దీపావళి వచ్చిందంటే మట్టి ప్రమిదలకి డిమాండ్ పెరుగుతుంది. ఇంట్లో పూజా మందిరం నుంచి ప్రహరీ గోడ వరకూ అంతటా మట్టి ప్రమిదలే వెలుగుతుంటాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రజలు దీపావళి సంబరాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీపావళి, కార్తీక మాసం ఉత్సవాల కోసం కొత్త మట్టి ప్రమిదల కొనుగోలు చేస్తున్నారు మహిళలు.
జిల్లాలోని పట్టణ , గ్రామీణ ప్రాంతాలు, మండల కేంద్రాల్లోమట్టి ప్రమిదలు భారీగా అమ్మకానికి పెట్టారు. దీపావళి సందర్భంగా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించడం ఏళ్లకేళ్లుగా వస్తున్న సంప్రదాయం. మరోవైపు మారుతున్న వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా కొత్త రూపాలు, అలంకరణల్లో లభించే రకరకాల మట్టి ప్రమిదలను వ్యాపారులు మార్కెట్లోకి తీసుకువచ్చారు. మహిళల అభిరుచికి తగినట్లుగా తాము కూడా ప్రమిదలను సిద్ధం చేస్తున్నామని వ్యాపారులు అంటున్నారు
తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఈ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ
విజయవాడలోని పటమట రైతు బజార్లోని భవాని హ్యాండ్ క్రాఫ్ట్ వారు దీపావళి పండుగ కావలిసిన అన్ని రకాల మట్టి దీపాల ప్రమిదలు మరియు రంగు రంగుల ఆకర్షనియమైన ప్రమీదలను విక్రయాలు చేస్తునట్టు తెలిపారు.దీపావళి అనగానే గుర్తుకు వచ్చేది మహిళలు ఇంటికి చేసే దీపాలంకరణ. రక రకలైన దీపాలతో ఎన్నో ఆకర్షనియమైన దీపాలతో ఇంటిని అంతా వెలుగు నిండిపోయేలా ఆకర్షనీయంగా తయారు చేస్తారు.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు.. ఇలా చేస్తే డబ్బే డబ్బు!
మహిళలు ఆకర్షనీయంగా ఇంటిని తయారు చేసే వారికీ వినుట్నంగా రంగు రంగుల ఆకు, పువ్వు, గవ్వ మరియు ఇంకెన్నో ఆకర్షనియమైన ఆకరాలతో మట్టి ప్రమీదల విక్రయాలు నిర్వహిమస్తునారు. నేటి దీపావళి సంవత్సరం, గత సంవత్సరం కంటే భిన్నంగా రకరకాలైన మట్టి దీపాల ప్రమిదలు విభిన్న ధరలతో 2 రూపాయల నుంచి ప్రమీదల సైజు మరియు అందాన్ని బట్టి 200 వందల రూపాయల నుంచి 300 రూపాయల దాక మట్టి ప్రమిదలు మార్కెట్లో దొరుకుతున్నాయి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..