అమెరికాలో కేసులు వాయిదా వేయించుకునే పరిస్థితి లేదు: జగన్ ను ఉద్దేశించి గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది!..ఎగ్జిట్ పోల్స్ తారుమారవుతాయి: డీకే ..జగన్ పై అనుచిత పోస్టులు… పోలీసులకు మాజీ మంత్రి కాకాణి ఫిర్యాదు.. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశారు? గాడిదలు కాశారా? బాలకృష్ణపై ఎందుకు విచారణ జరిపించలేదు : షర్మిల..విద్యాసంస్థలకు హెచ్చరిక.. అలా చేస్తే రూ.15లక్షల ఫైన్!.. నంద్యాల పద్మావతి నగర్ లో విద్యుత్ శాఖ లీలలు చూదము రారండి.

👉మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోయింది”! అవును.. ఉక్రెయిన్ -రష్యా మధ్య ఖండాతర క్షిపణి ప్రయోగాలతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.రష్యా – ఉక్రెయిన్ యుద్ధం మొదలై వెయ్యి రోజులు దాటిన సంగతి తెలిసిందే. కానీ.. ఇంతవరకూ ముగింపుఛాయలు కనిపించడం లేదు సరికదా.. ఉద్రిక్తతలు రోజు రోజుకీ పెరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో.. రష్యా మరింత దూకుడు పెంచుతుందని అమెరికా హెచ్చరిస్తుంది. ఈ సమయంలో యుద్ధం మొదలైపోయినట్లేనని అంటున్నారు మాజీ కమాండర్ ఇన్ చీఫ్. అవును.. ఉక్రెయిన్ – రష్యా మధ్య ఖండాతర క్షిపణి ప్రయోగాలతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. మరోపక్క ఉక్రెయిన్ కు మద్దతిస్తోన్న అమెరికా.. ఉ.కొరియా మద్దతు ఇస్తున్న రష్యా తమ తమ దూకుడు చర్యలతో పరిస్థితిని మరింత తీవ్రంగా మారుస్తున్నాయని అంటున్నారు. ఈ సమయంలో ఉక్రెయిన్ కు చెందిన మాజీ అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియాకు చెందిన సైనికులు ఉక్రెయిన్ పై పోరాడుతున్నారని.. ఇరాన్ రూపొందించిన ఆయుధ సామాగ్రితో ఉక్రెయిన్ లో అనేక మంది ప్రణాలు కోల్పోతున్నారని.. ఉ.కొరియా దళాలు, చైనా ఆయుధాలు ఈ యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఉక్రెయిన్ మాజీ కమాండర్ ఇన్ చీఫ్ వాలెరీ జులుఝ్నీ పేర్కొన్నారు. ఇలా రష్యా మిత్రదేశాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంట్రీ ఇచ్చిన ఈ తరుణంలో 2024లో మూడో ప్రపంచ యుద్ధం మొదలైందనేది మనం విశ్వసించొచ్చని వాలెరీ జులుఝ్నీ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా.. సంక్షోభం మరింత విస్తరించకుండా చర్యలు తీసుకోవాలని ఉక్రెయిన్ మిత్రదేశాలకు విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో ఉక్రెయిన్ పై రష్యా సూపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగంపై స్పందించిన జులుఝ్నీ… ఈ యుద్ధం స్థాయి, క్రూరత్వంలో ఇది స్పష్టమైన తీవ్రమైన పెరుగుదలను సూచిస్తుందని అన్నారు. ఉక్రెయిన్ సాంకేతికతతో మనుగడ సాగిస్తుంది కానీ.. ఈ యుద్ధంలో ఒంటరిగా మనుగడ సాధించగలదా అనేది తెలియదని అన్నారు. ప్రస్తుతం యునైటెడ్ కింగ్ డమ్ లో ఉక్రెయిన్ రాయబారిగా ఉన్న జులుఝ్నీ.. ఓ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ విధంగా మాట్లాడారు.
👉అమెరికాలో కేసులు వాయిదా వేయించుకునే పరిస్థితి లేదు: జగన్ ను ఉద్దేశించి గోరంట్ల బుచ్చయ్య చౌదరి*
– రూ. 1,750 కోట్ల లంచం తీసుకోవడం జగన్ కు ఒక లెక్క కాదన్న గోరంట్ల.. గంగవరం పోర్టును అదానీకి అక్రమంగా కట్టబెట్టారని ఆరోపణ.. అదానీ కేసులో జగన్ బుక్ కావడం ఖాయమని వ్యాఖ్య..
తన అవినీతి ఖ్యాతిని వైసీపీ అధినేత జగన్ విశ్వవ్యాప్తం చేసుకున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు. రూ. 60 వేల కోట్లు దోచుకున్న జగన్ ఈడీ, సీబీఐ కేసుల్లో ఉన్నారని… అయినా 12 ఏళ్లుగా కేసులను నడుపుకుంటూ వెళుతున్నారని విమర్శించారు. జైలుకు వెళ్లకుండా కేసులను ఎలా పొడిగించుకోవాలో తెలిసిన వ్యక్తి జగన్ అని అన్నారు. అలాంటి వ్యక్తికి రూ. 1,750 కోట్లు లంచం తీసుకోవడం ఒక లెక్కా? అని ప్రశ్నించారు. ఇండియాలో అయితే కేసులు వాయిదా వేయించుకోవచ్చని… అమెరికాలో వాయిదా వేయించుకునే అవకాశం లేదని చెప్పారు. అదానీ నుంచి లంచం తీసుకున్న కేసులో జగన్ బుక్ కావడం ఖాయమని అన్నారు. అదానీతో జగన్ అనేక ఒప్పందాలు చేసుకున్నారని బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఒక తెలుగువాడు నిర్వహిస్తున్న గంగవరం పోర్టును జగన్ అక్రమంగా అదానీకి కట్టబెట్టారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ అవినీతి పరాకాష్ఠకు చేరుకుందని అన్నారు. తాడేపల్లిలోని నివాసానికి ప్రభుత్వ ఖర్చుతో ఇనుప బారికేడ్లు పెట్టుకున్నారని బుచ్చయ్య చౌదరి విమర్శించారు. సీఎంగా ఎక్కడ పర్యటనకు వెళ్లినా చెట్లు కొట్టేయడం, దుకాణాలను మూసేయడం, పరదాలు కట్టుకోవడం చేసేవారని… ఇంత పిరికివాడు సీఎం ఎలా అయ్యాడని ఎద్దేవా చేశారు.👉
👉అదానీతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయాలి: రాహుల్ గాంధీకి కేటీఆర్ డిమాండ్*
– రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేయాలన్న కేటీఆర్
– స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన రూ.100 కోట్లు వెనక్కివ్వాలని డిమాండ్
– అదానీతో రేవంత్ దోస్తీ అధిష్ఠానానికి తెలిసే జరుగుతోందా? కాదా? అని కేటీఆర్ ప్రశ్న..
రాహుల్ గాంధీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా… అదానీతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసుకున్న అన్ని ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… స్కిల్ యూనివర్సిటికీ అదానీ ఇచ్చిన రూ.100 కోట్లను వెనక్కి ఇవ్వాలన్నారు. తెలంగాణ ప్రయోజనాలను అదానీకి తాకట్టు పెట్టడం సరికాదన్నారు. మన కంటే చిన్న… పేద దేశమైన కెన్యా అదానీతో అన్ని వ్యాపార సంబంధాలను రద్దు చేసుకుందన్నారు. మరి తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అదానీతో కుదిరిన ఒప్పందాలను ఎందుకు రద్దు చేసుకోవడం లేదో రాహుల్ గాంధీ చెప్పాలన్నారు. అదానీ నుంచి ఎంత మేర ఆశించి తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుందని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా అదానీపై విమర్శలు చేస్తున్న రాహుల్ గాంధీ… రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి అదానీతో ఒప్పందాలు రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు.తాము అధికారంలో ఉన్న పదేళ్లు అదానీ తెలంగాణకు రాకుండా నిలువరించామన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి అదే అదానీతో దోస్తీ చేస్తుంటే రాహుల్ గాంధీ ఎందుకు నిలువరించడం లేదన్నారు. ఢిల్లీలో అదానీతో కొట్లాడుతున్న కాంగ్రెస్… తెలంగాణలో మాత్రం ఎందుకు దోస్తీ చేస్తోందన్నారు. అదానీతో దేశానికి నష్టమని చెప్పిన రాహుల్ గాంధీ… ఆయనతో తెలంగాణకు కూడా నష్టం కాదా? చెప్పాలన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం మాట కాదని.. వారి మాటను పెడచెవిన పెట్టి అదానీ సామ్రాజ్యానికి రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ పరుస్తున్నారా? అని నిలదీశారు.
అదే జరిగితే మాత్రం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకుంటారా? లేదా? చెప్పాలన్నారు. స్కిల్ యూనివర్సిటీ కోసం రేవంత్ రెడ్డి అదానీ నుంచి రూ.100 కోట్లు స్వీకరించారని, ఇది తప్పా? కాదా? రాహుల్ గాంధీ చెప్పాలన్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీ అవినీతిపరుడు అంటున్న రాహుల్ గాంధీ… తెలంగాణ సీఎంను నీతిమంతుడు అని ఎలా అంటారని నిలదీశారు. అదానీతో వ్యాపార సంబంధాలు రాహుల్ గాంధీకి తెలిసి జరిగితే… ఇది ఆయన డబుల్ స్టాండ్‌కు నిదర్శమని విమర్శించారు. రాహుల్ గాంధీ మాటలు పెడచెవిన పెట్టి రేవంత్ రెడ్డి సొంతగా అదానీతో దోస్తీ చేస్తున్నారంటే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదానీని అరెస్ట్ చేయాలని ఓ వైపు రాహుల్ గాంధీ చెబుతుంటే, అదే అదానీతో ఎందుకు ఎంవోయూలు కుదుర్చుకుంటున్నారో రేవంత్ రెడ్డి కూడా చెప్పాలన్నారు. అదానీ… రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయని, మహారాష్ట్రలో ఎన్సీపీ రెండుగా కావడంలో ఆయన పాత్ర ఉందని తెలిసిందన్నారు. ఇటీవల కోహినూర్ హోటల్లో అదానీతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశమయ్యారని, కాబట్టి దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు బీజేపీ వాషింగ్ మిషన్‌లోకి వెళుతున్నారా? అని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో అదానీని గజదొంగ అన్న రేవంత్ రెడ్డి… ఇక్కడ మాత్రం ఆహ్వానిస్తున్నారని మండిపడ్డారు. అదానీ విషయంలో బీజేపీ కూడా ఏమీ మాట్లాడటం లేదన్నారు.
👉హైదరాబాద్ శివార్లలో అపార్ట్మెంట్లు, ఫార్మ్ ల్యాండ్ కట్టిస్తామని కోట్లు వసూలు చేసింది ఆర్జే వెంచర్స్. నారాయణ్ ఖేడ్, ఘట్కేసర్, పఠాన్ చెర్వు కర్తనుర్ ప్రాంతాలలో అపార్ట్మెంట్, ఫార్మ్ ల్యాండ్ పేరిట ఆర్జే వెంచర్స్ ప్రముఖులతో ప్రకటనలు చేయించారు.* 2020 నుంచి ఇప్పటి దాకా 600 మంది దగ్గర నుంచి రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు కట్టించుకున్నారు. ఆర్జే వెంచర్స్ తీరా చూస్తే ఇప్పుడు బోర్డ్ తిప్పేశారని శుక్రవారం బాధితులు బషీర్ బాగ్ లోని సీసీఎస్ ముందు ఆందోళనకు దిగారు.
డబ్బులు కట్టినవారు నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. *వెంచర్ ఎండి భాస్కర్ గుప్త, డైరెక్టర్ సుధారాణి మాటలు నమ్మి దాదాపు 600 మంది సుమారు రూ.150 కోట్లు కట్టామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.* ఎన్నిసార్లు అడిగిన నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. గట్టిగా అడిగితే చెక్కులు ఇచ్చారు.. కానీ అవి కూడా బౌన్స్ అయ్యాయని ఆర్జే వెంచర్ బాధితులు వాపోతున్నారు.
ఆర్జే వెంచర్స్ ఆస్తులు అమ్మి తమకు న్యాయం చేయాలని కోరుతున్నాము. సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంచర్ కార్యాలయం సైబరాబాద్ పరిధిలో ఉందని.. ఫిర్యాదు అక్కడ పోలీస్ స్టేషన్ లో చేయాలని అధికారులు సూచించారు.
👉 రాహుల్ గాంధీ అదానీని దుర్మార్గుడు, అవినీతిపరుడు అంటున్నాడు.. మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అదానీతో కుదుర్చుకున్న ఎంవోయూలు ఎందుకు రద్దు చేయడం లేదు?
కెన్యా దేశపు తలసరి ఆదాయం 2000 డాలర్లు.. అదే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 5000 డాలర్లు.. అలాంటి కెన్యా దేశపు అధ్యక్షుడు, అదానీ లంచగొండి అని తెలిసాక అతనితో వ్యాపారాలు రద్దు చేసాడు.
కానీ రోజు అదానీని తిట్టే కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఇంకా అదానీతో ఎంవోయూలు ఎందుకు రద్దు చేసుకోలేదు
-బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
👉విషాదం.. తలలోకి తూట దూసుకెళ్లి ఏఆర్ కానిస్టేబుల్ మృతి..!
గుంటూరులో ఆర్మ్‌డ్ రిజర్వ్ (AR) హెడ్‌ కానిస్టేబుల్‌ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎస్కార్ట్‌ విధులు నిర్వహిస్తుండగా తుపాకీ పేలడంతో తలలోకి తూటా దూసుకెళ్లింది..
వంశీకృష్ణ అనే హెడ్‌ కానిస్టేబుల్‌.. అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. వెంటనే తోటి కానిస్టేబుళ్లు వంశీకృష్ణను జీజీహెచ్‌​కు తరలించారు. అయితే ఈలోపే అతను మృతి చెందారని వైద్యులు తెలిపారు. తుపాకీ ప్రమాదవశాత్తు పేలిందా.. లేక వంశీకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డారా అన్న అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. హెడ్‌ కానిస్టేబుల్‌ వంశీకృష్ణ మృతితో కుటుంబం విషాదంలో మునిగిపోయింది…
👉…పద్మావతి నగర్ లో విద్యుత్ శాఖ లీలలు చూదము రారండి… రోడ్డుపై ఉన్న ఈ ట్రాన్స్ ఫార్మర్స్ విద్యుత్ శాఖవా…ప్రవేటు ఆసుపత్రివా..నంద్యాల ..
నంద్యాల పట్టణం నడిబొడ్డులో ఉన్న ట్రాన్స్ ఫార్మర్స్ ఏర్పాటులో విద్యుత్ శాఖ లీలలు ఔరా అనిపిస్తున్నాయి.నడిరోడ్డుపై ఏర్పాటుచేసిన ట్రాన్స్ ఫార్మర్స్ చర్చనీయాంశంగా మారింది.వివరాల్లోకి వెళితే విద్యుత్ సమస్యలు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించడానికి విద్యుత్ శాఖ ట్రాన్స్ ఫార్మర్స్ ఏర్పాటుచేస్తున్నారు.ప్రవేటు ఆసుపత్రులు కానీ,వ్యాపార సముదాయాలు కానీ వారికి అవసరమైన విద్యుత్ కోసం సొంత స్థలంలో ట్రాన్స్ ఫార్మర్స్ ఏర్పాటు చేసుకుంటారు.పద్మావతి నగర్లో విద్యుత్ శాఖ అనుమతి ఇచ్చారో లేదో తెలియదు.రోడ్డుపై రెండు ట్రాన్స్ ఫార్మర్స్ ఏర్పాటు చేశారు.ఒక ట్రాన్స్ ఫార్మర్ నుంచి ఏకంగా ఒక ఆసుపత్రికి కనెక్షన్ ఇచ్చారు.ఇలా ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రాంతంలో ప్రవేటు ఆసుపత్రి వారికి ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసుకోవచ్చా.విద్యుత్ శాఖ అనుమతితో ఇచ్చారో లేదో విద్యుత్ శాఖ అధికారులు చెప్పల్సి ఉంది.అలాగే పద్మావతి నగర్ లో పలు ప్రాంతాల్లో కాల్వ పై ట్రాన్స్ ఫార్మర్స్ ఏర్పాటు చేసుకున్న అధికారులు పట్టించుకోకపోవడం విశేషం.పేద వారిపైనే అధికారుల ప్రతాపం.బడా బాబులు అంటే నే మానవత్వం చూపిస్తున్నారు.
👉మీరు క్షమార్హులు కారు: పోసానిపై టాలీవుడ్ నిర్మాత సంచలన వ్యాఖ్యలు*- రాజకీయాలకు దూరంగా ఉంటానన్న పోసాని- కుటుంబాల గురించి, పిల్లల గురించి నీచంగా మాట్లాడారన్న ఎస్కేఎన్- అభిమానుల మనసులను ఎంతో బాధ పెట్టారని వ్యాఖ్య..
ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇకపై ఏ పార్టీని తిట్టనని, ఏ పార్టీని పొగడనని ఆయన అన్నారు. తన కుటుంబానికి తగిన సమయం ఇవ్వలేకపోతున్నానని… అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. మరోవైపు చంద్రబాబు, పవన్ కల్యాణ్, వారి కుటుంబ సభ్యులపై గతంలో పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగా ఆయనపై పలు చోట్ల పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయనే ప్రచారం జరిగింది. ఇంతలోనే పోసాని నుంచి కీలక ప్రకటన వెలువడటం గమనార్హం. మరోవైపు పోసాని నిర్ణయంపై టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అంటూ మీరు నటించే ముందు… తమ అభిమాన నాయకుడి గురించి, వారి ఇంట్లోని పసి పిల్లల గురించి మాట్లాడిన సంస్కార హీనమైన, నీచమైన మాటలకు చింతిస్తున్నానని లేదా క్షమించండని అడిగి ఉంటే… మీ మాటలను నమ్మాలనిపించేదని అన్నారు. మీరేదో పొరపాటున ఒకసారి మాట్లాడిన వ్యక్తి కాదని మండిపడ్డారు. ఎన్నోసార్లు చాలా నీచంగా మాట్లాడారని దుయ్యబట్టారు. అభిమానుల మనసును మీరు ఎంతో బాధ పెట్టారని ఎస్కేఎన్ అన్నారు. ఛీ ఇవేం మాటలు అంటూ అందరూ చెవులు మూసుకునేలా చేశారని మండిపడ్డారు. ఎవరి కుటుంబాలైనా, ఎవరి పిల్లలైనా ఒక్కటేనని చెప్పారు. రాజకీయాల్లో విమర్శలు సహజమేనని… కానీ వ్యక్తిగతంగా దిగజారిపోయి కుటుంబాల మీద కామెంట్స్ చేసిన మీలాంటి వాళ్లు ఏ మాత్రం క్షమార్హులు కారని అన్నారు.
👉ఎగ్జిట్ పోల్స్ తారుమారవుతాయి: డీకే శివకుమార్*
– మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి గెలుస్తుందన్న డీకే
– చన్నపట్నం ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్ దే గెలుపని ధీమా- జార్ఖండ్ గురించి చెప్పలేనని వ్యాఖ్య
మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రెండు రాష్ట్రాల్లో తమదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తోంది. తాజాగా కర్ణాటక డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ తారుమారవుతాయని అన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి విజయం సాధిస్తుందని చెప్పారు. మహారాష్ట్రలో తాను ప్రచారాన్ని నిర్వహించానని… తప్పకుండా గెలుస్తామనే నమ్మకం తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కు అంతా అనుకూలంగా ఉందనే విషయాన్ని తాను చూశానని చెప్పారు. ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాల గురించి మాత్రం తనకు తెలియదని డీకే శివకుమార్ అన్నారు. కర్ణాటకలోని చన్నపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పారు.
👉జగన్ పై అనుచిత పోస్టులు… పోలీసులకు మాజీ మంత్రి కాకాణి ఫిర్యాదు*
– వేదాయపాలెం పీఎస్ లో కాకాణి ఫిర్యాదు
– అనుచిత పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలన్న కాకాణి
– టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెచ్చిపోతున్నారని మండిపాటు
వైసీపీ అధినేత జగన్ పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నారంటూ వేదాయపాలెం పోలీసులకు వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో కాకాణి మాట్లాడుతూ… జగన్ పై కొందరు టీడీపీ కార్యకర్తలు దారుణమైన పోస్టులు పెడుతున్నారని అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయనపై అనుచిత పోస్టులు పెట్టారని తెలిపారు. వాళ్ల వివరాలను సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెచ్చిపోతున్నారని కాకాణి మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నట్టే… టీడీపీ వాళ్లపై కూడా కేసులు పెట్టాలని అన్నారు. రాజ్యాంగం అందరికీ ఒక్కటేనని చెప్పారు. సోమిరెడ్డి వల్ల ఇబ్బంది పడ్డ ఒక దళితుడి ఆవేదనను వాట్సాప్ లో షేర్ చేస్తే… తనపై కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు వైసీపీ కార్యకర్తల పేర్లతో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు.
👉నేను ఐదోసారి కూడా ముఖ్యమంత్రిగా వస్తా: సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్*
– విజన్ డాక్యుమెంట్-2047పై చంద్రబాబు ప్రసంగం
– మంచి పనులు చేస్తే ప్రజలు గెలిపిస్తారని వెల్లడి
– తాను పదోసారి కూడా ఎమ్మెల్యేను అవుతానని ధీమా..
ఏపీ అసెంబ్లీలో విజన్ డాక్యుమెంట్-2047పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఐదోసారి కూడా ముఖ్యంమంత్రిని అవుతానని ధీమా వ్యక్తం చేశారు. మంచి పనులు చేస్తే ప్రజలు గెలిపిస్తారని, మళ్లీ మనమందరం గెలిచి విజన్ 5.0ను కూడా తీసుకువద్దామని చంద్రబాబు కూటమి ఎమ్మెల్యేలను ఉద్దేశించి పిలుపునిచ్చారు. గుజరాత్ లో గత 30 ఏళ్లుగా ఒకే పార్టీ ఉందని, అక్కడే బీజేపీనే గెలుస్తోందని తెలిపారు. హర్యానాలోనూ బీజేపీ మూడో పర్యాయం విజయం సాధించిందని అన్నారు. మన ప్రవర్తన వల్ల, మన పనుల వల్ల చైతన్యవంతులను చేయగలిగితే… వారు ఎప్పుడూ మన వెంటే ఉంటారు అని చంద్రబాబు వివరించారు. ఇప్పుడు నేను తొమ్మిదో సారి ఎమ్మెల్యేగా ఉన్నానని, పదోసారి కూడా ఎమ్మెల్యే అవుతానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.
👉 అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గం లోని భోగసముద్రం పంచాయతీలో ప్రభుత్వాలు మారిన నాయకులు మారిన అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీకి భూములు పోయిన రైతులకు న్యాయం జరగదా ❓ ఏ నాయకుడు వచ్చినా వారికి ఓటేసే వరకే భూములు పోయిన ప్రజలను మభ్య పెడతారా ❓
👉 ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా తరఫున పోరాడేందుకు 10 వేల మంది సైనికులను పంపినందుకు గాను ఉత్తర కొరియాకు పుతిన్‌ వివిధ రూపాల్లో సహకారం అందిస్తున్నారని దక్షిణ కొరియా శుక్రవారం ఆరోపించింది. ఉత్తరకొరియాకు రష్యా అత్యాధునిక యాంటీ ఎయిర్‌ మిస్సైళ్లను ఇచ్చిందని దక్షిణ కొరియా అత్యున్నత భద్రతా సలహాదారు షిన్‌ వోన్సిక్‌ విలేకరులకు వెల్లడించారు. ఐక్యరాజ్య సమితి ఆంక్షలను అతిక్రమించి మరీ ఈ ఏడాది మార్చి నుంచి రష్యా సుమారు లక్ష బ్యారెళ్ల చమురును ఉత్తరకొరియాకు సరఫరా చేసిందని బీబీసీ ఓ కథనంలో పేర్కొంది. సైనిక సాయానికి బదులుగానే రష్యా చమురు సరఫరా చేసిందని వెల్లడించింది. ఇవేకాక, కొన్ని జంతువులు, పక్షులను ఉత్తరకొరియాకు రష్యా కానుకగా పంపిందని కథనాలు వెలువడ్డాయి.
👉 నాకు, ప్రభాస్ కు సంబంధం ఉన్నట్లుగా బాలకృష్ణకు చెందిన భవనం నుంచే ప్రచారం జరిగినట్లుగా ఇటీవల జగన్‌ ఒక వీడియోను చూపించారు. నిజంగా చెల్లెలిపై ప్రేమ ఉంటే… ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశారు? గాడిదలు కాశారా? బాలకృష్ణపై ఎందుకు విచారణ జరిపించలేదు?’ అంటూ షర్మిల నిలదీశారు. ఈ ప్రచారంపై కేసు పెట్టిన రోజే ప్రభాస్‌ అనే వ్యక్తిని ఇంతవరకు చూడలేదంటూ తన బిడ్డలపై ప్రమాణం చేసి చెప్పానని గుర్తుచేశారు. ఈ రోజూ తన బిడ్డలపై ప్రమాణం చేసి అదే చెబుతున్నానని అన్నారు. ‘జగన్‌కు ఇదంతా తెలిసి కూడా నాకు క్యారెక్టర్‌ లేనట్లుగా, ప్రభా్‌సతో సంబంధం ఉన్నట్లుగా గత ఐదేళ్లుగా తన సైతాన్‌ సైన్యంతో ప్రచారం చేయించలేదా? సిగ్గుండాలి. ఆయనకా చెల్లెలుపై ప్రేమ ఉన్నది?’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కేసు పెట్టినప్పుడు నేను మాట్లాడిన వీడియో పనికొస్తుందంటే మీరు వాడేసుకుంటారు. చెల్లెల్ని వాడేసుకుంటారు. తల్లి మీద కేసు పెడతారు. నాన్న పేరును సీబీఐ చార్జిషీట్‌లో చేర్పిస్తారు. మీరు ఏమైనా చేయగలరు. మీకు మీరే సాటి సార్‌!’ అంటూ జగన్‌ను ఉద్దేశించి షర్మిల వ్యాఖ్యానించారు.
👉విద్యాసంస్థలకు హెచ్చరిక.. అలా చేస్తే రూ.15లక్షల ఫైన్!..
రూల్స్ అతిక్రమించే ప్రైవేటు విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ హెచ్చరించింది. స్టూడెంట్ కు ఒరిజినల్ ధ్రువపత్రాలు ఇవ్వకపోతే, అధిక ఫీజులు వసూలు చేస్తే రూ.15లక్షల ఫైన్ విధించడంతో పాటు గుర్తింపును రద్దు చేసే అధికారం కమిషన్ కుఉంటుందని గుర్తుచేసింది. ఏవైనా సమస్యలుంటే 8712627318, 08645 274445 కు ఫిర్యాదు చేయొచ్చని విద్యార్థులకు సూచించింది.
👉 రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవల్‌పమెంట్‌ కౌన్సిల్‌ (నరెడ్కో) ప్రతినిధులు అన్నారు. శుక్రవారం ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎ్‌ఫ)కి రూ.75 లక్షల చెక్‌ అందజేశారు. అంతకు ముందు రూ.25 లక్షలు అందజేయగా, మొత్తం రూ.కోటి విరాళం అందజేసినట్టయింది. ఈ సందర్భంగా నరెడ్కో ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రంలో లాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని ఉపసంహరించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.

7k network
Recent Posts

కాంగ్రెస్‌- సోరోస్‌ అంశంలో తనని అవమానించేలా బీజేపీ ఎంపీలు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి -లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ .. రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదాఏపీలో ఇక వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు: లోకేశ్…”రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదా..”పురుగుల మందు తాగుతూ మహిళ సెల్ఫీ”…జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు…నార్పలలో వీర జవాన్ వరికుంట్ల సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప..

చైనా.. ఉక్రెయిన్.. ఇజ్రాయెల్ యుద్ధాలలో నలిగిపోతున్న భారతీయులు.. విశాఖలో మహిళపై లైంగిక దాడి.. సీఎం ఆదేశాలతో సెంట్రల్ జైలుకు నిందితుడు.. ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి పునరావాస ప్యాకేజీని కొట్టేశారట! … మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం?.. వినయ్‌ వైఖరి వల్లే తమ కుటుంబంలో వివాదాలు: మంచు మనోజ్.. మోహన్ బాబు హేయమైన చర్యపై ఖండన.. విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ .. తహశీల్దార్ పై సస్పెన్షన్ వేటు (కడప)… రేపు, ఎల్లుండి కలెక్టర్ల సదస్సు… పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. కొనసాగుతున్న ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య యుద్ధం..జవాన్ మృతి పట్ల మంత్రి డోలా తీవ్ర దిగ్బ్రాంతి

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల విన్నూత నిరసన*…డబ్బు కోసం,ఆస్తి కోసం పోరాటం చేయటం లేదు- మంచు మనోజ్..పోలీసుల అదుపులో పవన్ ను బెదిరించిన వ్యక్తి… ఎవరీ మల్లికార్జునరావు?…వందలాది ఎకరాల ప్రభుత్వ అసైన్మెంట్ భూముల కొనుగోలుపై స్పందించిన హైకోర్టు…ధాన్యం కొనుగోలులో వ్యాపారులు దగా చేస్తే చట్ట ప్రకారం చర్యలు…డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…మత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు: డాక్టర్ కూచిపూడి.

నాగబాబుకు మంత్రి పదవి.. సీఎం చంద్రబాబు ప్రకటన…’పుష్ప’ని ఫుల్ గా వాడేస్తోన్న ఆప్ – బీజేపీ!…డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ పై డీజీపీకి ఫోన్‌ చేసి మాట్లాడిన హోంమంత్రి అనిత.. …కోటి లో పోలీసుల ఓవరాక్షన్, మహిళలపై అసభ్య ప్రవర్తన, తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన మహిళ..మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన జగన్….,

సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సూర్యాపేట జిల్లా హోం గార్డ్స్ ఆఫీసర్స్..విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేష‌న్ బియ్యం సీజ్‌……జర్నలిస్టులపై మోహన్ బాబు బౌన్సర్ల దాడి….. అల్లూరి జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే, కందుల ఎమ్మెల్యే ముత్తుముల..

రైతుల ఆందోళనలో హర్యానా “పోలీసుల డ్రామా..!! నోయిడా జైలులో రైతుల నిరాహార దీక్ష(డిల్లీ)…VEE RUN FOR TIRUPATI…రెండు రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం.. దర్యాప్తు సంస్థల అధికారులమంటూ బెదిరింపు* 15 లక్షలు దోచేసిన సైబర్‌ నేరగాళ్లు… జాతీయ రహదారిపై లారీ క్లీనర్ సజీవ దహనం…. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది?