షర్మిల లూజ్…బాబు గెయిన్…!!!
అదే టైం లో వైసీపీ వ్యతిరేక ఓట్లను గంపగుత్తగా సొమ్ము చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న టీడీపీకే ఇది మేలు చేస్తుందని లెక్క ఉంది. ఏపీలో రాజకీయం ఏదో అనుకుంటే మరేదో అవుతోంది అని అంటున్నారు. దానికి కారణం ఏపీలో అటూ ఇటూ మోహరించి అధికార వైసీపీ విపక్ష టీడీపీ ఉండడమే. ప్రజలు కూడా ఈ రెండు పార్టీల మధ్యనే ఫిక్స్ అయిపోయారు. అయితే కొత్తగా ఎన్నికల ముందు ఎవరు వచ్చి బిగ్ సౌండ్ చేసినా ప్రభుత్వ వ్యతిరేకత మరింతగా పెరుగుతుందే తప్ప వారికి ఏ మాత్రం లాభం చేకూరదు అని అంటున్నారు. అదే టైం లో వైసీపీ వ్యతిరేక ఓట్లను గంపగుత్తగా సొమ్ము చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న టీడీపీకే ఇది మేలు చేస్తుందని లెక్క ఉంది. ఇపుడు చూడబోతే అదే నిజం అవుతోంది అని అంటున్నారు. ఇప్పటికి పదిహేను రోజుల క్రితం ఏపీలో పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల మొదటి అడుగు మొదటి పలుకు నుంచి జగన్ మీదనే విమర్శలు చేస్తున్నారు. అవి వ్యక్తిగత స్థాయిలో కూడా ఉంటున్నాయి. ఇవి ఒక దశలో శృతి మించి రాగాన పడిన సందర్భాలూ ఉన్నాయి. జగన్ రెడ్డి అంటూ వైఎస్ షర్మిల సంభోదించిన తీరు కూడా కాంగ్రెస్ కి మైనస్ అయింది అన్న మాట ఉంది. మరో సందర్భంలో ఆమె తన ఆస్తుల విషయం ప్రస్తావనకు తెచ్చారు. కడపలో ఆమె మాట్లాడుతూ, సాక్షిలో తనకు వాటాలు ఉన్నాయని కూడా ప్రకటించి సంచలనం రేపారు అయితే ఈ వాటాలు ఆస్తులు ఇవన్నీ కూడా షర్మిల వర్సెస్ జగన్ వ్యక్తిగత వివాదాలు అని జనాలకు అర్ధం అయ్యాయి. అలా వారికి అర్ధం అయ్యేలా చేయడంతో షర్మిల ఎమోషనల్ స్పీచెస్ నే దోహదం చేశాయని అంటున్నారు. ఆమె ఎంతసేపూ జగన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వల్ల ఇది అన్నాచెల్లెల్లు వివాదం అని జనంలోకి వెళ్ళిపోయింది. నాకు జగన్ అన్యాయం చేశారు అని ఆమె మొదటి రోజునే కుండబద్దలు కొట్టారు. ఆ మీదట ఆమె ఏపీకి అన్యాయం జరిగింది అని మాట్లాడినా జనాల బుర్రలకు మాత్రం ఇదే ఎక్కేసింది. దాంతో ప్రజలు కూడా కాంగ్రెస్ వైపు చూడలేకపోతున్నారు. పైగా కాంగ్రెస్ పాతాళం అంచులలో ఉంది. దాన్ని షర్మిల ఎన్నికల వేళకు వచ్చి ఎంత లేపినా లేచేది లేదు అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే జగన్ ఇంటి మనిషి సొంత ఆడపడుచు ఆయన మీద చేస్తున్న విమర్శలు మాత్రం జనంలో చర్చకు దారి తీస్తున్నాయి, జగన్ పాలన బాగా లేదని విపక్షాలు చెప్పడం వేరు, షర్మిల చెప్పడం వేరు. వైఎస్సార్ పాలనకు జగన్ పాలనకు మధ్య నక్కకూ నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని షర్మిల చెప్పినది కూడా జనంలోకి వెళ్ళిపోతోంది.
ఇక జగన్ పాలన బాగులేకపోతే ఆల్టర్నేషన్ గా ఉన్నది కాంగ్రెస్ అసలే కాదు, ఆ పార్టీ కంటే చాలా ముందు టీడీపీ ఉంది. పైగా జనసేనతో టీడీపీ పొత్తు ఉంది. బాబు కూడా వైసీపీని పూర్తిగా విమర్శిస్తున్నారు. ఇపుడు ఆయన మాటలను బలపరుస్తున్నట్లుగా షర్మిల కామెంట్స్ ఉన్నాయి. దాంతో జగన్ వ్యతిరేక ఓట్లు అన్నీ మరింతగా పెరిగి టీడీపీ ఖాతాలో పడుతున్నాయని అంటున్నారు. ఇది ముందే ఊహించి టీడీపీ దాని అనుకూల మీడియా షర్మిలకు మద్దతుగా ఉందని అంటున్నారు. ఇక షర్మిల ఓట్లు చీల్చేది ఏమీ ఉండదని అవి చీల్చినా కూడా వైసీపీకే భారీ నష్టం అంటున్నారు. అంటే షర్మిల ఏపీలో అగ్రెసివ్ మూడ్ లో చేసిన ప్రసంగాలు తటస్థ ఓటర్లలో కొత్త ఆలోచనలు తట్టిలేపాయని అంటున్నారు. వారు ఎవరికి ఓటు వేయాలా అన్నది ఇంకా డిసైడ్ కాలేదు ఇపుడు వారంతా టీడీపీతో ట్రావెల్ చేసే విధంగా షర్మిల రాజకీయ దూకుడు పనికి వచ్చింది అని అంటున్నారు. మొత్తానికి ఏదైతేనేమి షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ నాయకత్వం వైసీపీకి భారీ నష్టం టీడీపీకి మేలు అన్నట్లుగా బయటకు వస్తున్న విశ్లేషణలు ఉన్నాయి.
అదే సమయంలో తాను కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాక హస్తం పార్టీ ఆకాశానికి అంటుతుందని, కొత్త కాంతులు ఆ పార్టీలో వస్తాయని షర్మిల ధీమా పడినా లేక ఆమె వెనక ఉన్న పార్టీ నేతలు అనుకున్నా అవన్నీ భ్రమలు అని చెప్పడానికి గట్టిగా రెండు వారాలు కూడా పట్టలేదు. సో రేపటి రోజున వైసీపీ కాంగ్రెస్ నష్టపోయి టీడీపీ అధికార పీఠం దిశగా దూసుకుపోతే తమ స్వయకృపాపధాదం అని అన్నాచెల్లెలు సమీక్షుకునే రోజు వస్తుందా అంటే 2024 రిజల్ట్ మాత్రమే అవి చెప్పగలవు అంటున్నారు.
Recent Posts