రాజ్యాంగాన్ని కాపాడాలని షర్మిల పాదయాత్ర-బిజెపి విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన షర్మిల .. జగన్ కు అదానీ లంచం వ్యవహారంపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన సెంటర్ ఫర్ లిబర్టీ..పోలీస్ అధికారులు, సిబ్బంది రాజ్యాంగబద్ధంగా నడవాలని ప్రతిజ్ఞ (వైజాగ్ ).. ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరైన విజయపాల్.. పట్టపగలే శ్రీవారి హుండీలో దొంగతనం.. తెలంగాణలో 55 వేల ఎకరాల వక్ఫ్ భూముల కబ్జా!

👉 అదానీ – జగన్ వ్యవహారంలో కీలక పరిణామం! అమెరికా దర్యాప్తు సంస్థల ఆరోపణలు, అభియోగాలపై ఎవరి స్థాయిలో వారి వారి భావానువాదాలతో ఈ విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జగన్ కు అదానీ సంస్థ రూ.1,750 కోట్ల లంచం ఆరోపణల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అమెరికా దర్యాప్తు సంస్థల ఆరోపణలు, అభియోగాలపై ఎవరి స్థాయిలో వారి వారి భావానువాదాలతో ఈ విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. అయితే… తాము ఒప్పందం చేసుకున్నది ‘సెకీ’తో అని.. పైగా గతంలో చంద్రబాబు సర్కార్ కొనుగోలు చేసిన ధరకంటే తక్కువకే కొనుగోలు ఒప్పందం చేసుకున్నామని.. సగం సగం తెలుసుకుని హాఫ్ నాలెడ్జ్ ఆరోపణలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ విషయంలో రాష్ట్రానికి మేలు జరిగిందని చెబుతున్నారు. మరోపక్క దీనిపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని.. మరోపక్క అదానీపై ఇన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఆయనతో అంటకాగకుండా.. వెంటనే అదానీ సంస్థలను ఏపీలో బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందంటూ ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల.. సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఇక.. ఈ వ్యవహారంలో తనకు ఏమీ సంబంధం లేదంటూ గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన, ప్రస్తుత జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నారు. అదంతా అసత్యమని వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు! ఈ నేపథ్యంలో ఈ వ్యవహారానికి సంబంధించి ఓ కీలక పరిణాం చోటు చేసుకోంది.
అవును… అదానీ – జగన్.. సెకీతో విద్యుత్ ఒప్పందం – రూ.1,750 కోట్ల లంచం అనే వ్యవహారంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా… ఈ వ్యవహారంపై ఏసీబీకి ఫిర్యాదు అందింది. సెంటర్ ఫర్ లిబర్టీ అనే సంస్థ వ్యవస్థాపకుడు నల్లమోతు చక్రవర్తి అనే వ్యక్తి తాజాగా ఏసీబీకి ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.! జగన్ కు అదానీ సంస్థ రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీ విచారణలో తేలిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్న నల్లమోతు చక్రవర్తి … సెకీతో అదానీ కంపెనీ ఒప్పందపైనా విచారణ జరిపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు! మరోపక్క ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వ స్ట్రాంగ్ గా రియాక్ట్ అవ్వాలని.. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని.. వీలైనంత తొందర్లో ఈ వ్యవహారానికి సంబంధించిన వాస్తవాలు ప్రజలకు చెప్పాలని.. అలాకానిపక్షంలో కాంగ్రెస్ చేస్తొన్న “మోదానీ” ఆరోపణలు నిజమని నమ్మే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు!
👉 పట్టపగలే శ్రీవారి హుండీలో దొంగతనం..
స్టీల్ హుండీలో కొంత నగదు చోరీ..😱😱😱
సీసీ కెమెరాల్లో గుర్తించి దొంగను అదుపులోకి తీసుకున్న సిబ్బంది..
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
తిరుమలలో అనూహ్య ఘటన జరిగింది. భక్తుల కోర్కెలు తీర్చే వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీలో దొంగతనం జరిగింది. నవంబర్ 23న శ్రీవారి ఆలయంలోని స్టీల్ హుండీలోని కొంత నగదును దొంగిలించాడు. పట్టపగలు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కొంత నగదును చోరీచేసి అక్కడి నుంచి పరారయ్యాడు. చోరీకి సంబంధించిన దృశ్యాలు దగ్గరలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది ఫుటేజీలను పరిశీలించి దొంగతనానికి పాల్పడిన యువకుడిని గుర్తించారు.
యువకుడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు అదే రోజు అరెస్ట్ చేశారు. భద్రతా సిబ్బంది తమ ఆఫీస్‌లో అతనిని విచారించగా, నేరాన్ని అంగీకరించాడు. ఆ దొంగ నుంచి రూ.15 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్టు భద్రతా సిబ్బంది తెలిపారు. చోరీకి పాల్పడిన యువకుడి పేరు వేణు లింగం అని పోలీసులు వెల్లడించారు. తమిళనాడులోని శంకరన్ కోవిల్‌కు చెందినవాడని వివరించారు. అనంతరం టీటీడీ అధికారులు అతడిని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనానికి సంబంధించిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
👉 ఆంధ్ర రత్న భవన్ నుంచి అంబేద్కర్ స్మృతి వనం వరకు ఏపీ సి సి చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి పాదయాత్ర.. ..భారత రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని విజయవాడలో
రాజ్యాంగాన్ని కాపాడాలని పాదయాత్ర..యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు..

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని,140 కోట్ల జనాభాకు ప్రజాస్వామ్యం అందించిందని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం మన రాజ్యాంగం ప్రాథమిక హక్కులు, లౌకిక వాదం మనకు రాజ్యాంగం నుంచి కల్పించ బడ్డాయి .. మన రాజ్యాంగం ఎన్నో దేశాలకు ఆదర్శం అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎంతో ఉంది..రాజ్యాంగానికి ప్రమాదం రాకుండా కాంగ్రెస్ పోరాడుతూనే ఉంది..కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు రాజ్యాంగాన్ని నెత్తిన మోసింది..పౌరుల కోసం ఎన్నో హక్కులు కాంగ్రెస్ ప్రభుత్వం అనాడు కల్పించింది..కాంగ్రెస్ హయంలో ప్రాథమిక హక్కులు కాపాడ బడ్డాయి..అన్ని మతాలను గౌరవించడంలో కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం ఆదర్శం..మా నాయకుడు రాహుల్ గాంధీ ఇవ్వాళ రాజ్యాంగం పుస్తకాన్ని చేత పట్టాడు ..కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేశాడు.. బీజేపీ భారత రాజ్యాంగానికి విలువ ఇవ్వడం లేదు..ఇప్పుడు దేశంలో బీజేపీ రాజ్యాంగం నడుస్తుంది..బీజేపీ పాలనలో ప్రాథమిక హక్కులను విలువ లేదు..బీజేపీ కి వ్యతిరేకంగా మాట్లాడితే గొంతు నొక్కుతున్నారు..బీజేపీ నీ విమర్శిస్తే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
* ఈ దేశంలో స్వేచ్ఛా లేదు..మీడియా గొంతు కూడా నొక్కుతున్నారు..ఎన్నికల కమిషన్ నీ కూడా గుప్పిట్లో పెట్టుకున్నారు..దేశాన్ని కార్పొరేట్ల కు కట్టబెట్టారు..మొత్తం పవర్ మోడీ చేతుల్లో ఉంది..ఈ దేశం అన్ని రాష్ట్రాల సమూహం..
👉బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో భయబ్రాంతులకు గురి చేస్తున్నారు..పూర్తిగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు..బీజేపీ కి భారత రాజ్యాంగం అంటే గౌరవం లేదు..అన్ని మతాలూ గౌరవించాలి అనేది రాజ్యాంగం చెప్తుంది..కానీ బీజేపీ రాజ్యాంగం మాత్రం మతాల మధ్య చిచ్చు పెట్టాలని చెప్తుంది..మతాల మధ్య బీజేపీ మంటలు పెడుతుంది..మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో ఊచకోత కోస్తున్నారు..ఈ దేశ సంపద కొంత మంది చేతుల్లోనే పెట్టారు..అదానీ లాంటి సామాన్యుడిని ఆకాశానికి ఎత్తారు..
*దేశ సంపద మొత్తం అదానీ కి దోచి పెట్టారు..
*ఈ దేశంలో సామాజిక న్యాయం లేదు..ఎస్సి ఎస్టి మైనారిటీలను మనుషులుగా చూడటం లేదు..ఓట్లు వేసే యంత్రాలు గా చూస్తున్నారు..
*ఈ దేశంలో అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరగాలి అంటే కులగణన జరగాలి..ఏ వర్గం ఎంత మంది ఉన్నారో తెలియాలి..అప్పుడు ఈ దేశ సంపద వెనుక బడిన వర్గాల వారికి పంచొచ్చు..దేశం మొత్తం కుల గణన జరగాలి
అప్పుడే అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుంది..
**ఈ రాష్ట్రంలో వైసిపి రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు..గెలిచిన ఎంఎల్ఏ అసెంబ్లీకి వెళ్ళాలి అనేది రాజ్యాంగం చెప్తుంది..కానీ వీళ్లు మాత్రం అసెంబ్లీకి పోలేదు..అసెంబ్లీ కి పోనీ వాళ్ళు రాజ్యాంగం ప్రకారం రాజీనామాలు చేయండి..విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఎటువంటి దర్యాప్తు లేదు..
* అదానీ నీ బీజేపీ కాపాడుతుంది..జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందన్నారు.
ఇక్కడ చంద్రబాబులో కూడా ఎటువంటి యాక్షన్ లేదు.. 1750 కోట్లు లంచం తీసుకుంటే కనీసం విచారణ లేదు..
👉అందరు అదానీ కి,మోడీకి బయపడుతున్నారు
అన్ని సాక్ష్యాలు ఉన్నాయని, అమెరికా FBI చెప్పినా దర్యాప్తు చేయడం లేదు..చంద్రబాబు ను ఏమనుకోవాలి ?చంద్రబాబు ను డిమాండ్ చేస్తున్నాం..వెంటనే విచారణ కమిటీ వేయండి అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
👉ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరైన విజయపాల్… అరెస్ట్ చేసే అవకాశం*
రఘురామను కస్టడీలో చిత్రహింసలు పెట్టినట్టు విజయపాల్ పై ఆరోపణలు.. ఇప్పటికే పలు దఫాలుగా విచారించిన పోలీసులు..ముందస్తు బెయిల్ అభ్యర్థనకు సుప్రీంకోర్టులో చుక్కెదురు..ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఐడీ మాజీ ఏఎస్పీ విజయపాల్ నేడు ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. గతంలో మాదిరిగానే ఆయన విచారణకు సహకరించడంలేదని… తెలియదు, గుర్తులేదు అంటూ పొంతన లేని సమాధానాలు ఇచ్చారని తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయన కోర్టుల ద్వారా అరెస్ట్ నుంచి రక్షణ పొందుతూ వచ్చారు. అయితే, ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై విజయపాల్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అత్యున్నత న్యాయస్థానంలోనే ఆయనకు చుక్కెదురు కావడంతో, అరెస్ట్ తథ్యమని తెలుస్తోంది. ఈ సాయంత్రం విజయపాల్ ను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
👉జగన్ కు అదానీ లంచం వ్యవహారంపై ఏసీబీకి ఫిర్యాదు.. ముడుపుల వ్యవహారంపై అమెరికా కోర్టులో కేసు నమోదు.. ఒప్పందాలపై విచారణ జరపాలని ఏసీబీకి ఫిర్యాదు చేసిన చక్రవర్తి.. జగన్ కు రూ. 1,750 కోట్ల లంచం ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్న వైనం..వైసీపీ ప్రభుత్వ హయాంలో సోలార్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు అదానీ నుంచి ముడుపులు అందాయనే విషయం ఏపీలో కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై అమెరికా కోర్టులో కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో సెకీతో ఒప్పందంపై విచారణ జరపాలని కోరుతూ సెంటర్ ఫర్ లిబర్టీ సంస్థ వ్యవస్థాపకుడు నలమోతు చక్రవర్తి ఏపీ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. జగన్ కు రూ. 1,750 కోట్ల లంచం ఇచ్చినట్టు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ జరిపి వాస్తవాలను వెలికి తీయాలని కోరారు.
👉భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత రాజ్యాంగ నిర్మాత మరియు భారత రత్న డా.బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు .
నగర పోలీసు కమిషనర్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రస్తావన చేస్తూ భారత రాజ్యాంగాన్ని 26, నవంబర్ 1949 న రాజ్య సభ ఆమోదం తెలపడం జరిగిందని, తదుపరి 26 జనవరి, 1950 నుండి అమలులోకి వచ్చిందని తెలిపి, పోలీస్ అధికారులు, సిబ్బంది రాజ్యాంగబద్ధంగా నడవాలని ప్రతిజ్ఞ చేపించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, విధులు, చట్టాలే ప్రజలకు రక్షణ అని పేర్కొన్నారు.రాజ్యాంగ స్ఫూర్తిని అందరూ గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో ఎదురయ్య సవాళ్లను ఊహించి రాజ్యాంగం రచించారు. రాజ్యాంగానికి లోబడి ప్రతి ఒక్కరూ పనిచేస్తూ దేశాభివృద్దిలో పాలుపంచుకోవాలి. రాజ్యాంగ పరిరక్షణలో పోలీస్ శాఖ పాత్ర ముఖ్యమైనది.పోలీసులు సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, పౌరుల ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణలో బాధ్యతాయుతమైన సేవలు అందించాలని కోరారు.
👉తెలంగాణలో 55 వేల ఎకరాల వక్ఫ్ భూముల కబ్జా!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 55వేల ఎకరాల వక్ఫ్ భూములు ఆక్రమణల పాలయ్యాయి. రెవెన్యూ రికార్డులు, మ్యుటేషన్, గెజిట్ నోటిఫికేషన్ల జారీలో జాప్యం వల్ల కోట్లాది రూపాయల విలువ చేసే వక్ఫ్ భూములను(telangana wakf board) కొందరు అక్రమార్కులు కబ్జా(Encroachments) చేశారు. * నిజాం నవాబు కాలం నుంచి వచ్చిన వక్ఫ్ భూముల్లో(Waqf lands) 75 శాతం కబ్జాల పాలయ్యాయి. వేల కోట్ల రూపాయల విలువచేసే 55వేల ఎకరాల వక్ఫ్ భూములు ఆక్రమణల పాలైన వీటిపై తెలంగాణ వక్ఫ్ బోర్డు కేసులు వేసింది.
* 3,500 కు పైగా వేసిన కబ్జాల కేసులు కోర్టుల్లో విచారణలోనే ఉన్నాయి. నిజామాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి సంగారెడ్డి జిల్లాల్లో వేలాది ఎకరాల భూములు కబ్జా దారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి.
*కబ్జాదారుల కబంధ హస్తాల్లో వక్ఫ్ భూములు*
తెలంగాణ వక్ఫ్ బోర్డు పరిధిలో మొత్తం 77వేల ఎకరాల భూములుండగా, ఇందులో 75 శాతం భూములు కొందరు బడా వ్యక్తులు, కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి. కేవలం 22వేల ఎకరాల భూములు ఎలాంటి వివాదాలు లేకుండా వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్నాయి. కొందరు ముతవల్లీలు వక్ఫ్ భూములను అన్యాక్రాంతం చేశారు. వక్ఫ్ బోర్డు అధికారుల అవినీతి వల్ల భూములు కబ్జాల పాలయ్యాయి.వక్ఫ్ కబ్జాల పాలైన భూములను కాపాడేందుకు తాము న్యాయపోరాటం చేస్తున్నామని తెలంగాణ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ బియాబానీ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
*శంషాబాద్ విమానాశ్రయం నిర్మాణం కోసం…*
పహాడిషరీఫ్ సమీపంలోని 2వేల ఎకరాల వక్ఫ్ భూమిని ఉమ్మడి ఏపీ సర్కారు శంషాబాద్ విమానాశ్రయం నిర్మాణం కోసం కేటాయించింది. పహాడిషరీఫ్ లో వక్ఫ్ బోర్డు పరిధిలో కేవలం వంద ఎకరాల భూమి మాత్రమే మిగిలింది. వక్ఫ్ బోర్డుకు చెందిన 1700 ఎకరాల భూమి అటవీ శాఖ ఆధీనంలో ఉంది. దీంతో అటవీశాఖతో వక్ఫ్ బోర్డు న్యాయపోరాటం చేస్తుంది.మెదక్ జిల్లాలో 530 ఎకరాలు, మల్కాజిగిరి మండలంలో 350 ఎకరాలు, రాజేంద్రనగర్ లో 350 ఎకరాలు, మణికొండలో 108 ఎకరాలు, మాదాపూర్ గుట్టల బేగంపేటలో 90 ఎకరాలు, చేవేళ్ల మండలంలో 1200 ఎకరాల వక్ఫ్ భూములున్నాయి.
వక్ఫ్ భూములపై సర్వే జరిగినా రెవెన్యూ శాఖ వారి రికార్డుల్లో ముటేషన్ చేయక పోవడం వల్ల వేలాది ఎకరాల భూములు కబ్జాదారుల చేతుల్లో చిక్కాయి. వక్ఫ్ భూములపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినా దాన్ని ప్రచురించడంలో తాత్సారం, రెవెన్యూశాఖ అధికారుల ఉదాశీనత వల్ల వక్ఫ్ భూములు కబ్జాల పాలయ్యాయని ఇస్లామిక్ కాలమిస్ట్ ముహ్మద్ ముజాహిద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. వక్ఫ్ భూములను ముటేషన్ చేయాలని కోరుతూ వక్ఫ్ బోర్డు కలెక్టర్లకు లేఖలు రాసినా దాన్ని పట్టించుకోలేదు.
మణికొండలో 1950 ఎకరాల వక్ఫ్ భూములను రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయక పోవడం వల్ల ప్రభుత్వం మల్టీనేషనల్ కంపెనీలకు వేలం వేసి విక్రయించేందుకు ఏపీఐఐసీకి కేటాయించారు.ఉమ్మడి ఏపీ సర్కారు 1961వ సంవత్సరంలో వక్ఫ్ సర్వే కమిషనరును నియమించింది. అయినా వక్ఫ్ భూములు కబ్జాల పాలయ్యాయి.వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో తెలంగాణ వక్ఫ్ బోర్డు ఆధీనంలోని మసీదులు, అష్రూఖానాలు, ఖబ్రస్థాన్లు, దర్గాల పరిధిలోని వక్ఫ్ భూముల పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. ఒక సారి వక్ఫ్ భూమి అని ప్రకటించాక ఎప్పటికీ వక్ఫ్ గానే ఉంటుందని, కానీ ఈ కొత్త బిల్లు వల్ల వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ ఎలా అనేది చర్చనీయాంశంగా మారింది.

7k network
Recent Posts

కాంగ్రెస్‌- సోరోస్‌ అంశంలో తనని అవమానించేలా బీజేపీ ఎంపీలు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి -లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ .. రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదాఏపీలో ఇక వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు: లోకేశ్…”రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదా..”పురుగుల మందు తాగుతూ మహిళ సెల్ఫీ”…జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు…నార్పలలో వీర జవాన్ వరికుంట్ల సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప..

చైనా.. ఉక్రెయిన్.. ఇజ్రాయెల్ యుద్ధాలలో నలిగిపోతున్న భారతీయులు.. విశాఖలో మహిళపై లైంగిక దాడి.. సీఎం ఆదేశాలతో సెంట్రల్ జైలుకు నిందితుడు.. ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి పునరావాస ప్యాకేజీని కొట్టేశారట! … మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం?.. వినయ్‌ వైఖరి వల్లే తమ కుటుంబంలో వివాదాలు: మంచు మనోజ్.. మోహన్ బాబు హేయమైన చర్యపై ఖండన.. విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ .. తహశీల్దార్ పై సస్పెన్షన్ వేటు (కడప)… రేపు, ఎల్లుండి కలెక్టర్ల సదస్సు… పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. కొనసాగుతున్న ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య యుద్ధం..జవాన్ మృతి పట్ల మంత్రి డోలా తీవ్ర దిగ్బ్రాంతి

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల విన్నూత నిరసన*…డబ్బు కోసం,ఆస్తి కోసం పోరాటం చేయటం లేదు- మంచు మనోజ్..పోలీసుల అదుపులో పవన్ ను బెదిరించిన వ్యక్తి… ఎవరీ మల్లికార్జునరావు?…వందలాది ఎకరాల ప్రభుత్వ అసైన్మెంట్ భూముల కొనుగోలుపై స్పందించిన హైకోర్టు…ధాన్యం కొనుగోలులో వ్యాపారులు దగా చేస్తే చట్ట ప్రకారం చర్యలు…డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…మత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు: డాక్టర్ కూచిపూడి.

నాగబాబుకు మంత్రి పదవి.. సీఎం చంద్రబాబు ప్రకటన…’పుష్ప’ని ఫుల్ గా వాడేస్తోన్న ఆప్ – బీజేపీ!…డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ పై డీజీపీకి ఫోన్‌ చేసి మాట్లాడిన హోంమంత్రి అనిత.. …కోటి లో పోలీసుల ఓవరాక్షన్, మహిళలపై అసభ్య ప్రవర్తన, తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన మహిళ..మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన జగన్….,

సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సూర్యాపేట జిల్లా హోం గార్డ్స్ ఆఫీసర్స్..విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేష‌న్ బియ్యం సీజ్‌……జర్నలిస్టులపై మోహన్ బాబు బౌన్సర్ల దాడి….. అల్లూరి జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే, కందుల ఎమ్మెల్యే ముత్తుముల..

రైతుల ఆందోళనలో హర్యానా “పోలీసుల డ్రామా..!! నోయిడా జైలులో రైతుల నిరాహార దీక్ష(డిల్లీ)…VEE RUN FOR TIRUPATI…రెండు రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం.. దర్యాప్తు సంస్థల అధికారులమంటూ బెదిరింపు* 15 లక్షలు దోచేసిన సైబర్‌ నేరగాళ్లు… జాతీయ రహదారిపై లారీ క్లీనర్ సజీవ దహనం…. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది?