్రతీ ఒక్కరూ తప్పకుండా వాహన పత్రలతో పాటు లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి అని మార్కాపురం డీఎస్పీ బాల సుందరరావు హెచ్చరించారు. అధిక మొత్తంలో రేట్లు వసూలు చేయకూడదు చేసిన ఎడల కఠినమైన చర్యలు తీసుకోబడును,యూనిఫాం తప్పనిసరిగా ఉండాలని,ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనాలు నడపాలి అని,మద్యం తాగి వాహనాలు నడపకూడదని రాష్ డ్రైవింగ్, చేయకూడదని,హెచ్చరించారు.

7k network
Recent Posts

* అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది..👉 ఆన్ లైన్ పేకాటలో జిల్లా రెవెన్యూ అధికారి మలోల బిజీ బిజీ (అనంతపురం ) .. *రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ గా మధుసూదన్ రెడ్డి 👉నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ లకు యువకుడు బలి*.. *రాష్ట్ర డీఐజీ ద్వారక తిరుమలరావుకు ఘన స్వాగతం.. నేనిప్పుడు మారిపోయాను : ఆర్జివి ..

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త