👉కేజ్రీవాల్‌పై యాసిడ్ దాడి.. ఢిల్లీలో సంచలన ఘటన! ఈ నేపథ్యంలో ఆయన పలు నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తున్నారు.దేశరాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది.ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి,ఆమ్ ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై ఓ దుండగుడు యాసిడ్ దాడి చేశారు. వచ్చే నెలలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో కేజ్రీవాల్..ఇప్పటి నుంచే పని ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆయన పలు నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తున్నారు. ప్రజలకు తమ ప్రభుత్వం చేసిన మేళ్లను వివరిస్తున్నారు. ఇదే సమయంలో కేంద్రం తనను అన్యాయంగా అరెస్టు చేసిన కేసులు పెట్టిన విషయాన్ని కూడా చెబు తున్నారు. ఈ క్రమంలో శనివారం ఆయన గ్రేటర్ కైలాష్ ప్రాంతం పాదయాత్ర నిర్వహించారు. సాయం త్రం 6 గంటల సమయంలో స్థానికులను కలుసుకుని ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ సయమంలో ఆప్ కార్యకర్తల్లో కలిసి పోయిన ఓ వ్యక్తి కేజ్రీవాల్ సమీపంలోకి వచ్చారు. ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ సమయంలో తాను అప్పటి కే తెచ్చుకున్న ఓ బాటిల్‌లోని ద్రావణాన్ని కేజ్రీవాల్‌పై పోశారు.ఈ షాకింగ్ ఘటనతో కేజ్రీవాల్ ఉలిక్కిపడ్డారు.ఈ ద్రావణం కేజ్రీవాల్ శరీరంపైనా.. ఆయన దుస్తులపైనా పడింది. వెంటనే అలెర్ట్ అయిన కేజ్రీవాల్ భద్రతా సిబ్బంది, ఆప్ కార్యకర్తలు దుండగుడిని పట్టుకుని చితక్కొట్టారు.ఈ ఘటనలో కేజ్రీవాల్ స్వల్పంగా గాయపడ్డారు. హఠాత్పరిణామంతో ఆయన ఉలిక్కి పడి.. తేరుకోలేక పోయారు. దుండగుడిని అరెస్టు చేసిన గ్రేటర్ కైలాష్ పోలీసులు స్టేషన్‌కు తరలించి విచారించారు. అతను వాడింది.. యాసిడ్డేనని నిర్ధారించారు. అయితే.. అది అంత ప్రభావవంతం కాదని.. చర్మం కాలిపోయే పరిస్థితి లేదని భావిస్తున్నారు. అయినప్ప టికీ.. మాజీ సీఎం పై అంత ధైర్యంగా దాడి చేయడం వెనుక ఎవరు ఉన్నారనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ దాడి ఘటనతో కేజ్రీవాల్ తన పర్యటనను నిలుపుదల చేసుకుని.. ఆసుపత్రికి వెళ్లారు. మరోవైపు ఈ ఘటన రాజకీయంగా విమర్శలకు దారి తీసింది. దీని వెనుక.. ప్రతిపక్షాల కుట్ర ఉందని ఆప్ నాయకులు ఆరోపించారు. అయితే.. తమకు సంబంధం లేదని బీజేపీ నేతలు ప్రకటించడం గమనార్హం.
👉పెన్షన్ల పంపిణీలో పైసా అవినీతి ఉన్నా ఒప్పుకోను: సీఎం చంద్రబాబు.. ఒక రోజు ముందుగానే పంపిణీ
– అనంతపురం జిల్లా నేమకల్లు గ్రామంలో చంద్రబాబు పర్యటన
ఏపీలో ఒక రోజు ముందుగానే సామాజిక పెన్షన్లు అందజేశారు. డిసెంబరు 1వ తేదీ ఆదివారం రావడంతో, నేడు నవంబరు 30వ తేదీనే ఇంటింటికీ తిరిగి పెన్షన్లు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం జిల్లా నేమకల్లులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంగా ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు అందించారు. చంద్రబాబు నేమకల్లులో దివ్యాంగురాలు భాగ్యమ్మ ఇంటికి వెళ్లారు. ఆమె కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఆమెకు దివ్యాంగ పింఛను రూ.15 వేలు అందజేశారు. అదే గ్రామంలో రుద్రమ్మ అనే వితంతు మహిళ ఇంటికి కూడా వెళ్లి పెన్షన్ అందజేశారు. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ఇద్దరు మహిళల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు అందించానని వెల్లడించారు. ప్రజల్లోని ఆనందం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. మెరుగైన పెన్షన్ల ద్వారా వితంతువులు, దివ్యాంగులకు ఉండగా ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. “అణగారిన వర్గాలకు అండగా ఉండడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఎన్నికల హామీ మేరకు పెంచిన పెన్షన్లను ఏప్రిల్ నుంచి లెక్కగట్టి ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లను ప్రవేశపెట్టింది ఎన్టీఆర్.ఇప్పుడు రాష్ట్రంలో 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. పెన్షన్ల రూపంలో ఈ ఐదు నెలల్లో రూ.18 వేల కోట్లు పంపిణీ చేశాం. పెన్షన్ మూడు నెలలకు ఒకసారి కూడా తీసుకునే వెసులుబాటు కల్పించాం. పెన్షను లబ్ధిదారుల్లో కూలీలు, కార్మికులు ఉన్నారనే ఈ సౌకర్యం తీసుకువచ్చాం. దేశంలోనే ఎక్కువ పెన్షన్ ఇచ్చే రాష్ట్రం మనదే. పెన్షన్ల పంపిణీలో పైసా అవినీతి ఉండకూడదని స్పష్టం చేశాను. పేదలకు అనేక రకాలుగా మేలు చేయాలని ఉంది…కానీ సమస్యలు చాలా ఉన్నాయి.వైసీపీ ఐదేళ్ల పాలనతో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయి.ముందు వాటిని బాగు చేయాల్సి ఉంది” అని సీఎం చంద్రబాబు వివరించారు.
*అనంతపురం జిల్లా అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం: చంద్రబాబు*
మీ పంటలకు నీళ్లు ఇస్తానని గతంలో ఇక్కడి రైతులకు హామీ ఇచ్చాను. రాయలసీమను రతనాల సీమగా మార్చుతానని చెప్పాను. మొన్నటి ఎన్నికల్లో ప్రజలంతా ఆలోచించి ఓటేశారు. అనంతపురం జిల్లా అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. రాయదుర్గం అంటే చాలా వెనుకబడిన ప్రాంతం. రాయదుర్గం ప్రాంతం ఎడారిగా మారకుండా చర్యలు చేపట్టాం. రాయదుర్గం ప్రజల్లో వెలుగులు నింపే బాధ్యత తీసుకుంటాం. హంద్రీ నీవాపై రూ.4,500 కోట్లు ఖర్చు చేశాం. రాయలసీమలోని ప్రాజెక్టులకు రూ.12,500 కోట్లు ఖర్చు చేశాం. ఇక్కడున్న నేమకల్లు ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం.
👉పవన్ ఆవేదన – ఆక్రోశం.. రెండు కారణాలు.. !
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కాకినాడ పోర్టులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భారీ ఎత్తున ఆవేదన, ఆక్రోశం వ్యక్తం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కాకినాడ పోర్టులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భారీ ఎత్తున ఆవేదన, ఆక్రోశం వ్యక్తం చేశారు. “ఉప ముఖ్యమంత్రినైన నన్నే“ అంటూ ఆయన పోర్టు అధికారులపై విరుచుకుపడ్డారు. తాను పరిశీలనకు వస్తానంటే కూడా వద్దన్నారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే.. అసలు ఈ ఆవేదన, ఆక్రోశానికి అధికారుల అడ్డగింతేకారణమా? అంటే.. కాదని అంటున్నారు పరిశీలకులు. దీని వెనుక మరో రెండు కీలక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.నిజానికి పోర్టులు రాష్ట్రాల పరిధిలో ఉండవు. పోర్టు బయట వరకు మాత్రమే రాష్ట్రాలకు అధికారం ఉంటుంది. లోపల వ్యవహారాలు అన్నీ కూడా.. కేంద్రం నియమించిన అధికారుల చేతిలో ఉంటుంది.ఈ విషయం పవన్‌కు తెలియంది కాదు. కాబట్టి.. ఎవరినైనా వద్దనే హక్కు, అధికారం రెండూ కూడా పోర్టు అధికారులకే ఉంటుంది. భారత నౌకా రంగం చేతిలోనే పోర్టుల వ్యవహారం ఉంటుంది. కాబట్టి పవన్ చేసిన వ్యాఖ్యలు..వారికి అంటుకోవు.సాక్షాత్తూ ముఖ్యమంత్రి వెళ్లినా..పైనుంచి ఆదేశాలు ఉంటేనే లోపలకు అనుమతిస్తారు.లేకపోతే గేట్లు మూసేస్తారు.దీనికి తమిళనాడే ఉదాహరణ.👉 ఇక, పవన్ ఆవేదన విషయాన్ని తీసుకుంటే.. స్థానికంగా ఉన్న కొందరు కూటమి నేతలు.. చేస్తున్న అక్రమాలపైనే ఆయన ఆగ్రహం ఉంది. వైసీపీకి ఓ స్థానిక నాయకుడికి వీరు సహకరిస్తున్నారన్నది ప్రధానంగా పవన్ ఆవేదన. సదరు వైసీపీ నాయకుడిని అడ్డంగా బుక్ చేసి జైలుకు పంపించాలన్నది ఆయన లక్ష్యం అని అయితే.. ఇది అంత సాధ్యం కావడం లేదు.సదరు నేతకు కూటమి నాయకులే అండగా ఉన్నారు. ఈ విషయాన్ని బయటకు చెప్పలేక.. కడుపులో దాచుకోలేక ఇలా ఇప్పుడు బయటపడ్డారు. ఇక,*రెండో కారణం..స్థానిక జిల్లా పోలీసులు సరైన విధంగా ఆయనను గౌరవించకపోవడం. దీనికి కూడా..రాజకీయ కారణాలు ఉన్నాయన్నది పవన్ అంతర్గత చర్చల్లో చెబుతున్న మాట. తాజాగా ఎస్పీ తన పర్యటనలో లేరని, సెలవుపై వెళ్లిపోయారని పవనే చెప్పారు. ఇది అసాధారణమని ఆయన భావిస్తున్నారు. కానీ..స్థానికంగా ఉన్న కూటమి పెద్దలే ఈ వ్యవహారంలో ఉన్నారన్నది ఆయనకు కూడా తెలుసు. కానీ నేరుగా వారిని ఏమీ అనలేక..ఇలా ఆక్రోశం వెళ్లగక్కడం గమనార్హం.
👉రేషన్ బియ్యం.. మారాల్సిందెవరు… మార్పు ఎందుకు.. ! అక్రమ మార్గాల్లో విదేశాలకు తరిలిపోతున్న బియ్యాన్ని నిలువరించేందుకు ఆయన ప్రయత్నాలు చేపట్టారు.తాజాగా డిప్యూటీ సీఎం,జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రేషన్ బియ్యం అక్రమాలపై కన్నెర్ర చేశారు. అక్రమ మార్గాల్లో విదేశాలకు తరిలిపోతున్న బియ్యాన్ని నిలువ రించేందుకు ఆయన ప్రయత్నాలు చేపట్టారు. 👉అయితే.. అసలు రేషన్ బియ్యం విషయంలో మారాల్సిందెవరు? మార్పు ఎందుకు రావాలి? అనే ప్రశ్నలు.. కీలకంగా మారాయి.నిజానికి రేషన్ బియ్యం అక్రమ రవాణా అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య కాదు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ సమస్య ఉంది. ** వైఎస్ రాజశేఖరరెడ్డి.. ఈ విషయంలో ప్రధానంగా దృష్టి పెట్టారు. ఆయన మరణం తర్వాత.. ఈ విషయం పక్కకు పోయింది. రేషన్ బియ్యం పేరుతో పేదలకు ప్రభుత్వాలు ఇస్తున్న బీటీ బియ్య.. దొడ్డుగా ఉండడంతోపాటు.. ఇవి త్వరగా అరగకపోవడం, అన్నం ముద్ద కావడం, తిన్నాక అనారోగ్య సమస్యలు వస్తుండడంతో రేషన్ బియ్యాన్ని తీసుకునే పేదలు.. వాటిని తెగనమ్మి.. నాణ్యమైన బియ్యాన్ని ఎంత ఖరీదుకైనా కొనుగోలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వాలు ఎప్పుడో గుర్తించాయి. ఈ విషయం జనసేన అధినేత పవన్‌కు కూడా తెలుసు.** ఒక్కసారి 2019 ఎన్నికలకు ముందుకు వెళ్తే.. అప్పటి ఎన్నికల ప్రచారంలో పవన్ ఇదే విషయాన్ని చెప్పారు.“రేషన్ బియ్యం తింటే కడుపునొప్పి వస్తోందని, వళ్లు నొప్పులు వస్తున్నాయని..ఇప్పుడు ఇక్కడివారు చెప్పారు. అందుకే మేం అధికారంలోకి వస్తే.. రేషన్ బియ్యానికి అయ్యే ఖర్చును వారి ఖాతాలో వేస్తా. దీంతో వారు నాణ్యమైన బియ్యాన్నికొనుగోలు చేసేలా చూస్తాం“ అని చెప్పారు. కానీ, అది సాధ్యంకాలేదు. ఇక, వైసీపీ అధినేత జగన్ కూడా..అదే ఎన్నికలకు ముందు.. రేషన్ బియ్యం సమస్యను తెలుసుకుని.. నాణ్యమైన సన్నబియ్యం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇది కొన్నాళ్లు నడిచింంది. తర్వాత.. మళ్లీ ఆగిపోయింది. అంటే..మొత్తంగా రేషన్ బియ్యం ప్రజలు వినియో గించుకోవాలని నిజంగానే ప్రభుత్వాలు భావిస్తే..వారు ఆనందంగా తీసుకునేందుకు,తినేందుకు ఉపయోగపడే నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేస్తే..బియ్యం అమ్ము కోవాలని ప్రజలు కూడా భావించరన్న విషయాన్ని గుర్తించాల్సి ఉంది. ఆదిశగా చర్యలు తీసుకుంటే.. అక్రమాలు వాతంటత అవే ఆగిపోతాయనడంలో సందేహం లేదు. ఏది ఏమైనా రేషన్ బియ్యం రాజకీయ నాయకులకు వరంగా మారిందని ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు.
👉 ఒంగోలులోని LC NO. 207 అగ్రహారం లోని గేటు దగ్గర నూతనంగా నిర్మించనున్న రైల్వే అండర్ పాస్ (RUB) బ్రిడ్జి పనులను పరిశీలించిన సాంఘిక సంక్షేమశాఖ మంత్రివర్యులు డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి , ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్,సంతనూతలపాడు శాసనసభ్యులు బి ఎన్ విజయకుమార్ ,నగర మేయర్ గంగాడ సుజాత,ఒంగోలు మున్సిపల్ కమిషనర్ కోడూరి వెంకటేశ్వరరావు తదితర నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
👉మాజీ మంత్రి రోజాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన దళిత సంఘాలు..- కర్నూలు త్రీ టౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేసిన దళిత సంఘాలు..మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగితో చెప్పులు మోయించిన రోజా-దళితులను అవమానించారంటూ దళిత సంఘాల ఫిర్యాదు
మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజాపై దళిత సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో దళిత సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్లలోని సూర్యలంక బీచ్ లో దళిత ఉద్యోగితో చెప్పులు మోయించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే… 2023 ఫిబ్రవరిలో సూర్యలంక బీచ్ కు పర్యాటక మంత్రిగా ఉన్న రోజా వెళ్లారు. ఆమె సముద్రపు నీటిలోకి దిగే ముందు ఒడ్డున చెప్పులు వదిలారు. చెప్పులను జాగ్రత్తగా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో, పర్యాటక శాఖ రిసార్ట్స్ లో పని చేస్తున్న ఒక ఉద్యోగి ఆమె చెప్పులను మోశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే… దళితులను రోజా అవమానించారంటూ కర్నూలు పోలీస్ స్టేషన్ లో ఈరోజు దళిత సంఘాలు ఫిర్యాదు చేశాయి.
👉నటి జెత్వాని కేసులో ఏపీ హైకోర్టులో సీఐడీ అఫిడవిట్.*
*జెత్వాని కేసులో ఐపీఎస్‍లు కాంతిరాణా, విశాల్ గున్నీకి బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ అఫిడవిట్.*
*చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న సీఐడీ.*
*ఐపీఎస్‍లను కస్డోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరం ఉందని అఫిడవిట్‍లో పేర్కొన్న సీఐడీ.*
*జెత్వానీని అక్రమ అరెస్ట్ చేశారని సీఐడీ అఫిడవిట్ – అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ PSR ఆంజనేయులు ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందని తెలిపిన సీఐడీ.*
*PSR చెప్పిన వెంటనే అప్పటి విజయవాడ సీపీ కాంతిరాణా ముంబైకి ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేశారు – నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే కేసు దర్యాప్తు పక్కదారి పట్టే అవకాశం ఉందన్న సీఐడీ.*
👉దేశంలోనే ఉత్తమ పోలీసు స్టేషన్.. శాలిబండ పోలీస్ స్టేషన్ ..హైదరాబాద్ :
2024కు గాను పోలీసుస్టేషన్ల పై దేశ వ్యాప్తంగా చేసిన సర్వేలో తెలంగాణ లో హైదరాబాద్ శాలిబండ పోలీసు స్టేషన్ దేశం మొత్తంలో 8వ ఉత్తమ పోలీసుస్టేషన్ గా ఎంపికైంది. ప్రస్తుతం ముగ్గురు SIలు, ఆరుగురు హెడ్ కానిస్టేబుల్స్, 30 కానిస్టేబుల్స్, 6 గురు హోం గార్డులు ఇక్కడ పని చేస్తున్నారు. ఈ సందర్భంగా శాలిబండ పోలీస్ స్టేషన్ సిబ్బందిని తెలంగాణ డీజీపీ అభినందించారు.
👉పురుగుమందుల షాపులను ఆకస్మిక తనిఖీ చేసిన వ్యవసాయశాఖ అధికారులు..
ప్రకాశం జిల్లా కంభం .. మండలంలోని పురుగుమందుల షాపులను వ్యవసాయ శాఖ అధికారులు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.దీనిలో భాగంగా 4 దుకాణాలను తనిఖీ చేశారు .వీటికి సంబంధించి ఆయా దస్త్రాలను రిజిస్టర్ లను ఇన్వాయిసు లను వివిధ కంపెనీల ఉత్పత్తులను పరిశీలించడం జరిగింది. సరైన పత్రాలు లేనటువంటి పురుగు మందుల అమ్మకమును నిలిపివేయడం జరిగినది. తనిఖీల భాగంగా ఎరువులు పురుగు మందులు అధిక ధరలలో నమ్మినచో కఠినంగా శిక్షించడం జరుగుతుందని తెలిపారు. ఆధరైడ్ డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిందిగా చేయడమైనది. కార్యక్రమంలో మార్కాపురం సహాయ వ్యవసాయ సంచాలకులు డి బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో మండల వ్యవసాయ అధికారి డి స్వరూప పాల్గొన్నారు .
👉 క్రీడల్లో సత్తా చాటిన కదిరి బాబురావు వ్యవసాయ కళాశాల విద్యార్థి
శ్రీకాకుళం జిల్లాలోని నైరా వ్యవసాయ కళాశాలలో జరిగిన ముడో విడుత అంతర కళాశాలల క్రీడా పోటీల లో కదిరి బాబురావు వ్యవసాయ కళాశాలలో మూడోవ సంవత్సరం చదువుతున్న మునయ్య షాట్ పుట్ లో సత్తా చాటి మొదటి స్థానం సాధించారు. మునయ్యకు శ్రీకాకుళం జిల్లా యస్.పి కె.వి మహేశ్వర రెడ్డి అవార్డును అందజేశారు. కార్య క్రమంలో నైరా వ్యవసాయ కళాశాల డీన్, పాల్గొన్నారు.
👉కంభం గ్రామపంచాయతీ పరిది లోని 54 బూత్ లో ఎన్టీఆర్ భోరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం..
కంభం గ్రామపంచాయతీ పరిధిలోని జుమ్మా మసీద్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో పింఛన్ పంపిణీ ఉదయం నుంచి ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ ముస్లిం మైనార్టీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి అతర్ షేక్ హుస్సేన్ (దాదా )మాట్లాడుతు కూటమి ప్రభుత్వం పింఛన్దారుల విషయంలో గొప్ప నిర్ణయాలు తీసుకున్నదని పింఛన్ వస్తు ఏదైనా దురదృష్టవశాత్తు భర్త మరణిస్తే వెంబడే వచ్చే నెలలో భార్యకు పింఛన్ ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అదేవిధంగా ఏదైనా అనివార్య కారణాలవల్ల పింఛన్ ఒక నెల తీసుకోకుంటే మూడు నెలల వరకు తీసుకునే అవకాశం కూడా కల్పించిందని తెలిపారు.కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయబ్ సచివాలయ సిబ్బంది ఏఎన్ఎం రాణి తదితరులు పాల్గొన్నారు.
కేజ్రీవాల్‌పై యాసిడ్ దాడి.. ఢిల్లీలో సంచలన ఘటన! ..పెన్షన్ల పంపిణీలో పైసా అవినీతి ఉన్నా ఒప్పుకోను: సీఎం చంద్రబాబు..పవన్ ఆవేదన – ఆక్రోశం..రెండు కారణాలు.. రేషన్ బియ్యం.. మారాల్సిందెవరు… మార్పు ఎందుకు.. మాజీ మంత్రి రోజాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన దళిత సంఘాలు..నూతనంగా నిర్మించనున్న రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి పనులను పరిశీలించిన మంత్రి డోలా..కంభం లో ఎన్టీఆర్ భోరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం..
Recent Posts