👉 మోడీ మీకిది తగునా…పేద వాళ్ళ డబ్బులు బిలియనీర్స్ కి ఇస్తారా ? పన్నుల రాయితీలను బడా వ్యక్తులకు ఇస్తూ పేదలకు మాత్రం న్యాయం చేయడం లేదని అంటున్నారు. 😱😱😱 కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పేదల నుండి పన్నుల ద్వారా వసూలు చేసిన డబ్బులను పెద్దలకు బిలియనీర్లకు ఇస్తోంది అని అంటున్నారు. రాజకీయ పరిశీలకులు, ఆర్ధిక విశ్లేషకులు కూడా ఇదే విషయం స్పష్టం చేస్తున్నారు. పన్నుల రాయితీలను బడా వ్యక్తులకు ఇస్తూ పేదలకు మాత్రం న్యాయం చేయడం లేదని అంటున్నారు.
**కానీ గడచిన పదేళ్ళ కాలంలో చూస్తూంటే ఉపాధి ఏదీ పెరగలేదు ఆర్ధిక వృద్ధి కూడా జరగలేదు, ఎగుమతులు కూడా ఆశించిన స్థాయిలో పెరరలేదు అని గుర్తు చేస్తున్నారు దాని మీద కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏకంగా ప్రైవేట్ కంపెనీలతో మీటింగులు పెట్టి మరీ ఆగ్రహం వ్యక్తం చేశారు అని కూడా చెబుతున్నారు. కానీ కేంద్ర ఆర్ధిక మంత్రితో పాటు పాలకులకు అర్ధం కాని విషయం ఏంటి అంటే ఉత్పత్తికి ప్రోత్సాహం ఇస్తే జరగదు కొనేవారు ఉంటేనే ఉత్పత్తి చేస్తారు. ఇది ఆర్ధిక మూల సూత్రమని అంటున్నారు. సప్లై సైడ్ ఇచ్చే రాయితీలతోనే ఆర్ధిక వృద్ధి సాధ్యపడదు, కానీ డిమాండ్ సైడ్ ప్రోత్సాహంతోనే వృద్ధి పెరుగుతుంది. అంటే ప్రజల కొనుగోలు శక్తిని పెంచే చర్యలను పాలకులు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు. కంప్త్రోలర్ ఆఫ్ అకౌంట్స్ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ ఆరు నెలలకు గానూ టాక్స్ కలెక్షన్ డేటాను ఇటీవల రిలీజ్ చేసింది. అందులో 2023 ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే 2024లో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ ఆరు నెలలకు గానూ 12 శాతం ఆదాయం పన్ను వసూళ్ళు పెరిగింది. ఇందులో కార్పోరేట్ సంస్థలు కట్టే పన్నుల రేటు 2.3 శాతం ఉందని అంటున్నారు. అదే సమయంలో పర్సనల్ ఇంకం టాక్స్ 25 శాతం పెరిగింది.** వేతన జీవులు జీతగాళ్ళు మధ్యతరగతి పేద వర్గాల నుంచి పెద్ద ఎత్తున పన్నులను ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయనడానికి ఇదే ఉదాహరణ అంటున్నారు. జీఎస్టీ కూడా ఎక్కువగా పేదవారు కడుతున్నారు. ఇది కూడా సామాన్యుడి మీద పెను భారంగా ఉంది. జీఎస్టీ భారం మధ్యతరగతి వారే మోస్తున్నారు. మధ్యతరగతిని దారుణంగా భారాలు మోపి ప్రభుత్వాలు ఇబ్బందులో పెడుతున్నాయని అంటున్నారు. ఈ విధానం మారాల్సి ఉందని అంటున్నారు.
😱😱😱 కేవలం లగ్జరీ ఉత్పత్తులు, హై అండ్ ప్రోడక్ట్స్ మాత్రమే అమ్ముడుపోతున్న నేపథ్యం ఉంది. కార్ల అమ్మకాలు అయినా రియల్ ఎస్టేట్ రంగం అయినా ఖరీదైన వస్తువులే అమ్ముడు పోతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కాస్ట్లీ విల్లాస్ కే ఎక్కువ అమ్మకలౌ కనిపిస్తున్నాయి. ఈ మొత్తం చూస్తూంటే మధ్యతరగతి వర్గాలు కొనుగోలు చేసే అపార్ట్మెంట్స్ కానీ కార్లు కానీ ఇతరత్రా వస్తువుల కొనుగోలులో భారీగా మార్పులు వస్తున్నాయి. ఇక లిస్టెడ్ కంపెనీలు సాలరీ అండ్ వేజ్ కాంపోంట్ చూస్తే కనుక వాటి గ్రోత్ రేటు కూడా సగానికి సగం పైగా పడిపోయింది అని నివేదికలు ఉన్నాయి. ఈ లిస్టెడ్ కంపెనీలు శాలరీస్ వేజెస్ మీద పెట్టే గ్రోత్ రేటు లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలీ అంటే డబుల్ డిజిట్ నుంచి సింగిల్ డిజిట్ లోకి పడిపోయిందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. కొత్తగా జీతాల పెంపు లేదు, కొత్తగా ఉపాధి కల్పన లేదు, అలాగే ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయి, ఈ మొత్తం వ్యవహారంలో పూర్తిగా ఆర్ధిక సంక్షోభంలో పడుతున్నది మధ్యతరగతి వర్గాలే అని అంటున్నారు. ముఖ్యంగా పట్టణాలలో ఉండే మధ్యతరగతి వర్గాల జీవన వ్యయం బాగా పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, వసతి కోసం పెట్టే ఖర్చు కానీ పిల్లల చదువుల విషయంలో పెట్టే ఖర్చులు కానీ దారుణంగా పెరిగిపోయాయని అంటున్నారు. ఇక ఆరోగ్యపరమైన ఖర్చులు పెరిగాయి. హెల్త్ ఇన్స్యూరెన్స్ మీద కూడా అడ్డగోలుగా జీఎస్టీ విధిస్తున్నారు అని అంటున్నారు. ఈ విధంగా చూస్తే కార్పోరేట్ సంస్థలు లాభాల బాటను నడుస్తున్నాయి. పేద మధ్యతరగతి అయితే దారుణంగా చితికిపోతున్నారు అని అంటున్నారు. ఇక చిత్రంగా కార్పోరేట్ సెక్టార్ పై విధించే పన్నులు తగ్గుతున్నాయి. మధ్యతరగతి వర్గాల నుంచి వసూలు చేసే ఆదాయ పన్నులు భారీగా పెరుగుతున్నాయని విశ్లేషిస్తున్నారు. దేశంలో చిత్రమైన పరిస్థితి ఈ రోజు ఉందని అంటున్నారు. కార్పోరేట్లు కట్టే పన్నుల కన్నా మధ్యతరగతి ఇండివిడ్యువల్ గా కంటే ఆదాయం పన్ను ఎక్కువగా ఉందని అంటున్నారు. ఈ రోజున వ్యక్తిగత స్థాయిలో కట్టే ఆదాయం పన్ను గ్రోత్ రేట్ చూస్తే కార్పోరేట్ టాక్స్, జీఎస్టీ కస్టమ్ అన్నింటినీ మించి పోయింది అని ఆర్ధిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.**ఒక విధంగా చెప్పాలీ అంటే మధ్యతరగతి వర్గాలకు మద్దెల దరువులాగానే పరిస్థితి ఉందని అంటున్నారు. ఈ మొత్తం ఆర్ధిక వ్యవషలో కార్పొరేట్లు భారీగా లబ్ది పొందుతున్నారని అంటున్నారు. 2019లో కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ ఆదాయం పన్నులు ఏకంగా పది శాతం తగ్గించింది అని గుర్తు చేస్తున్నారు. దీని ఫలితంగా మూడు లక్షల కోట్లు కార్పోరేట్లకు ఆదాయం సమకూరింది అని అంటున్నారు. 2014-2019ల మధ్యన కార్పోరేట్ల లాభాలు సగటున 104 శాతం పెరిగాయని గణాంకాలు తెలియచేస్తున్నాయని వివరిస్తున్నారు. ఇక 2019 నుంచి 2024 మధ్య తీసుకుంటే కార్పోరేట్ల లాభాలు 32.5 శాతం పెరిగాయి. అంటే ఏకంగా మూడు వందల శాతం పెరిగింది అని లెక్కలు చెబుతున్నాయి. అదే సమయంలో వారు కట్టే ఆదాయం పన్ను తీసుకుంటే కేవలం 18.6 శాతమే పెరిగిందని అంటున్నారు.**సాధారణంగా లాభాలు పెరిగినపుడు ఆదాయం పన్ను పెరగాలి. కానీ కార్పోరేటర్లకు ఆదాయం పన్ను భారీగా తగ్గించడం వల్లనే ఆదాయం పన్ను నుంచి వారు పెద్ద ఎత్తున మినహాయింపు పొందుతున్నారని అంటున్నారు. అలా మూడు లక్షల కోట్ల దాకా కార్పోరేటర్లకు పన్నుల తగ్గింపు వల్ల లాభం కలిగింది అని చెబుతున్నారు.**అంతే కాకుండా 2012-13 ఆర్ధిక సంవత్సరం నుంచి 2022 దాకా పదేళ్ళ కాలంలో చూస్తే పన్నుల రాయితీల వల్ల కార్పోరేటర్లకు ఏకంగా ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల కోట్ల ఆదాయం లాభంగా వస్తే ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఆదాయాన్ని పన్నుల రూపంలో కోల్పోయిందని అంటున్నారు. వీటికి అదనంగా కార్పోరేట్ సమస్థలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేయడం వల్ల లక్షల కోట్ల ఆదాయం కూడా ప్రభుత్వం కోల్పోయింది అని అంటున్నారు. అసలే తక్కువగానే కార్పోరేటర్లు లాభాలు చూపిస్తారు.అయినా సరే వారికే రాయితీలు ఇవ్వడం ఎందుకు అన్న చర్చ వస్తోంది. కార్పోరేట్ల వల్ల ఉపాధి దక్కుతుందని, ఆర్ధిక వృద్ధి లభిస్తుందని ప్రభుత్వాలు చెబుతూంటాయి. అందుకే రాయితీలు ఇస్తామని అంటున్నారు. కానీ గడచిన పదేళ్ళ కాలంలో చూస్తూంటే ఉపాధి ఏదీ పెరగలేదు ఆర్ధిక వృద్ధి కూడా జరగలేదు, ఎగుమతులు కూడా ఆశించిన స్థాయిలో పెరరలేదు అని గుర్తు చేస్తున్నారు దాని మీద కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏకంగా ప్రైవేట్ కంపెనీలతో మీటింగులు పెట్టి మరీ ఆగ్రహం వ్యక్తం చేశారు అని కూడా చెబుతున్నారు. కానీ కేంద్ర ఆర్ధిక మంత్రితో పాటు పాలకులకు అర్ధం కాని విషయం ఏంటి అంటే ఉత్పత్తికి ప్రోత్సాహం ఇస్తే జరగదు కొనేవారు ఉంటేనే ఉత్పత్తి చేస్తారు. ఇది ఆర్ధిక మూల సూత్రమని అంటున్నారు. సప్లై సైడ్ ఇచ్చే రాయితీలతోనే ఆర్ధిక వృద్ధి సాధ్యపడదు, కానీ డిమాండ్ సైడ్ ప్రోత్సాహంతోనే వృద్ధి పెరుగుతుంది. అంటే ప్రజల కొనుగోలు శక్తిని పెంచే చర్యలను పాలకులు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు.
👉ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. *ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలు, కేసులు పెట్టే వారికి రక్షణ కల్పించేలా సర్కార్ చర్యలు.* *లంచగొండి అధికారులపై కేసులు పెట్టే వారికి రక్షణ కోసం.. *ఏడీజీపీ స్థాయి అధికారికి ఏపీ ప్రభుత్వం బాధ్యతలు. *నోడల్ అధికారిగా ఇంటెలిజెన్స్ ఏడీజీపీ మహేష్ చంద్ర లడ్డా నియామకం.*
👉మీరు సముద్రంలో హడావిడి చేయడం కాదు’… షర్మిల కీలక వ్యాఖ్యలు!
కాకినాడ పోర్ట్ కేంద్రంగా అక్రమంగా రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతుందనే వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. కాకినాడ పోర్ట్ కేంద్రంగా అక్రమంగా రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతుందనే వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.👉 పోర్ట్ లో రేషన్ బియ్యంతో ఉన్న షిప్ లలో ఒకటి ఏపీ ఆర్థిక మంత్రి వియ్యంకుడిది ఉందని.. దాన్ని పవన్ కల్యాణ్ ఎందుకు సీజ్ చేయలేదని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల స్పందించారు. అవును… కాకినాడ పోర్ట్ కేంద్రంగా విదేశాలకు రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారంటూ తెరపైకి వచ్చిన ఆరోపణల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం పెద్ద మాఫియా అని.. ఇది జాతీయ స్థాయి కుంభకోణం అని.. దీనిపై సిట్ లేదా సీబీఐ ఎంక్వైరీ వేయాలని చంద్రబాబు, పవన్ లను షర్మిల డిమాండ్ చేశారు. తాజాగా ఈ వ్యవహారంపై ఎక్స్ వేదికగా భారీ పోస్ట్ పెట్టిన ఏపీ పీసీసీ చీఫ్… రాష్ట్రంలో పీడీఎస్ రైస్ విదేశాలకు తరలించడం పెద్ద మాఫియా అని.. ఇదో జాతీయ స్థాయి కుంభకోనం అని.. పేదల పొట్టకొట్టి రూ.48 వేల కోట్ల ప్రజల డబ్బును పందికొక్కుల్లా తినేసిన దోపిడీ అని.. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లుగా ఈ వ్యవహారం సాగిందని అన్నారు. రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఉందని.. కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకూ కొంతమంది అవినీతి అధికారుల పాత్ర ఉందని.. ఎవరికి దక్కాల్సిన వాటా వాళ్లకు చేరుతుండటంతో నిఘా వ్యవస్థ పూర్తిగా కళ్లు మూసుకుందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. **గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలోని పోర్టుల నుంచి 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అయ్యిందంటే మన చెక్ పోస్టుల పని తీరు ఎంటో అంచనా వేయొచ్చని.. ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చని.. అక్రమ బియ్యాన్ని పట్టుకునేందుకు మీరు బోట్లూ వేసుకొని సముద్రంలో హడావిడి చేయడం కాదు.. నిజాలు నిగ్గు తేల్చండి అని అన్నారు. ఇందులో భాగంగా… మూడేళ్లలో 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యాన్ని ఎలా సేకరించారు..? దీని వెనకున్న బియ్యం దొంగలెవరు..? రూ.48 వేల కోట్లు ఎవరెవరు తిన్నారు..? అప్పటి ప్రభుత్వ పెద్దలకు బియ్యం మాఫియాతో సంబంధాలు ఉన్నాయా..? మిల్లర్ల చేతివాటం ఉందా..? రేషన్ డీలర్ మాయాజాలమా..? నిజాలు నిగ్గు తేలాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక దర్యాప్తు కమిటీ వేయాలని.. లేదా, కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తో విచారణ జరిపించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను షర్మిల డిమాండ్ చేశారు.
👉అమాయకులు నే టార్గెట్ చేసి…..నయా దందా….టూర్స్ ట్రావెల్స్ ప్యాకేజీల పేరుతో మోసం…!..10కోట్లు స్వాహా చేసిన కేటుగాళ్ళు..!!!
ఆకర్షణీయమైన ట్రావెల్ ప్యాకేజీలకు అట్రాక్ట్ అయ్యారో.. నిలువునా మోసపోతారు.
దేశంలో యాత్రల పేరుతో పెద్ద దందానే నడుస్తోంది. దేశంలో టూర్స్ ట్రావెల్స్ ప్యాకేజీల గుట్టు ఒక్కోక్కటిగా బయటపడుతున్నాయి.
మొన్న నోయిడాలో ఓ కంపెనీ మోసం చేయగా.. ఇలాంటి ఘటనే ఇప్పుడు మన హైదరాబాద్‌లో జరిగింది.
హైదరాబాద్ ఉప్పల్‌లోని శ్రీ గాయత్రి టూర్స్ & ట్రావెల్స్ యాత్రల పేరుతో 500 మందికి కుచ్చు టోపీ పెట్టింది.
స్పెషల్ ఆఫర్స్ పేరుతో ఒక్కొక్కరి నుంచి 3వేల రూపాయలు వసూలు చేశారు. నిర్వాహకుడు భరత్ శర్మ..
500 మంది నుంచి సుమారు 10కోట్లకు పైగా వసూలు చేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలని ఉప్పల్ పీఎస్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శ్రీ గాయత్రి టూర్స్ & ట్రావెల్స్ నిర్వాహకుడు భరత్ శర్మను అరెస్ట్ చేశారు. రిమాండ్‌కు తరలించారు. దీనిపై ఎంక్వైరీ చేస్తున్నారు. ఇలాంటి మోసాలపై ఆరా తీస్తున్నారు.ట్రావెల్స్ మోసాల భారిన పడకుండా ఉండాలని కోరుతున్నారు పోలీసులు..
👉APCR జాతీయ ప్రధాన కార్యదర్శి నదీమ్ ఖాన్‌పై ఢిల్లీ పోలీసుల వేధింపులు, కక్షపూరిత FIR నమోదు:పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (PUCL) ఖండన..
PUCL ఢిల్లీ పోలీసులు మానవ హక్కుల కార్యకర్త నదీమ్ ఖాన్‌పై జరుపుతున్న ఉద్దేశ పురకమైన వేధింపులను, ట్విట్టర్‌లోని కొన్ని సామాజిక మాధ్యమ ఖాతాల ప్రేరణతో నిర్వహిస్తున్న కుట్రను తీవ్రంగా ఖండించింది.2024 నవంబర్ 30 సాయంత్రం 5 గంటలకు, షాహీన్ బాగ్ పోలీస్ స్టేషన్ SHO సహా నలుగురు పోలీసు సిబ్బంది బెంగళూరులో నదీమ్ ఖాన్ ఉన్న ప్రైవేట్ నివాసానికి చేరుకుని, వారెంట్ లేకుండా అతనిని నిర్బంధించడానికి ప్రయత్నించారు.
సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు, నదీమ్ ఖాన్‌ను వారితో కలసి “స్వచ్ఛందంగా” ఢిల్లీకి రావాలని ఒత్తిడి చేశారు. ఈ అనుమానిత విచారణకు సంబంధించి FIR నంబర్ 0280/2024 షాహీన్ బాగ్ పోలీస్ స్టేషన్‌లో మధ్యాహ్నం 12:48కి నమోదు చేశారు. ఆ FIR నమోదు చేసి కేవలం నాలుగు గంటలకే పోలీసులు బెంగళూరు చేరుకున్నారు! కానీ ముందు నోటీసు ఇవ్వకుండా, లేదా అరెస్టు వారెంట్ లేకుండా రావడం, న్యాయ ప్రక్రియకు విరుద్ధం అని ఆరోపించారు.
6 గంటల పాటు నదీమ్ ఖాన్, అతని కుటుంబ సభ్యులను వేధించి, భయపెట్టే ప్రయత్నం జరిగింది. FIRలోని నేరాలు సెక్షన్ 196, 353(2), 61 కింద ఉన్నాయి. వీటి శిక్షలు 3 సంవత్సరాలకు తక్కువ. అర్ణేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు ప్రకారం, ఈ నేరాలకు 7 సంవత్సరాల శిక్షకంటే తక్కువ శిక్షలు ఉంటే అరెస్టు చేయరాదు. అయినప్పటికీ, SHO మరియు పోలీసులు న్యాయ ప్రక్రియ పాటించకుండా అతనిని ఢిల్లీకి తీసుకెళ్లడానికి ఒత్తిడి చేశారన్నారు.
నదీమ్ ఖాన్, APCR జాతీయ ప్రధాన కార్యదర్శిగా మానవ హక్కుల పరిరక్షణకు పాటుపడుతున్నారు. 2024 నవంబర్ 29 రాత్రి 9 గంటల సమయంలో, ఢిల్లీలోని APCR కార్యాలయానికి 20-25 మంది పోలీసులు ముందస్తు సమాచారం లేకుండా దాడి చేయడం, వారి ఉద్దేశాన్ని స్పష్టం చేస్తోందని కవితా శ్రీవాస్తవ (జాతీయ అధ్యక్షురాలు)
వీ. సురేష్ (జాతీయ ప్రధాన కార్యదర్శి) ఆరోపించారు.
PUCL డిమాండ్లు:
1. FIRను తక్షణం రద్దు చేయాలి.
2. నదీమ్ ఖాన్ కుటుంబాన్ని వేధించడం నిలిపివేయాలి, వారికి నష్ట పరిహారం అందించాలి.
3. షాహీన్ బాగ్ పోలీస్ స్టేషన్ SHOపై క్రిమినల్ బెదిరింపు, వేధింపులు, అక్రమంగా ప్రవేశం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
👉ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం సమీపంలో ఉన్న మా భూమిని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, ఆయన సోదరుడు సతీష్ లు ఆక్రమించారని, దరిమడుగు గ్రామానికి చెందిన బాధిత రైతులు పేర్కొన్నారు. సోమవారం ఉండవల్లి లోని సీఎం నివాసంలో మంత్రి లోకేష్ ను కలిసి ఈ మేరకు మాజీ మంత్రి భూకబ్జా లపై ఫిర్యాదు చేశారు.
గతంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సురేష్ మంత్రి గా ఉంటూ తమ భూమిని కబ్జా చేశారు అని, లోకేష్ కి వివరించారు.బాధిత రైతు బట్టగిరి రంగ రామాంజులరెడ్డి మాట్లాడుతూ.. అధికారాన్ని ఉపయోగించుకొని దరిమడుగు గ్రామ సర్వే నంబర్ 841/1 లో మూడు ఎకరాల భూమిని ఆక్రమించారని, తమ భూమి తమకు ఇప్పించాలని వేడుకున్నారు. అధికారులు స్పందించలేదని వాపోయారు. ఇప్పటికైనా వారిని శిక్షించి, తమ పొలాన్ని అప్పజెప్పాలని వారు కోరారు
👉ఏపీలో 400 గంజాయి చాక్లెట్ల కలకలం*
నరసరావుపేట :తెలుగు రాష్ట్రాలలో గంజాయి ముఠా రెచ్చిపోతోంది. ప్రధానంగా కాలేజీ, స్కూలు విద్యార్థులనే టార్గెట్ చేసిగంజాయిని చాకెట్లుగా తయారుచేసి విక్రయిస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఓ షాపు పై పోలీసులు దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో 175 గ్రాముల గంజాయితో పాటు 400 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.ఒడిశాకు చెందిన ఉదయానంద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
👉అక్రమంగా గిద్దలూరు నియోజకవర్గం లో నడుపుతున్న బి ఎడ్ కాలేజీ యాజమాన్యాలకు ప్రజా సంకల్ప వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు మదిరె రంగసాయిరెడ్డి
బహిరంగ లేఖ:*
అక్రమంగా గిద్దలూరు నియోజకవర్గం లో నడుపుతున్న కొందరు బి. ఎడ్ కాలేజీ వారు గిద్దలూరు లోని ఓ ముఖ్య నాయకుడికి ముడుపులు మరో రెండు రోజుల్లో పంపుతున్నట్లు తెలుస్తోందన్నారు.
అయ్యా, బి. ఎడ్ కాలేజీ ల యాజమాన్యం గారు పద్దతిగా కాలేజీ లు నడిపితే ప్రజలు హర్శిస్తారు. కానీ
ఇలా అడ్డదారుల్లో నడపాలనుకుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది… నియమ నిబంధనలకు అనుగుణంగా కాలేజీ లు నడిపితే చట్టం ముందు బాగుంటుంది.. లేదంటే అక్రమాలను ఎలా అరికట్టాలోమాకు తెలుసు అన్నారు.
మోడీ మీకిది తగునా… పేదల డబ్బు బిలియనీర్స్ కి ఇస్తారా ?..పోర్ట్ లో రేషన్ బియ్యంతో ఉన్న షిప్ లలో ఒకటి ఏపీ ఆర్థిక మంత్రి వియ్యంకుడిది-షర్మిల ఆరోపణ..APCR జాతీయ ప్రధాన కార్యదర్శి నదీమ్ ఖాన్‌పై ఢిల్లీ పోలీసుల వేధింపులు.. ఏపీలో 400 గంజాయి చాక్లెట్ల కలకలం.. తన భూమిని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, ఆయన సోదరుడు సతీష్ ఆక్రమించారని ఆరోపణ .. బి ఎడ్ కాలేజీ యాజమాన్యాల అక్రమాలపై విరుచుకుపడ్డ ప్రజా సంకల్ప వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు
Recent Posts