ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను జగన్ నాశనం చేశారన్న చంద్రబాబు..అదానీ.. అమెరికా ఎపిసోడ్ లో జగన్ పేరు?..షర్మిలపై అసత్య ప్రచారం చేసేదెవరో ప్రజలందరికీ తెలుసు-బాలకృష్ణ..గిద్దలూరు నగర పంచాయతి పరిధిలోనీ క్లబ్ రోడ్ సచివాలయం మరియు కోటగడ్డ వీధి సచివాలయం పరిధి ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి.. అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సహాయం (కొమరోలు)..దుష్ప్రచారం చేస్తున్న విశ్రాంత ఉపాధ్యాయునిపై ఫిర్యాదు(కంభం)..అక్రమ మద్యం స్వాధీనం.

👉అదానీ.. అమెరికా ఎపిసోడ్ లో జగన్ పేరు?😲😲😲 ..ఏపీ ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం ప్రకారం అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి 4667 మెగావాట్లు.. అజూర్ పవర్ ఇండియా లిమిటెడ్ నుంచి 2333 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు తొలి ఒప్పందం కుదిరింది. అదానీ సంస్థపై అమెరికా కోర్టులో కేసు నమోదు కావటం.. దీనికి సంబంధించిన పరిణామాలు వేగంగా చోటు చేసుకోవటం ఒక ఎత్తు అయితే.. అంతే వేగంగా రియాక్షన్లు వచ్చేస్తున్నాయి. ఇలాంటి వేళ..
అమెరికా దర్యాఫ్తు సంస్థల విచారణలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి హై జగన్మోహన్ రెడ్డి – అదానీల మధ్య చోటు చేసుకున్న రహస్య ఒప్పందానికి సంబంధించిన వివరాలు కూడా బయటకు రావటం సంచలనంగా మారింది.
అదానీ – జగన్ మధ్య కుదిరిన ఒప్పందాల వివరాల్ని తేదీలతో సహా.. అసలేం జరిగిందన్న వివరాల్ని బయటకు వెల్లడించటం చూస్తూ.. అమెరికా విచారణ సంస్థల దర్యాప్తు వర్సెస్ దేశీయ విచారణ సంస్థల జోరు మధ్య వ్యత్యాసం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇంతకూ అమెరికా దర్యాప్తు సంస్థలు ఏ అంశాల్ని ప్రస్తావించాయి? ఆ సందర్భంగా ఏం జరిగిందన్న వివరణను చూస్తే.. 2021-09-12 (సెప్టెంబరు 12, 2021) 2019లో అదానీ సంస్థతో సెకి ఒక ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం రాజస్థాన్ లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సాయం చేస్తుంది. అదానీ సంస్థ కోట్ చేస్తున్న ధరకు విద్యుత్ కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రాలేదు. ఈ క్రమంలో గౌతమ్ అదానీ రంగంలోకి దిగారు. 2021-09-15 (సెప్టెంబరు 15, 2021) తాడేపల్లిలోని జగన్ నివాసంలో గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలు అద్యంతం రహస్యంగా ఉండటం గమనార్హం. వీరి మధ్య కుదిరిన రహస్య ఒప్పందానికి సంబంధించి.. బయటకు వచ్చిన డీల్ విషయానికి వస్తే సెకి నుంచి ఏపీ ప్రభుత్వానికి ఒక లేఖ వచ్చింది. దీని సారాంశం ఏమంటే.. అదానీ విద్యుత్ సంస్థలు యూనిట్ రూ.2.49 చొప్పున ఏపీ ప్రభుత్వానికి సరఫరా చేసేందుకు ముందుకు వచ్చాయి. పాతికేళ్లు ఆ విద్యుత్ ను కొనుగోలు చేసేందుకు తమతో ఒప్పందం చేసుకోవాలని ఏపీ విద్యుత్ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. సాధారణంగా ఇలాంటి ప్రతిపాదనలు వస్తే.. సదరు శాఖ కార్యదర్శి.. సంబంధిత మంత్రి పరిశీలన తర్వాతే ముఖ్యమంత్రి ముందుకు పెడతారు. ఆయన ఓకే చెబితే.. కేబినెట్ లో చర్చకు పెట్టి.. ఆమోద ముద్ర వేస్తారు. 