ప్రస్తుతం యువత అంత
ఉద్యోగాల
కోసం ఎక్కడికో వెళ్లి ఖర్చుపెట్టి మరీ ప్రోగ్రామింగ్, ఇతర ఎన్నో రకాల
కోర్స్‌లలో
చేరి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. టెన్త్, ఇంటర్ వరకు చదివి విద్యకు దూరమై సరైన ఉద్యోగాలు దొరక్క మళ్ళీ చదివే అవకాశం లేక ఎంతో మంది నిరుద్యోగులుగా ఉండి పోతున్నారు. చదువు పై ఆసక్తి ఉండిపెద్ద ఉద్యోగం ఉన్నత స్థాయిలో ఉండాలి అనే వారందరికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కౌశల్ కేంద్రం (PM Kaushal Center) ద్వారా టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీ.టెక్ చదివిన విద్యార్థులు, నిరుద్యోగుల కొరకు ఉచితంగా ట్రైనింగ్ నిర్వహిస్తూ పూర్తి స్థాయి ఉద్యోగులుగా తీర్చిదిద్దుతున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీ.టెక్ చదివి ఇంట్లో నిరుద్యోగులుగా ఉంటున్న ప్రతి ఒక్కరికి ఇది ఒక శుభవార్త.
ఈ ట్రైనింగ్ సమయంలో ప్రోగ్రాం ట్రైనింగ్, వర్క్ షాప్ ద్వారా మీరు ఎంచుకున్న ఏ కోర్స్‌లో అయినా ప్రతిభావంతులు తీర్చిదిద్ది ట్రైనింగ్ సర్టిఫికెట్ అందచేస్తున్నారు. విద్య ఉన్న అర్హత లేదని ఎంతో మంది ఉద్యోగాలు వచ్చి కూడా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఈ ట్రైనింగ్ ద్వారా ప్రతి ఒక్కరు ఉద్యోగులుగామారతారు.
Foreign Languages: ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఎన్నో ఉద్యోగావకాశాలు
2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారతదేశంలో ఎక్కడ నిరుద్యోగులు ఉండకూడదు అని ప్రతి జిల్లాకు, ప్రతి నియోజకవర్గానికి సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ఉచితంగా ట్రైనింగ్ నిర్వహిస్తున్నారు. డ్రాఫ్ట్స్‌మ్యాన్ మెకానికల్, సెక్యూరిటీ అనలిస్ట్, ఎంబెడ్డెడ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, డెవ్ఆప్స్ ఇంజనీర్, ఎయిర్‌లైన్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటీవ్, కిసాన్ డ్రోన్ ఆపరేటర్ లాంటి కోర్సుల్లో శిక్షణ పొందొచ్చు.
Job Alert: విశాఖపట్నంలోని విమ్స్‌లో ఉద్యోగాలు… రూ.1.60 లక్షల వరకు వేతనం
డిసెంబర్ 18 నుంచి కొత్త బ్యాచ్ ట్రైనింగ్ ప్రారంభిస్తున్నామని, ఈ స్కిల్ ట్రైనింగ్ కొరకు ఆసక్తి కలవారు విజయవాడ మాచవరం డౌన్లోని నీయన్ ప్లాజా ప్రధానమంత్రి కౌశల్ కేంద్రం సందర్శించవచ్చని ఇంఛార్జ్ జాన్ బాషా తెలిపారు. ఈ ట్రైనింగ్ కొరకు ఆధార్ కార్డు కలర్ కాపీ, ఎడ్యుకేషనల్ స్టడీ కాపీస్, బ్యాంకు బుక్ కాపీ, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోస్ తీసుకోని వెళ్తే వారు ఆన్లైన్ చేసి ట్రైనింగ్ బ్యాచ్లో చేర్చుకుంటారన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..