- ఆల్ మేవా జిల్లా క్యాలెండర్ ఆవిష్కరించిన రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, హోసింగ్, సమాచార శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి వారి నివాసం లో ఆల్ మైనారిటీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా క్యాలెండరు ను అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం మరియు సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఉద్యోగ,ఉపాధ్యాయ,కార్మికులు ఈ ప్రభుత్వానికి ఎంతో అండగా ఉన్నారని ఈ ప్రభుత్వం ఏర్పడడానికి సహకరించారని, ప్రభుత్వ ఉద్యోగులు క్రమశిష్కణతో,నిజాయితీగా పని చేయాలనీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి క్యాంపు కార్యాలయ ఇంచార్జి తుంబురు దయాకర్ రెడ్డి, కాంగ్రెస్ మైనారిటీ నాయకులూ షైక్ జిలాని, ఆల్ మేవా జిల్లా అధ్యక్షులు షైక్ యాకూబ్ పాషా, గౌరవ అధ్యక్షులు నయీమ్ పాషా, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి జమీరుద్దీన్,వైస్ ప్రెసిడెంట్స్ సాదిక్ అలీ, ఎం.ఏ గఫుర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఖాజామొయినుద్దీన్, జాయింట్ సెక్రెటరీస్ షైక్ మౌలాన్కర్, షైక్ మదార్, జానీ పాషా, రియాజ్ అహ్మద్, బషీర్, పాషా మరియు కాంగ్రెస్ మైనారిటీ నాయకులూ కరీమ్ తదితరులు పాల్గొన్నారు.