2021-09-16 (సెప్టెంబరు 16, 2021) సాధారణంగా ప్రభుత్వంతో పని అంటే దానికి పట్టే టైం గురించి తెలిసిందే. అందునా వేల కోట్ల రూపాయిలకు సంబంధించిన అంశం అన్నప్పుడు ఆలస్యం సహజం. అందుకు భిన్నంగా ఈ ఎపిసోడ్ చోటు చేసుకుంది. సెకి నుంచి ఏపీ విద్యుత్ శాఖకు వచ్చిన ప్రతిపాదనకు జెట్ స్పీడ్ స్పందన లభించింది. సెకి నుంచి లేఖ అందిన తర్వాతి రోజే.. మంత్రివర్గ సమావేశ ఎజెండాలో పెట్టేశారు. రాష్ట్రంలో 6600 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అప్పటికే పిలిచిన టెండర్లను రద్దు చేసి.. సెకి నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని కేబినెట్ భేటీ తీర్మానించింది. ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం ఏమంటే.. జగన్ ప్రభుత్వం తరచూ ప్రస్తావించే.. టెండర్లు.. రివర్సు టెండర్లు లాంటి చర్చలోకి వెళ్లకుండా ఇష్యూ క్లోజ్ కావటం. (డిసెంబరు, 2021) ఏపీ ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం ప్రకారం అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి 4667 మెగావాట్లు.. అజూర్ పవర్ ఇండియా లిమిటెడ్ నుంచి 2333 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు తొలి ఒప్పందం కుదిరింది. అజూర్ నుంచి తీసుకోవాల్సిన విద్యుత్ ను కూడా అదానీ నుంచి తీసుకునేలా సెకి తర్వాత ప్రతిపాదించింది.అందుకు ఏపీ ప్రభుత్వం ఓకే చెప్పేసింది. ఇక్కడ కొత్తగా వెలుగు చూసిన కొత్త విషయం ఏమంటే.. అదానీ.. అజూర్ లు పేరుకు మాత్రమే వేర్వేరు కంపెనీలు కానీ.. రెండూ ఒకటేనన్న విషయం తాజాగా వెల్లడవుతోంది. అమెరికా దర్యాప్తు సంస్థలు ఇదే విషయాన్ని ప్రస్తావించటం గమనార్హం. సెకి నుంచి యూనిట్ కు రూ.2.49 చొప్పున చెల్లించేందుకు డీల్ చేసుకునే సమయానికి కొన్ని రాష్ట్రాలు ఇతర సౌర విద్యుత్ సంస్థల నుంచి యూనిట్ రూ.1.99 చొప్పున చెల్లింపులు జరిపేలా ఒప్పందం చేసుకోవటం గమనార్హం. అదానీ.. అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మధ్య జరిగిన భేటీల వివరాలు చాలావరకు వెలుగు చూసింది లేదు. కానీ.. తాజా ఇష్యూ సందర్భంగా పలు అంశాల్ని అమెరికా దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. అన్నింటికి మించి భేటీలకు సంబంధించి తేదీలతో సహా వివరాలు వెల్లడికావటం చూస్తే.. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఇష్యూలోకి వస్తారా? అన్నదిప్పుడు చర్చగా మారింది. ముడుపులు చెల్లించే క్రమంలో ఎవరెవరు? ఎక్కడెక్కడ? ఎలా కలిశారు? ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయో ఆధారాలతో సహా వెల్లడించిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
👉ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను జగన్ నాశనం చేశారన్న చంద్రబాబు..అమెరికా కోర్టులో వేసిన ఛార్జ్ షీట్ తమ వద్ద ఉందన్న ముఖ్యమంత్రి..ఈ అంశాన్ని ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తోందని వెల్లడి.. అమెరికా కోర్టులో అదానీ సహా 8 మందిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరు కూడా వినిపించడం కలకలం రేపుతోంది. గత ప్రభుత్వాధినేతకు రూ. 1,750 కోట్ల ముడుపులు అందాయనే వార్త ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఏపీ శాసనసభలో పలువురు సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ అంశంపై మాట్లాడారు.
ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను జగన్ నాశనం చేశారని చంద్రబాబు విమర్శించారు. జగన్ చేసిన అవినీతి అంశాన్ని ప్రస్తావించడానికి కూడా ఇబ్బందిపడే పరిస్థితి ఉందని అన్నారు. అమెరికా కోర్టులో వేసిన ఛార్జిషీట్ తమ వద్ద ఉందని చెప్పారు. దీనిని అధ్యయనం చేసి, మరింత సమాచారం తీసుకుని తగిన విధంగా స్పందిస్తామని తెలిపారు.
