బ్రదర్ అనిల్ చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికరమైన చర్చ!

ఓ పాస్టర్ల సదస్సులో పాల్గొన్న ఆయన చేసిన వ్యాఖ్యలు, చెప్పిన మాటలు, తదనంతరం ఇతర పాస్టర్లు స్పందించి పలికిన పలుకులు రాజకీయంగా ఆసక్తిగా మారాయి. ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలూ ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్న వేళ ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ భర్త బ్రదర్ అనిల్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పాస్టర్ల సదస్సులో పాల్గొన్న ఆయన చేసిన వ్యాఖ్యలు, చెప్పిన మాటలు, తదనంతరం ఇతర పాస్టర్లు స్పందించి పలికిన పలుకులు రాజకీయంగా ఆసక్తిగా మారాయి. దీంతో… బ్రదర్ అనీల్ పాలిటిక్స్ షురూ చేసినట్లేనా అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి. మూడ్ ఆఫ్ శ్రీకాకుళం…! అవును… ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే టీడీపీ – జనసేన పొత్తులో ఉండగా.. వీరితో బీజేపీ కూడా కలిసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక తాజాగా వైఎస్ షర్మిళ ఎంట్రీతో ఏపీలో కాంగ్రెస్ లో కూడా కొత్త ఉత్సాహం వచ్చిందని అంటున్నారు. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించినప్పటినుంచీ షర్మిళ మైకు పట్టుకున్న ప్రతీసారి వైఎస్ జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా… “దేవునిపై పూర్తి విశ్వాసం ఉంచి చేపడితే అసాధ్యమైన పని సుసాధ్యమవుతుంది! తను ఏమి చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఒక పిలుపునిస్తాడు! బలవంతులను సిగ్గు పరచడానికి దేవుడు బలహీనులను ఎంచుకుంటారు!” అని అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యల్లో “బలవంతులను సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులను ఎంచుకుంటారు” అని చెప్పిన విషయాన్ని విశ్లేషిస్తున్నారు పరిశీలకులు. ఇందులో భాగంగా… “బలవంతుడు – బలహీనుడు”… సమయంలో బలహీనుడి తరుపున దేవుడు యుద్ధం చేయడం వంటి వ్యాఖ్యలకు బైబిల్ గ్రంథంలో “దావీదు – గొల్యాతు” అంశం బెస్ట్ ఉదాహరణ అని అనుకోవచ్చు. మహా బలిష్టుడు.. చేతిలో కత్తి, డాలు.. శరీరానికి కవచం, తలపై కిరీటం ధరించిన వ్యక్తిని దావీదు అనే గొర్రెలను కాచుకునే బాలుడు ఒడిశెతో కొట్టి నేలకూలుస్తాడు! ఇది పూర్తిగా దేవుడు చేసిన యుద్ధమే అని చెబుతాడు. దీంతో… ఇజ్రాయేలీయులు దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తారు. కట్ చేస్తే… తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో పెంతెకోస్తు ఫెలోషిప్‌ రాష్ట్ర కార్యదర్శి అధ్యక్షతన పాస్టర్లతో జరిగిన సమావేశంలో అనిల్ కుమార్ పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి పలువురు పాస్టర్లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మైకందుకున్న అనిల్… తాను ఇక్కడకు రాజకీయాలు మాట్లాడడానికి, ఓట్లు అడిగేందుకు రాలేదని.. కేవలం దేవుని రాజ్యం గురించి మాట్లాడేందుకే వచ్చానని చెబుతూ… “బలవంతుడు – బలహీనుడు” అనే అంశం లేవనెత్తడంపై ఈ ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఇక్కడ జగన్ ను గొల్యాతుతో.. షర్మిళను దావీదుతో పోల్చే ప్రయత్నం అనిల్ చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ రకంగా ఆయన స్టైల్లో ఆయన పొలిటికల్ స్టేట్ మెంట్స్ ఇస్తున్నారని అంటున్నారు పరిశీలకులు! ఆ సంగతి అలా ఉంటే… 2009 ఎన్నికల తర్వాత సోనియాతోనూ, 2019 ఎన్నికల్లో చంద్రబాబుతోనూ పైనచెప్పుకున్న “బలవంతుడు – బలహీనుడు” యుద్ధం జగన్ నాడే చేశారని.. అదే అసలు సిసలైన “దావీదు – గొల్యాతు” స్టోరీ అని అంటున్నారు వైసీపీ ఫ్యాన్స్!!

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…