గిద్దలూరు అభివృద్ధికి మద్దతివ్వండి
హైదరాబాద్ లోని గిద్దలూరు వాసులతో ముత్తుముల సమావేశం
హైదరాబాద్ జంట నగరాల్లోని గిద్దలూరు నియోజకవర్గ వాసులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేనల ఉమ్మడి అభ్యర్థి అయిన తనకు మద్దతు తెలియచేసి, ప్రతీ ఒక్కరూ తనకు ఓటు వేయాలని, గతంలో తాను గిద్దలూరు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశానని, రాబోయే ఎన్నికల్లో తనకు అండగా నిలిచి గిద్దలూరులో మరింత అభివృద్ధి జరిగేందుకు తోడ్పడాలని అభ్యర్ధించారు. ఎన్నికల సమయంలో ప్రతీ ఒక్కరూ గిద్దలూరు నియోజకవర్గంలోని గ్రామాలలి కుటుంబ సభ్యులతో సహా తనకు సైకిల్ గుర్తు పై ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో దామెర్ల పవన్ కుమార్ యాదవ్, ప్రవీణ్ కుమార్ యాదవ్, మారుతోట మహేష్, తమ్మిశెట్టి రామారావు గారు మరియు గిద్దలూరు నియోజకవర్గ వాసులు పాల్గోన్నారు.