ఈ అంశాన్ని తమ ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తోందని చెప్పారు. చరిత్రలో ఏ నాయకుడు చేయని తప్పులను ముఖ్యమంత్రిగా జగన్ చేశారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం బరితెగించి తప్పులు చేసిందని… ఆ తప్పులను ఒప్పులుగా చిత్రీకరించిందని విమర్శించారు.ఆంధ్ర రాష్ట్రాన్ని అదానీ రాష్ట్రంగా చేశాడు.. జగన్ పై షర్మిల ఫైర్..
👉జగన్ కు అదానీ లంచం ఇచ్చినట్లు అమెరికా స్పష్టంగా చెప్పిందన్న షర్మిల..అదానీ దేశం పరువు తీస్తే, జగన్ ఆంధ్ర రాష్ట్రం పరువు తీశారని మండిపాటు..రూ.1750 కోట్లు తీసుకుని ప్రజలను జగన్ తాకట్టు పెట్టారని విమర్శ..
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అవినీతిపై నేడు అంతర్జాతీయంగా చర్చ జరుగుతోందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా విమర్శించారు. ఇది ఒక్క జగన్ కుటుంబానికి మాత్రమే అవమానం కాదని మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి, భారత దేశానికే అవమానకరమని అన్నారు. అదానీ గ్రూప్ లంచాల వ్యవహారంలో జగన్ కు రూ.1,750 కోట్ల ముడుపులు ముట్టాయనేది స్పష్టంగా తేలిపోయిందని పేర్కొన్నారు. జగన్ పేరు మాత్రమే బయటపెట్టలేదు తప్ప ఆయనకే లంచం ముట్టిందని అమెరికా స్పష్టంగా వెల్లడించిందని అన్నారు.
అదానీ స్వయంగా ఏపీ ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తితో రూ.1,750 కోట్లకు డీల్ కుదుర్చుకున్నాడని, దీంతో అదానీ కంపెనీతో ఏపీ ప్రభుత్వం 25 ఏళ్లకు ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారని గుర్తుచేశారు. జగన్ తన స్వార్థం కోసం దండుకున్న లంచంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఎంత భారం పడుతుందనేది ఆలోచించలేదన్నారు. లంచం తీసుకుని సోలార్ పవర్ ను అధిక ధరకు కొనుగోలు చేశాడని షర్మిల మండిపడ్డారు.
జగన్ కు ముట్టిన 1750 కోట్లకు బదులుగా రాష్ట్ర ప్రజలపై రాబోయే రోజుల్లో రూ.లక్ష కోట్ల భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఎప్పుడూ విశ్వసనీయత అంటూ కబుర్లు చెబుతారని గుర్తుచేస్తూ.. అదానీ కంపెనీ విషయంలో లంచం పుచ్చుకుని జగన్ తన విశ్వసనీయతను తనే కాలరాసుకున్నారని విమర్శించారు. అదానీ దేశం పరువు తీస్తే జగన్ ఆంధ్ర రాష్ట్ర పరువును గంగలో కలిపాడని మండిపడ్డారు.
అదానీ కంపెనీతో జగన్ చేసుకున్న డీల్స్ లో ఇదొకటి మాత్రమేనని, బయటకు రాని డీల్స్ ఇంకా ఎన్ని ఉన్నాయోనని షర్మిల సందేహం వ్యక్తం చేశారు. గంగవరం పోర్టులో ప్రభుత్వానికి పది శాతం వాటా ఉండేదని షర్మిల గుర్తుచేశారు. ఈ పోర్టు మళ్లీ ప్రభుత్వం చేతికి రావాలని స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తపన పడ్డారని చెప్పారు. అయితే, వైఎస్ జగన్ సీఎం అయ్యాక గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాను నామమాత్రపు ధరకే గౌతమి అదానీకి కట్టబెట్టారని ఆరోపించారు.
దాదాపు 9 వేల పైచిలుకు విలువైన వాటాను అదానీకి కేవలం రూ.640 కోట్లకు అమ్మేశారని మండిపడ్డారు. ఈ డీల్ లో ఎంత లంచం వచ్చిందో జగన్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇలాంటి డీల్స్ ఎన్నో కుదుర్చుకున్నారని, వాటిలో ఎంత లంచాలు తీసుకున్నారో విచారించే వారేలేరని ఆవేదన వ్యక్తం చేశారు. పోర్టులు, డేటా సెంటర్ ఏర్పాటు, సబ్ మెరైన్ డీల్.. ఇలా ప్రాజెక్టులన్నీ అదానీకి కట్టబెట్టారని షర్మిల ఆరోపించారు. అదానీకి అప్పగించిన డీల్స్ అన్నింటినీ రద్దు చేసి, అదానీ గ్రూప్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని షర్మిల డిమాండ్ చేశారు.
జగన్ అవినీతిపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోందన్నారు. అదానీ అవినీతిపై ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోదీ విచారణ జరిపించాలని, లేకపోతే మోదీ అవినీతిలో కూరుకుపోయారని భావించాల్సి ఉంటుందని షర్మిల స్పష్టం చేశారు. కేవలం పది పన్నెండేళ్ల వ్యవధిలోనే అదానీ అనే వాడు ప్రపంచ కుబేరుడిగా ఎదిగాడని, దీని వెనక ఎన్ని అవినీతి అక్రమాలు ఉన్నాయో విచారణ జరిపితే బయటపడతాయని షర్మిల చెప్పారు.
👉షర్మిలపై అసత్య ప్రచారం చేసేదెవరో ప్రజలందరికీ తెలుసు: ప్రముఖ బాలీవుడ్ నటులు, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ..గ‌న్నవరం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన బాల‌కృష్ణ‌..షర్మిల ఆరోపణలపై స్పందన..
షర్మిలపై త‌ప్పుడు ప్ర‌చారాన్ని వారే పట్టించుకోనప్పుడు తానెందుకు పట్టించుకోవాలని వ్యాఖ్యలు..
అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజరయ్యేందుకు టీడీపీ ఎమ్మెల్యే నంద‌మూరి బాలకృష్ణ ఈరోజు ఉద‌యం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ స‌మ‌యంలో మీడియాతో మాట్లాడిన ఆయ‌న… ఏపీ పీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేసేదెవరో ప్రజలందరికీ తెలుస‌ని అన్నారు. ఈ త‌ప్పుడు ప్ర‌చారాన్ని వారే పట్టించుకోనప్పుడు నేను ఎందుకు పట్టించుకోవాలంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇదిలా ఉంటే… న‌టుడు ప్ర‌భాస్‌తో త‌న‌కు ఎలాంటి రిలేష‌న్ లేద‌ని తాజాగా మ‌రోసారి షర్మిల స్ప‌ష్టం చేశారు. త‌న పిల్ల‌లపై ప్ర‌మాణ‌పూర్వకంగా ప్ర‌భాస్ ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని అన్నారు. త‌న‌పై బాల‌కృష్ణ ఇంటి నుంచే త‌ప్పుడు ప్ర‌చారం జ‌రిగింద‌ని జగన్ చెప్పారని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అలాగే, వైసీపీ వాళ్లు అసెంబ్లీకి హాజరు కాకుండా మనుషులను పెట్టుకున్నారంటూ బాల‌య్య ఎద్దేవా చేశారు. ఇవాళ‌ కూడా వాళ్లు అసెంబ్లీకి రాకుంటే బాగుంటుంద‌ని తెలిపారు.
👉టీడీపీ కార్యకర్తకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కుమారుడు దివ్యేష్*
*రాచర్ల మండలం, ఓబుళరెడ్డిపల్లె గ్రామంలో ఆనారోగ్యంతో బాధపడుతూ మరణించిన టీడీపీ కార్యకర్త మండ్ల కాశీనాయుడు మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ వారి భౌతికకాయానికి గిద్దలూరు ఎమ్మెల్యే కుమారుడు ముత్తుముల దివ్యేష్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. వారితో పాటు స్థానిక నాయకులు నివాళులు అర్పించారు..*
👉ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) సభ్యులుగా నియమితులైన గిద్దలూరు శాసనసభ్యుల ముత్తుముల అశోక్ రెడ్డికి నియోజకవర్గ టిడిపి నాయకులు కార్యకర్తలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు…

👉బ్రెయిన్ స్ట్రోక్ బాధితురాలికి అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదివేలరూపాయలు ఆర్థిక సాయం*..కొమరోలు మండలం తాటిచెర్ల పంచాయతీ గ్రామ నివాసి ఎస్సీ పాలెంలో నివసిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందినటువంటి పల్లాల రూతమ్మ బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆరోగ్యం క్షీణించింది వైద్యులు పరీక్షలు చేసి ఆపరేషన్ చేయాలని చెప్పేసి కుటుంబ సభ్యులకు తెలియజేశారు ప్రస్తుతం బాధితురాలు ఒంగోలు పట్టణంలోని ప్రకాశం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు ఈ విషయాన్ని గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ బోనేని వెంకటేశ్వర్లు యాదవ్ మరియు వారి టీం సభ్యులు వైద్యశాలకు వెళ్లి బాధితురాలని పరామర్శించి మానవతా దృక్పథంతో నిరుపేద కుటుంబానికి చెందిన రూతమ్మ కుటుంబ సభ్యులకు అమ్మ ఫౌండేషన్ కుటుంబ సభ్యుల సహకారంతో ₹10,000 ( అక్షరాల పదివేల రూపాయలు ) నగదును ఆర్థిక సాయం చేశారు
👉అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ బోనేని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అందించింది చిన్న సహాయమే అయినప్పటికీ పేషెంట్ కి ఎంతో కొంత ఆసుపత్రి ఖర్చులకు ఉపయోగపడతాయి అనే ఉద్దేశ్యంతో ఇవ్వడం జరిగింది రూతమ్మ ఆరోగ్యం బాగుండాలని అమ్మ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థకుటుంబ సభ్యులు కోరుకుంటున్నారన్నారు
👉 కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ సెక్రటరీ పందనబోయిన భూపాల్, టీం సభ్యులు పల్లాల కిరణ్ , పల్లాల విక్టర్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు
👉 గిద్దలూరు నగర పంచాయతి పరిధిలోనీ క్లబ్ రోడ్ సచివాలయం మరియు కోటగడ్డ వీధి సచివాలయం పరిధిలోగల ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి.. !గిద్దలూరు నగర పంచాయతి కమిషనర్..
కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిలో భాగంగా ఇప్పటివరకు NPCI మ్యాపింగ్ లో భాగముగా ఇండియన్ పోస్టల్ బ్యాంక్ నందు ఖాతా ఉండి ఆధార్ మ్యాప్ కాకుండా ఉన్న వారికి రేపు అనగా తేదీ:23-11-2024 ఉదయం 10.00 గంటలకు క్లబ్ రోడ్ సచివాలయం మరియు కోటగడ్డ వీధి సచివాలయం నందు పోస్టల్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ప్రజలకు పోస్టల్ బ్యాంకు ఎకౌంటునకు ఆధార్ మ్యాప్ చేయడము మరియు 18 సంవత్సరాల వయసు దాటిన వారికి పోస్టల్ బ్యాంకు నందు కొత్త అకౌంటు ఓపెన్ చేసి యాక్టివేట్ చేయబడునని తెలియజేయడమైనది.
అకౌంట్ ఓపెన్ చేసికొనుటకు గాను ఆధార్ కార్డు,పాన్ కార్డు లతో హాజరు కావలసినదిగా తెలియజేయడమైనది.
మరియు సచివాలయ సిబ్బంది వారి ద్వారా ఇంకను లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతానకు ఆధార్ కార్డు నెంబర్ లింక్ కాకుండా ఉన్న ఎడల వారు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్ లింక్ ను అప్డేట్ చేయించుకొనవలసిందిగా కోరడమైనది.
NPCI మ్యాపింగ్ ద్వారా అప్డేట్ చేయించుకున్న ప్రజలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం వారి నుండి వచ్చే పథకాలకు మీ బ్యాంకు ఖాతా నెంబర్ నందు డైరెక్టుగా లబ్ధి చేకూరుటకు అవకాశం కలదని పట్టణ ప్రజలకు తెలియజేయడమైనది.
👉దళిత మహిళలు గ్రామ, మండల మహిళా సమాఖ్య అధ్యక్ష పదవులకు పనికి రారా ??.. దుష్ప్రచారం చేస్తున్న విశ్రాంత ఉపాధ్యాయునిపై ఫిర్యాదు..
అంబేద్కర్ రాజ్యాంగం రాసి అందులో దళితులకు సమాన హక్కులు కల్పించి 74 ఏళ్లు అయినా ఇంకా వారిని హక్కులకు దూరం చేయాలి అనుకోవడం అది కూడా చదువుకున్న విద్యావంతులే కుల వివక్ష చూపించడం దారుణం అని కంభం మండలo గ్రామ మహిళా సమాఖ్య సంఘం (VOA) అధ్యక్షురాలు పెద్దిరెడ్డి శ్రీ లక్ష్మీ, కార్యదర్శి దొంతా కాశీ రత్నం లు ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేసారు. తమ మీద జరుగుతున్న అసత్య ప్రచారాల గురించి శుక్రవారం కంభం పట్టణ ఎస్ ఐ కి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఇటీవల వెలుగు కార్యాలయం లో అవినీతి చేస్తున్నారని గ్రామ & మండల మహిళా సమాఖ్య ఎన్నికలు నిబంధనలకు విరుధ్ధంగా జరిగాయని “రిటైర్డ్ ఉపాధ్యాయుడైన ఇబ్రహీం” మరియు కొంత‌మంది అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కంభం మండల గ్రామ మహిళా సమాఖ్య (VOA) నాయకులు తెలిపారు. రోజుకొక కండువా కప్పుకుంటూ … రోజుకొక పార్టీ అని చెప్పుకుంటూ మా మీద నిందలు వేయడం సరి కాదని. …. మా మీద నిందలు వేసే ఇబ్రహీం యెక్క భార్య ఒక గ్రామ సంఘం కు, మండల సమాఖ్య కు మరియు జిల్లా సమాఖ్య కు కూడా గతంలో అధ్యక్షురాలుగా, కార్యదర్శిగా పని చేసిందని.అయితే మొన్న అక్టోబర్ నెల లో గ్రామ సంఘం కమిటీ కి జరిగిన ఎన్నికలలో కొత్తగా ఒక దళిత మహిళను నూతన గ్రామ సంఘం అధ్యక్షురాలిగా సభ్యులు ఎన్నుకోవడం జరిగిందని …. ఈ నెల 20 తారీఖున మండల అధ్యక్షురాలు పదవికి కూడా నూతన ఎస్సీ మహిళనే అధ్యక్షురాలిగా ఎన్నుకోవడం జరిగిందని…
దళిత మహిళలను అధ్యక్షురాల్లు గా ఎన్నుకోవడం వల్ల తన భార్య పదవి పోయిందనే అక్కసుతో దళిత మహిళలను అధ్యక్షులు గా చేసేది ఏంటి అని నీచంగా కుల వివక్ష తో మాట్లాడుతున్నారు అన్నారు.
మాల మాదిగల పెత్తనం ఏంటి అని కుల దురహంకారoతో మాట్లాడుతూ, అధికారులకు మాపై లేని పోని ఆరోపణలతో ఫిర్యాదులు చేస్తూ… సోషల్ మీడియా గ్రూపులలో పోస్టులు పెడుతూ మమ్మల్ని మానసికంగా హింసిoచడం దుర్మార్గo అన్నారు.
దళిత మహిళలను అధ్యక్షులుగా తీసేసి అధ్యక్షులు గా తిరిగి జరీనాను ఎన్నుకుంటే ఫిర్యాదులు అన్నీ వెనక్కి తీసుకుంటామని లేదంటే అందరి ఉద్యోగాలు ఊడగొట్టిస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు.
అతను, అతనికి తెలిసిన కొంతమంది చేత సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్టుల్లో పెట్టించి కావాలనే మా పరువు తీస్తున్నారు అని కనుక ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు.👉నాయకులకు గొడవలు ఉంటే బయట తేల్చుకోవాలి కానీ అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్న పేద ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ మహిళల మీద ఫిర్యాదులు చేస్తూ బాధ పెట్టడం ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. *వ్యక్తిగత స్వార్ధంతో పదవి కోసం ప్రయత్నించి ఓడిపోయి సంబంధం లేని వారిపై నిందలు వేస్తున్నారన్నారు.*ఆమె మూడు పదవుల్లో అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు ఏ అవినీతి వారికి కనపడలేదని ఇప్పుడు కేవలం దళిత మహిళలను అధ్యక్షురాలుగా ఎన్నుకోగానే అవినీతి జరిగిందని ఆరోపించడం సమంజసం కాదని అన్నారు.
దళిత మహిళలకు పదవి రావడంతో కులం తక్కువ వాళ్లకి ఆ పదవి ఎలా ఇస్తారని కడుపులో దళితుల మీద వివక్ష పెట్ఠుకుని పై అధికారులకు అసత్య ఆరోపణలతో ఫిర్యాదులు చేస్తున్నారని, కానీ వాటిలో వాస్తవం లేదన్నారు. దళిత మహిళలు అధ్యక్షురాలు కావడం ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దళిత మహిళలకు, పేద మైనారిటీ, ఎస్టీ & బిసి మహిళలకు జరుగుతున్న అన్యాయంపై గౌరవ ప్రజా సంఘాల, దళిత సంఘాల నాయకులు, ప్రజలు, మీడియా వారు అండగా నిలబడాలని వారు కోరారు.
👉అక్రమ మద్యం స్వాధీనం.. ప్రకాశం జిల్లా కంభం మండలంలోని లింగాపురం గ్రామంలో ఒక వ్యక్తి నుండి ఎనిమిది క్వార్టర్ బాటిళ్ళ మద్యం సీసాలనుస్వాధీనం చేసుకుని కేసు నమోదుచేసినట్లు ఎస్సై బి నరసింహారావు తెలిపారు.

7k network
Recent Posts

కాంగ్రెస్‌- సోరోస్‌ అంశంలో తనని అవమానించేలా బీజేపీ ఎంపీలు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి -లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ .. రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదాఏపీలో ఇక వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు: లోకేశ్…”రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదా..”పురుగుల మందు తాగుతూ మహిళ సెల్ఫీ”…జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు…నార్పలలో వీర జవాన్ వరికుంట్ల సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప..

చైనా.. ఉక్రెయిన్.. ఇజ్రాయెల్ యుద్ధాలలో నలిగిపోతున్న భారతీయులు.. విశాఖలో మహిళపై లైంగిక దాడి.. సీఎం ఆదేశాలతో సెంట్రల్ జైలుకు నిందితుడు.. ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి పునరావాస ప్యాకేజీని కొట్టేశారట! … మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం?.. వినయ్‌ వైఖరి వల్లే తమ కుటుంబంలో వివాదాలు: మంచు మనోజ్.. మోహన్ బాబు హేయమైన చర్యపై ఖండన.. విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ .. తహశీల్దార్ పై సస్పెన్షన్ వేటు (కడప)… రేపు, ఎల్లుండి కలెక్టర్ల సదస్సు… పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. కొనసాగుతున్న ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య యుద్ధం..జవాన్ మృతి పట్ల మంత్రి డోలా తీవ్ర దిగ్బ్రాంతి

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల విన్నూత నిరసన*…డబ్బు కోసం,ఆస్తి కోసం పోరాటం చేయటం లేదు- మంచు మనోజ్..పోలీసుల అదుపులో పవన్ ను బెదిరించిన వ్యక్తి… ఎవరీ మల్లికార్జునరావు?…వందలాది ఎకరాల ప్రభుత్వ అసైన్మెంట్ భూముల కొనుగోలుపై స్పందించిన హైకోర్టు…ధాన్యం కొనుగోలులో వ్యాపారులు దగా చేస్తే చట్ట ప్రకారం చర్యలు…డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…మత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు: డాక్టర్ కూచిపూడి.

నాగబాబుకు మంత్రి పదవి.. సీఎం చంద్రబాబు ప్రకటన…’పుష్ప’ని ఫుల్ గా వాడేస్తోన్న ఆప్ – బీజేపీ!…డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ పై డీజీపీకి ఫోన్‌ చేసి మాట్లాడిన హోంమంత్రి అనిత.. …కోటి లో పోలీసుల ఓవరాక్షన్, మహిళలపై అసభ్య ప్రవర్తన, తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన మహిళ..మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన జగన్….,

సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సూర్యాపేట జిల్లా హోం గార్డ్స్ ఆఫీసర్స్..విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేష‌న్ బియ్యం సీజ్‌……జర్నలిస్టులపై మోహన్ బాబు బౌన్సర్ల దాడి….. అల్లూరి జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే, కందుల ఎమ్మెల్యే ముత్తుముల..

రైతుల ఆందోళనలో హర్యానా “పోలీసుల డ్రామా..!! నోయిడా జైలులో రైతుల నిరాహార దీక్ష(డిల్లీ)…VEE RUN FOR TIRUPATI…రెండు రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం.. దర్యాప్తు సంస్థల అధికారులమంటూ బెదిరింపు* 15 లక్షలు దోచేసిన సైబర్‌ నేరగాళ్లు… జాతీయ రహదారిపై లారీ క్లీనర్ సజీవ దహనం…. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది?