Andhra Pradesh: విజయవాడ ఎంపీ సీటుపై వైసీపీకి ఎందుకంత నిర్లక్ష్యం..? కారణం అదేనా..!

(Anna Raghu,Senior Correspondent,News18,Amaravathi)

విజయవాడ(Vijayawada) ఎంపీ సీటు పై వైసీపీ(YCP)కి ఎందుకంత నిర్లక్ష్యం.. 2024 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటుపై అటు టిడిపి(TDP) లో ఆశావహులు ఎక్కువవుతున్న  వైసీపీ మాత్రం ఎందుకు శీతకన్ను వేసింది అని రాజకీయ వర్గాలలో ఒక మిలియన్ డాలర్ ల ప్రశ్నగా మిగిలింది . విజయవాడ ఎంపీగా టిడిపి తరఫునకేశినేని నాని ప్రస్తుతం కొనసాగుతున్నాడు.  అయితే విజయవాడ వైసీపీ ఎంపీ అనేది ప్రతిసారి అక్కడ సంచలన వార్తగా ఉంటుంది. 2019 ఎన్నికలలో జగన్ సునామీని ఎదురుకొని మరి విజయవాడ లోక్సభ స్థానాన్ని టీడీపీ కీవసం చేసుకుంది.తరువాత జరిగిన పరిణామాల్లో   2019 ఎన్నికల్లో  పోటీ చేసిన పొట్లూరు వరప్రసాద్(Varaprasad) విజయవాడ వాసి అయినను పార్టీ కి క్యాడర్ కి దూరంగానే ఉన్నారు  అయితే జగన్ అధిష్టానం మాత్రం విజయవాడ ఎంపీ సీటుపై మాత్రం దృష్టి సారించడం లేదు.  లోకసభ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా ఎంపీ అభ్యర్థి పనితీరు, సమర్థత ఆ సీట్లపై ప్రభావం చూపుతోంది. అయితే ఈసారి కూడా  టిడిపి ఎలాగైనాసరే గెలవాలని పట్టుదలతో ఉండటం వైసిపి  విజయవాడ ఎంపీ సీటు  పై  ఫోకస్ పెట్టినట్లు  ఎక్కడ కూడా కంబడట లేదు అని వైసీపీ వర్గాల వాదన

కనివిని ఎరగని ఘనవిజయం..

విజయవాడ ఎంపీగా ప్రస్తుతం కేశినేనినాని కొనసాగుతున్నాడు. కానీ అతని స్థానంలో కేసినేని చిన్ని వస్తాడని కొంతమంది పార్టీనాయుకులుఅంటున్నారు. అయితే టిడిపి మాత్రం ఈసారీ కూడా ఎంపీ సీట్ ఎలాగైనా సరే గెలవాలని ఒకసంకల్పంతో పనిచేస్తుంది  గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించికనివిని ఎరగని ఘనవిజయాన్ని సాధించిన వైసిపి పార్టీ అంతకు మించి విజయాన్ని 2024లో రావాలనిఆశిస్తోంది. సమావేశాల్లో 175 సీట్లకు 175 గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ గట్టిగా కుండబద్దలు కొడుతున్నాడు.ఎలక్షన్ లు దగ్గరపడుతున్న నేపథ్యం లో విజయవాడ లోక్సభ స్థానము పై మాత్రం సీత కన్నువేసినట్లే కనబడుతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి అయినప్పటికీ కార్యకలాపాలన్నీ విజయవాడ వేదిక గా జరుగుతాయి.ఇక్కడ ప్రోటోకాల్ వంటి వాటిలో కూడా ప్రతిపక్ష పార్టీ లోక్సభ సభ్యుడి తో వేదికను పంచుకోవాల్సి వస్తుంది.అయినా కూడా జగన్ రాష్ట్రము మొత్తం ద్రుష్టి సారించి ఎన్నికలకు సిద్దమవుతున్న విజయవాడ స్థానం ను లైట్ తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

నటి రితికా సింగ్‌ సిక్స్‌ ప్యాక్ ఫోటోలు వైరల్


నటి రితికా సింగ్‌ సిక్స్‌ ప్యాక్ ఫోటోలు వైరల్

విస్తృత సమావేశాలు.. 

వైసిపి 2024లో అధికారంలోకిరావడానికి ఏ విధంగా ప్రయత్నిస్తుందో, టిడిపి జనసేన కూడా అంతకన్నా గట్టిగానేప్రయత్నిస్తున్నాయి, జగన్ బస్సు యాత్ర అని, టిడిపి సైకోపోవాలి, సైకిల్ రావాలని,జనసేన వారాహి అని ప్రజల్లోకి వెళ్లుతున్నారు. అంతేకాకుండా టిడిపి, జనసేనలు పొత్తుకుదుర్చుకోని విస్తృత సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలావే  2024 ఎన్నికల్లో ఎలా ముందుడగు వేయాలో ప్రణాళికలుసిద్ధం చేసుకుంటున్నారు. విజయవాడ ఎంపీ సీట్ కోసం టీడీపీ, జనసేన,. వైసీపీ నువ్వానేనా అన్నట్లుగా ఉన్నాయి.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

పదేళ్లలో పెరిగిన ఈడీ దూకుడు..సీఎం జగన్ సమక్షంలో చేరికలు..నామినేషన్ వేసిన మాగుంట..రేపే కుందూరు నామినేషన్..రాజీనామా చేస్తే 15 వేలు!!!..బస్సులో అమ్మాయి అసభ్య ప్రవర్తన..సోదరుడి కోసం సోదరి ప్రచారం

టిడిపిని వాలంటీర్లే ఓడిస్తార?..పవన్ సీట్లు అమ్ముతున్నారని..పిఠాపురంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు..సీతారాముల కళ్యాణంలో మాగుంట,ముత్తుముల దంపతులు..గిద్దలూరు వైకాపా టీడీపీలలో చేరికలు

సీఎం జగన్ సమక్షంలో హేమాహేమీల చేరికలు..ఓర్వలేకనే దాడులు..1400 కిలోల బంగారం స్వాధీనం..విస్తృత ప్రచారంలో మాగుంట తనయుడు..కంభంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డిఆత్మీయ సమ్మేళనం.. త్రిబుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య..

ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులు..సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించిన షర్మిల..పవన్ కళ్యాణ్ పై నాన్ బైయిలబుల్ కేసు!!! సల్మాన్ ఖాన్ఇంటి వద్ద కాల్పులు..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట..ఎమ్మెల్యే అన్నా సతీమణి,కోడలు ప్రచారం..