👉మాకొద్దీ యుద్ధం.. లక్షల మంది ఉక్రెయిన్ సైనికుల పలాయనం ఉక్రెయిన్ పరిస్థితి ఏమో కానీ.. రష్యా మాత్రం అద్దె సైనికులను తీసుకుంటోంది. అత్యంత వివాదాస్పద దేశమైన ఉత్తర కొరియాతో పాటు ఇటీవల యెమెన్ సైనికులనూ రంగంలోకి దింపింది. ఏ యుద్ధమైనా పోరాడేది సైనికులే.. గ్రౌండ్ లో వారే లేకుంటే శత్రువు/ప్రత్యర్థిదే విజయం.. రెండున్నరేళ్లుగా జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పటికే సైనికులకు సంబంధించి అనేక కథనాలు వచ్చాయి. లక్షల మంది సైనికులు చనిపోయినట్లుగా, మరికొన్ని లక్షల మంది గాయపడినట్లుగా వార్తలు వినపించాయి. అంటే.. రష్యా.. ఉక్రెయిన్ లది ఒకటే సమస్య అని తెలిసిపోతోంది. కాగా, రష్యా తనకు సైన్యం సరిపోక వివిధ దేశాల నుంచి సైనికులను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్ కు చెందిన కొందరు యువకులను ఉద్యోగాల పేరిట రిక్రూట్ చేసుకుంది. అక్కడ పరిస్థితి భరించేలేక యువకులు మొరపెట్టుకోవడంతో భారత ప్రధాని మోదీనే జోక్యం చేసుకున్నారు. అద్దె సైనికులు ఉక్రెయిన్ పరిస్థితి ఏమో కానీ.. రష్యా మాత్రం అద్దె సైనికులను తీసుకుంటోంది. అత్యంత వివాదాస్పద దేశమైన ఉత్తర కొరియాతో పాటు ఇటీవల యెమెన్ సైనికులనూ రంగంలోకి దింపింది. అంటే పరోక్షంగా ఇది ప్రపంచ యుద్ధంగా మారుతోంది. ఇక ఉక్రెయిన్ కు సొంత సైన్యమే దిక్కు. ఇతర దేశాల సైనికులను దించే అవకాశం లేదు. అయితే, ఇప్పుడు ఉక్రెయిన్ కు సైనికుల పలాయనం పెద్ద సమస్యగా మారిందట. రష్యా దూకుడు ముంగిట.. 2022 ఫిబ్రవరిలో మొదలైంది రష్యా-ఉక్రెయిన్ యుద్ధం. ఇటీవలే ఉక్రెయిన్ విద్యుత్తు వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుంది రష్యా. దీంతో చాలా వరకు దేశం చీకట్లో మగ్గింది. ఇలాంటి సమయంలో ఉక్రెయిన్ సైనికులు పారిపోతున్నారట. మరోవైపు రష్యాతో త్వరలో చర్చలు జరిగే అవకాశం ఉంది. ఉక్రెయిన్ సైనికులు ఇలా పారిపోతే రష్యా ను డిమాండ్ చేయలేని పరిస్థితి ఎదురవుతుంది. అమెరికా ఒత్తిడితో.. ‘అదనపు బలగాలను తీసుకోండి.. 18 ఏళ్లు దాటినవారిని ఎంచుకోడి’ అంటూ ఉక్రెయిన్ పై అమెరికా ఒత్తిడి పెడుతోంది. అయితే, అధికారికంగా లక్షలమంది అనధికారికంగా 2 లక్షల మంది సైనికులు పారిపోయిన పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఏడాది వ్యవధిలోనే 50 వేల మంది ఉక్రెయిన్ సైనికులు కనీసం సెలవు పెట్టకుండా ఇళ్లకో, మరెక్కడికో వెళ్లిపోయారట. ఇప్పుడు 3 లక్షలమంది మాత్రమే సైనికులున్నారు. సర్జరీలు, అనారోగ్య కారణాలను చూపి సెలవు తీసుకున్న సైనికులు మళ్లీ తిరిగిరావడం లేదు. **అటు నుంచి 50 ఫిరంగులు.. ఉక్రెయిన్ సైనికులపై 50 ఫిరంగి గుళ్లు కురుస్తుంటే.. ఇటు నుంచి ఒక్కటే పేల్చగలుగుతున్నారట. రష్యా దాడిలో సహచరులు ముక్కలవుతుంటే తమకూ అదే పరిస్థితి వస్తుంది కదా? అని ఆందోళన చెందుతున్నట్లు ఓ పారిపోయిన సైనికుడు తెలిపాడు. తమను అధికారులు 15 కిలోమీటర్ల వెనుకుండి.. ముందుకెళ్లండంటూ ఉసిగొల్పుతున్నారని.. ఎంతకూ ముగియని ఈ యుద్ధంలో సైన్యం ఓ జైలులా మారిందని సర్జరీ కోసం వెళ్లి తిరిగిరాని మరో సైనికుడు వాపోయాడు. ఓ పట్టణమే రష్యా వశమైంది.. దాడి చేయడం.. పట్టణాలు, నగరాలను కలిపేసుకోవడం..రష్యా తీరిది. ఇలానే ఉక్రెయిన్ లో పోరాడే సైనికులు లేక ఉహ్లెదార్ పట్టణం రష్యా వశమైంది. 120 మంది ఉండాల్సిన యూనిట్లలో హతులు, క్షతులు, పారరిపోయినవారు పోగా 10 మంది మాత్రమే మిగిలిన సందర్భాలు ఉన్నాయని సమాచారం.
👉అదానీ – జగన్ ఫైట్.. ఇక, ఎండింగే…!
అందుకే.. వారు `అఫిషియల్`గా పేర్కొన్నారన్నది టీడీపీ నాయకులు చేస్తున్న వాదన. అఫిషియల్ అంటే.. అప్పటి సీఎం జగనేనని వాదిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త.. ప్రపంచ కుబేరుడు గౌతం అదానీ ఏపీలో సౌర విద్యుత్‌కు సంబంధించి చేసుకున్న ఒప్పందంలో అప్పటి సీఎం జగన్‌కు 1750 కోట్ల రూపాయల మేరకు లంచాలు ఇచ్చారన్నది అంత ర్జాతీయంగా వచ్చిన అభియోగం. అయితే.. దీనిపై రాజకీయంగా అధికార కూటమిలోని టీడీపీకి, వైసీపీకి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అసలు నా పేరు ఎక్కడ ఉందన్నది అప్పటి సీఎం వైసీపీ అధినేత జగన్ సంధిస్తున్న ప్రశ్న. ఎందుకంటే.. అమెరికాలో నమోదైన కేసులో.. “ఆంధ్రప్రదేశ్ అఫిషియల్“ అని పేర్కొన్నారు. వాస్తవానికి మన ఇండియన్ లాంగ్వేజ్‌లో అఫిషియల్ అంటే.. ప్రభుత్వ అధికారి అని అర్థం. కానీ, అమెరికా భాషలో చెప్పాలంటే.. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాయకులు కూడా అధికారులుగా పరిగణిస్తారు. అందుకే.. వారు `అఫిషియల్`గా పేర్కొన్నారన్నది టీడీపీ నాయకులు చేస్తున్న వాదన. అఫిషియల్ అంటే.. అప్పటి సీఎం జగనేనని వాదిస్తున్నారు. ఇక, ఈ విషయంలో తాను ఎందుకైనా సిద్ధమేనన్నట్టుగా జగన్ చెప్పుకొచ్చారు.👉 కానీ, ఈ విషయంలో టీడీపీ దాడి కేవలం వన్ సైడ్‌గానే కనిపిస్తోంది. అదానీ ఇచ్చిన లంచం.. జగన్ తీసుకున్నారన్నది వాస్తవమైతే.. ఈ కేసులో అదానీ పాత్ర కీలకం. ఉదాహరణకు మన భారతీయ చట్టాల్లో కూడా తీసుకున్నవారే కాదు.. లంచం ఇచ్చిన వారిపైనా సేమ్ సెక్షన్లు నమోదు చేస్తున్నారు. కాబట్టి అదానీ కూడా ఈ కేసులో భాగంగానే చూడాలి. కానీ, టీడీపీ ఈ విషయాన్ని నేరుగా చెప్పదు. కేంద్రంలోని పెద్దలతో అదానీకి ఉన్న సంబంధాలు..రాజకీయంగా ఎదురయ్యే ఇబ్బందుల నేపథ్యంలో టీడీపీ కానీ,మిత్రపక్షాలు కానీ.. ఎక్కడా జగన్ పేరును తీసుకువస్తున్నాయే తప్ప.. దీనిపై అదానీ గురించి ఎక్కడా మాట్లాడక పోవడం గమనార్హం. మరోవైపు.. అదానీ-జగన్ విషయాన్ని నేరుగా కెలికితే.. రేపు పెట్టుబడులపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జగన్‌పై ఫైట్ చేసినా.. కూటమికి వొనగూరే ప్రయోజనం లేదు. అందుకే.. పార్టీ అంతర్గత నిర్ణయాల్లో ఈ విషయాన్ని తగ్గించాలని సూచించడం గమనార్హం. దీంతో ఇక నుంచి ఈ విషయం దాదాపు తెరమరుగేనని అంటున్నారు పరిశీలకులు.
👉ఏపీ వక్ఫ్ బోర్డు రద్దు .. ఆదేశాలు జారీ చేసిన సర్కార్..మైనారిటీ సంక్షేమ శాఖ జీవో-47 ఉపసంహరణ..
వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసమేనని పేర్కొన్న ప్రభుత్వం
*త్వరలో కొత్త బోర్డు ఏర్పాటు జరుగుతుందన్న మంత్రి ఎన్ఎండీ ఫరూక్..
ఏపీ వక్ఫ్ బోర్డు విషయంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం నియమించిన వక్ఫ్ బోర్డును రద్దు చేసింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో జారీ కాబడిన మైనారిటీ సంక్షేమ శాఖ వక్ఫ్ బోర్డు జీవో -47 ను ఉపసంహరిస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన జీవోను రద్దు చేస్తూ మైనార్టీ సంక్షేమ శాఖ జీవో-75 జారీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. గత ఏడాది అక్టోబర్ 21న అప్పటి ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నామినేట్ చేయబడ్డ సభ్యుల నియామకాల తీరుపై కొందరు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో, వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎంపిక ప్రక్రియను నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
వివిధ రకాల న్యాయపరమైన సమస్యలు తలెత్తిన కారణంగా వక్ఫ్ బోర్డులో పరిపాలన శూన్యత ఏర్పడిందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం జారీ చేసిన, వివాదాస్పదమైన జీవోను రద్దు చేస్తూ నూతనంగా జీవో నెంబర్ 75 ను జారీ చేసిందని మంత్రి ఫరూక్ తెలిపారు. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ మరియు పరిరక్షణ, మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగానే ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు.
👉మార్కాపురం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ-2 లో ఓ గదిలో అక్రమంగా నిల్వ ఉంచిన 40 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు.
👉 ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఏజెన్సీ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్..
మావోయిస్టు దళ కమండ్ బృందంతో పాటు మరో ఏడుగురు నక్సల్స్ మృతి
భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్న.. పోలీసులు
మృతి చెందిన మొత్తం 7 మంది సభ్యులు
1. కుర్సం మంగు @ భద్రు @ పాపన్న, TSCM, సెక్రటరీ యెల్లందు – నర్సంపేట AC, AK-47 రైఫిల్.
2. ఈగోలపు మల్లయ్య @ మధు, DVCM,
కార్యదర్శి ఏటూరునాగారం మహదేవ్‌పూర్ ఏసీ, ఏకే-47 రైఫిల్..3. ముస్సాకి దేవల్ @ కరుణాకర్, ACM,
4. ముస్సాకి జమున, ACM,.. 5. జైసింగ్, పార్టీ సభ్యుడు.. 6.కిషోర్,7.కామేష్, పార్టీ సభ్యులు
👉 శ్రీశైల దేవస్థానంలో మల్లికార్జున సత్రం నందు టీజీ. వెంకటేష్. తెలంగాణ రాష్ట్ర. మంత్రి. ఆదివాసి ముద్దుబిడ్డ. సీతక్కకు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పొంద జిల్లా నాయకుడు వై ఆశీర్వాదం మంత్రి గారిని కలిసి సెలవ కప్పి పూలమాలతో సన్మానం చేయడం జరిగింది. అనంతరం ఆమెతో మాట్లాడుతూ. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఆదివాసి గిరిజనుల చెంచులకు. అడవి హక్కుల చట్టం. ప్రభుత్వాలు భూములకు పట్టాలు.మంజూరు చేయాలని, అంతరించి పోతున్న ఆదివాసి చెంచు గిరిజనులను కాపాడాలని వారిని కోరడమైనది.వారిని కలిసిన వారిలో.TUCI. పి మల్లికార్జున. దుగ్యం. రమేష్… అంజి.కొమరం భీం ఆదివాసి చెంచు గిరిజన శ్రీ భ్రమరాంబ పార్వతి శివాని పాల్గొన్నారు
👉గిద్దలూరు సబ్ జైల్ ను సందర్శించిన జడ్జి*
ప్రకాశం జిల్లా గిద్దలూరులోని సబ్ జైల్ ను శనివారం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఓంకార్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీలను పలకరించి వారికి అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. నేర ప్రవృత్తిని వీడి సత్ప్రవర్తనతో మెలగాలని ఖైదీలకు జడ్జి ఓంకార్ సూచించారు. అలానే వారి గదులను ఆహార పదార్థాలను పరిశీలించారు. ఖైదీలకు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు అధికారులు అందించాలన్నారు.
👉ఒంగోలు PVR గ్రౌండ్స్ లో నిర్వహించిన మాగుంట సుబ్బారామిరెడ్డి 29వ వర్ధంతి కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ,ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, ఇంచార్జ్ లు, జిల్లా టీడీపీ కూటమి నేతలతో కలిసి పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు . కార్యక్రమంలో సుబ్బారామి రెడ్డి గారి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మాగుంట ట్రస్ట్ ద్వారా మెరిట్ విద్యార్థులకు ప్రోత్సాహకాలు, సర్టిఫికెట్ లను అందజేశారు.
*ఒంగోలు జిల్లా కలెక్టరేట్ లో జరిగిన దిశా మీటింగ్ మరియు 20 సూత్రాలు అంశాల పై జరిగిన సమావేశంలో పాల్గొన్న గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి మరియు మంత్రివర్యులు, ఎంపీ, ఎమ్మెల్యేలు.. జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రహమాన్..
👉నాణ్యమైన విద్య, మౌలిక వసతుల కల్పనే లక్ష్యం*
*గిద్దలూరు సాంఘిక సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులకు దుప్పట్లు పంపిణి చేసిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*
**విద్యార్థులకు నాణ్యమైన విద్య, మౌలికవసతుల కల్పనే ఎన్దీయే ప్రభుత్వ లక్ష్యమని, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. గిద్దలూరు పట్టణం, పి.ఆర్ కాలనీలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుప్పట్లు (బెడ్ షీట్ + కార్పేట్) పంపిణి కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గోన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు బాల్యం నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని, తల్లిదండ్రులు తమ పిల్లల పై పెట్టుకున్న కళలను నిజం చేయాలని, ఒక క్రమశిక్షణతో కూడిన జీవన విధానం జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేధించేందుకు ఉపయోగపడతాయని ప్రతి ఉపాద్యాయుడు వసతి గృహంలో ఉన్న ప్రతి విద్యార్థిని తమ పిల్లలుగా భావించి, వారికీ నాణ్యమైన ఆహారం, విద్యను అందించి వారిని తీర్చిదిద్దాలని అన్నారు.. అనంతరం విద్యార్థులకు ఎమ్మెల్యే దుప్పట్లు పంపిణి చేశారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక శాఖ అధికారి నాయక్ మరియు గిద్దలూరు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు,సిబ్బంది పట్టణ టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు,విద్యార్థులు పాల్గోన్నారు.*
👉నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సోదరుడు కృష్ణ కిషోర్*
*కొమరోలు మండలం, ద్వారకచర్ల గ్రామంలో ఆనారోగ్యంతో బాధపడుతూ స్వర్గస్తులైన శీలం కోటేశ్వర రెడ్డి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ గిద్దలూరు ఎమ్మెల్యే సోదరుడు ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి వారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. వారితో పాటు టీడీపీ నాయకులు గోడి ఓబులరెడ్డి, నంది శ్రీను నివాళులు అర్పించారు.*
👉అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కృష్ణ కిషోర్*
*గిద్దలూరు పట్టణంలోని షరాఫ్ వీధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే సోదరుడు ముత్తుముల కృష్ణ కిషోర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ వారు భక్తులకు, ప్రజలకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన కృష్ణ కిషోర్ ని ఆలయ కమిటీ సభ్యులు శాలువా వేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు పట్టణ టీడీపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గోన్నారు.
