అదాని వ్యవహారం లో నా పాత్ర ఉందని తేలితే నా కుటుంబం అంతా ఉరేసుకుంటాం-మాజీ మంత్రి బాలినేని.. ఉసూరుమనిపించిన మోడీ…ఎందుకలా ?.. 5ఎర్రచందనం దుంగలు స్వాధీనం (పించా డ్యాం)..షాద్ నగర్ ఫాంహౌస్ లో రాంగోపాల్ వర్మ..?..ప్రకాష్ రాజ్ కోసం రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు.. అండమాన్ తీరంలో ఇండియన్ కోస్ట్ గార్డ్స్ సిబ్బంది భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం..మలక్ పేట లో లా విద్యార్థిని అనుమానస్పద మృతి..మలక్ పేట పోలీసు స్టేషన్ ముందు గిరిజన సంఘాల ఆందోళన..నిమ్స్ లో చికిత్స పొందుతూ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి..మోకాళ్లపై దుర్గగుడి మెట్లు ఎక్కిన యువకుడిని పిలిపించుకున్న నారా లోకేశ్.. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహ రిసెప్షన్ లో పాల్గొన్న ఒంగోలు ఎంపీ మాగుంట .

👉అదాని వ్యవహారం లో నా పాత్ర ఉందని తేలితే నా కుటుంబం అంతా ఉరేసుకుంటాం అన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి..అదానీ వ్యవహారంలో నా పాత్ర ఒక్క శాతం ఉందని తేలినా నా కుటుంబమంతా ఉరేసుకుంటామన్న మంత్రి బాలినేని..ప్రజలను మోసం చేసి సంపాదించుకునే వ్యక్తిత్వం నాది కాదు.. అర్ధరాత్రి నాకు ఫోన్లు చేసి పత్రాలపై సంతకాలు పెట్టమన్నారు. అదానీ ఇష్యూ కి నాకు అసలు ఎలాంటి సంబంధం లేదన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.
👉 ఢిల్లీ లోని చాణక్యపురి లోని పాలిక సర్వీసెస్ ఆఫీసర్స్ ఇన్స్టిట్యూట్ లో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహ రిసెప్షన్ లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి
👉ఉసూరుమనిపించిన మోడీ…ఎందుకలా ? ఉక్కు మీద ప్రధాని ప్రకటన చేయాలని ఉక్కు కార్మికులు భారీ ప్రదర్శనను కూడా నగరంలో నిర్వహించారు. ప్రధాని గా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణం చేసిన తరువాత విశాఖ వస్తున్నారు అని అంతా సంతోషించారు. ప్రధాని హోదాలో మోడీ వస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అంతా ఆశగా ఎదురుచూశారు. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ప్రధానమంత్రి పూర్తి స్పష్టత ఇస్తారని కూడా భావించారు. అదే విధంగా విశాఖ సహా ఉత్తరాంధ్రకు కేంద్రం ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది అన్న దాని మీద కూడా నరేంద్ర మోడీ నోటి వెంట నుంచి మంచి మాటలు నాలుగు వినాలని కూడా ఆశించారు. అయితే నరేంద్ర మోడీ విశాఖ పర్యటనకు వాయుగండం అడ్డు పడిపోయింది. ఈ నెల 29న ప్రధాని విశాఖలో పర్యటించాల్సి ఉంది. రోడ్ షోతో పాటు విశాఖలో ఒక భారీ బహిరంగ సభకు కూడా అటెండ్ కావాల్సి ఉంది. అయితే మోడీ వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కచ్చితమైన ప్రకటన కోసం అంతా చూస్తున్నారు. ఉక్కు మీద ప్రధాని ప్రకటన చేయాలని ఉక్కు కార్మికులు భారీ ప్రదర్శనను కూడా నగరంలో నిర్వహించారు. విశాఖ వేదిక మీద నుంచి ప్రైవేటీకరణ ఉండదని ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే అనూహ్యంగా ప్రధాని మోడీ విశాఖ పర్యటన రద్దు అయింది. దానికి కారణం బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం. దీంతో ప్రధాని విశాఖ పర్యటన రద్దు చేస్తున్నట్లుగా పీఎంఓ వర్గాలు వెల్లడించాయి. దీంతో మళ్ళీ అంతా ఉసూరు మంటున్నారు. ఇదిలా ఉంటే నరేంద్ర మోడీ ప్రధాని హోదాలో విశాఖ వచ్చి రెండేళ్లు దాటింది. 2022 నవంబర్ నెలలోనే ఆయన విశాఖ వచ్చి బహిరంగ సభ నిర్వహించారు.ఆనాడు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఆనాడు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద ప్రధాని మాట్లాడుతారు అని అంతా అనుకున్నారు కానీ నిరాశే మిగిలింది.ఇక ఎన్నికల వేళలో ప్రధాని సభ విశాఖలో ఉంటుందని అనుకున్నా అనకాపల్లి లో బీజేపీ పోటీ చేయడంతో ఆ సభతోనే ముగించారు. నాడు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడుతారు అనుకుంటే అపుడూ ఆ విషయం రాలేదు. ఇపుడు విశాఖ నడిబొడ్డునే ప్రధాని నరేంద్ర మోడీ సభ ఉంటుంది కాబట్టి కన్ఫర్మ్ గా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం మీద ఏదో ఒక స్పష్టత వస్తుందని అనుకున్నారు. కానీ ఇది కూడా క్యాన్సిల్ కావడంతో మళ్ళీ మోడీ విశాఖకు ఎపుడు వస్తారు అని ఎదురు చూపులు తప్పడం లేదు అని అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి అయినా విశాఖ స్టీల్ ప్లాంట్ మీద విస్పష్టంగా ప్రకటన చేయాలని ఉక్కు కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఢిల్లీ నుంచే వర్చువల్ విధానంలో విశాఖలోని అనేక అభివృద్ధి ప్రాజెక్ట్కులకు ఈ నెల 29న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు అని అంటున్నారు. ఆ సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కీలక ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రధాని విశాఖ గురించి ఏమి చెబుతారో చూడాల్సి ఉంది.
👉*ఆర్ఎస్ఏఎస్టీఎఫ్* ( *RSASTF* )పించా డ్యామ్ సమీపంలో 5ఎర్రచందనం దుంగలు స్వాధీనం : ఒకరు అరెస్ట్
అన్నమయ్య జిల్లా రాజంపేట సెక్షన్ లోని పించా డ్యామ్ వద్ద ఐదు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు కార్యాచరణలో భాగంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ పర్యవేక్షణలో డీఎస్పీ జి. బాలిరెడ్డి మార్గనిర్దేశంలో రైల్వే కోడూరు సబ్ కంట్రోల్ ఆర్ఐ కృపానందకు చెందిన అర్ఎస్ఐ టి. రాఘవేంద్ర టీమ్ రాజంపేట సెక్షన్ లోని పించా డ్యాం వైపు కూంబింగ్ చేస్తుండగా ఆరోగ్యపురం సమీపంలోని చేయ్యేరు వద్ద కొందరు వ్యక్తులను గమనించి వారిని చుట్టు ముట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులను గమనించిన వారు పారిపోతుండగా ఒకరిని పట్టుకోగలిగారు. అతనిని అన్నమయ్య జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అక్కడి సమీపంలో దాచి ఉంచిన ఐదు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అతనిని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించగా ఎస్ ఐ సీహెచ్ రఫీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
👉షాద్ నగర్ ఫాంహౌస్ లో రాంగోపాల్ వర్మ..?*
*ప్రకాష్ రాజ్ కోసం రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు..*
*కమ్మదనం వద్ద ఓ ప్రముఖ నటుడి ఫామ్ హౌస్ లో ఉన్నట్టు బోగట్టా*
కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ పోలీసులు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ క్రమంలో.. గతంలో వ్యూహం సినిమా నేపథ్యంలో ఆయన చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఆయన సతీమణిపై వివాదాస్పదంగా పోస్టులు పెట్టిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలులో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒంగోలు నుంచి పోలీసులు ఇదివరకే హైదరాబాద్ కు చేరుకున్నారు. దీంతో రాంగోపాల్ వర్మ (ఆర్జీవీ) ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకోగా తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ చివర్లని కమ్మదనం గ్రామ పరిధిలో ఉన్న ఓ ప్రముఖ నటుడు ఫామ్ హౌస్ లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ కు చెందిన పోలీసులు కమ్మదనం లోని ప్రముఖ నటుడి ఫామ్ హౌస్ వద్ద నిఘా పెట్టారని తెలుస్తుంది. గతంలోనే తమ ముందు హజరు కావాలని ఒంగోలు పోలీసులు.. ఆర్జీవీ ఇంటికి వెళ్లి మరీ నోటీసులు జారీ చేశారు. కానీ ఆర్జీవీ మాత్రం.. తాను సినిమాల వల్ల బిజీగా ఉన్నానని, విచారణకు మరింత సమయం కావాలని తన లాయర్ తో పోలీసులకు రిక్వెస్ట్ లెటర్ ను పంపించారు. మరోవైపు రామ్ గోపాల్ వర్మ.. ఈ కేసులో అరెస్టు నుంచి తనకు స్టే ఇవ్వాలని కూడా ఏపీ హైకొర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది. ఈ క్రమంలో నాలుగు రోజులు కావడంతో మళ్లీ…తాజాగా.. ఒంగోలు పోలీసులు మళ్లీ హైదరాబాద్ కు రావడం మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు షాద్ నగర్ ప్రాంతంలోని ఫామ్ హౌస్ లో ఆయన తలదాచుకున్నట్లు తెలియడంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్కడికి వచ్చారని మీడియా ప్రతినిధులు సైతం సంఘటన స్థలానికి చేరుకుని ఆరాధిస్తున్నారు. ఇప్పటికే ఇంకా సమయం కావాలని మరోసారి లాయర్ పోలీసులు రిక్వెస్ట్ లెటర్ అందించారని, అయిన కూడా పోలీసులు రావడం మాత్రం వార్తలలో నిలిచిందని సినీ రాజకీయ వర్గాలు అంటున్నారు. అయితే.. ఆర్జీవీ ఇంట్లో లేడని అక్కడి వాళ్లు చెప్పినట్లు సమాచారం. కానీ పోలీసులు మాత్రం పలు కొన్ని బృందాలుగా విడిపోయి.. కొంత మంది ఆర్జీవి ఇంటి దగ్గర, మరికొందరు అసలు ఆర్జీవీ ఎక్కడున్నారని కూడా విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని రాంగోపాల్ వర్మ కమ్మదనం ఫామ్ హౌస్ వద్ద తలదాచుకున్నట్లు తెలియడంతో పలువురు పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టు తెలుస్తుంది. కొంత మంది మాత్రం ఆర్జీవి తన పరిచయస్తుల, ఫామ్ హౌస్ లో ఉన్నారని కూడా అంటున్నారు. దీంతో పోలీసులు ఆర్జీవిని అరెస్ట్ చేస్తారని వాదనలు గట్టిగా విన్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జీవీ తరపు లాయర్ మాత్రం.. తాము ఆన్ లైన్ లో.. వీడియో మాధ్యమంలో విచారణకు హజరు అయ్యేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పినట్లు తెలుస్తొంది. కానీ ప్రస్తుతం మాత్రం ఆర్జీవీ అరెస్ట్ కు పోలీసులు అన్ని విధాలుగా రంగం సిద్దం చేసుకుని వచ్చారని కూడా వార్తలు విన్పిస్తున్నాయి. ప్రస్తుతం షాద్ నగర్ ఇలాకాలో ప్రముఖ నటుడి వ్యవసాయ క్షేత్రంలో తలదాచుకున్న వార్తల నేపథ్యంలో పోలీసులు ఇక్కడికి విచారణ నిమిత్తం వచ్చినట్లు తెలుస్తోంది..
👉అండమాన్ తీరంలో ఇండియన్ కోస్ట్ గార్డ్స్ సిబ్బంది భారీగా మాదకద్రవ్యాలను పట్టుకున్నారు..*ఫిషింగ్ బోటు నుంచి 5 టన్నుల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.*
*ఇండియన్ కోస్ట్ గార్డ్ చరిత్రలోనే ఇంత భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు పట్టుబడటం ఇదే తొలిసారి అని సమాచారం.*
ఇటీవల కాలంలో స్మగ్లింగ్పై మాదక ద్రవ్యాల నిరోధక విభాగాలు తీవ్ర స్థాయిలో దాడులు చేస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం గుజరాత్ వద్ద భారత ప్రాదేశిక జలాల్లో దాదాపు 700 కిలోల మెదు స్వాధీనం చేసుకొన్నారు. ఈ సందర్భంగా ఇరాన్కు చెందిన 8 మందిని అరెస్టు చేశారు. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఆధారంగా సాగర్ మథన్-1 ఆపరేషన్ లో భాగంగా వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాదే సముద్ర మార్గంలో తరలిస్తున్న 3,500 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుని ఇరాన్కు చెందిన 11 మంది, పాకకు చెందిన 14 మందిని అరెస్టు చేసి మూడు కేసులు నమోదు చేశారు.
👉 మలక్ పేట లో లా విద్యార్థిని అనుమానస్పద మృతి..మలక్ పేట పోలీసు స్టేషన్ ముందు గిరిజన సంఘాల ఆందోళన.
హైదరాబాద్: మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మూసారం బాగ్ ఆఫీస్ లో పనిచేస్తున్న గిరిజన యువతి, లా విద్యార్థిని ఇస్లావత్ శ్రావ్య(20) అనుమాన స్పద స్థితిలో ఆఫీస్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య .
హత్య చేసి ఆత్మహత్య గా చిత్రీకరించారంటూ పీఎస్ ముందు గిరిజన సంఘాల నేతలు,కుటుంబ సభ్యుల ఆందోళన.
👉కరాటే పోటీలో మెడల్స్ సాధించిన విద్యార్థులకు సీఐ శివగంగాధర్ రెడ్డి సార్ అభినందన..
తాడిపత్రి మండలం సచివాలయం దగ్గర ఉన్న మార్షల్ ఆర్ట్స్ జపాన్ షిటోరియో కరాటే ట్రైనింగ్ స్కూల్ విద్యార్థులు నవంబర్ 10 ఆదివారం మంగళగిరిలో నేషనల్ కరాటే °ఛాంపియన్షిప్ తాడపత్రి కరాటే విద్యార్థులు 20 మంది పాల్గొని మెడల్స్ సర్టిఫికెట్స్ గెలుపొందిన వారికి రూరల్ పోలీస్ స్టేషన్ లో సిఐ శివగంగాధర్ రెడ్డి గెలుపొందిన విద్యార్థులందరికీ మెడల్స్ సర్టిఫికెట్స్ అందజేసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరాటే మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ రకాల స్కూల్ విద్యార్థులు నేర్చుకుంటూ డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ కరాటే పోటీలలో పాల్గొని అండర్ 14 విభాగంలో కటాస్. కుమిటి ( ఫైటింగ్) గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ సాధించారని తాడపత్రి నుంచి 20 మంది విద్యార్థులను మంగళగిరి కి నేషనల్ టోర్నమెంట్ కి తీసుకొని వెళ్లి విద్యార్థులను క టాస్ ఫైటింగ్ విభాగంలో వారిని ఆడించి మరియు తిరిగి తాడపత్రి పట్టణానికి వచ్చి చేరుకున్నందుకు కోచ్ శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థులు మరిన్ని పోటీలలో పాల్గొని ఇంకా ఎన్నో మెడల్స్ గెలుపొందాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సపోర్ట్ చేసిన అందరినీ అభినందించారు
👉 నిమ్స్ లో చికిత్స పొందుతూ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి..వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో నిమ్స్ లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ సోమవారం మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అక్టోబర్ 30న ఫుడ్ పాయిజన్ అవ్వడంతో కలుషితాహారం తిని దాదాపుగా 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఆరుగురు విద్యార్థినులు నిమ్స్ లో చికిత్స పొందగా ఐదుగురు కోలుకున్నారు. కాగా వైద్యులు తీవ్రంగా శ్రమించినా విద్యార్థినికి ప్రాణాలు దక్కలేదు.
👉 మోకాళ్లపై దుర్గగుడి మెట్లు ఎక్కిన యువకుడిని పిలిపించుకున్న నారా లోకేశ్..మంత్రిని కలిసేందుకు మోకాళ్లపై దుర్గగుడి మెట్లెక్కిన యర్రంశెట్టి సాయికృష్ణ
ఉండవల్లిలోని నివాసానికి పిలిపించుకొని మాట్లాడిన మంత్రి..
వైసీపీ పాలనలో తీవ్ర వేధింపులు ఎదుర్కొన్న యువకుడు
వైసీపీ రాక్షస పాలనలో తీవ్ర వేధింపులు ఎదుర్కొన్న కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం చౌడవరానికి చెందిన యర్రంశెట్టి సాయికృష్ణను మంత్రి నారా లోకేశ్ పిలిపించి అతనితో మాట్లాడారు. ఈ నెల 8వ తేదీన మంత్రి లోకేశ్‌ను కలిసేలా అనుగ్రహించాలంటూ సాయికృష్ణ మోకాలిపై దుర్గగుడి మెట్లెక్కాడు.
తన ఆకాంక్షను సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా తెలియజేశాడు. దీంతో మంత్రి తక్షణమే స్పందించారు. నేడు ఉండవల్లిలోని నివాసానికి సాయికృష్ణను పిలిపించి అతని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
వైసీపీ పాలనలో నాటి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ దమనకాండపై ప్లకార్డుల ద్వారా శాంతియుతంగా నిరసన గళం వినిపించాడు. ప్రజాసమస్యలపై కరపత్రాలు పంచాడు. దీంతో వైసీపీ ప్రభుత్వం అతడి ఇంటికి విద్యుత్ సరఫరాను నిలిపివేసి తీవ్రంగా వేధించింది. సాయికృష్ణ ఉద్యోగం కూడా కోల్పోవాల్సి వచ్చింది. ప్రజా ప్రభుత్వం కొలువుదీరడంతో అతని కోరిక నెరవేరింది. సాయికృష్ణ పోరాటాన్ని మంత్రి అభినందించారు.

7k network
Recent Posts

కాంగ్రెస్‌- సోరోస్‌ అంశంలో తనని అవమానించేలా బీజేపీ ఎంపీలు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి -లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ .. రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదాఏపీలో ఇక వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు: లోకేశ్…”రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదా..”పురుగుల మందు తాగుతూ మహిళ సెల్ఫీ”…జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు…నార్పలలో వీర జవాన్ వరికుంట్ల సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప..

చైనా.. ఉక్రెయిన్.. ఇజ్రాయెల్ యుద్ధాలలో నలిగిపోతున్న భారతీయులు.. విశాఖలో మహిళపై లైంగిక దాడి.. సీఎం ఆదేశాలతో సెంట్రల్ జైలుకు నిందితుడు.. ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి పునరావాస ప్యాకేజీని కొట్టేశారట! … మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం?.. వినయ్‌ వైఖరి వల్లే తమ కుటుంబంలో వివాదాలు: మంచు మనోజ్.. మోహన్ బాబు హేయమైన చర్యపై ఖండన.. విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ .. తహశీల్దార్ పై సస్పెన్షన్ వేటు (కడప)… రేపు, ఎల్లుండి కలెక్టర్ల సదస్సు… పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. కొనసాగుతున్న ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య యుద్ధం..జవాన్ మృతి పట్ల మంత్రి డోలా తీవ్ర దిగ్బ్రాంతి

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల విన్నూత నిరసన*…డబ్బు కోసం,ఆస్తి కోసం పోరాటం చేయటం లేదు- మంచు మనోజ్..పోలీసుల అదుపులో పవన్ ను బెదిరించిన వ్యక్తి… ఎవరీ మల్లికార్జునరావు?…వందలాది ఎకరాల ప్రభుత్వ అసైన్మెంట్ భూముల కొనుగోలుపై స్పందించిన హైకోర్టు…ధాన్యం కొనుగోలులో వ్యాపారులు దగా చేస్తే చట్ట ప్రకారం చర్యలు…డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…మత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు: డాక్టర్ కూచిపూడి.

నాగబాబుకు మంత్రి పదవి.. సీఎం చంద్రబాబు ప్రకటన…’పుష్ప’ని ఫుల్ గా వాడేస్తోన్న ఆప్ – బీజేపీ!…డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ పై డీజీపీకి ఫోన్‌ చేసి మాట్లాడిన హోంమంత్రి అనిత.. …కోటి లో పోలీసుల ఓవరాక్షన్, మహిళలపై అసభ్య ప్రవర్తన, తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన మహిళ..మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన జగన్….,

సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సూర్యాపేట జిల్లా హోం గార్డ్స్ ఆఫీసర్స్..విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేష‌న్ బియ్యం సీజ్‌……జర్నలిస్టులపై మోహన్ బాబు బౌన్సర్ల దాడి….. అల్లూరి జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే, కందుల ఎమ్మెల్యే ముత్తుముల..

రైతుల ఆందోళనలో హర్యానా “పోలీసుల డ్రామా..!! నోయిడా జైలులో రైతుల నిరాహార దీక్ష(డిల్లీ)…VEE RUN FOR TIRUPATI…రెండు రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం.. దర్యాప్తు సంస్థల అధికారులమంటూ బెదిరింపు* 15 లక్షలు దోచేసిన సైబర్‌ నేరగాళ్లు… జాతీయ రహదారిపై లారీ క్లీనర్ సజీవ దహనం…. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది?