బ్యాలెట్‌ పేపర్‌తో మరోసారి ఎన్నికలు నిర్వహించాలి – ఉద్ధవ్ ఠాక్రే.. ‘అదానికి లీజుకు ఆ స్థలం.. ఆర్టీసీ ఉద్యోగుల సంచలన లేఖ.. వారిని బ్లాక్ లిస్టులో పెట్టండి: సీఎం చంద్రబాబు..అదానీతో జగన్‌ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్‌ ఒప్పందాలన్నీ రద్దుచేయాలి – షర్మిల..భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లతో హోంమంత్రి అనిత టెలికాన్ఫరెన్స్* *శ్రీశైలం పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ.. మార్కాపురం, తురిమెళ్ళ లో డ్రగ్స్ పై అవగాహన.. ఘనంగా స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి 77 వ జయంతి..ప్రభుత్వ హాస్టల్‌లో విద్యార్థినితో నగ్న పూజ?.. ఢిల్లీలో టిడిపి నూతన కార్యాలయం ప్రారంభం.. ద్వారకా తిరుమల లో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు.. పంటల బీమా పై అవగాహన (కంభం)

👉 అదానికి లీజుకు ఆ స్థలం.. ఆర్టీసీ ఉద్యోగుల సంచలన లేఖ..
పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌కు ఆర్టీసీ స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ (APPTD) ప్రతినిధులు లేఖ రాశారు.
రామగిరిలో గతంలో ఉన్న విండ్ ఎనర్సి ప్రాజెక్టుకు సంబంధించిన సుమారు 300 ఎకరాల స్థలాన్ని అతి తక్కువ లీజుతో SECI (సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) పేరుతో అదానికి లీజుకు ఇచ్చారని చెప్పారు
ఈ ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. ఆర్థిక అవకతవకలు జరిగినట్లు వార్తా కథనాలు వచ్చాయని అన్నారు. ఈ స్థలాన్ని ఆర్టీసీ సంస్థ అంతర్గత నిధుల ద్వారాగాని, ఇతర ఆర్థిక సంస్థల సహకారంతోగాని అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు. రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్ బస్సుల అవసరాలు తీర్చుకోవచ్చని తెలిపారు. ఈ స్థలాన్ని రౌండ్ క్లాక్ సోర్స్‌గా రాత్రి వేళల్లో విండ్ ఎనర్జీని, పగటి వేళల్లో సోలార్ ఎనర్జీని 24గంటలు ఉత్పత్తి చేయవచ్చని చెప్పారు. ఈ స్థలాన్ని అభివృద్ధి చేసుకుని హైబ్రిడ్ ప్రాజెక్టుగా చేసుకోవచ్చని అన్నారు. భవిష్యత్తు అవసరాల రీత్యా SECI పేరుతో అదానీతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయించాలని కోరారు…విద్యుత్ ఒప్పందాల్లో ఆరోపణలు…
విద్యుత్ ఒప్పందాల్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ.. ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో వారిపై అమెరికాలోని న్యాయస్థానం అభియోగాలు నమోదు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది.
👉 వారిని బ్లాక్ లిస్టులో పెట్టండి: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ : ఆర్ అండ్ బీ శాఖపై సీఎం చంద్రబాబు నేడు సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. 1307 కిమీ పొడవైన 18 స్టేట్ హైవేలను పీపీపీ పద్దతిలో నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల్లో 13 వేల కిమీ అంతర్గత రోడ్లు నిర్మాణం చేపట్టాలని పూర్తి నాణ్యతతో మరమ్మతులు జరగాలని సీఎం సూచించారు. అయితే నాణ్యత లేకపోతే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
👉మహారాష్ట్ర ఎన్నికల్లో పరాజయం తర్వాత ఉద్ధవ్‌ ఠాక్రే శివసేన పార్టీ కొత్త డిమాండ్‌ తెరపైకి తెచ్చింది. తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాలు నిలిపివేసి బ్యాలెట్‌ పేపర్‌తో మరోసారి ఎన్నికలు నిర్వహించాలని కోరింది. ఈ డిమాండ్‌పై ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌రౌత్‌ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఈవీఎంలపై 450 ఫిర్యాదులు చేసినా పట్టించుకోకుండా పోలింగ్‌ కొనసాగించినందువల్లఆ ఎన్నికల ఫలితాలు నిలిపివేసి పేపర్‌ బ్యాలెట్‌తో మరోసారి నిర్వహించాలని కోరుతున్నామన్నారు. అప్పుడు తామే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎలక్షన్‌ కౌంటింగ్‌ రోజున మొదట లెక్కించిన బ్యాలెట్లలో తాము ఆధిక్యంలో ఉన్నా కూడా ఈవీఎంల కౌంటింగ్‌ మొదలైన తర్వాత పరిస్థితి మారి పోయిందని ఆరోపించారు. ఎన్నికల విజయాల్లో బీజేపీ ఓ వ్యూహం ప్రకారం వెళుతోందని, పెద్ద రాష్ట్రాల్లో ఆ పార్టీ గెలుస్తూ, చిన్న రాష్ట్రాలను మాత్రం ప్రతిపక్షాలకు ఇచ్చేస్తోందని రౌత్‌ ఆరోపించారు.
👉 అదానీతో జగన్‌ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్‌ ఒప్పందాలన్నీ రద్దుచేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. అదానీ నుంచి జగన్‌కు అందిన ముడుపులు, అర్ధరాత్రి అనుమతులపై దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు. అదానీతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల వల్ల రాష్ట్రంపై రూ.లక్షన్నర కోట్ల భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ సీఎంకు ఆమె సోమవారం బహిరంగ లేఖ రాశారు. ఈ ఒప్పందాల్లో గౌతమ్‌ అదానీ నుంచి జగన్‌ రూ.1,750 కోట్ల ముడుపులు అందుకున్నట్లుగా వచ్చిన ఆరోపణలపై సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో దర్యాప్తునకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. లంచాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని, ఆర్థికంగా నష్టాల్లోకి. కష్టాల్లోకి నెట్టేశారని ఆరోపించారు. అదానీ, జగన్‌ మధ్య జరిగిన వ్యాపార లావాదేవీలు మొత్తం రాష్ట్ర సహజ వనరులను దోచుకునే భారీ కుంభకోణంగా పీసీసీ భావిస్తోందన్నారు. సెకీ ద్వారా అదానీతో గత ప్రభుత్వం 25 ఏళ్లకు చేసుకున్న ఒప్పందం రాష్ట్రానికి భారమన్నారు. అదానీతో ఒప్పందాల రద్దుతో పాటు ఆ కంపెనీని తక్షణమే బ్లాక్‌లిస్టులో పెట్టాలని డిమాండ్‌ చేశారు. గంగవరం పోర్టు అమ్మకంపైనా విచారణ చేపట్టాలన్నారు. జగన్‌ ముడుపులపై దర్యాప్తు చేయిస్తారా లేదంటే అదానీతో అంటకాగుతారా అని చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు.
👉 *ఏపీలో భవనాలు, లేఅవుట్ల అనుమతులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం*అమరావతి :
ఏపీలో భవనాలు, లేఅవుట్ల అనుమతులు సులభతరం చేస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.టౌన్ ప్లానింగ్ విభాగంలో సంస్కరణలపై కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను సీఎం చంద్రబాబు ఆమోదించారు. ఈమేరకు 15 మీటర్ల ఎత్తు వరకూ భవన నిర్మాణాల
ప్లాన్లకు మున్సిపల్ శాఖ అనుమతి అవసరం లేదని మంత్రి నారాయణ తెలిపారు. దీనివల్ల 95శాతం మంది మున్సిపల్ ఆఫీస్ల చుట్టూ తిరిగే అవసరం ఉండదని తెలిపారు.
👉ఈ రోజు ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరియు ఇతర పార్లమెంట్ సభ్యులు.
👉 స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి 77 వ జయంతి సందర్భంగా రాంనగర్ 2 వ లైను లోని మాగుంట కార్యాలయంలో స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి చిత్ర పటానికి పుష్పమాలంకరణ మరియు అభిలాష్ హోటల్ సెంటర్, రైల్వే స్టేషన్ రోడ్డులోని పాత స్టేట్ బ్యాంక్ మరియు అద్దంకి బస్సు స్టాండు సెంటరులోని స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.కార్యక్రమంలో స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి మనుమడు,మాగుంట సుబ్బరామ్ బాబు, అయినాబత్తిన ఘనశ్యాం,తాతా ప్రసాద్,బెల్లం సత్యనారాయణ,కుప్పా రంగనాయకులు, ఆత్మకూరి బ్రహ్మయ్య, పసుపులేటి శ్రీను,కొర్రపాటి శ్రీనివాస రావు, రాజ్ విమల్,VC రెడ్డి,నాదెండ్ల సుధాకర్, మారెళ్ళ వివేకా, కార్పోరేటర్ చింతల గోపి, కార్పోరేటర్ , నాగభూషణం గురు బ్రహ్మం,శశి కాంత్ భూషణ్,కాశి రెడ్డి,అయినాబత్తిన కృష్ణ,కుమార్, BLనరసింహం,చెరుకూరి ఆదిలక్ష్మీ,రావుల పద్మజ,నాళం నరసమ్మ,అనిలా కుమారి, అనంతమ్మ రాయపాటి సీతమ్మ ,మాగుంట అభిమానులు మరియు ప్రజలు పాల్గొన్నారు.
👉ప్రభుత్వ హాస్టల్‌లో విద్యార్థినితో నగ్న పూజ?*
పెద్దపల్లి, నవంబర్‌ 26: మూడనమ్మకాల ముసుగు లో బాలికల హాస్టల్‌ వసతి గృహంలో దారుణానికి ఒడిగట్టారు. కనక వర్షం కరుస్తుందని, డబ్బు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతుందని ఏకంగా విద్యార్ధినితో నగ్న పూజలకు ఒడిగట్టారు.
హాస్టల్‌లో వంట పని చేసే వంట మనిషి ఈ దారుణా నికి పాల్పడటం ఇంకా విడ్డూరం. ఈ దారుణ ఘటన పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బాలికల వసతి గృహంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో పొరుగు జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని, తన సోదరితో కలిసి ఉంటుంది. బాలిక తల్లిదండ్రులు పేదవారు కావడంతో ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ అక్కచె ల్లెల్లు చదువుకుంటున్నారు. వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకున్న హాస్టల్‌లో పనిచేసే ఓ వంట మనిషి దారుణానికి ఒడిగట్టింది.
ఆ ఇద్దరు బాలికలను చేరదీసినట్టుగా నటిస్తూ పెద్ద కుట్రకు తెరదించింది. వారిలో పెద్దమ్మాయికి మాయ మాటలు చెప్పి.. నగ్న పూజలు చేస్తే కనకవర్షం కురుస్తుందని నమ్మించింది. ఆ డబ్బుతో మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండవచ్చని నమ్మబలికింది.
వంట మనిషి మాయ మాటలు నమ్మిన బాలిక ఆమె చెప్పినట్లు చేయ డానికి అంగీకరించింది. ఈ క్రమంలో వారం క్రితం వంట మనిషి ఉండే గదికి ఓ వ్యక్తిని తీసుకువచ్చింది. అక్కడకి బాలికను పిలిపించి అతని ముందర నగ్నంగా ఉండాలని చెప్పింది.
అప్పుడు అతడు ప్రత్యేక పూజలు చేస్తాడని, అప్పుడు డబ్బు బంగారం రాశులు కురుస్తాయని చెప్పింది.దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన ఆ విద్యార్థిని భయంతో అక్కడి నుంచి పారిపోయింది. మంథని పట్టణంలో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లి 4 రోజులుగా అక్కడే తలదాచుకుంది.
అనంతరం అసలు విషయం బాలిక తల్లిదండ్రులకు విషయం తెలియడంతో స్థానికంగా కలకలం రేగింది. బాలిక తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు, బంధువులు హాస్టల్‌ వద్దకు చేరుకుని సదరు వంట మనిషిని నిలదీశారు.
దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న సీఐ రాజు, ఎస్‌ఐ రమేశ్‌ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సర్దుమనిగేలా చర్యలు చేపట్టారు. బాలికను ప్రలోభ పెట్టిన మహిళను అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసినట్టు మంథని ఎస్‌ఐ తెలిపారు. దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
👉డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కి ఘన నివాళులు అర్పించిన సబ్ కలెక్టర్*
ప్రకాశం జిల్లా :మార్కాపురం పట్టణం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం లో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మార్కాపురం సబ్ కలెక్టర్ డాక్టర్ బి. అర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మంగళవారం ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి. అర్ అంబేద్కర్ చేసిన మేలులో ఎన్నో ఉన్నాయని వాటిని మరిచిపోలేని అన్నారు..
👉 అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు..
ఏలూరు జిల్లా…ద్వారకాతిరుమలలో
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు..
పంచాయతీ పార్క్ లో 15 సంవత్సరాల క్రితం ఆవిష్కరించ బడిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గారి విగ్రహం అర్థ రాత్రి సమయంలో ధ్వంసం చేసిన గుర్తుతెలియని సంఘ విద్రోహులు..ఓవైపు దేశవ్యాప్తంగా 75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్న ఈ సమయంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం చాలా దారుణం అత్యంత హేయమైన చర్య..
పోలీసు రెవెన్యూ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి దోషులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలిని ప్రజా సంఘల నాయకులు కోరుతున్నారు
👉భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లతో హోంమంత్రి అనిత టెలికాన్ఫరెన్స్*
*శ్రీశైలం పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన హోంమంత్రి అనిత*
*కుటుంబసమేతంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామిని దర్శించుకున్న హోంమంత్రి*
* రాజ్యాంగ వజ్రోత్సవ శుభాకాంక్షలు వెల్లడి*
అమరావతి, ;- బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రవాయుగుండంగా మారనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రానున్న రెండు రోజుల్లో ఉత్తరాంధ్రకు భారీ వర్షాలుంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాయలసీమ, కోస్త్రాంధ్ర సహా వర్షం పడే అవకాశమున్న జిల్లాల కలెక్టర్లు ప్రాణ, ఆస్తి నష్టాలకు ఆస్కారం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆమె ఆదేశించారు. మత్స్యకారులు, రైతులు, గొర్రెల కాపరులను వర్షం, పిడుగుల హెచ్చరికలతో ఫోన్ కాల్స్, సందేశాల ద్వారా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా చేయాలని విపత్తునిర్వహణ శాఖ ఎండీ కూర్మనాథ్ కు హోంమంత్రి ఆదేశాలిచ్చారు. వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లకుండా ఆయా శాఖ అధికారులు సమన్వయం చేసుకునేలా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని వెల్లడించారు.
నంద్యాల జిల్లా శ్రీశైలంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ను హోంమంత్రి వంగలపూడి అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ రికార్డుల నిర్వహణపై ఆమె సమీక్ష చేశారు. లోన్ యాప్, సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తుల భద్రత, మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలని ఆదేశించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు సమిష్టిగా కృషి చేయాలన్నారు.
అంతకుముందు, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను మంగళవారం హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. దర్శనాంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో హోంమంత్రి అనితకు వేదపండితులు వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఏపీ ప్రజలంతా శాంతిభద్రతలతో సుభిక్షంగా ఉండాలని హోంమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హోంమంత్రి వంగలపూడి అనిత తన ఎక్స్ అకౌంట్ ద్వారా దేశ పౌరులకు రాజ్యాంగ వజ్రోత్సవ శుభాకాంక్షలు వెల్లడించారు. దేశమంతా ఒక్కటిగా నిలిపిన భారతీయుల తోడు నీడ.. కంటికిరెప్పలా..కన్నతల్లిలా 75 ఏళ్లుగా కాపాడుతున్న రక్షణగోడా రాజ్యాంగమన్నారు. రాజ్యాంగాన్ని రూపొందించడంలో 15 మంది నారీమణులు నాడు కీలక పాత్ర పోషించడం గర్వించే విషయమని పేర్కొన్నారు. విదేశీ శత్రువులు, స్వదేశీ సంక్షోభాలు ఎన్ని ఎదురైనా భారతావనిలో ప్రజస్వామ్యం నిలబడడం మాత్రమే కాదు మరింత బలపడిందన్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం గత ఐదేళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో మహోన్నత అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారన్నారు. సర్వ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే కాదు.. ప్రజల సర్వనాశనమే లక్ష్యంగా విఫలయత్నం చేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలోని రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టడంతో తిరిగి నేడు రాజ్యాంగ వజ్రోత్సవాలను స్వేచ్ఛగా జరుపుకుంటున్నామని ఎక్స్ లో పేర్కొన్నారు.
👉వయనాడ్ ఎంపీగా గెలిచిన ప్రియాంక గాంధీకి అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.*
👉డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి ఎస్సై రాజా మోహన్ రావు*
ప్రకాశం జిల్లా మార్కాపురంలోని రెడ్డి మహిళా కళాశాలలో విద్యార్థినులకు సైబర్ నేరాల మరియు డ్రగ్స్ తో సహా పలు విషయాలపై అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించిన పట్టణ టూ టౌన్ ఎస్సై డా. రాజమోహన్ రావు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు డ్రగ్స్ కి దూరంగా ఉండాలని చెడు అలవాట్లకి బానిసలవ్వుకూడదని ఆయన అన్నారు…
👉ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై కొత్త కేసు నమోదు చేసిన పెద్దారవీడు పోలీసులు…యర్రగొండపాలెంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కు 41A నోటీసు ఇచ్చిన పెద్దారవీడు ఎస్సై అనిల్ కుమార్.
👉వెలుగొండ ప్రాజెక్ట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, గిద్దలూరు ఇ ఆర్ఓ మరియు ప్రజా ఫిర్యాదుల కమిటీ జిల్లా స్పెషల్ ఆఫీసర్ ఎం వెంకట శివరామిరెడ్డి మంగళవారం కంభం తహసిల్దార్ కార్యాలయంలో జరుగుతున్న వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు.కార్యక్రమంలో ఆయనతో పాటు డిప్యూటీ తహసిల్దార్ శ్రీనివాసులు వీఆర్ఓ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు
👉మూడో విడుత క్రీడా పోటీలలో కదిరి బాబురావు వ్యవసాయ కళాశాల విద్యార్థులు ప్రతిభ..
ఆచార్య ఎన్ జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముడోవిడుత అంతర కళాశాలల క్రీడా సమ్మేళనం శ్రీకాకుళం జిల్లాలోని నైరా వ్యవసాయ కళాశాల లో ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా పోటీలలో కదిరి బాబురావు వ్యవసాయ కళాశాలలో ముడో సంవత్సరం చదువుతున్న మునయ్య షార్ట్ ఫుట్ లో మంచి ప్రతిభ కనబరిచి మొదటి స్థానం సాధించారు.
👉 పంటల బీమాపై రైతులకు అవగాహన ..
ఎర్రబాలెం గ్రామం కంభం మండలం లో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం లో ఉద్యాన అధికారి డి శ్వేత, వ్యవసాయ అధికారి స్వరూప పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డి శ్వేత మాట్లాడుతూ రబీలో మిరప పంటకు ప్రభుత్వం దిగుబడి ఆధారిత పంటల బీమా అమలు చేస్తుందన్నారు. జిల్లాకు సంబంధించి ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా పంటల భీమా అమలు చేస్తారు. పథకంలో ప్రీమియం అమౌంట్ 525 రూపాయలు రైతులు చెల్లించాల్సి ఉంటుందని ,పంట కోత ప్రయోగాలు నిర్వహించి దిగుబడి తగ్గినట్లు నిర్ధారణ అయితే రైతుకు బీమా లభిస్తుంది. ఎకరాకు గరిష్టంగా 1,05,000/_రూపాయల వరకు చెల్లిస్తారు నమోదుకు డిసెంబర్ 15 వరకు గడువు ఉందని రైతులకు తెలిపారు
👉సైబర్ నేరాలు మరియు మద్యం, మత్తు పదార్థాల సేవనం వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన
తురుమెళ్ళ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సైబర్ నేరాలపై మద్యపానం, మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రయోజనాలపై గురించి , మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి ఎస్సై బి నరసింహరావు విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించారు.కార్యక్రమంలో అధ్యాపక మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
👉 భారత రాజ్యాంగ దినోత్యవం సందర్భంగా
స్థానిక జానియర్ సివిల్ జడ్జి కోర్ట్ పొదిలి నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సు నందు ముఖ్య అతిథిగా సివిల్ జడ్జి మరియు చైర్మన్, మండల లీగల్ సర్వీసెస్ కమిటి చైర్మన్ అయిన ఎం.స్.వి ప్రత్యూష పాల్గొనడం జరిగింది. ఈ విజ్ఞాన సదస్సు నందు రాజ్యాంగ నిర్మాణం ఎలా జరిగింది, రాజ్యాంగ నిర్మాణంలో అంబేదరర్ పోషించిన పాత్ర గురించి వివరించడం జరిగింది. ఈ యొక్క న్యాయ విజ్ఞ్నాన సదస్సులో న్యాయవాదులు షేక్. షబ్బీర్,డి.రామారావు, జి.శ్రీనివాసులు, జీ.సుజాత మరియు కోర్ట్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.
👉ప్రజా సంకల్ప వేదిక లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు*
భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజా సంకల్ప వేదిక కార్యాలయంలో డా. బి.ఆర్. అంబేద్కర్ గారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర అధ్యక్షులు మదిరె రంగ సాయి రెడ్డి గారు.
👉మొక్కజొన్న మిరప పంటలను పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు..
పొలం పిలుస్తుంది లో భాగంగా వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ అధికారులు మండలంలోని ఎర్రబాలెం, చిన్న కంభం గ్రామాల్లో పంటలను పరిశీలించడం జరిగింది. దీనిలో భాగంగా కంది మొక్కజొన్న మిరప పంటలను పరిశీలించడం జరిగింది. మిరప పంటకు సంబంధించి రసం పీల్చుపురుగుల కోసము జాగ్రత్తలు గురించి ఉద్యాన శాఖాధికారి డి శ్వేత తెలియజేశారు. అలాగే మొక్కజొన్న పంటలు ప్రధానంగా ఆశించేటటువంటి కత్తెర పురుగు నివారణకు ఎమామెట్టిన్ బెంజోయిడ్ ఎకరాకు 80 గ్రాములు మబ్బులో పడే విధముగా వేసినచో నివారణ చేసుకోవచ్చని తెలియజేసినారు.అలాగే పోషకాల లోపాన్ని నివారించడానికి మల్టీకే ఎకరాకి కేజీ ప్యాకెట్ ని పిచికారీ చేయాల్సిందిగా తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో కంభం మండల వ్యవసాయ అధికారి ఎం స్వరూప తో పాటు వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.

7k network
Recent Posts

కాంగ్రెస్‌- సోరోస్‌ అంశంలో తనని అవమానించేలా బీజేపీ ఎంపీలు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి -లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ .. రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదాఏపీలో ఇక వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు: లోకేశ్…”రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదా..”పురుగుల మందు తాగుతూ మహిళ సెల్ఫీ”…జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు…నార్పలలో వీర జవాన్ వరికుంట్ల సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప..

చైనా.. ఉక్రెయిన్.. ఇజ్రాయెల్ యుద్ధాలలో నలిగిపోతున్న భారతీయులు.. విశాఖలో మహిళపై లైంగిక దాడి.. సీఎం ఆదేశాలతో సెంట్రల్ జైలుకు నిందితుడు.. ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి పునరావాస ప్యాకేజీని కొట్టేశారట! … మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం?.. వినయ్‌ వైఖరి వల్లే తమ కుటుంబంలో వివాదాలు: మంచు మనోజ్.. మోహన్ బాబు హేయమైన చర్యపై ఖండన.. విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ .. తహశీల్దార్ పై సస్పెన్షన్ వేటు (కడప)… రేపు, ఎల్లుండి కలెక్టర్ల సదస్సు… పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. కొనసాగుతున్న ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య యుద్ధం..జవాన్ మృతి పట్ల మంత్రి డోలా తీవ్ర దిగ్బ్రాంతి

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల విన్నూత నిరసన*…డబ్బు కోసం,ఆస్తి కోసం పోరాటం చేయటం లేదు- మంచు మనోజ్..పోలీసుల అదుపులో పవన్ ను బెదిరించిన వ్యక్తి… ఎవరీ మల్లికార్జునరావు?…వందలాది ఎకరాల ప్రభుత్వ అసైన్మెంట్ భూముల కొనుగోలుపై స్పందించిన హైకోర్టు…ధాన్యం కొనుగోలులో వ్యాపారులు దగా చేస్తే చట్ట ప్రకారం చర్యలు…డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…మత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు: డాక్టర్ కూచిపూడి.

నాగబాబుకు మంత్రి పదవి.. సీఎం చంద్రబాబు ప్రకటన…’పుష్ప’ని ఫుల్ గా వాడేస్తోన్న ఆప్ – బీజేపీ!…డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ పై డీజీపీకి ఫోన్‌ చేసి మాట్లాడిన హోంమంత్రి అనిత.. …కోటి లో పోలీసుల ఓవరాక్షన్, మహిళలపై అసభ్య ప్రవర్తన, తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన మహిళ..మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన జగన్….,

సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సూర్యాపేట జిల్లా హోం గార్డ్స్ ఆఫీసర్స్..విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేష‌న్ బియ్యం సీజ్‌……జర్నలిస్టులపై మోహన్ బాబు బౌన్సర్ల దాడి….. అల్లూరి జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే, కందుల ఎమ్మెల్యే ముత్తుముల..

రైతుల ఆందోళనలో హర్యానా “పోలీసుల డ్రామా..!! నోయిడా జైలులో రైతుల నిరాహార దీక్ష(డిల్లీ)…VEE RUN FOR TIRUPATI…రెండు రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం.. దర్యాప్తు సంస్థల అధికారులమంటూ బెదిరింపు* 15 లక్షలు దోచేసిన సైబర్‌ నేరగాళ్లు… జాతీయ రహదారిపై లారీ క్లీనర్ సజీవ దహనం…. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది?