జ్యోతిర్లింగాల దర్శనం… విజయవాడ నుంచి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ

విజయవాడ, చుట్టూ పక్కల ప్రాంత వాసులకు శుభవార్త.
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్
విజయవాడ నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. కార్తీకమాసం ఈశ్వరుని దర్శనం కోసం సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర, స్టేట్యూ అఫ్ యూనిటీ సందర్శించేందుకు
విజయవాడ
నుంచి నవంబర్ 18న ప్రత్యేక రైలు బయల్దేరనుంది. ఈ రైలులో 716 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు.

సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్రలో ఉజ్జయిని (మహాకాళేశ్వర్ & ఓంకారేశ్వర్), స్టేట్యూ అఫ్ యూనిటీ, ద్వారకా నాగేశ్వర్, సోమ్‌నాథ్, నాసిక్ (త్రయంబాకేశ్వర్), ఔరాంగబాద్ (గ్రిషనేశ్వర్) పుణ్య క్షేత్రాలు, ప్రసిద్ధ ప్రదేశాలను తిలకిస్తూ 13 రోజుల యాత్రను సప్త జ్యోతిర్లింగన్ యాత్రతో కార్తీక మాసం నవంబర్ 18వ తేదీన విజయవాడ నుండి ప్రారంభం కానుందని రైల్వే టూరిజం అధికారులు తెలిపారు.

Lambasingi: లంబసింగి వెళ్తున్నారా? ఈ బోట్ షికార్ అస్సలు మిస్ అవ్వొద్దు

ఈ జ్యోతిర్లింగన్ యాత్ర భక్తులు, ప్రయాణికులు భాగస్వాములు కావాలి అనుకుంటున్నవారు విజయవాడ రైల్వేస్టేషన్ మొదటి ప్లాట్‌ఫామ్‌లోని రైల్వే రిటైరింగ్ దగ్గర ప్రయాణికులకు టిక్కెట్లు విక్రయాలు చేస్తున్నారు. ఆసక్తి కలవారు https://www.irctctourism.com ద్వారా కూడా ఆన్‌లైన్‌లో టిక్కెట్లు తీసుకోవచ్చని అధికారులు సమాచారం ఇస్తున్నారు.

Araku Tour: కేవలం రూ.650 కే అరకు టూర్… ఆర్టీసీ స్పెషల్ ప్యాకేజీ

సప్త జ్యోతిర్లింగన్ టికెట్ల వివరాలు

జ్యోతిర్లింగన్ దర్శనానికి వెళ్లేవారికి వేర్వేరు టూర్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో టికెట్ ధర స్లీపర్ బెర్త్ పెద్దవాళ్లకు రూ.21,000, పిల్లలకు రూ.19,500 చెల్లించాలి. థర్డ్ ఏసీ ధరలు చూస్తే పెద్దవాళ్ళకి రూ.32,500, పిల్లలకు రూ.31,000 చెల్లించాలి. ఇక సెకండ్ ఏసీలో పెద్దవాళ్లకు రూ.42,500, పిల్లలకు రూ.40,500 ఛార్జ్ చేస్తున్నారు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

పదేళ్లలో పెరిగిన ఈడీ దూకుడు..సీఎం జగన్ సమక్షంలో చేరికలు..నామినేషన్ వేసిన మాగుంట..రేపే కుందూరు నామినేషన్..రాజీనామా చేస్తే 15 వేలు!!!..బస్సులో అమ్మాయి అసభ్య ప్రవర్తన..సోదరుడి కోసం సోదరి ప్రచారం

టిడిపిని వాలంటీర్లే ఓడిస్తార?..పవన్ సీట్లు అమ్ముతున్నారని..పిఠాపురంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు..సీతారాముల కళ్యాణంలో మాగుంట,ముత్తుముల దంపతులు..గిద్దలూరు వైకాపా టీడీపీలలో చేరికలు

సీఎం జగన్ సమక్షంలో హేమాహేమీల చేరికలు..ఓర్వలేకనే దాడులు..1400 కిలోల బంగారం స్వాధీనం..విస్తృత ప్రచారంలో మాగుంట తనయుడు..కంభంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డిఆత్మీయ సమ్మేళనం.. త్రిబుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య..

ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులు..సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించిన షర్మిల..పవన్ కళ్యాణ్ పై నాన్ బైయిలబుల్ కేసు!!! సల్మాన్ ఖాన్ఇంటి వద్ద కాల్పులు..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట..ఎమ్మెల్యే అన్నా సతీమణి,కోడలు ప్రచారం..