కంభం సీఐగా కె.రామకోటయ్య
ప్రకాశం జిల్లా కంభం సీఐగా రామకోటయ్య బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల బదిలీల్లో భాగంగా ప్రస్తుతం కంభం సీఐగా పనిచేస్తున్న రాజేష్ కుమార్ పల్నాడు జిల్లాకు బదిలీ అయ్యారు. దర్శి సీఐ గా విధులు నిర్వహిస్తున్న రామకోటయ్య కంభం కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ తాను అన్నివేళలా అందుబాటులో ఉంటానని, శాంతిభద్రతలను పరిరక్షించేందుకు కృషి చేస్తానని, ప్రజలు తమ వంతుగా సహకరించాలని కోరారు .