రైల్వే ప్రయాణికులకు ముఖ్యమైన అలర్ట్.
ట్రైన్
జర్నీ చేయాలని భావించే వారు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. లేదంటే తర్వాత ఇబ్బందులు పడాల్సి రావొచ్చు. ట్రాక్ మరమ్మతుల కారణంగా ఇప్పటికే పలు ట్రైన్స్‌ను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇప్పుడు తాజాగా
రైల్వేస్
కీలక అప్‌డేట్ ఇచ్చింది.
మరి కొన్ని రోజులు ట్రైన్స్ క్యాన్సిల్ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అందువల్ల రైల్వే ప్రయాణం చేయాలని భావించే వారు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ట్రాక్ మరమ్మతుల కారణంగా గుంటూరు నుంచి విశాఖపట్నం ప్రయాణించే సింహాద్రి ఎక్సప్రెస్ రైలును రద్దు చేసిన అధికారులు తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
Araku Tour: అరకు టూర్ ప్యాకేజీ రూ.650 మాత్రమే… ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ
ఈ నిర్ణయం వల్ల ట్రైన్స్ రద్దు ఇంకొన్ని రోజులు అమలులో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ నెల 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు (17239) గుంటూరు నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం, (17240) విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా గుంటూరు వెళ్లే సింహాద్రి ఎక్సప్రెస్ రైళ్లను అధికారులు రద్దు చేశారు.
విశాఖపట్నం నుంచి శబరిమలకు ఆర్టీసీ టూర్ ప్యాకేజీ
అయితే పనులు పూర్తి కావడపోవడం వల్ల నవంబర్ 13 నుంచి నవంబర్ 19వరకు ఈ ట్రైన్స్ రద్దును పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. అందువల్ల మీరు ట్రైన్ జర్నీ చేసే యోచనలో ఉంటే ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఏఏ ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యాయో, ఎప్పటి వరకు రద్దు అయ్యాయో తెలుసుకోవడం ఉత్తమం. తద్వారా అందుకు అనుగుణంగా ట్రైన్ జర్నీ ప్లాన్ చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..