👉కార్తీక వనభోజనాల కార్యక్రమంలో పాల్గోన్న ఎమ్మెల్యే సోదరుడు కృష్ణ కిషోర్*
*గిద్దలూరు పట్టణంలోని శ్రీ కృష్ణ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కృష్ణంశెట్టి పల్లె గ్రామ సమీపంలోని శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక వన భోజనాలు నిర్వహించారు. కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే సోదరుడు ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గోని వనభోజనాలను ప్రారంభించారు.. ఈ సందర్బంగా వారికీ ఆలయ కమిటీ సభ్యులు పూలమాల శాలువా వేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఓబిలిబోయిన వెంకటయ్య, నంద్యాల శ్రీనివాసులు, చల్లా బాల నరసింహులు, గుంటిక కొండయ్య, బూనబోయిన చంద్రశేఖర్, బోధనబోయిన గోపాలక్రిష్ణ, చల్లా రమేష్, దారం గురువయ్య, మొర్రి పిచ్చయ్య, కొత్తకోట పొలయ్య, బాల గురువయ్య, బొర్రా రాఘవేంద్ర యాదవ్, తదితరులు పాల్గోన్నారు.*ని.వర్గ రిపోర్టర్ సనావుల్లా ఖాన్..
👉తిరుమల ఘాట్ రోడ్ లో దొర్లీపడ్డ కొండ చరియలు*
తిరుపతి :డిసెంబర్ 01
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను శనివారం రాత్రి మహాబలిపురం- కరైకల్ వద్ద తీరం దాటి.. బలహీనపడి తీవ్ర వాయు గుండంగా కొనసాగుతోంది.
దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక, కలియుగ వైకుంఠం తిరుమలలో శనివారం నుంచి వర్షం తెరిపినివ్వడం లేదు. దీంతో ఆదివారం తెల్లవారుజామున రెండో ఘాట్ రోడ్డులో కొండచరి యలు విరిగిపడ్డాయి.
ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా సిబ్బంది ఎప్పటి కప్పుడు జేసీబీలతో బండ రాళ్లను తొలగిస్తున్నారు. గోగర్బం డ్యామ్ పూర్తిగా నిండిపోవడంతో గేట్లు ఎత్తి నీటిని కిందకు వదలు తున్నారు.
👉కుప్పకూలిన సెల్ టవర్…తప్పిన ప్రమాదం
శ్రీకాళహస్తి డిసెంబర్ 1 : శ్రీకాళహస్తి పట్టణంలోని ఆవరణలో పెంగల్ తుఫాన్ కారణంగా నిరుపయోగంలేని సెల్ టవర్ కుప్ప కూలిపోయింది. వివరాల్లోకి వెళితే .. భాస్కర్ పేట పట్టణ ఆరోగ్య కేంద్ర ఆవరణంలో నిరుపయోగం లేని సెల్ టవర్ పెంగల్ తుఫాన్ వల్ల భాస్కర్ పేట హై స్కూల్, ప్రైమరీ స్కూల్, అంగన్వాడి స్కూల్ లకు సెలవ ప్రకటించడంతో పాటు జన సంచారం లేని సమయంలో కూప్పకూలడంతో విద్యార్థులకు ప్రమాదం తప్పింది. సెల్ టవర్ ఇంటి పైన పడటంతో ఇంటి గోడలు స్వల్పంగా దెబ్బతిన్నాయి.ఈ ప్రమాదం ఘటన స్థలం భాస్కరపేట సచివాలయానికి ఆనుకొని ఉంది.వార్డు ప్రజలు సచివాలయ అధికారులకు తెలియజేసిన స్పందించలేదు. ఇంకనైనా ఉన్నత అధికారులు స్పందించి కుప్పకూలిన సెల్ టవర్ ను తొలగించాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.
మాకొద్దీ యుద్ధం.. లక్షల మంది ఉక్రెయిన్ సైనికుల పలాయనం..అదానీ – జగన్ ఫైట్.. ఇక, ఎండింగే ..ఏపీ వక్ఫ్ బోర్డు రద్దు .. ఆదేశాలు జారీ చేసిన సర్కార్..గిద్దలూరు: సబ్ జైల్ ను సందర్శించిన జడ్జి.. ఏటూరు నాగారం మండలం ఏజెన్సీ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల.. ఘనంగా మాగుంట సుబ్బరామిరెడ్డి వర్ధంతి..
Recent Posts