గంజాయిని కూకటివేళ్లతో పెకిలిస్తాం ..దా’రుణ’ యాప్ బాధితులలలో చదువుకున్నవారే అధికం : హోంమంత్రి..కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్‌సిసి డే సంబరాలు.. చట్టాలపై అవగాహన అవసరం..నవంబర్ 26 కలెక్టరేట్ వద్ద మహాధర్నాకి తరలిరండి.సంయుక్త కిసాన్ మోర్చా.. గిద్దలూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ ఓంకార్..అక్రమంగా గోవులను తరలిస్తున్న కంటైనర్ స్వాధీనం.. సీఎం చంద్రబాబును కలిసిన దామచర్ల..పలు కేసుల్లో 9 మంది దొంగల అరెస్టు ..ఎమ్మెల్యే ముత్తుములకు శుభాకాంక్షలు..

👉 *గంజాయిని కూకటివేళ్లతో పెకిలిస్తాం : హోంమంత్రి అనిత*..అమరావతి..
*చంద్రగిరి యువగళం యాత్రలో గంజాయి ప్రభావం ప్రత్యక్షంగా చూశా*
*గంజాయి,బ్లేడ్ బ్యాచ్ లపై పీడీ యాక్ట్ కేసులు, ఆస్తులు జప్తు*
*వైసీపీ పాలనలో రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి*
*25 వేల కిలోల గంజాయి స్వాధీనం, 916 మందిపై కేసులు*
*గంజాయి నిర్మూలనకు యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు*
*దా’రుణ’ యాప్ బాధితుల్లో చదువుకున్న వారే అధికం*
*శాసనసభలో సభ్యుల ప్రశ్నలకు హోంమంత్రి అనిత సమాధానం*..
అమరావతి: గత ఐదేళ్ల వైసీపీ పాలన వల్ల రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా పెరిగిందని శాసనసభలో హోంమంత్రి అనిత వెల్లడించారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలన, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలను అరికట్టే అంశంపై శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (రాజమండ్రి) , రెడ్డప్పగారి మాధవిరెడ్డి(కడప), సుందరపు విజయ్ కుమార్ (యలమంచిలి) అడిగిన ప్రశ్నలకు ఆమె గురువారం జరిగిన సభలో సమాధానం ఇచ్చారు. 2014-19 ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే 2019 – 24 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి విచ్చలవిడిగా పెరిగిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం గంజాయిని పెంచి పోషించిందని ఆరోపించారు. గత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ ఏనాడూ గంజాయిపై ఒక్క రివ్యూ కూడా చేయలేదని విమర్శించారు. అందుకే ఏజెన్సీ ఏరియాల నుంచి చిన్నపిల్ల స్కూల్ బ్యాగుల్లోకి గంజాయి వచ్చి చేరిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్ర సమయంలో చంద్రగిరి నియోజకవర్గంలో ఒక తల్లి, తన బిడ్డను తీసుకొచ్చి నారా లోకేష్ని కలిసి గంజాయి బారిన పడిన విషయాన్ని ఈ సందర్భంగా హోంమంత్రి గుర్తు చేశారు. గంజాయి వల్ల తమ జీవితాలు ఎంత నాశనమయ్యాయో ఆ తల్లి నాడు లోకేశ్ కి వివరిస్తూ కన్నీరు పెట్టిన సంగతిని ప్రస్తావించారు. అప్పుడే మంత్రి నారా లోకేష్.. అధికారంలోకి రాగానే గంజాయిపై దృష్టి పెట్టాలని నిర్ణయించారన్నారు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే గంజాయి కట్టడిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.
గంజాయి రవాణా రాష్ట్ర మంతట జరుగుతున్నా..వైసీపీ పాలనలో చెక్ పోస్టుల్లో కనీసం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయలేదని హోంమంత్రి మండిపడ్డారు. కానీ ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెక్ పోస్టులు పెంచడంతో పాటు.. నిరంతర పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. దానివల్లనే ఐదు నెలల పాలనలో సుమారు 25 వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగలిగామన్నారు. 916 మందిపై కేసులు కూడా నమోదు చేసినట్టు స్పష్టం చేశారు. తాజాగా రాజమండ్రిలో ఒక ఫార్మాసిస్ట్.. జైల్లో ఉన్న నిందితుడికి గంజాయి అందించిన ఘటనలో నిఘా అధికారులు అతన్ని గుర్తించి అరెస్టు చేసి జైలుకు పంపించడమే అప్రమత్తతకు ఒక ఉదాహరణగా వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాలతో గంజాయి నేరస్థులపై పీడీ యాక్టులతో పాటు వారి ఆస్తులు స్వాధీనం చేసుకునేలా కఠిన చర్యలు చేపడుతున్నామన్నారు. గంజాయి నిర్మూలన కోసం ఇప్పటికే 469 మంది సిబ్బందితో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆ స్పెషల్ ఫోర్స్ నిర్వహణకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక బడ్జెట్ ను కూడా కేటాయించామన్నారు. మిగిలిన శాఖలతో సంబంధం లేకుండా గంజాయి నిర్మూలనలో సర్వాధికారాలు కల్పించామన్నారు. రాబోయే రోజుల్లో గంజాయిని పూర్తిగా అరికడతామని సభలో హోంమంత్రి ప్రకటించారు. గంజాయి నిర్మూలనకు యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. అడిషనల్ డీజీపీ స్థాయి వ్యక్తిని టాస్క్ ఫోర్స్ కు పర్యవేక్షణ అధికారిగా నియమించేందుకు ఇటీవల కేబినెట్ ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. గంజాయి నిర్మూలనతో పాటు ప్రజల్లో సామాజిక బాధ్యత పెంచేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్టు ప్రకటించారు. కడప శాసనసభ సభ్యురాలు మాధవిరెడ్డి తమ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న గంజాయి రవాణాపై అధికారులతో సమన్వయం చేసుకుని నిర్మూలించేలా చర్యలు తీసుకుంటామన్నారు. బ్లేడ్ బ్యాచ్ ఆగడాలను అడ్డుకునేందుకు నేరస్థుల వివరాలతో ప్రొఫైలింగ్ చేస్తున్నట్టు తెలిపారు. అనుమానిత ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ ఉండేలా పోలీస్ శాఖను ఆదేశించడం జరిగిందన్నారు. రాజమండ్రి, విజయవాడ ప్రాంతాల్లో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో పటిష్ట నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు.
👉దా’రుణ’ యాప్ బాధితులలలో చదువుకున్నవారే అధికం : హోంమంత్రి*
లోన్ యాప్స్ అరాచకాలు, బలవంతపు వసూళ్లపై సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానం వెల్లడించారు. లోన్ యాప్స్ వల్ల రాష్ట్రంలో ఇప్పటివరకు 212 మంది ఇబ్బందిపడినట్లు బాధితులను గుర్తించామన్నారు. ఈ యాప్ కు సంబంధించిన వారి బెదిరింపులకు భయపడి 8 మంది ఆత్మహత్యలకు పాల్పడినట్లు ఆమె స్పష్టం చేశారు. గూగుల్ ప్లేస్టోర్ లో 456 నకిలీ రుణ యాప్ లను గుర్తించి వీటిపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. గో క్యాష్, లోన్ బారో, క్యాష్ బనానా, లింక్ లోన్ వంటి యాప్ లను ఉదాహరణగా పేర్కొన్నారు. ఇప్పటికే 229 యాప్ లను ప్లే స్టోర్ లో బ్లాక్ చేయించడం జరిగిందన్నారు. వేధింపులకు పాల్పడిన యాప్ లకు సంబంధించి ఏకంగా 199 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించామన్నారు. అక్రమ వసూళ్లు, వేధింపులకు పాల్పడే 1138 మొబైల్ స్పామ్ కాల్స్ నంబర్లను గుర్తించి టెలికం డైరెక్టర్ కు ఫిర్యాదు చేసి వాటిని బ్లాక్ చేయించినట్లు ఆమె పేర్కొన్నారు. ఇకపై ఎవరైనా ఆన్ మోసాలకు గురైతే 1930 హెల్ప్ లైన్ లో సంప్రదించాలని కోరారు. 2020 కోవిడ్ సమయంలో ఆన్ నేరాలు, లోన్ యాప్ ల ఆగడాలు విస్తృతంగా పెరిగి నేరాల స్వరూపం కొత్త మార్గాలను అన్వేషించినట్లు హోంమంత్రి తెలిపారు. బలహీనతలను క్యాష్ చేసుకుంటూ షెల్ కంపెనీలు, దివాళాతీసిన సంస్థలకు సంబంధించిన వారు చిన్న చిన్న మొత్తాల్లో లోన్ లు ఇస్తామని అమాయక యువతని ట్రాప్ చేసి వారు ఆత్మహత్యలు చేసుకునేవరకూ విడిచిపెట్టకుండా హింసిస్తున్న ఘటనలున్నాయని ఆమె వివరించారు. ఆశకి పోకుండా అవగాహన కలిగి ఉండడం వల్లనే ఈ తరహా వేధింపుల బారిన పడకుండా యువత, తల్లిదండ్రులు అప్రమత్తం చేసే అవగాహన కార్యక్రమాలను కూడా చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఈ తరహా ఘటనలలో చదువుకోని వారితో పాటు చదువుకున్న వారు కూడా బలవుతున్న నేపథ్యంలో దీనిపై మరింత విస్తృత చర్చ జరగాలని హోంమంత్రి పేర్కొన్నారు.
👉 ఏలూరు జిల్లా..ఏలూరులో అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న నెహ్రూ ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు కొవ్వూరు పట్టణంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారు పూర్తిగా దెబ్బతింది .నెహ్రూకు గాని హోంగార్డుకు గాని డ్రైవర్ కు గాని ఎటువంటి గాయాలు కాలేదు.
👉వైజాగ్ న్యాయవిద్యార్థి పై అత్యాచారాన్ని నిరసిస్తూ
న్యాయవాదులు మరియు కళాశాలలో విద్యార్థులు ఆందోళన
ఏఐఎల్ యు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్
వైజాగ్ లా స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్ ను నిరసిస్తూ,శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ఇడపబత్తిని ప్రసాద్ మరియు న్యాయవాదులు సుమలత బాలా త్రిపసుందరి భార్గవి వారు మీడియా తో
మాట్లాడుతూ, విద్యార్థిని పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. కళాశాలల్లో విద్యార్థిని ల సమస్యల పై తరచుగా కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. మీడియా,సినిమాల్లో అశ్లీలతను నియంత్రించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.స్త్రీలపై దాడులను అరికట్టాలని, దాడులను పాల్పడేవారిని త్వరితగతిన శిక్షించేందుకు తగిన యంత్రాంగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు నరేంద్ర నంద కళాశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
👉పలు కేసుల్లో 9 మంది దొంగల అరెస్టు – రూ.40 లక్షల విలువైన బంగారు – వెండి వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికారాలు మరియు మోటార్ సైకిళ్ల స్వాదీనం.*
*పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దొంగతనాల వివరాలు వెల్లడించిన ఎస్పీ కంచి. శ్రీనివాసరావు ,.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూఇటీవల జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన బంగారు, వెండి మరియు మోటార్ సైకిళ్ల దొంగతనాలకు సంబంధించి *సౌత్ కోస్టల్ జోన్, గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి ఐపిఎస్ ఆదేశాల మేరకు* పల్నాడు పోలీసులు వేగంగా దర్యాప్తు జరిపి పలువురు ముద్దాయిలను చాకచక్యంగా అరెస్ట్ చేయడం జరిగినదని తెలిపినారు.
👉దొంగతనాలు & నిందితుల వివరాలు :-*
*చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న నరసరావు పేట ఇస్లాంపేట కు చెందిన షేక్ సుభాని అనే అతన్ని అరెస్టు చేసి, ఐదు కేసులలో అతను దొంగతనం చేసిన 170 గ్రాముల బంగారం, నాలుగు కిలోల వెండి, రూ.10,000/- నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేసినారు. ఈ ముద్దాయి పల్నాడు,ప్రకాశం బాపట్ల జిల్లాలలో దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించారు*
ఐనవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు చేస్తున్నటువంటి లింగం.ఎలమంద(ఐనవోలు గ్రామం), కొమ్మిరిశెట్టి.రామాంజనేయులు(ఐనవోలు గ్రామం) అను ఇద్దరిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి ఎనిమిది మోటార్ సైకిళ్ళను స్వాదీనం చేసుకోవడం జరిగినది.
ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామ సచివాలయం, ఆయుష్మాన్ భవ భవనం నందు,రైతు భరోసా కేంద్రం లో మరియు కొచ్చేర్ల గ్రామ హై స్కూల్ నందు దొంగతనానికి పాల్పడిన జరపాల.వెంకటేశ్వర్లు(రేమిడిచర్ల గ్రామం) నాయక్, భూక్య. బాలాజీ నాయక్(రేమిడిచర్ల గ్రామం), పూడివలస. గణపతి@ గణేష్(ముప్పిడి గ్రామం పొలంకి మండలం శ్రీకాకుళం జిల్లా ప్రస్తుతం నరసరావుపేట పల్నాడు బస్టాండ్ ఏరియా పాత చెక్పోస్ట్ నందు నివాసం) అనే వాళ్ళని అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ.4 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకోవడం జరిగింది.వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు చేస్తున్నటువంటి మట్టపల్లి.హరిబాబు ఎలియాస్ కమ్మ కాశి(మాచర్ల), చల్లా.భవాని శంకర్@ శంకర్(శంకర్), షేక్.మస్తాన్ వలి@ అత్తిలి (మాచర్ల) అను ముగ్గురిని అరెస్టు చేసి, వారు వద్ద నుండి 10 మోటార్ సైకిళ్ళను స్వాధీనం చేసుకోవడం జరిగింది
ఈ పైన పేర్కొన్న అన్ని దొంగతనాల కేసుల్లో సుమారు 40 లక్షల విలువైనటువంటి ఆస్తులని పోలీసులు రికవరి చేయడం జరిగినట్లు శ్రీ పల్నాడు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసుల్లో సమగ్ర దర్యాప్తు జరిపిన *చిలకలూరిపేట టౌన్ పోలీస్ సిఐ రమేష్ ని,ఐనవోలు,ఈపురు, వెల్దుర్తి పోలీస్ స్టేషన్ల ఎస్సై లను,వారి పోలీస్ సిబ్బంది అందరికీ ఎస్పీ అభినందించడం జరిగినది.* అదేవిధంగా పైన పేర్కొన్న అధికారులకు ఎప్పటికపుడు దిశా నిర్దేశం చేస్తూ ముద్దాయిలను అరెస్టు చేసి, దొంగిలించబడిన సొత్తును రికవరి చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన నరసరావుపేట మరియు గురజాల డిఎస్పి ల కృషిని ఎస్పీ అభినందించారు.
👉 నవంబర్ 26 కలెక్టరేట్ వద్ద మహాధర్నాకి తరలిరండి.సంయుక్త కిసాన్ మోర్చా. కేంద్రంలోని బిజెపి సంకీర్ణ ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకిస్తూ నవంబర్ 26న ఒంగోలు కలెక్టరేట్ వద్ద మహా ధర్నాకి రైతులు,కార్మికులు తరలిరావాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు పిలుపునిచ్చారు.శనివారం కార్మిక, కర్షక,ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నవంబర్ 26న దేశవ్యాప్త కలేక్టరేట్ల ధర్నా సన్నాహాకాల్లో భాగంగా కాటూరివారిపాలెం,పొదిలిలో రైతు కార్మిక సంఘాలు నాయకులు పర్యటించారు.ఈ పర్యటనలో రంగారావు రైతులు ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి సంకీర్ణ ప్రభుత్వం రైతులను వ్యవసాయం నుండి గెంటి వేసి కార్పోరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుందన్నారు.దేశానికి తిండి పెట్టే రైతును అప్పుల ఊబిలోకి పెట్టేలా ప్రభుత్వం విధానాలు ఉన్నాయన్నారు.పరపతి సౌకర్యం కల్పించటంలేదన్నారు.సాగునీటి కల్పనకు తోడ్పడే ప్రాజెక్టులను నిధులు కేటాయించి సకాలంలో పూర్తిచేయడం లేదన్నారు.ఫలితంగా 28 సంవత్సరాలు గడిచినా నేటికి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు.జిల్లాలోని పశ్చిమ ప్రాంతం నేటికి దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటిగా ఉందన్నారు.సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి యం.రమేష్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాచేలా నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చి యజమానులకు బానిసలుగా కార్మికులను మారుస్తున్నారన్నారు.అసంఘటితరంగ కార్మికులు సంక్షేమానికి సమగ్ర చట్టం రూపొందించకపోగా ఉన్న భావన నిర్మాణ బోర్డును నిర్వీర్యం చేసిందన్నారు.స్కీంవర్కర్లకు కనీస వేతనాలు అమలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్,ఉద్యోగ భద్రత లేదన్నారు.ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పోరేట్లకు దారాదత్తం చేస్తుందన్నారు.పొదిలిలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి సప్లై చానల్ ద్వారా సాగర్ నీటితో పెద్దచెరువును నింపాలన్నారు.పొదిలి, మర్రిపూడి మండలాలను వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో చేర్చాలన్నారు.కిసాన్ కాంగ్రేస్ మాజీ జిల్లా అధ్యక్షులు డి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సంస్కరణల్లో భాగంగా వ్యవసాయ పెంపు సెట్లకు మీటర్లు బిగించి రైతులపై భారం మోపుతున్నారన్నారు.ముసి పరివాహక గ్రామాలలో భూగర్భజలాలు పెంపుకు, పశువులమేతకు సాగర్ నీటిని వదలాలన్నారు.శ్రీరామ కోటేశ్వరరావు మాట్లాడుతూ పొదిలి ప్రాంతంలో త్రాగు,సాగునీటి సమస్యలు పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలన్నారు.ఈ పర్యటనలో ఫెన్షనర్స్ అసోసియేషన్ పొదిలి తాలుకా అధ్యక్షులు ఎం.బాదుల్లా,ట్రెజర్ సిహెచ్.సుబ్బారావు,సిఐటియు నాయకులు పి.చార్లెస్,కె.వి.నరసింహం,కాటూరివారిపాలెం గ్రామస్తులు కాటూరి రమేష్,సుబ్బారావు,నరసింహారావులు పాల్గొన్నారు. స్టాఫ్ రిపోర్టర్ ఎస్ రెహమాన్..
👉ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో దామచర్ల జనార్దన్ రావు భేటీ*
ఒంగోలు నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో దామచర్ల జనార్దన్ రావు చర్చించారు. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం అసెంబ్లీ ఆవరణలోని సీఎం ఛాంబర్‌లో చంద్రబాబుతో వారిద్దరు సమావేశమయ్యారు.నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలపై మరియు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు గురించి ప్రధానంగా చర్చించారు.
👉ఎమ్మెల్యే ముత్తుములకు శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నాయకులు*
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగించుకొని, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులుగా నియమితులై గిద్దలూరు పట్టణానికి వచ్చిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డిని నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మర్యాద పూర్వకంగా కలిసి పూలమాల,శాలువా వేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేశారు. గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి ఏపీ PAC కమిటీలో స్థానం కల్పించటం తమ నియోజకవరర్గానికి ఎంతో గర్వకారణంగా ఉందని,ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గిద్దలూరు నియోజకవర్గం తరుపున ధన్యవాద ములు తెలిపారు.. గిద్దలూరు ఇంచార్జ్ సనావుల్లా ఖాన్..
👉 అక్రమంగా గోవులను తరలిస్తున్న కంటైనర్ స్వాధీనం..
కంభం అమరావతి – అనంతపురం జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి సుమారు మూడు గంటల సమయంలో హనుమాన్ జంక్షన్ నుండి అనంతపురం కు గోవులను తరలిస్తున్న కంటైనర్ను కంభం ఎస్ఐ బి నరసింహరావు పట్టుకోవడం జరిగింది. లారీ డ్రైవర్ను క్లీనర్ను అదుపులోకి తీసుకున్నారు . కంటైనర్ యజమానిపై కేసు నమోదు చేసి కంటైనర్ లోని గోవులను గోశాలకు తరలిస్తున్నామని కంభం ఎస్ఐ నరసింహారావు తెలిపారు.
👉మహిళలకు చట్టాలపై అవగాహన..
విధాన్ సే సమాధాన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మహిళలకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జాతీయ మహిళా కమిషన్ మరియు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గిద్దలూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి పి ఓంకార్ ముఖ్యఅతిథిగా పాల్గొని మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి దీనిపై మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రక్షణ కోసం న్యాయస్థానం వారికి ఏర్పాటుచేసిన చట్టాల గురించి వివరించారు. కార్యక్రమంలో తహసిల్దార్ ఏ కిరణ్, ఎంపీడీవో వీరభద్రా చారి, ఎంపిపి చెగిరెడ్డి తులసమ్మ,ఎస్సై బి నరసింహారావు, అడ్వకేట్ లు జహీరాభి, సత్య సులోచన,ఈ ఓ ఆర్ డి విజయలక్ష్మి ,సిడిపిఓ నీలోఫర్, మహిళలు పాల్గొన్నారు.
👉 విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం… గిద్దలూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ ఓంకార్ .
కంభం పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లో గిద్దలూరు న్యాయ సేవ అధికారి సంస్థ ఆధ్వర్యంలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమం లో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ. ఓంకార్ విద్యార్థులను, అధ్యాపకులను ఉద్దేశించి మాట్లాడుతూ చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవడంతో పాటు క్రమశిక్షణ ,చక్కని అధ్యయనం ద్వారా అభ్యున్నతి సాధించాలని ఆకాంక్షించారు, అక్రమ నిర్బంధం నుండి హెబియస్ కార్పస్ పిటిషన్ ద్వారా తక్షణం న్యాయం లభిస్తుందన్నారు , బాల్య వివాహాలు నిరోధానికి, బాల కార్మిక వ్యవస్థ లేకుండా చేసేందుకు చట్టాలు ఉన్నాయని వేధింపుల నిరోధానికి చట్టాలు ఉన్నాయని వివరించారు. చదివే వయసులో ప్రేమ పేరుతో కొందరు భవితవ్యాన్ని కోల్పోతున్నారని ఇటీవల కాలంలో మైనర్ బాలికలు బాలురు అదృశ్యం అవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని ,యువత పెడదారి పట్టకూడ దన్నారు. డ్రగ్స్, గంజాయి ,మద్యపానం వంటి అలవాట్లకు యువత దూరంగా ఉండాలన్నారు.ర్యాగింగ్, ఫోక్సో తదితర చట్టాల గురించి జడ్జి విద్యార్థులకు వివరించారు ,తొలుత ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు,కార్యక్రమంలో ఆర్ ఐ ఓ ఏ .సైమన్ విక్టర్ ,ఎం ఈ ఓ మాల్యాద్రి,ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యా యులు,లీగల్ వాలంటీర్లు ఎన్జీవోలు చిట్లూరి ఏలియా,యోబు,అధ్యాపకులు,ఉపాద్యాయులు, సిబ్బంది,పాల్గొన్నారు.

oppo_0

👉 కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్‌సిసి డే సంబరాలు.. ప్రకాశం జిల్లా కంభం.. నియమ,నిబద్ధతలకు నిలువెత్తు రూపమే నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అని, ఎంఈఓ బి.మాల్యాద్రి అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 76వ ఎన్‌సిసి దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో పలు రకాల మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగించారు.ఎఎన్‌ఓ మహ్మద్ ఇక్బాల్ బాషా మాట్లాడుతూ ఎన్‌సిసి విద్యార్థుల క్రమశిక్షణ, కర్తవ్యదీక్ష,నిస్వార్థ సేవలే వారి ప్రత్యేకతను చాటుతాయని, సమాజంలో వారికి గౌరవాన్ని, గుర్తింపును ఇస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఎన్సిసి క్యాడెట్లు,విద్యార్థులు పాల్గొన్నారు. కంభం రిపోర్టర్ ఎన్ వెంకటేశ్వర్లు
👉 సైబర్ నేరాలు మరియు మద్యం, మత్తు పదార్థాల సేవనం వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన .. ప్రకాశం జిల్లా కంభం..స్థానిక వాసవి సంస్థ విద్యార్థులకు సైబర్ నేరాలపై మద్యపానం, మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రయోజనాలపై గురించి , మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి ఎస్సై బి నరసింహరావు విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వాసవి విద్యాసంస్థల ప్రిన్సిపాల్ లు మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

7k network
Recent Posts

కాంగ్రెస్‌- సోరోస్‌ అంశంలో తనని అవమానించేలా బీజేపీ ఎంపీలు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి -లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ .. రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదాఏపీలో ఇక వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు: లోకేశ్…”రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదా..”పురుగుల మందు తాగుతూ మహిళ సెల్ఫీ”…జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు…నార్పలలో వీర జవాన్ వరికుంట్ల సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప..

చైనా.. ఉక్రెయిన్.. ఇజ్రాయెల్ యుద్ధాలలో నలిగిపోతున్న భారతీయులు.. విశాఖలో మహిళపై లైంగిక దాడి.. సీఎం ఆదేశాలతో సెంట్రల్ జైలుకు నిందితుడు.. ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి పునరావాస ప్యాకేజీని కొట్టేశారట! … మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం?.. వినయ్‌ వైఖరి వల్లే తమ కుటుంబంలో వివాదాలు: మంచు మనోజ్.. మోహన్ బాబు హేయమైన చర్యపై ఖండన.. విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ .. తహశీల్దార్ పై సస్పెన్షన్ వేటు (కడప)… రేపు, ఎల్లుండి కలెక్టర్ల సదస్సు… పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. కొనసాగుతున్న ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య యుద్ధం..జవాన్ మృతి పట్ల మంత్రి డోలా తీవ్ర దిగ్బ్రాంతి

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల విన్నూత నిరసన*…డబ్బు కోసం,ఆస్తి కోసం పోరాటం చేయటం లేదు- మంచు మనోజ్..పోలీసుల అదుపులో పవన్ ను బెదిరించిన వ్యక్తి… ఎవరీ మల్లికార్జునరావు?…వందలాది ఎకరాల ప్రభుత్వ అసైన్మెంట్ భూముల కొనుగోలుపై స్పందించిన హైకోర్టు…ధాన్యం కొనుగోలులో వ్యాపారులు దగా చేస్తే చట్ట ప్రకారం చర్యలు…డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…మత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు: డాక్టర్ కూచిపూడి.

నాగబాబుకు మంత్రి పదవి.. సీఎం చంద్రబాబు ప్రకటన…’పుష్ప’ని ఫుల్ గా వాడేస్తోన్న ఆప్ – బీజేపీ!…డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ పై డీజీపీకి ఫోన్‌ చేసి మాట్లాడిన హోంమంత్రి అనిత.. …కోటి లో పోలీసుల ఓవరాక్షన్, మహిళలపై అసభ్య ప్రవర్తన, తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన మహిళ..మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన జగన్….,

సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సూర్యాపేట జిల్లా హోం గార్డ్స్ ఆఫీసర్స్..విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేష‌న్ బియ్యం సీజ్‌……జర్నలిస్టులపై మోహన్ బాబు బౌన్సర్ల దాడి….. అల్లూరి జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే, కందుల ఎమ్మెల్యే ముత్తుముల..

రైతుల ఆందోళనలో హర్యానా “పోలీసుల డ్రామా..!! నోయిడా జైలులో రైతుల నిరాహార దీక్ష(డిల్లీ)…VEE RUN FOR TIRUPATI…రెండు రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం.. దర్యాప్తు సంస్థల అధికారులమంటూ బెదిరింపు* 15 లక్షలు దోచేసిన సైబర్‌ నేరగాళ్లు… జాతీయ రహదారిపై లారీ క్లీనర్ సజీవ దహనం…. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది?